Sunday 11 March 2012

మగాడికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు ఏమిటి?

పై టైటిల్ చూసి తొందరపడి ఈ పోస్ట్ లోకి వచ్చినందుకు మొదటగా మీకు సారీ..
ఎందుకంటే మంచి మేటర్ చదువుతున్నమనుకొని ఇందులోకి వచ్చి మీ
అమూల్యమైన టైమ్ వేస్ట్ చేసినందుకు.
ఎందుకంటే నేను అడిగింది ప్రశ్న మాత్రమే.. అంతేకాని దానికి సమాధానం కాదు.
అనుభవజ్ణులైన బ్లాగర్లు ఈ నా ప్రశ్నకు సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నాను...
నేను ఆ మధ్యన మా బంధువర్గంలోని కొంత మంది అమ్మాయిలని అడిగాను ఈ ప్రశ్న..
దానికి ఒక్కొక్కొరు, ఒక్కొక్క విధముగా సమాధానం చెప్పారు...
మొదటిది: అల్కహల్ అలవాటు ఉండకూడదు...
అల్కహల్ అలవాటు లేని వాళ్ళందరూ మంచి లక్షణాలు కల్గి ఉంటారని సర్టిఫై చేయగలమా?
అలాగే అల్కహల్ అలవాటు ఉన్నవాళ్ళందరూ చెడు లక్షణాలు కల్గి ఉంటారని సర్టి ఫై చేయగలమా?
రెండవది: సిగరెట్టు అలవాటు ఉండకూడదు...
సిగరెట్టు త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని నేను ఒప్పుకొంటాను.. కాని సిగరెట్టు త్రాగకపోవడం అనేది
ఉత్తమ లక్షణం క్రిందకి వచ్చినప్పటికి, అతని వ్యక్తిత్వం మంచి లక్షణాలతో కూడి ఉంటుందని సర్టి ఫై చేయగలమా??
మూడవది: బట్ట తల ఉండకూడదు....
ఓ మై గాడ్.. ఇది కూడా ఉత్తమ లక్షణం కేటగిరిలోకి వస్తుందా.....
అంటే బట్టతల లేని వాళ్ళందరికి ఉత్తమ లక్షణాలు ఉన్నట్టేనా???
నాల్గవది: నన్ను చాగా చూసుకోవాలి..
తమను బాగా చూసుకుంటే, అది ఉత్తమ లక్షణం క్రింద జమ కట్టేయవచ్చా??
వాడు బయట బోలెడు వెధవ పనులు చేసి, ఇంట్లో తమను బాగా చూసుకుంటే.. దానిని ఉత్తమ లక్షణంగా జమకట్టవచ్చా??
ఇదండీ.. నేటి తరం అమ్మాయిల్లో మగాడి కి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు...
ఇక నా ఉద్దేశంలో చెప్పాలంటే ఉత్తమ లక్షణాలు వేరు, అలవాట్లు వేరు అని చెబుతాను.
అలవాట్లు అనేవి అతని యొక్క బాహ్య స్వరూపమును తెలుపుతాయి...
కాని లక్షణమనేది ఆ వ్యక్తి యొక్క నడవడికను తెలియజేస్తుంది...
ఒక వ్యక్తికి అల్కహల్ త్రాగడమనే చెడు అలవాటు ఉన్నప్పటికీ, అతనికి ఉత్తమ లక్షణాలు కల్గి ఉండోచ్చు..
దాని వలన ఇతరులకు హాని కల్గదు.. కాని చెడు లక్షణాలు కల్గి ఉంటే, అది ఇతరులకు హని కల్గిస్తుంది...
అలాగే త్రాగకపోవడమనే మంచి అలవాటు ఉ న్నప్పట్టికి, అతను చెడు లక్షణాలు కల్గి ఉండోచ్చు...
దాని వలన అతనికి హని లేకపోయినప్పటికి, ఇతరులకు హని కల్గుతుంది....
అదే విధముగా సిగరెట్టు అలవాటు, బట్టతల లేకపోవడం, బాగా చూసుకోవడం విషయాల్లో కూడా...
ఒక మగాడికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు చరిత్రలో వివరించినట్టుగా నాకు గుర్తు..
(క్షమించండి.. సదరు వివరములు ఇక్కడ ఇవ్వలేకపోయినందుకు).
(అని నాకు అందుబాటులో లేవు)
గమనిక: నాకు పైన తెల్పిన అల్కహల్, సిగరెట్టు అలవాటు లేదు. మరియు బట్టతల కూడా
లేదని మీ అందరికి మనవి చేసుకుంటున్నాను.
అంటే వాళ్ళ దృష్టిలో నేను ఉత్తమ మగాడినని ఫీల్ అయిపోయి చంకలు గుద్దేసుకుంటున్నానని అనుకోకుండేయి...
నేను అంత మంచోణ్ణి అని అనుకోవడం లేదు లెండి......
మీకైమనా నా ప్రశ్నకు సమాధానం తెలిస్తే, కొద్దిగా చెప్పండే.....

7 comments:

  1. హ హ.. బట్టతల ఉండకూడదా.. :-)

    సరేలెండి. ఉత్తమ లక్షణాలు అనేవి ఆయావ్యక్తులను బట్టి మారుతూ ఉంటాయి. నాకు సంబందించినత వరకూ ఉత్తమ లక్షణాలు కల మగాడు అంటే..

    తన ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా మరొకరి ఆత్మగౌరవానికి భంగం కలిగించ కుండా జీవించ గలిగే వాడు ఉత్తమ పురుషుడు.

    ReplyDelete
  2. శ్రీకాంత్ గార్కి,
    "తన అత్మ గౌరవానికి భంగం కలగకుండా మరొకరి అత్మగౌరవానికి భంగం కలిగించకుండా జీవించగలిగే వాడు ఉత్తమ పురుషుడు"
    ఒక వాక్యంలో చాలా బాగా చెప్పారండీ... కేకో.. కేక...

    ReplyDelete
  3. అన్ని జంతువుల ఉత్తమలక్షణాలు తనకే కావలని కోరుకుందట జిరాఫీ ! ఆ కధ గుర్తుకొస్తోంది వీళ్ళ అమాయకత్వం చూస్తే.గూ్గ్లిస్తే ఈ చతురోక్తి కనిపించింది :
    http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=579

    ReplyDelete
  4. అన్ని జంతువుల ఉత్తమలక్షణాలు తనకే కావలని కోరుకుందట జిరాఫీ ! ఆ కధ గుర్తుకొస్తోంది వీళ్ళ అమాయకత్వం చూస్తే.గూ్గ్లిస్తే ఈ చతురోక్తి కనిపించింది :
    http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=A&ID=579

    ReplyDelete
  5. అన్వేషి గార్కి,
    మొదటగా మీకు ధన్యవాదములు నా బ్లాగ్ ని దర్శించినందుకు...
    జిరాఫీ అన్ని జంతువుల ఉత్తమ లక్షణాలు తనకే కావలనుకున్న కధ నాకు తెలియదండి..
    మీరు అడ్రసుతో ఇచ్చిన చతురక్తి చాలా బాగుందండీ...... ఎంతయిన అమ్మాయిలంటే అమ్మాయిలెనండి....

    ReplyDelete
  6. మళ్లీ ఇంకొ మొట్టికాయ మీ టపా చూసిన తర్వాత ఆ లక్షణాలేవొ చెప్పాలని అనుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. చెప్పండి సార్... అంతకంటేనా!
      తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండీ

      Delete