Saturday 29 September 2012

కేంద్రంలో మరో కోతగాడు....


దేశములో ప్రభుత్వ సొమ్ముతో తేరగా పోషిస్తున్న కోతగాళ్ళలో ఇప్పటికే మాంటెక్ సింగ్ అహ్లువాలియా ఉన్నారు..

ఇప్పటికే మన దేశంలో అసలు పేదరికమే లేదని కనిపెట్టి తేల్చిచెప్పిన పెద్దాయన ఈయన....

 

ఇప్పుడు ఈయనకు తోడు మరో కోతగాడు తయారయ్యాడు...

అయనే విజయ్ కేల్కర్...
 

ఈయన గారు దేశంలో ప్రస్తుతం వంటగ్యాస్, కిరోసిన్, డిజీల్, చౌక దుకాణాల్లో యిచ్చే ఆహర ధాన్యాలకు యిచ్చే సబ్బీడిలను పూర్తిగా తొలగించాలని సెలవిచ్చారు. అలాగే పెట్రోలియం ఉత్తతిలో రాయితీలను దశల వారీగా ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వానికి హితభోద చేసారు.

భారత అర్దిక వ్యవస్ద పలు దేశియ, అంతర్జాతియ కారణాలతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని, అందుకు ప్రతిగా ప్రభుత్వం యిస్తున్న అన్ని రాయితీల కోతలో ధైర్యంగా వ్యవహరీంచాలని సెలవిచ్చారు.

ఆయినా, నాకు తెలియక అడుగుతాను.. వారు  సబ్బీడి రూపములో యిస్తున్న డబ్బు ప్రజల నుండి వసూలు చేసింది కాదా? లేక వాడి అబ్బ సొమ్మా?

సరే.. రాయితీలు యివ్వడం అర్దిక వ్యవస్దకి భారంగా ఉందనుకుందాము... రాయితీల కోత ఆన్ని వర్గాలకి వర్తించాలి కదా? కేవలం సామాన్యుడు ఎక్కువగా ఆధారపడే అంశములపైనే రాయితీల కోత విధించాలా? మరి ధనవంతులకు, కార్పోరేట్లకు యిచ్చే రాయితీల మాట ఏమిటి?

సరే, అది కూడా ప్రక్కన పెడదాం...

ప్రజ్యాస్వామ్య ప్రతినిధులుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి వారు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? సమాధానం చెప్పడం కష్టం వాళ్ళకు....

 ప్రభుత్వం వారు దేశ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా, మోజారిటి ప్రజలు స్వయంవృద్ది మీద బ్రతుకుతున్నారు.

 వ్యవసాయం మీద మోజారిటి ప్రజలు ఆధారపడేవారు. రైతులు కష్టమైన, నష్టమైన వ్యవసాయం చేసుకోనేవారు. అంతే తప్ప ఏనాడు ప్రభుత్వం వారి మీద ఆధారపడలేదు. కాని ప్రభుత్వం ఏమి చేసింది! దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం మీద అధారపడడం వలన అర్దిక వృద్ది పెరగడం లేదని భావించి, వ్యవసాయ రంగంనకు చేయూత యివ్వడం మాట దేవుడెరుగు.. ఉన్న రంగంను అస్దవ్యస్దం చేసేలా చర్యలు తీసుకున్నారు.

 

పోనీ, వ్యవసాయరంగం నుండి మరలిన ప్రజలకు వేరే జీవనధారం ఏమైనా చూపించిందా? అది లేదు...

దానితో చాలా మంది స్వయం ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు.. చాలా మంది కిరణా కొట్టు దారులుగా, చిన్న పరిశ్రమల యజమానులగా రూపాంతరం చెందారు. కొంత మంది బాగా చదువుకొని పట్టబద్రులయ్యారు.  ఇక్కడ కూడా ప్రభుత్వం వీరికి ఏమి సాయం చేయలేదు.....

ప్రభుత్వం ఇంకా ఏమి చేసింది ప్రజల జీవన ప్రమాణాల మెరుగవ్వడం కోసం?...

స్వంతంగా అర్దిక అవలంబన ఏర్పాటు చేసుకొసుకొన్న కిరాణాకొట్టు దారుల మూలాలు దెబ్బతీయడానికి ఎఫ్.డి.ఐ. లను అనుమతించింది.

చిన్న పరిశ్రమల యజమానులగా రూపాంతరం చెంది, ఇంకో కొద్ది మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న పరిశ్రమలను దెబ్బతీయడానికి, కరెంటు సరాఫరాలో కోతలు విధించింది.....

బాగా చదువుకొని పట్టబద్రులయ్యి, ఏదోక సంస్దలో ఉద్యోగం సంపాదించుకోవలనుకొన్న యువతకు ఏమి చేసింది? దేశంలో అసలు పారిశ్రామికకరణ అభివృద్దే లేకుండా, స్వంతంగా ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులుగా పడుకోబెట్టింది...

అసలు సక్రమయిన ప్రభుత్వ రవాణా వ్యవస్ద అనేది లేని దేశములో ప్రజలు స్వంత వావానముల మీద ఆధారపడితే, ప్రభుత్వం ఏమి చేసింది? పెట్రోలు ధరల్లో సబ్బీడి ఎత్తేసింది......

ప్రజలకి వారు ఏమి చేయకుండా, ప్రజల నుండి పన్నులు వసూలు చేయడం మానేస్తున్నారా? ముక్కు పిండి మరీ అన్ని రకముల పన్నులను పిండుకుంటున్నారు. పన్నుల ద్వారా వచ్చిన డబ్బును సబ్బీడి రూపంలో తిరిగి ప్రజలకు యివ్వకూడదని మన విజయ కేల్కర్ గారి అభిప్రాయం......

ఇలాంటి కోతల రాయుళ్ళు ఉన్నందునే దేశ అర్దిక వ్యవస్ద సమస్యల్లో ఉన్నదని ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటే మేలు...

ముందుగా వారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పమనండి.. ఆ తర్వాత  సబ్బీడిల్లో కోతల గురించి మాట్లాడమనండి.

 

వ్యవసాయరంగంనకు చేయూత యివ్వక పోయిన పర్వాలేదు... నిర్వీర్యం చేసే చర్యలు తీసుకోకుండా ఉంటే చాలు

సక్రమయిన ప్రజా రవాణా వ్యవస్దను ఏర్పాటు చేయండి.. అప్పుడు ముడి చమురుపై సబ్బీడి యివ్వవలసిన అవసరం లేదు....

కిరణా కొట్టుదారులు, మరియు ఇతర చిన్న చితకా దుకాణాదారులను వాళ్ళ మానాన వాళ్ళను ఉండనీయండి... ఎఫ్.డి.ఐ.లను అనుమతించకుండా ఉంటే చాలు......

ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి.... కానీ నాకే టైమ్ సరిపోవడం లేదు..

నిజానికి, మన అర్దికవేత్తల, రాజకీయ నాయకులు ఘనకార్యల గురించి ఎవరికి టైమ్ సరిపోతుందిలెండి....

ఎవడి పిచ్చి వాడికానందం..... నా గోల నాకు ఆనందం.. ఏమి చేస్తాం....

అంతా అపై వాది దయ....

కాదు...కాదు...

అంతా ఏలికల వారి దయ...

Friday 28 September 2012

నీతి, నిజాయితి, నిబద్దతల ప్రతినిధి


నాలుగో తరగతి ఉద్యోగిగా ముంబయి హైకోర్టులో ఫైళ్ళు మోసిన కుర్రాడు,

ఎనిమిదేళ్ళ తరువాత అదే కోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, గత రెండేళ్ళుగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ నిన్న రిటైరైన నీతి, నిజాయితీలకు ప్రతిరూపం

శ్రీ సరోష్ హోమీ కపాడియా...
 

“నేను ఓ పేద కుటుంబం నుండి వచ్చాను. నాల్గో తరగతి ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన నాకున్న ఆస్తుపాస్తులల్లా నీతి, నిజాయితీ, నిబద్దతలే” అని విన్రమంగా పలికిన శ్రీ సరోష్ హోమీ కపాడియా గారిని స్పూర్తిగా తీసుకొని మరెందరో పనిచేయాలని కోరుకుంటూ... శ్రీ కపాడియా గార్కి తమ శేష జీవితం ఆనందంతో కొనసాగాలని కోరుకుంటున్నాను.
 

Thursday 27 September 2012

జీవ వైవిధ్యం.... తెలుసుకోవలసిన విషయం


మరి కొద్ది రోజుల్లో రాజధాని హైదరబాద్ లో ప్రపంచ స్దాయి జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్న తరుణంలో అసలు జీవ వైవిధ్యం అంటే ఏమిటి? దాని గురించి విస్తృత సమాచారము ఈనాడు దినపత్రికలో రోజూ ఇస్తున్నారు.

ఇప్పటి వరకు జీవ వైవిధ్య సదస్సు అంటే ఏమిటో అనుకునేవాడిని. అదేదో సైన్సుకు సంబందించిన మీట్ ఏమో అనుకున్నాను. కాని దినపత్రికలో చదివిన తర్వాత తెలిసింది. ఆ సదస్సు ప్రపంచంలో అనేకానేక జాతుల జీవనం, అంతరించడం అనే విషయమ్మీద అని.

జీవ వైవిధ్యం పేరుతో ఈనాడు దినపత్రికలో ఈ మధ్య వరుసగా కధనాలు ఇస్తున్నారు. చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.

నిజానికి గ్లోబలికరణ పేరుతో మనము ప్రకృతి ఎంతలా నాశనం చేస్తున్నామో, తద్వారా అనేక జాతుల మధ్య ఉన్న లింక్ ను నాశనం చేయడం వలన మనకు ఎంత నష్టం వాటిల్లుతుందో తెలిసింది. ఒక సారి ఆలోచించి చూస్తే మన చిన్నప్పుడు కళ్ళ ముందు తిరిగిన అనేక జీవజాతులు నేడు చాలా అరుదుగా కనిపించడం గమనిస్తున్నాము.(నిజం చెప్పాలంటే కాకులు కూడా చాలా అరుదుగా కనిపిస్తున్నాయి). ప్రకృతి ప్రకోపం, కరువు లేక యితర కారణాల వలన ఒక జాతి అంతరించాలంటే ఇంచుమించుగా కొన్ని వందల సం.రాలు పట్టోచ్చు.

అడవుల్లో ఉన్న జాతులు గురించి ప్రక్కన పెట్టండి. మా చిన్నతనంలొ మేము చూసిన అనేక జాతులు ఇప్పటికే కనుమరుగు కావడం చాలా బాధగా ఉంది. బహుశా ఒక ఇరవై సం.ల వ్యవధిలో అనుకుంటా ఇలా జరగడం. అంతరించిపోవడం అనే ప్రక్రియ ఎంత వేగంగా ఉందో అర్ద్రం అవుతుంది.

నా చిన్నతనంలో ఉన్న వాటిలో పిచ్చుకలు, రామచిలుకలు, గ్రద్దలు, రాబందులు, కముజు పిట్టలు ఇంకా నాకు పేర్లు గుర్తుకు రావడం లేదు కానీ చాలా ఉన్నాయండీ...అవన్నీ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా కనబడడం లేదు.
 
 

ఇక కప్పలు..... ఎక్కడ పడితే కనిపించే కప్పలు కూడా అసలు కనబడడం లేదండీ..
 

నాకు బాగా గుర్తు... మా అన్నయ్య కు కప్పంటే చాలా భయం. అది తెలిసి నేను కప్పను చేతితో పట్టుకొని మా అన్నయ్య వెనకాల పరిగెట్టడం నాకు ఇప్పటికి బాగా గుర్తు.

రోజులు ఎలా మారిపోతున్నాయో...ఏంటో...  కొన్నాళ్ళకు మానవ జాతి మాత్రమే ఉండేలా ఉంది...

గిరిజన కిషోరం


కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ కేంద్రమంత్రిగా తనకున్న విశేషాధికారముని ఉపయెగించి విశాఖ మన్యంలో బాక్సైట్ గనుల కేటాయింపులను రద్దుచేయడం ద్వారా తాను ప్రజల ప్రతినిధినని చాటారు..
 
