Monday 21 May 2012

’పవర్’ అన్ ఇన్ బైపోల్స్ ఏరియాస్ (అదృష్టవంతుల కధ)....


’పవర్’ అనే పదానికి ఎంత శక్తి ఉందో మీ అందరికి తెలుసు...

ముఖ్యంగా ఆ పదాన్ని ఒక్కొక్కొరు ఒక్కొక్కొ విధముగా అన్వయించుకుంటారు.....

ఎవరు ఏ విధంగా అన్వయించుకొన్నప్పటికి పవర్ అనే పదానికి చాలా శక్తివంతమైన అర్దం వస్తుంది...

అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పవర్ స్టార్ అనే బిరుదు తగులించుకొన్నారు.....

పవర్ స్టార్ అంటే ఆంద్రలో యువత వెర్రెత్తిపోతారు........ అదే విధంగా "పవర్" అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదే స్దాయిలో వెర్రెత్తిపోతారు....

"పవర్" అనే పదాన్ని ప్రభుత్వ పెద్దలు రెండు రకాలుగా అన్వయించుకుంటారు.. ఒకటికి ఎలక్షన్స్ కు ముందు ప్రజలకు కావలసిన కరెంటు గురించి....ఎలక్షన్స్ తర్వాత తమకొచ్చే అధికారం గురించి..... ఏదైనా దానిని పవర్ అనే అంటారు....

ఎందుకంటే వాళ్ళ దృష్టిలో తమ "పవర్" నిలబెట్టుకోవాలంటే, ప్రజలను "పవర్"(కరెంటు) కష్టాల నుండి గట్టెంకిచాలి కాబట్టి....

సాధారణంగా ప్రభుత్వాలు తమకు "పవర్" అందివచ్చేవరకు ప్రజలకు కావలసిన పవర్ గురించి చాలా శ్రద్ద తీసుకుంటారు.... దాని కోసం ప్రక్క రాష్ట్రాల నుండి ఎంత మొత్తానికైనా కొనుగొలు చేస్తారు.....

వాళ్ళకు కావలసిన "పవర్" వచ్చేసిన తర్వాత, ప్రజలకు కావలసిన పవర్ గురించి మర్చిపోతారు.... ఇక పవర్ గురించి ప్రజలు, ముఖ్యంగా రైతులు పడే పాట్లు ఆ దేవుడికే ఎరుక.....

తమ "పవర్" పదిలంగా ఉన్నంతకాలం.. ప్రజల పవర్ కష్టాలు గురించి అలోచించడానికి కూడా తీరిక లేకుండా, తమకు ప్రయెజనం చేకూర్చే పవర్ ప్రాజెక్టులు గురించి అలోచించుకోవడానికే తమ హెచ్చు సమయం సరిపోతుంది.....

వాళ్ళ కంటికి ప్రజలు ఎలక్షన్స్ సమయములోనే మహారాజుల్లా కనబడతారు... ఆ సమయములో ప్రజల మీద ఎక్కడ లేని అపార ప్రేమ పుట్టుకొస్తుంది.. ఆ సమయములో రూల్స్ అన్ద్ రెగ్యులేషన్స్ జాన్త హయి...

మొదటగా వారు అలోచించేది ప్రజల గురించే. ఎందుకంటే మరి వాళ్ళకు కావలిసినది ప్రజల దగ్గర ఉంటుంది కాబట్టి. ఆ ఎలక్షన్లు ఉన్న సమయం మంతా ప్రజలకు ఎటువంటి పవర్ ఇబ్బందులు లేకుండా రేయింబవళ్ళు ఎంతో కష్టపడుతుంటాయి ప్రభుత్వాలు....

అందుకనే నాలాంటి అమాయక జీవులు అనుకుంటాయి... ఎల్లవేళలా ఎలక్షన్లు ఉంటే బాగుణ్ణు అని.....
కాని ఆ దేవుడు అందరి మొరలు అలకించలేడు కదా..... ఒకవేళ అలకించిన అందరి కోరికలు తీర్చలేడు కదా......
అందుకని అలాంటి మహరాజు జీవితంను ఈ వేసవిలో కేవలం కొంత మంది కైనా కల్పించాలని ఆ దేవుడు సంకల్పించాడు....

అనుకున్నదే తడవుగా భగ భగ మండే వేసవిలో పద్దెనిమిది నియెజకవర్గాల్లో ఉప ఎన్నికలు రప్పించాడు.....
ఉప ఎన్నికలు రప్పించినాక ప్రభుత్వాలుకు కంటి మీద కునుకు ఎక్కడ పడుతుంది. అంతే ఉప ఎన్నికలున్న పద్దెనిమిది నియెజకవర్గ ప్రజలు వాళ్ళ దృష్టిలో మహరాజులయిపోయారు..... వెంటనే వారికి ఈ వేసవిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగర్తలు తీసుకోవాలని క్రింది స్దాయి అన్ని శాఖల అధికారులకు అదేశాలు వెళ్ళిపోయాయి....


అన్నింటిని తిమ్మిని బమ్మిని చేసి ఏదో విధంగా సరిపెట్టగలరు కాని..... పవర్ ను మాత్రం ఎలా సరిపెట్టగలదు ఆ మాత్రం అధికారులు........ అసలే వేసవి కాలమామే.... ప్రజలు ఎండ వేడి భరించలేక కరెంటును మంచినీళ్ళు త్రాగినట్టు పోలోమని త్రాగేస్తుంటే "పవర్" కి కటకట వచ్చేసింది...


ఆయినప్పటికి ఆ పద్దెనిమిది నియెజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు కలగరాదు. మంత్రదండం వాళ్ళ చేతుల్లో ఉందాయే....


ఆ పద్దెనిమిది తప్పితే మిగతా వాళ్ళతో మనకి పని ఏముందిలే అని ధర్మ ప్రభువులు వారు, అయా ప్రాంతాల్లో గంటలకు గంటలు తరబడి పవర్ కట్ అమలుచేసి, ఉప ఎన్నికల ప్రజలకు నిరంతర కరెంటు సప్లయి చేయుచూ వారి సేవలో తరించిపోతున్నారు...


తంతే, బూరెల బుట్టలో పడ్డట్టు, కరెక్టుగా మండు వేసవిలోనే వాళ్ళ నియెజకవర్గాలకు ఎన్నికలు వచ్చినందుకు అక్కడ ప్రజలు ఉబ్బితబ్బి ఆయిపోతున్నారు... ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత వెసులుబాటు ఉంటుందా అని.......

మిగతా ప్రాంతాల ప్రజలు మాత్రం... ప్రభుత్వం వారు బహుకరిస్తున్న "పవర్ కట్" పధకాన్ని తనివితీరా అనుభవిస్తూ, తమకు ఉప ఎన్నికలు రాని తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ.......................... గడిపేస్తున్నారు....
 

తప్పదు కదా...... రేయ్... విసన కర్ర ఇలా తెండి రా బాబు........ చచ్చిపోతున్నా గాలి ఆడక....


Monday 14 May 2012

దువ్విన తలనే దువ్వగా...

దువ్విన తలనే దువ్వగా....దువ్వగా.. ఏమవుతుంది??

నెత్తి మీద క్రాప్ చాలా అందంగా కనబడుతుంది అంటారా మీరు??

నేను అయితే ఏమి అనను కాని.. మా చెల్లాయి అయితే మాత్రం అద్దమునకు కన్నాలు పడిపోతాయి అని ఆట పట్టిస్తుంది...

కన్నాలు పడితే ఏమిటి లేకపోతే ఏమిటి అని అనుకొని ఉంటే నాకే ఏ సమస్యలు లేకపోదును... కాని నిలువెత్తు అద్దంతో నాకు చాలా సమస్యలు వస్తున్నాయండీ బాబూ..... మీకు నవ్వులాటగా ఉన్నా, నాకు మాత్రం నిలువెత్తు అద్దం బోలెడన్నీ సమస్యలు తెచ్చిపెడుతుందండీ... నన్ను నన్నుగా స్దిమితంగా ఉండనీయడం లేదు.

ఇదేంటి.. నిలువెత్తు అద్దం తో మనోడికి సమస్యలు ఏమిటి అనుకుంటే, వివరముగా చెపుతాను మీకు.. వినండి....

అద్దం యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు ఉన్నది కాదని రామాయణం తెలిసిన వారందరికి తెలుసు.. ఆ రోజుల్లో సాక్షాత్తు శ్రీ రామ చంద్రుల వారే తన చిన్నతనంలో ఎక్కడో అందనంత ఎత్తులో ఉన్న చందమామ కావాలని మారాం చేస్తే, ఏమి చేయాలో తోచని దశరధుడిని కాపాడింది ఎవరు?? అద్దమే కదా.... నిలువెత్తు అద్దంలో చందమామను చూపించి శ్రీ రాముని కోరిక తీర్చాడు.. ఆ అద్దంలో ఉన్న చందమామను చూసి నిజమైన చందమామ అని భ్రమపడి ఆ శ్రీ రామచంద్రుడంతటి వాడే ఎంత సంబరపడిపోయాడో అంటే మనమెంత చెప్పండి!!

అదే విధంగా ఆడాళ్ళకు అద్దంతో ఉన్న అవినాభవ సంబంధం గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఇంట్లో ఏమి లేకపోయినా పర్లేదు కాని, అద్దం మాత్రం లేకపోతే అడవాళ్ళు గుమ్మం దాటి బయటకు రాలేరని మా కన్నగాడు ఏనాడో చెప్పేశాడు.

ఇకపోతే వావానాలకు, బైక్ లకు ఉండే అద్దాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పక్కల్లేదనుకుంటా.... వెనక ఎవరూ వస్తున్నారో దాని ద్వారా తెలుసుకొని తద్వారా డ్రైవింగ్ ఫర్ పెక్ట్ గా చేయడానికి ఎంతగానో ఉపకరిస్తాయి కూడాను అవి.

అద్దంతో ఇన్ని ఉపయెగాలుండగా నాకు మాత్రం అద్దంతో చాలా ఇబ్బందులే కల్గుతున్నాయి..

నా చిన్నప్పుడు మా ఇంట్లో నిలువెత్తు అద్దం ఉండేది. దానిలో నేను ప్రతిరోజూ చూసుకొని నా ప్రతిబింబంను పై నుండి క్రింద దాకా చూసుకోవడం నాకు అలవాటు. (బట్టలు వేసుకొనే లెండి). అ అలవాటు అద్దంలో పావు వంతు ఉన్న నా ప్రతిబింబం, అద్దం చివరకి వచ్చేంత వరకు సాగుతునే ఉంది.

నిలువెత్తు అద్దం ముందు మన ప్రతిబింబం చూసుకోవడం కామనే అనుకొండి.. కాని అది శృతి మించితేనే అనర్దాలు..

అమితాబ్ బచ్చన్ మొదటిసారి సినిమా అవకాశాల కోసము ప్రయత్నించినపుడు, ముందు అద్దంలో చూసుకో నీ ముఖంను అని వెటకరించడట ఒకడు.. రోషమొచ్చిన అమితాబ్ అద్దం ముందు గంటల తరబడి నిలబడి ప్రాక్టిస్ చేయడం ద్వారా తదనంతర కాలములో గొప్ప యాక్టర్ అయ్యాడు... అమితాబ్ విషయములో శృతి మించడం అనేది అతనికి ప్లస్ ఆయింది. కాని అది అందరికి ప్లస్ అవ్వాలని రూలేమి లేదు కదా.

