Friday 17 April 2015

పుస్తకాలయందు కల్తీ పుస్తకాలు వేరయా....



ఈనాడు వార్తపత్రిక ఎలా రాస్తుందంటే ఆంధ్ర ప్రదేశ్ ని ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే అభివృద్ధి చేయగలడనీ, అతను మాత్రమే రాష్ట్రాన్ని ఉన్నపళంగా సింగపూర్ లా చేసేస్తాడనిపించేలా వార్తలు రాస్తుంది.. ఎందుకంటే రామెజీరావుకి టి.డి.పి. విజన్ ఇంపొర్టట్ కాబట్టి.

అదే సాక్షి వార్తపత్రిక విషయానికి వచ్చేసరికి జగన్ ఒక దైవ దూతగా, రాష్టాన్ని, ప్రజలను కాపాడడానికి ఆ యేసు పంపిన ప్రత్యేక దూత అని ఇంకా ఏవోయో రాస్తుంది. దానికి కర్మ, కర్త, క్రియ అన్ని జగనే కాబట్టి.

ఇక టి.వి.9 వాడైతే రవిప్రకాశ్ కి ఏది రైటు అనిపిస్తే అది ఒప్పు గాను, ఏది రాంగు అనిపిస్తే అది రాంగుగాను అనిపిస్తుంది. అదే పద్దతి వారి దగ్గరకి వచ్చేసరికి వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే వారికి టి.ఆర్.పి.రేటింగు మాత్రమే ముఖ్యం కాబట్టి.

మంచి వక్త లేక అనుభవజ్ణుడ్ని ఎవరైనా మీ విజయరహస్యం ఏమిటని అడిగితే పుస్తకాలు చదవడం అని చాలా మంది చెపుతారు. అదీ నిజమే.  మనం పురాణాలైన, చరిత్రైనా, సైన్సు ఐనా మరేదైనా పుస్తకాలు చదవడం ద్వారానే తెలుసుకుంటున్నాము. ఆ చదివినదాన్నే గుర్తుపెట్టుకొని విజ్ణానం పెంచుకుంటున్నాము.  రాముడికి సీత ఏమవుతుంది అని అడిగితే బార్య అవుతుంది అని మనకి ఎలా తెలుసు? రామాయణం చదవడం వల్లనే కదా.. అలాగే మార్కిజం, కమ్యూనిజం ఇలా నానారకాల యిజాలు కూడా పుస్తకాలు చదవడం ద్వారానే తెలుసుకుంటున్నాము. మనకి ఏదైనా కొత్త విషయం తెలుసుకోగలుగుతున్నామంటే ఏదోక పుస్తకం చదవడం ద్వారానే.

ఆయితే పుస్తకాల్లో చదివినదంతా నిజమేనా అని అడిగితే అవునని, కాదని చెప్పే పరిస్దితిలో ప్రస్తుతం ఉన్నామనిపిస్తుంది నాకు. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు చూస్తుంటే మెరిసేదంతా బంగారం కాదన్నట్టు, మనం చదివేదంతా నిజం కాదని అనిపిస్తుంది.  చరిత్రని వక్రీకరించి రాసిన చెత్తనే చదువుకొని అదే నిజమని అనుకొనే భ్రమల్లో ఉన్నాం.

స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెసు  ప్రభుత్వాలు ప్రాధమిక, మాధ్యమిక మరియు ఉన్నత విద్యా పాఠ్యంశాల్లో వాళ్ళ నాయకుల సోది తప్ప ఏదయినా విషయాన్ని చెప్పగలిగాయా.. డిగ్రీ పూర్తయిన తర్వాత వివిధ పుస్తకాలు , బయోగ్రఫి చదివిన తర్వాత, తూస్.. వీళ్ళ గురించా ఇంత గొప్పగా ఊహించుకున్నది అని ప్రతి ఒక్కడికి అనిపించకమానదు.  స్వాతంత్రం సిద్దించడంలో ఒక్క గాంధీ, నెహ్రూలకు మాత్రమే స్దానం ఉందన్నట్టుగా మన పిల్లల పాఠ్యపుస్తకాలు రూపొందించారు. చరిత్ర చెప్పినప్పుడు మంచి పనులు,చెడ్డ పనులు రెండూ మిళితం చేసి చెప్పాలి గానీ, మంచి పనులు మాత్రమే ముద్రించి మిగతావి ముద్రించకుండా ఉంటే తప్పులు దాచేయవచ్చు అనుకోవడమంతా తెలివితక్కువ పని ఇంకొకటి లేదని వీళ్ళకి అప్పుడు తెలియలేదా?