పచ్చని అడవులతో, అనేక రకాలైన విభిన్న గిరిజన జాతులతో అలరారుతున్న విశాఖ మన్యంలో బాక్సైట్ గనుల తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రెవేటు కంపెనీలకు అనుమతి యివ్వడం ద్వారా మన్యం భవిష్యత్తు పై నీలినీడలు కమ్ముకున్నాయి.  తవ్వకాలు ద్వారా పచ్చని అడవులు నాశనం ఆవ్వడమే కాకుండా అనాదిగా ఉన్న ప్రకృతి చక్రం తారుమారు అయ్యే ప్రమాదం ఉండడంతో మన్యంను నమ్ముకొని అనేక వందల ఏళ్ళుగా జీవిస్తున్న అనేక గిరిజన తెగల ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు చెవికి ఎక్కించుకోలేదు.  దీనిపై మన్యంలోని ఒక గిరిజన తెగకు చెందిన కిశోర్ చంద్రదేవ్., తాను ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, గనుల తవ్వకాల వలన జరగబోయే నష్టాన్ని పసిగట్టి, సదరు తవ్వకపు అనుమతులను రద్దు చేయవలసినదిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినప్పటికి, రాష్ట్ర ప్రభుత్వము దానిని ఇసుమంతైన పరిగణనలోకి తీసుకోలేదు.

దానితో రాష్ట్ర గవర్నర్ వార్కి గల విశేషాధికారమును ఉపయెగించి తవ్వకాలను రద్దుచేయవలసినదిగా కేంద్రమంత్రి హోదాలో విన్నపం చేసినప్పటికి నేటి వరకు గవర్నర్ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్న పాపానికి పోలేదు. దానికి కారణం బాక్సైట్ గనుల లైసెన్సు దక్కించుకొన్న కంపెనీల్లో విదేశీ కంపెనీలు కూడా ఉండడం కారణం కావచ్చు. వాటికి దన్ను ఇచ్చే పెద్ద తలకాయలు ప్రభుత్వంలో ఉండడంతో గవర్నర్ కూడా మిన్నకుండిపోయారు.

మన్యంలో తవ్వకాలు వలన నాశనమయ్యే ప్రకృతి, గిరిజన తెగలు మరియు అనేక యితర జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నప్పట్టికి ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం చూస్తే, వారు ప్రజల తరపున పనిచేస్తున్నారా? లేక ప్రెవేటు కంపెనీ ప్రతినిధుల కొరకు పనిచేస్తున్నారా? అన్న సందేహం వస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం మరియు గవర్నర్ నుండి ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇక చివరి అస్త్రంగా తనకున్న విశేష అధికారమునుపయెగించి బాక్సైట్ గనుల తవ్వకాల అనుమతిని రద్దు చేయుచూ రాష్ట్ర ప్రభుత్వానికి నోట్ పెట్టారు.

ఒక వేళ కేంద్ర మంత్రి ఆదేశాలను రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోతే, ఏంటి పరిస్దితి అని అడిగిన జర్నలిస్టులకు ఆయన ఇచ్చిన సమాధానం “గిరిజన శాఖ మంత్రిగా నాకు రాజ్యాంగం ద్వారా  సంక్రమించిన అధికారమును నేను ఉపయెగించాను. దానిని పాటించకపోతే రాజ్యాంగంను పట్టించుకోనట్టే”
 

మరియు నేను గిరిజన శాఖా మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, దానికి సంబందించి గిరిజన సంక్షేమంను పట్టించుకోకపోతే నేనేందుకు? ఈ శాఖ ఎందుకు? అని ప్రశ్నించారు.

మన్యం ప్రజల జీవనధారం, ప్రకృతి వనరులు నాశనం ఆవుతున్నా పట్టించుకోనని ప్రభుత్వం, మరి రాజ్యాంగంను అయినా పట్టించుకుంటుందా అనేది వేచిచూడాలి.

Tuesday 25 September 2012

ప్రధాని గారి ట్విట్టు మాట



ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తన ట్విట్టర్ లో వ్రాసిన వ్యాఖ్యానం

ఎఫ్.డి..లు అనుమతించడం ద్వారా చిన్న వ్యాపారులను ప్రక్కకు నెట్టడం అన్నది సరికాదు.
    చిన్న వ్యాపారులకు సరయిన అవకాశాలుంటాయి.