అలాగని నన్ను ఎవడూ అద్దంలో నీ ముఖం చూసుకోమని ఎగతాళి చేయలేదులెండి. అలాంటి అవకాశం ఎవడూ ఇవ్వకుండానే నేనే నిలువెత్తు అద్దం కనబడగానే వెంటనే దాని ముందు ప్రత్యక్షమయిపోతాను...

టీనేజికి వచ్చినంతవరకు పెద్దగా ముదరలేదు కాని జబ్బు, ఆ తర్వాతే బాగా ముదురుపోయింది. ప్రతిరోజు నిలువెత్తు అద్దము ముందు నిలబడి నిన్నటికి, ఇవాళ్టికి తేడా ఏముందా చూసుకోవడం నా పాలిట దరిద్రం ఆయింది. మనిషి అన్నాక బాడీలో బోలెడన్నీ మార్పులు వస్తుంటాయి కదండీ. అవన్నీ సహజం కూడానూ.. కాని అద్దం ముందు ఉన్నప్పుడు నాకు అవేవి గుర్తుకు వచ్చిచావడం లేదు. సరి కదా నిన్నటి మీద ఈ రోజు లావు ఆయిపోయానేమో అన్న అనుమానం చంపుకుతినేస్తుంది. దానితో లావు తగ్గడానికి అని, చర్మం తెల్లబడడానికి అని ఇలా రోజూ ఏదో ఒక ఫీటింగ్ చేస్తుఉండేవాడిని.

అద్దంలో నా ఏకపాత్రాభినయంను చూస్తుండే మా చెల్లాయి.. అన్నయ్, అలా ఎక్కువ సేపు అద్దం ముందు ఉండి చూసుకుంటూ ఉంటే అద్దానికి కన్నాలు పడిపోవు అని నిష్టురాలు అడేది. మా చెల్లాయి సరదాకే అన్నప్పటికి, మర్నాటి నుండి చూస్తే నిజంగానే అద్దానికి చిన్న చిన్న కన్నాలు పడినట్టుగా అనిపించేది. అయ్యాబాబోయ్ ఇలా అయితే లాభంలేదు... అద్దం మీద పడ్డ కన్నాలు చూసి, మా చెల్లాయి ఎగతాళి చేస్తుందోమోనని అక్కడ నుండి తగ్గించుకోవడం మొదలెట్టాను. కాని నిన్నటికి, నేటికి మార్పు అనే జబ్బు మాత్రం వదల్లేదు...

వాస్తవానికి చెప్పాలంటే నేను నాజుగ్గానే ఉంటాను. కాని అద్దంలో చూసుకొన్నప్పుడు మాత్రం నిన్నటి మీద లావు ఆయిపోయానేమో అని భావన వెంటాడేది. దానితో ప్రతిరోజూ ఉదయము రన్నింగ్ వెళ్ళేవాడిని. అది నాకు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయెగపడిందనుకొండి.

తర్వాత కొంత కాలానికి ఉద్యోగరీత్యా కాకినాడలో ఒక్కడినే ఉండవలసి వచ్చింది. ఆ మాత్రం మన ఒక్కడికే అన్ని ఫర్నిచర్స్ అక్కర్లేదు కదా...

అందుకని నేను ఉంటున్న రూమ్ లో ముఖం మాత్రమే కనిపించే ఒక చిన్న అద్దం ఉండేది. దానితో నా సమస్యలు చాలా వరకు తీరిపోయాయి. ఆ చిన్ని అద్దంలో నా ముఖం ఒక్కటే కనబడడంతో, ఇక మిగిలిన యాంగిల్స్ మార్పులు గురించి తెలుసుకొనే అవకాశం కోల్పోయాను. దానితో జీవితం ఎటువంటి బాదరబందీ లేకుండా హాయిగా గడిపేయడం జరిగింది. అప్పుడప్పుడు బయట పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ముందున్న అద్దంలో చూసుకొన్నప్పటికీ, వాటిల్లో అంత క్లారిటీ లేకపోవడం నాకు ప్లస్ ఆయిందిలెండి. ఆయిన అంత పబ్లిక్ గా అన్ని నిమిషాలు షాపింగ్ మాల్ గ్లాసెస్ ముందు నిలబడి చూస్తే మన కామన్ సెన్స్ ఊరుకోదు కదా... అందుకని ఒకవేళ అలాంటి అద్దాలు కనబడిన ఇబ్బంది పడలేదు.

ఇక మనకి ఎటువంటి బాదరబందీ లేదు కాబట్టి, నచ్చినప్పుడు రన్నింగ్ కి వెళ్ళడం, లేకపోతే మానివేయడం... ఇలా మనకి ఏది తోస్తే అది చేసేవాడిని.

ఇలా హ్యాపిగా జరిగిపోతున్న నా జీవితంలోకి మరో మలుపు క్రిందటి నెలలో జరిగింది..

నేను అప్పటి వరకు ఉన్న రూమ్ లోకి వాటర్ సరిగా రాకపోవడం వలన, దాని గురించి ఓనర్ గారికి కంప్లైట్ చేయడంతో, ఓనర్ కి చిర్రెత్తి రూమ్ ఖాళి చేసేమని అర్డర్ వేసాడు. మనమేమన్నా తక్కువ తిన్నామా?? తప్పు వాడి దగ్గర పెట్టుకొని, నన్ను అంటాడా అని నేను కూడా ఫైర్ ఆయిపోయి రూమ్ ఖాళి చేసేయడానికి సిద్దపడిపోయా....

ఆవేశానికి పోయి రూమ్ ఖాళి చేస్తానన్న గాని, చేస్తానన్న రోజుకి నెల రోజుల వరకు ఎక్కడ రూమ్ దొరకనే లేదు. బైక్ టైర్లు అరిగేలా ఊరంతా తిరిగి గాలించినా నో రూమ్స్.

ఒక వేళ ఎక్కడైనా టు-లెట్ కనబడితే, అబగా దగ్గరకు వెళితే, క్రింది చీమంతా అక్షరాలతో ఓన్లీ ఫర్ ఫ్యామిల్స్ అనో, లేక ఓన్లీ ఫర్ బ్రాహ్మిణ్స్ అనో ఉండేది. ఇక చివరకి విసుగెత్తి పోయిన సమయంలో నా స్నేహితుడు వాళ్ళ కాలనీలో ఉండే ఒక పోర్షన్ ని రిఫర్ చేసాడు. మూడు రోజుల నుండి మంచినీళ్ళు దొరకని వాడికి, మామూలు మంచి నీళ్ళు దొరికితే ఎలాగుంటందో నాకు కూడా అలానే అనిపించింది. ఇతర వివరములు ఏమి అడక్కుండనే ఓనర్ చెప్పినన్నిట్టికి "ఊ" కట్టేసి అందులో జాయినయిపోయాను..

అందులో జాయినయిన తర్వాత చూద్దును... ఆ పోర్షన్ లో ఉన్న రెండు గదుల్లో గోడకు అందంగా ఏర్పాటు చేసిన రెండు నిలువెత్తు ఆద్దాలు....

ఇక ఇప్పుడు చూడండీ.. నా పాట్లు.. మళ్ళీ మొదలయ్యాయి.... అర్జంటుగా జిమ్ జాయినవ్వాలని నా అంతరాత్మ ఇప్పటికే తెగ సతాయిస్తుంది...

ఈ రోజు పొద్దున చూద్దునూ... అద్దానికి చిన్న చిన్న కన్నాలు పడినట్టున్నాయి అనిపించింది..


Tuesday 8 May 2012

ఈ రోజుల్లో మూడవ సారి "ఇష్క్"

ఈ మధ్య ఆఫీసులో మరీ వర్క్ లోడ్ పెరిగిపోయిందండీ..