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ మరణం గురించి తదనంతర పరిణామాల గురించి ఇప్పటికీ సరయిన సృష్టత లేదు.  సృష్టత ఇవ్వలేనంత దౌర్బగ్య పరిస్దితిలో ఉన్నాయనుకోవాలా మన ప్రభుత్వాలు? అలాగే లాల్ బహుదుర్ శాస్త్రి గారి అకస్మిక మరణం కూడా సృష్టత లేనిదే. నెహ్రూ గారు చేసిన మంచి పనులు చిన్నప్పుడే మా బుర్రల్లోకి ఎక్కించడానికి ప్రయత్నం చేసారు గానీ, ఆయన గారు చేసిన నిర్వాకాలు గురించి తెలిసినపుడు వాడంతా సన్నాసి ఇంకొకడు ఎవడైనా మన భారత దేశ చరిత్ర అంతా తిరగేసినా ఉంటాడని నేను అనుకోవడం లేదు.
పాలు యందు కల్తీ పాలు వేరయా అన్నట్టు పుస్తకాలయందు కల్తీ పుస్తకాలు వేరయా అని చెప్పాలి. చరిత్రని తమకు అనుకూలంగా మార్పులు చేసి, లేదా పూర్తిగా  మార్చివేసి సమాజంను తప్పుదోవ పట్టించడం అనేది ఈ నాటిది కాదు. క్రీస్తు మరణాంతరం నుండే అది మొదలయింది. క్రీస్తు మరణించిన 150 సం.రాల తర్వాత ఆయన జీవితంను పుస్తకరూపంలోకి తీసుకువస్తే, అది ఇన్నేళ్ళల్లో ఎన్ని వక్రీకరణలకు గురయిందో చరిత్రని అపౌహన పట్టిన వారికి అర్ద్రమవుతుంది. ఇప్పుడు కొత్తగా రామాయణం, భారతం లను కూడా వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చుకొనే పనిలో కొన్ని హిందూ ధార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలు కలవరం కలిగిస్తున్నాయి.

క్రీస్తు పూర్వానికి ముందే నాగరికతతో అంగరంగ వైభవంగా వెలుగులు వెలిగిన పలు ప్రాంతాలు చరిత్రలో ఉన్నప్పట్టికీ, మేము పుట్టిన తర్వాతే నాగరికత అంటే ఏంటో ప్రపంచానికి తెలిసిందని సొల్లు కబుర్లు చెప్పే సన్నాసులు రాసే పుస్తకాలు ఇబ్బడిముబ్బడిగా విపణిలో ఉండడం మన దురదృష్టం అనుకోవాలి.

 ఒక పుస్తకం చదవాలి అని నిశ్చయించుకొన్నప్పుడు అందులో ఉన్న అంశాలు  నిజమైనవా, కాదా అని తెలుసుకోవడానికి వేరోక పుస్తకం మీద ఆధారపడవల్సిన ఖర్మ ఏర్పడింది. 

చంద్రబాబు నాయుడు గురించి రామోజీ రావు రాసే సొల్లు, జగన్ గురించి సాక్షి చెప్పే సొల్లు, రామాయణం గురించి రంగనాయకమ్మ రాసిన సొల్లు, నెహ్రూ గురించి మన పాఠ్యాంశాల్లో రాసిన సొల్లు చదువుతూ పోతే ఏది అసలో, ఏది చెత్తో తెలియని అయోమయంలో నాలాంటి వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు. నిజనిజాలతో వీళ్ళు ఎవరికీ పని లేదు. జస్ట్ వీళ్ళ పైత్యంను అంతా జనాల మీదకి వదలడమే తప్ప వేరే ఏమి లేదు.

ఇప్పుడంతా ఎలా ఉందంటే ఒక అబద్దాన్ని వంద సార్లు నిజమని చెపితే అదే నిజమని భావిస్తారట. అలా ఉంది ఇప్పుడు... అలా వంద అబద్దాల్ని వంద సార్లు కాదు కదా లక్ష సార్లు ఇల్లెక్కి మరీ అరుస్తున్నారు. 

 ఇందులో చెప్పింది చాలా తక్కువ.  ఇది మాత్రం అక్షరాలా సత్యం./.

చిత్ర సౌజన్యం: గూగుల్