అంటే ఆయన గారి ఉద్దేశం క్రింది విధంగా వుంటుంది కాబోలు.........


 

Monday 24 September 2012

ప్రజలు సహృదయంతో అర్ద్రం చేసుకోవాలి..


ఎక్కడో విన్నట్టుగా ఉందా మీకు పై వాక్యం చూసినపుడు....

ఇంకెవరండీ.. మన బొత్స గారు ఆర్టీసి చార్జీలు పెంపుదల సందర్బంగా చెప్పిన అపూర్వ మాటలవి...

మన్మోహన్ సింగ్ గారేమో డీజిల్ ను ధనవంతులు మాత్రమే వాడతారు.. మరియు ఖరిదైన కార్లకు మాత్రమే డీజిల్ వాడతారు. అలాంటప్పుడు ధనవంతులకు, వారు వాడే కార్లకు అవసరమయ్యే డిజీల్ కు రాయితీ యివ్వడం భావ్యమా? ధనవంతుల కొరకు సబ్బీడిలు యివ్వడం  అవసరమా? అని దేశంలో సామాన్యులందరి తరపున వకాల్తా పుచ్చుకొని అమాయకంగా అడిగారు... (కార్పోరేట్లకు, బడా కంపెనీలకు ఇష్టానుసారం ప్రభుత్వం యిచ్చే రాయితీల గురించి మాట్లాడకండి. మనకు తెలీదనుకుంటున్నారు కదా).

డిజీల్ ధర పెంపు వలన ధనవంతులకు మాత్రమే నష్టం అని తమ పార్టీ ప్రభుత్వం వారే అంటే, మరి బొత్స గారు సామాన్యుల నడ్డి విరిగేలా ఆర్టీసి చార్జీలు పెంచేసి, డిజీల్ ధరలు పెరగడం వలన,  చార్జీలు తప్పనిసరయి పెంచవలసివచ్చిందని సెలవిచ్చారు. మరియు ఈ చర్యని ప్రజలు సహృదయంతో అర్ద్రం చేసుకోవలసినదిగా కోరారు.

ఇంతకీ ప్రజలు అర్ద్రం చేసుకోవలసినది....

బొత్స వారి బాదుడు సామాన్యుల మీద వేసినందుకా లేక సింగ్ గారు చెప్పినట్లు ధనవంతుల మీద వేసినందుకా?

చెట్లకు డబ్బులు కాస్తాయా?


దేశాన్ని ముందుకు నడిపించలంటే సంస్కరణలు అమలు చేయవలసినదే,

దానికోసం డబ్బులు కావాలి కదా? అవి ఎక్కడ నుండి వస్తాయి? డబ్బులేమి చెట్లకు కాయవు కదా! అని గొప్ప సత్యాన్ని చెప్పిన మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు...

ఎనిమిదేళ్ళుగా ఏలుతున్న తమ ప్రభుత్వ నిర్వాకం ఫలితంగా ఇష్టానురీతిన నిత్యావసరములు, యితర అవసరముల ధరల పెరుగుదల,  గ్యాస్ సబ్బీడిలు ఎత్తివేత వంటి చర్యలు ద్వారా ఇప్పటికే సామాన్యుడి అర్దిక పరిస్దితిని అతకతులం చేసిన ప్రభుత్వం..... మరీ వీటన్నిటిని భరించడానికి సామ్యానులకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయనుకుంటున్నారు?

బహుశా సామాన్యుల ఇళ్ళల్లో చెట్లకు డబ్బులు కాస్తున్నాయి అనుకుంటున్నారా!!

Sunday 16 September 2012

ఒబామా గొప్పా?, సింగ్ గొప్పా?

