Wednesday 29 February 2012

దొంగ- గజదొంగ..

నిన్న అసెంబ్లీలో అర్దిక శాఖా మాత్యులు అనం రామనారాయణరెడ్డి గారు ఒక నిష్టుర సత్యం ప్రకటించారు
.
తమ కుటుంబంను ఇబ్బందిపాల్జేస్తున్నారన్న విజయమ్మ ఆరోపణకి సమాధానమిస్తూ
, మేమెమి మీ ఆయన వై.ఎస్. గారు ప్రవేశపెట్టిన పధకాలను( స్విస్ బ్యాంకులకు నిధులు మళ్ళింపు కార్యక్రమాలు) ఆపుజేయలేదు. ఇంకా చెప్పాలంటే వై.ఎస్. హయంలో వివిధ పధకాలకు కేటాయించిన నిధుల కన్నా ప్రస్తుతం బోలెడు నిధులు కేటాయించేసాము. అలాంటపుడు వై.ఎస్. ప్రవేశపెట్టిన పధకాలను ( స్విస్ బ్యాంకులకు నిధులు మళ్ళింపు కార్యక్రమాలు) ఎలా అపుజేసామని ఆరోపిస్తున్నారు అని గయ్యిమన్నారు. ప్రజల సొమ్మును వివిధ పధకాల పేరు మీద హం ఫట్ చేయడం వై.ఎస్. జమనాలోనేనా... మా జమనాలో కూడా అటువంటి పధకాలు ఆగిపోతే, తమకు స్విస్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవా అని ఆనం గారు స్వగతంలో అనుకొని, చూడమ్మా విజయమ్మ గారు మీరు అనవసరముగా రచ్చకెక్కొద్దు... సంక్షేమ ఫలాలు పూర్తి స్దాయిలో ప్రజలకు అందితే, మనకు దిక్కులేదన్న సంగతి మీ అయనకే కాదు.. మాకు తెలుసు... అందుకనే సదరు పధకాలను బుద్దొన్నోడు ఎవడూ ఆపేయాలని అనుకోడు. మా కొత్త సి.ఎమ్. కిరణ్ నేతృత్వంలో మేము ఇంకా ముదురుపోయాము. మీ అయన హయాంలో ప్రజా సొమ్ము పై కేవలం దొంగతనాలు మాత్రమే చేసాము. కాని ఇప్పుడు గజ దొంగతనాలు చేస్తున్నాము. కాకపోతే ఆ నిధులు ప్రవహించే స్విస్ ఖాతాల ఎక్కౌంటు నెంబర్లు మాత్రమే మారతాయి. కాబట్టి అనవరసరంగా రచ్చ రచ్చ చేయొద్దు అని చెప్పారు. ఇకపోతే జగన్ పై సి.బి.. దాడుల విషయములో అవన్నీ ప్రధానమంత్రి పరిధిలో ఉన్న సి.బి.. చూసుకుంటుంది. దానికి, మాకు ఏంటి సంబంధం అని ఒక గొప్ప లాజిక్ క్వొశ్చన్ వేసారు. సి.బి.. మీద అధిపత్యం చెలాయించే ప్రధాని మంత్రి మీద ప్రస్తుతం ఎవరూ అధిపత్యం చెలాయిస్తున్నారన్న విషయము మాత్రం ఆమాత్యులు వార్కి జాతిజనులకు చెప్పలేదు. ఇలా సాగుతుండగా కొడుకు, కోడలు చదివిన ఉన్నత చదువులతో చాలా సంతృప్తి పడిపోతున్న చంద్రబాబునాయుడు గారు, అదేంటి మొత్తము మాటలన్నీ మీరిద్దరు మాట్లాడుకోవడమేనా? అని అనుకొని, వెంటనే లేచి, వై.ఎస్. జమనాలో అవినీతి గురించి మేము అప్పుడే చెప్పాము. అంతే కాకుండా అయ్యగారి అవినీతి మీద ఒక పుస్తకం కూడా వేసాము అని రెండు వేల మూడొ సారి గట్టిగా అరిచారు... నిధుల పంపకం గురించి విజయమ్మ గారు, నేను మాట్లాడుకుంటే మధ్యలో ఈ బాబు గాడొకడు అని చిన్న అసహానం ఫీలయ్యి, ఆయిన ఇదంతా మామూలే అని అనుకొని అనం గారు తిరిగి తన ప్రసంగించడం మొదలెట్టారు. చంద్రబాబు అరోపిస్తునట్టు వై.ఎస్. జమనాలో వై.ఎస్. గారు దొంగతనం చేసినట్టు మాకు తెలియనే తెలియదు. కావలంటే అమ్మ తోడు ఒట్టు... అప్పుడు వై.ఎస్. గారు మమ్మలందరిని కళ్ళకు గంతలు కట్టుకోమన్నారు. అంతే మేమందరం కట్టుకొన్నాము. అంతే తప్ప మాకు దానితో మాకేమి సంబంధం లేదు. ఒక వేళ ఎవరైనా గంతలు ఇప్పినట్టు తేలితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము.( ఇప్పుడు గంతలు కట్టుకోవలసిన అవసరం లేదులెండి. ఎందుకంటే ