Saturday 15 September 2012

What is the Life?

వ్వాట్ ఈజ్ ద లైఫ్?

టి.వి. చూస్తూ, నా ప్రక్కన్న ఉన్న నా రూమ్ మేట్ నాయుడు ని అడిగాను..

నా పైపు అదోలా చూసి, నాకు ఇటు వైపు కూర్చొన్న నరేంద్ర వైపు చూశాడు. తనని అడగమన్నట్టుగా..
నరేంద్ర వైపు చూసి, సార్, వ్వాట్ ఈజ్ ద లైఫ్? అని అడిగాను...

వాడు నా పైపు కొద్దిగా ఎగాదిగా మరియు చిరునవ్వుతో చూసి, లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ అన్నాడు...

నేను, నాయుడు నవ్వుకున్నాము వాడి సమాధానానికి! ఎందుకంటే ఆ రోజే శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ రిలీజ్......

వాడు సమయాను సంధర్బంనుపయెగించి, చమత్కారంగా సమాధానము చెప్పినప్పటికీ, నేను వేసుకొన్న క్వొశ్చన్ కి సరయిన సమాధానము దొరకలేదు అనిపించింది.

ఆవును...... వ్వాట్ ఈజ్ ద లైఫ్?


ప్రతి ఒక్కరికీ, ఏదోక సందర్బంలో ఈ క్వొశ్చన్ తగులుతుందని ఎక్కడో చదివాను. నిజంగానే ఆ క్వొశ్చన్ నాకు ఇప్పుడు వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడూ మనకి అటువంటి క్వొశ్చన్ రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నిజంగానే లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ కాబట్టి.. ఆప్పుడే లైఫ్ ని ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేయగలమా అనే ఆలోచించగలము. కొద్దిగా పెద్ద ఆయిన తర్వాత చదువులు గురించి, టార్గెట్ పెట్టుకొన్న గోల్స్ గురించి,  అమ్మాయిల గురించి, ఉద్యోగాల గురించి ఆలోచించి ఏ సందర్బంలోను పై క్వొశ్చన్ బుర్రలోకి వచ్చే చాన్సే లేదు. అదీ కూడా ఆయిపోయిన తర్వాత, అంటే ముప్పైకి వచ్చాక, ఈ క్వొశ్చన్ వచ్చింది బుర్రలోకి....

వయసు పెరిగే కొలదీ మనిషిలో సున్నితత్వం తగ్గిపోయి, స్వార్దం పెరుగుపోతుందని ఒక తత్వవేత్త సెలవిచ్చాడు...
 
అదే విధంగా ఇంకో పెద్దాయన, పెద్దయ్యే కొలది, మమతలు, అనుబంధాలలో కూడా తేడాలు వస్తాయని సెలవిచ్చాడు....

ఇలా, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్దితిని ప్రతి ఒక్కరూ ఇరవై ఆరు నుండి ముప్పై సం.రాల లోపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారని తెలిసింది... అదేంటో నాకు మాత్రం ముప్పై దగ్గరకి వచ్చిన తర్వాత కాని నాకా క్వొశ్చన్ తగల్లేదు. (బహుశా మన తెలివి ఎక్కువయిపోయి ఉంటుందిలెండి). పోనిలే ఇప్పటికైనా వచ్చిందీ... రాకపోయే ఉంటే అసలు నేను మనిషిని కానేమో అని డౌట్ వచ్చి యుండేది...

నిజంగానే నాకీ ఈ డౌట్ వచ్చిన దగ్గర నుండి సరయిన సమాధానము దొరకలేదు.

ఒక్కొసారి ఆలోచిస్తే, నాలో స్వార్దం పెరిగిపోయిందేమో అనిపించింది. అలాగే నా సన్నిహితులతో నాకున్న అనుబంధాలలో గాఢత తగ్గిపోయిందేమో అని కూడా అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో నాకీ క్వొశ్చన్ ఇప్పుడు వచ్చింది!

నిజానికి నేను చాలా హ్యాపిగా గడిపేశాను ఇప్పటి వరకు... ముఖ్యంగా నా స్నేహితులతో నాకున్న అనుబంధం, అలాగే బంధువులతో ఉన్న అనుబంధం నా జీవితాన్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచేవి.  మరి, ఇప్పుడు వారందరూ లేరా? అని అడిగితే ఉన్నారనే చెప్పాలి... మరెందుకు నేనిలా ఉన్నాను?

ఏమో సమాధానము నాకే తెలియదు.

కాని నా స్నేహితులు మాత్రం అందరూ కలసినపుడు గతంలో లాగానే చాలా హ్యపీగా ఉంటారు.. ఒకప్పుడూ నేను వాళ్ళలో ఒకడిలా కలసిపోయేవాడిని. కానీ ఇప్పుడు.... వాళ్ళతో కలవలేకపోతున్నాను....

బహుశా వయసుతో పాటుగా అలోచనల్లో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మనము ఏమీ సాధించాము అనిపిస్తుంది? నేను స్వయముగా సాధించాను అనదగ్గ విజయలేవి అనిపిస్తుంది? తరచి చూసుకుంటే ఏమి కనబడడం లేదు... అదేనా మన అసంతృప్తికి కారణం? 

అదేనని చెప్పలేము... మన స్వంత విజయాలు కాకపోయిన, ఈ రోజు నేను మంచి పొజిషన్ లోనే ఉన్నాను. మరెందుకు ఇప్పుడు మాత్రమే వ్వాట్ ఈజ్ ద లైఫ్ అని క్వొశ్చన్ నా బుర్రలో తొలుస్తుంది?

తొక్కలో ఆలోచనలూ నువ్వునూ.... చెత్తగా అలోచించండం వలనే ఇలాంటి చెత్త అలోచనలు వస్తుంటాయి నీకు అని నా అంతర్మాత నన్ను విసుక్కొంది....

అంతేనేమో అని అనుకొని, కనీసం శేఖర్ కమ్ముల ఆయిన చెప్పుతాడు కదా అని “ లైఫ్ ఈజ్ బ్యూటీపుల్” సినిమాకి వెళ్ళా... మూడు గంటలు ఓపిక పట్టి చూసాను.. ఆయిపోయిన తర్వాత చూద్దును.... నా క్వొశ్చన్ కి సమాధానం దొరకలేదు...

సినిమా ఆయిపోయిన తర్వాత, రూమ్ కి వచ్చిన తర్వాత అడిగారు నా రూమ్మేట్స్ సినిమా ఎలావుంది అని?

వ్వాట్ ఈజ్ ద లైఫ్? ........ ఇది నా సమాధానం వారు అడిగిన దానికి నా సమాధానం.

అప్పుడు నరేంద్ర అన్నాడు....  రాజీవ్ కి పెళ్ళయితే కాని తెలియదు ఈ క్వొశ్చన్ కి సమాధానం....
ఆయిన నాకొక డౌట్.... పెళ్ళయితే ఎవ్వడైనా చెప్పుతాడు “లైఫ్ ఈజ్ హెల్” అని....

నాకు అపుడు కాదు కావాలి... ఇప్పుడు కావాలి సమాధానం “వ్వాట్ ఈజ్ ద లైఫ్” అంటే.....

No comments:

Post a Comment