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గొప్పా లేక భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్పా?
అమెరికా అధ్యక్షుడు తమ దేశ కంపెనీలు ఉత్పత్తులను స్వంత దేశ ప్రజలే కొనక, అమ్ముడవక వాటిని ఎలా, ఎక్కడ అమ్మాలా అని అలోచించి వాటిని భారత దేశానికి అంటగట్టి, తద్వారా అమెరికా కంపెనీలను సేవ్ చేద్దామనుకొన్నాడు
మరి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తమ దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ప్రజలు ఇబ్బందులతో అలరారుతున్నప్పటికీ, విశాల హృదయంతో అమెరికా ప్రజల కష్టాలకు స్పందించి ఎఫ్.డి.ఐ. లకు తలుపులు బార్లా తెరిచారు.
ఇప్పుడు చెప్పండి,
స్వంత ప్రయెజనాలను ఆశించి అమెరికా కంపెనీలను సేవ్ చేద్దామనుకుంటున్న ఒబామా నా
లేక ప్రపంచ సంక్షేమమే ధ్యేయంగా (ప్రపంచం అంటే మన్మోహన్ దృష్టిలో అమెరికా అని అర్దం చేసుకోవాలి) స్వప్రయెజనాలను కూడా పణంగా పెట్టి దేశ ప్రజలను బకారాలను చేద్దామనుకుంటున్న సింగ్ గారా
ఎవరు గొప్ప?

Saturday 15 September 2012

What is the Life?

వ్వాట్ ఈజ్ ద లైఫ్?

టి.వి. చూస్తూ, నా ప్రక్కన్న ఉన్న నా రూమ్ మేట్ నాయుడు ని అడిగాను..

నా పైపు అదోలా చూసి, నాకు ఇటు వైపు కూర్చొన్న నరేంద్ర వైపు చూశాడు. తనని అడగమన్నట్టుగా..
నరేంద్ర వైపు చూసి, సార్, వ్వాట్ ఈజ్ ద లైఫ్? అని అడిగాను...

వాడు నా పైపు కొద్దిగా ఎగాదిగా మరియు చిరునవ్వుతో చూసి, లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ అన్నాడు...

నేను, నాయుడు నవ్వుకున్నాము వాడి సమాధానానికి! ఎందుకంటే ఆ రోజే శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ రిలీజ్......

వాడు సమయాను సంధర్బంనుపయెగించి, చమత్కారంగా సమాధానము చెప్పినప్పటికీ, నేను వేసుకొన్న క్వొశ్చన్ కి సరయిన సమాధానము దొరకలేదు అనిపించింది.

ఆవును...... వ్వాట్ ఈజ్ ద లైఫ్?


ప్రతి ఒక్కరికీ, ఏదోక సందర్బంలో ఈ క్వొశ్చన్ తగులుతుందని ఎక్కడో చదివాను. నిజంగానే ఆ క్వొశ్చన్ నాకు ఇప్పుడు వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడూ మనకి అటువంటి క్వొశ్చన్ రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నిజంగానే లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ కాబట్టి.. ఆప్పుడే లైఫ్ ని ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేయగలమా అనే ఆలోచించగలము. కొద్దిగా పెద్ద ఆయిన తర్వాత చదువులు గురించి, టార్గెట్ పెట్టుకొన్న గోల్స్ గురించి,  అమ్మాయిల గురించి, ఉద్యోగాల గురించి ఆలోచించి ఏ సందర్బంలోను పై క్వొశ్చన్ బుర్రలోకి వచ్చే చాన్సే లేదు. అదీ కూడా ఆయిపోయిన తర్వాత, అంటే ముప్పైకి వచ్చాక, ఈ క్వొశ్చన్ వచ్చింది బుర్రలోకి....

వయసు పెరిగే కొలదీ మనిషిలో సున్నితత్వం తగ్గిపోయి, స్వార్దం పెరుగుపోతుందని ఒక తత్వవేత్త సెలవిచ్చాడు...
 
అదే విధంగా ఇంకో పెద్దాయన, పెద్దయ్యే కొలది, మమతలు, అనుబంధాలలో కూడా తేడాలు వస్తాయని సెలవిచ్చాడు....

ఇలా, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్దితిని ప్రతి ఒక్కరూ ఇరవై ఆరు నుండి ముప్పై సం.రాల లోపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారని తెలిసింది... అదేంటో నాకు మాత్రం ముప్పై దగ్గరకి వచ్చిన తర్వాత కాని నాకా క్వొశ్చన్ తగల్లేదు. (బహుశా మన తెలివి ఎక్కువయిపోయి ఉంటుందిలెండి). పోనిలే ఇప్పటికైనా వచ్చిందీ... రాకపోయే ఉంటే అసలు నేను మనిషిని కానేమో అని డౌట్ వచ్చి యుండేది...

