కేంద్రమంత్రి కిషోర్
చంద్రదేవ్ కేంద్రమంత్రిగా తనకున్న విశేషాధికారముని ఉపయెగించి విశాఖ మన్యంలో
బాక్సైట్ గనుల కేటాయింపులను రద్దుచేయడం ద్వారా తాను ప్రజల ప్రతినిధినని చాటారు..
పచ్చని అడవులతో, అనేక
రకాలైన విభిన్న గిరిజన జాతులతో అలరారుతున్న విశాఖ మన్యంలో బాక్సైట్ గనుల తవ్వకాలకు
రాష్ట్ర ప్రభుత్వం ప్రెవేటు కంపెనీలకు అనుమతి యివ్వడం ద్వారా మన్యం భవిష్యత్తు పై
నీలినీడలు కమ్ముకున్నాయి. తవ్వకాలు ద్వారా
పచ్చని అడవులు నాశనం ఆవ్వడమే కాకుండా అనాదిగా ఉన్న ప్రకృతి చక్రం తారుమారు అయ్యే
ప్రమాదం ఉండడంతో మన్యంను నమ్ముకొని అనేక వందల ఏళ్ళుగా జీవిస్తున్న అనేక గిరిజన
తెగల ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు చెవికి
ఎక్కించుకోలేదు. దీనిపై మన్యంలోని ఒక
గిరిజన తెగకు చెందిన కిశోర్ చంద్రదేవ్., తాను ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా,
గనుల తవ్వకాల వలన జరగబోయే నష్టాన్ని పసిగట్టి, సదరు తవ్వకపు అనుమతులను రద్దు
చేయవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినప్పటికి, రాష్ట్ర ప్రభుత్వము దానిని
ఇసుమంతైన పరిగణనలోకి తీసుకోలేదు.
దానితో రాష్ట్ర గవర్నర్
వార్కి గల విశేషాధికారమును ఉపయెగించి తవ్వకాలను రద్దుచేయవలసినదిగా కేంద్రమంత్రి
హోదాలో విన్నపం చేసినప్పటికి నేటి వరకు గవర్నర్ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్న
పాపానికి పోలేదు. దానికి కారణం బాక్సైట్ గనుల లైసెన్సు దక్కించుకొన్న కంపెనీల్లో
విదేశీ కంపెనీలు కూడా ఉండడం కారణం కావచ్చు. వాటికి దన్ను ఇచ్చే పెద్ద తలకాయలు
ప్రభుత్వంలో ఉండడంతో గవర్నర్ కూడా మిన్నకుండిపోయారు.
మన్యంలో తవ్వకాలు వలన
నాశనమయ్యే ప్రకృతి, గిరిజన తెగలు మరియు అనేక యితర జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం
ఉన్నప్పట్టికి ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం చూస్తే, వారు ప్రజల తరపున
పనిచేస్తున్నారా? లేక ప్రెవేటు కంపెనీ ప్రతినిధుల కొరకు పనిచేస్తున్నారా? అన్న
సందేహం వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం మరియు
గవర్నర్ నుండి ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇక చివరి అస్త్రంగా తనకున్న విశేష
అధికారమునుపయెగించి బాక్సైట్ గనుల తవ్వకాల అనుమతిని రద్దు చేయుచూ రాష్ట్ర
ప్రభుత్వానికి నోట్ పెట్టారు.
ఒక వేళ కేంద్ర మంత్రి
ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోతే, ఏంటి పరిస్దితి అని అడిగిన
జర్నలిస్టులకు ఆయన ఇచ్చిన సమాధానం
“గిరిజన శాఖ మంత్రిగా నాకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారమును నేను ఉపయెగించాను. దానిని
పాటించకపోతే రాజ్యాంగంను పట్టించుకోనట్టే”
మరియు నేను గిరిజన శాఖా
మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, దానికి సంబందించి గిరిజన సంక్షేమంను పట్టించుకోకపోతే
నేనేందుకు? ఈ శాఖ ఎందుకు? అని ప్రశ్నించారు.
మన్యం ప్రజల జీవనధారం,
ప్రకృతి వనరులు నాశనం ఆవుతున్నా పట్టించుకోనని ప్రభుత్వం, మరి రాజ్యాంగంను అయినా పట్టించుకుంటుందా
అనేది వేచిచూడాలి.
baagundandi.naaku nachindi kishor gari prakatana .andaru alaa pani cheste anipichindi.
ReplyDeleteరాధిక గార్కి,
Deleteఅందరూ అలా పనిచేస్తే కిశోర్ గారి గురించి చెప్పుకోవలసిన అవసరం రాదు కదండీ... స్వంత ప్రాంత అవసరాలు కూడా పట్టించుకోవడం లేదండీ మన రాజకీయ నాయకులు.
స్పందించినందుకు ధన్యవాదములు
Kishore Chandra Dev is a true hero. Hats off to his courage!
ReplyDelete