అందుకని ఇటు వైపు రావడానికి సరయిన టైమ్ కుదరల్లేదు...

వర్క్ లోడ్ పెరగడంతో బుర్ర కూడా వంద కిలోమిటర్లు తిరిగి వచ్చిన బైక్ సైలెన్సర్ మీద చెయ్యేస్తే ఎలా వుంటుందో అలా ఆయిపోయింది..

మరి ఆ హీట్ తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి.... చాలా మంది ఆయితే మటుకు సుబ్బరంగా బార్ కి వెళ్ళి రెండు బీర్లు లాగేస్తారు..

బీర్లు అప్పుడెప్పుడో చిన్నప్పుడే గ్యాలన్ల కొద్ది తాగేసి... చివరికి దాన్ని తాగడం కాదు కదా.. దాని పేరు విన్నా అమడదూరం పారిపోయే స్టేజికి వచ్చేసా.
(అది తప్ప వేరే మందు నాకు అలవాటు లేదు కాబట్టి.. మిగతా వాటి గురించి చెప్పదలచుకోలేదు)

లేకపోతే లవర్స్ దగ్గరకి వెళ్ళి సేదతీరుతారు (లవర్ దగ్గరకు వెళితే ఉన్న హీట్ ఇంకా పెరుగుపోతుందన్న సంగతి వీడికి ఎవరయినా చెప్పండిరా బాబు అని అనిపించిందా మీకు).
నాకు లవర్స్ లేరు. అందుకని నా ఉద్దేశం అలా చెప్పినా... కోపడకండి నా మీద( లవర్స్ తో బి.పి. తెచ్చుకుంటున్న బాధితులు).


లేకపోతే ఏమి చేస్తారు??? నాకు తెలియడం లేదే....

ఆ..ఆ... సినిమాకు పోతారు... వీడేంది బే...మరి చిన్న పిల్లాడిలా ఉన్నాడు... ఉద్యోగము చేసుకుంటూ ఇంకా సినిమాలు అంటాడు ఏంటీ వీడు!!! అని అనుకుంటే అది నా ఖర్మ అనుకోవాలే... అంతే...

నాకు ఉన్న ప్రత్యాయమ్నం అదే ఒక్కటే ఉంది మరీ... అందుకని సినిమాల మీద పడ్డది మన దృష్టి...

నగరంలో అడుతున్న ధియేటర్లు అన్ని ఒక్కసారి మైండ్ లో రీల్ లా తిరిగాయి... చూడదగింది ఒక్క సినిమా కనబడలే ఆ రీల్ లో..

ఆయిన మన బుర్రలో ఉన్న హీట్ ని తగ్గించాలంటే తప్పకుండా సినిమా చూడవలసినదే అని డిసైడ్ ఆయినందున, మరొక సారి రీల్ ని రీవైండ్ చేసా...


ఆయిన సేమ్ రిజల్ట్...


చివరికి చూడగా, చూడగా నితిన్ నటించిన ఇష్క్ ఆయితే బాగుంటుందని డిసైడ్ అయ్యా...

అప్పటికే ఆ సినిమాను రెండు సార్లు చూసేసినప్పటికీ, దాని పైపే నా మనసు మొగ్గు చూపింది...

ఎందుకంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు కంటికి చాలా ఆహ్లదకరముగా అనిపించింది. ఫస్ట్ రెండు సార్లు చూసినప్పుడు నాకు దాని మీద పోస్ట్ రాయాలని ఏమి అనిపించలేదు.. కాని ఇప్పుడు దాని మీద రాయడానికి ఒక చిన్న కారణం ఉంది...

నేను ఇంటర్, డిగ్రి చదివే రోజుల్లో బాగున్న ఒకో సినిమాను పది, పదకొండు సార్లు చూసేవాణ్ణి.. ఎందుకు అలా అంటే... అది అంతే..