నిజంగానే నాకీ ఈ డౌట్ వచ్చిన దగ్గర నుండి సరయిన సమాధానము దొరకలేదు.

ఒక్కొసారి ఆలోచిస్తే, నాలో స్వార్దం పెరిగిపోయిందేమో అనిపించింది. అలాగే నా సన్నిహితులతో నాకున్న అనుబంధాలలో గాఢత తగ్గిపోయిందేమో అని కూడా అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో నాకీ క్వొశ్చన్ ఇప్పుడు వచ్చింది!

నిజానికి నేను చాలా హ్యాపిగా గడిపేశాను ఇప్పటి వరకు... ముఖ్యంగా నా స్నేహితులతో నాకున్న అనుబంధం, అలాగే బంధువులతో ఉన్న అనుబంధం నా జీవితాన్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచేవి.  మరి, ఇప్పుడు వారందరూ లేరా? అని అడిగితే ఉన్నారనే చెప్పాలి... మరెందుకు నేనిలా ఉన్నాను?

ఏమో సమాధానము నాకే తెలియదు.

కాని నా స్నేహితులు మాత్రం అందరూ కలసినపుడు గతంలో లాగానే చాలా హ్యపీగా ఉంటారు.. ఒకప్పుడూ నేను వాళ్ళలో ఒకడిలా కలసిపోయేవాడిని. కానీ ఇప్పుడు.... వాళ్ళతో కలవలేకపోతున్నాను....

బహుశా వయసుతో పాటుగా అలోచనల్లో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మనము ఏమీ సాధించాము అనిపిస్తుంది? నేను స్వయముగా సాధించాను అనదగ్గ విజయలేవి అనిపిస్తుంది? తరచి చూసుకుంటే ఏమి కనబడడం లేదు... అదేనా మన అసంతృప్తికి కారణం? 

అదేనని చెప్పలేము... మన స్వంత విజయాలు కాకపోయిన, ఈ రోజు నేను మంచి పొజిషన్ లోనే ఉన్నాను. మరెందుకు ఇప్పుడు మాత్రమే వ్వాట్ ఈజ్ ద లైఫ్ అని క్వొశ్చన్ నా బుర్రలో తొలుస్తుంది?

తొక్కలో ఆలోచనలూ నువ్వునూ.... చెత్తగా అలోచించండం వలనే ఇలాంటి చెత్త అలోచనలు వస్తుంటాయి నీకు అని నా అంతర్మాత నన్ను విసుక్కొంది....

అంతేనేమో అని అనుకొని, కనీసం శేఖర్ కమ్ముల ఆయిన చెప్పుతాడు కదా అని “ లైఫ్ ఈజ్ బ్యూటీపుల్” సినిమాకి వెళ్ళా... మూడు గంటలు ఓపిక పట్టి చూసాను.. ఆయిపోయిన తర్వాత చూద్దును.... నా క్వొశ్చన్ కి సమాధానం దొరకలేదు...

సినిమా ఆయిపోయిన తర్వాత, రూమ్ కి వచ్చిన తర్వాత అడిగారు నా రూమ్మేట్స్ సినిమా ఎలావుంది అని?

వ్వాట్ ఈజ్ ద లైఫ్? ........ ఇది నా సమాధానం వారు అడిగిన దానికి నా సమాధానం.

అప్పుడు నరేంద్ర అన్నాడు....  రాజీవ్ కి పెళ్ళయితే కాని తెలియదు ఈ క్వొశ్చన్ కి సమాధానం....
ఆయిన నాకొక డౌట్.... పెళ్ళయితే ఎవ్వడైనా చెప్పుతాడు “లైఫ్ ఈజ్ హెల్” అని....

నాకు అపుడు కాదు కావాలి... ఇప్పుడు కావాలి సమాధానం “వ్వాట్ ఈజ్ ద లైఫ్” అంటే.....