తర్వాతర్వతా రోజుల్లో బాగున్న సినిమాలు వచ్చినప్పటికీ, రెండో సారి చూద్దామనుకోనే లోగానే ఆ సినిమా మారిపోయేది ఆ ధియేటరు నుండి..

అంటే ఏ సినిమా కూడా ఇరవై, ఇరవైదు రోజులు కన్నా ఎక్కువగా ధియేటర్లులో ఉండడం లేదు కదా.... ఇప్పుడు ఏది ఆయిన మొదటి వారం, లేక రెండు వారాములోగా చూసేవలసినదే... మూడవ వారంలో చూద్దామంటే ఏ డి.వి.డి. లోనే చూడవలసిన పరిస్దితి...

ఇలాంటి పరిస్దితిలో ఇష్క్ సినిమాను మూడవ సారి చూడగలిగినంటే దానికి కారణం చాలా రోజుల తర్వాత ఒక చూడదగిన సినిమా డెబ్బయి రోజుల పైబడి ఆడడం మూలంగా....

దీనికి ముందు నితిన్ గారి సినిమాల గురించి మాట్లాడుకోవాలి... అలవాటులో పొరబాటుగా నితిన్ సినిమాలు అన్ని చూడడం మొదలెట్టినప్పుడు ఆయన గారు కొట్టిన దెబ్బకు మరల నితిన్ సినిమాకు వెళ్తే నా చెప్పు తీసుకొని నన్నే కొట్టుకోవాలన్నంతగా మరియు ఆయన సినిమాలకు వెళ్ళాలంటే చూసేవాడికి దమ్ము ఉండాలనే విధంగా సీన్ క్రియేట్ చేసాడు ఆయన.

అందుకని ఆయన సినిమాలు చూడాలంటే ఒకటికి రెండు సార్లు అలోచించవలసి వచ్చేది

ఇక సినిమా విషయానికి వస్తే, ఈ మధ్య కాలములో, ఇంకా చెప్పాలంటే గడిచిన కొన్ని సంవత్సరాల్లో నేను ఇష్టపడి ఒకటి కన్నా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఇదే...

సినిమా అద్బుతమైన సినిమా అని చెప్పను.. కాని హ్యాపిగా కాళ్ళు చాపుకొని ప్రశాంతంగా చూడొచ్చు ఈ సినిమాను...

సినిమాను కధ, నటులు, నటిమణులు వీరెవరు కోసం చూడక్కర్లేదు.. కేవలం సినిమాను అలా చూస్తే చాలు...
అంత గొప్పగా పిక్చరేజేషన్ చేసారు పి.సి.శ్రీరామ్ గారు.... కేవలం ఆయన పనితనం చూసే ఈ సినిమా అంత బాగా వచ్చినట్లుగా అనిపించింది..

ఆయన పిక్చరేజేషన్ లో తీసిన ఈ సినిమా పాటలు చూస్తుంటే చాలా బాగున్నాయినిపిస్తుంది....

ఇకపోతే నిత్యామీనన్ గురించి..... ఈ సినిమాలో ప్రియా పాత్రకు కరెక్టుగా సరిపోయిందనిపిస్తుంది... ఆవిడ హవభావాల్లో ఉన్న సహజత్వం నాలాంటి పేక్షకులను కట్టిపడేస్తుంది....

ముఖ్యంగా బంగారు గాజులంటే ఆవిడికున్న పిచ్చిని ఎలివేట్ చేసే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి..

ఇకపోతే నితిన్, అజయ్ పాత్రలు కూడా వాటి పరిధి మేరకు చాలా చక్కగా ఆకట్టుకొన్నాయి. కధ కన్నా కధనం చాలా బాగుంది...

ఇప్పటికి ఇంకా ఈ సినిమాను చూడకపోయింటే తప్పకుండా చూడండి

చూసిన తర్వాత మీరే ఒప్పుకుంటారు... సినిమా అంతా పి.సి.శ్రీరామ్ గారు కనబడతారని.....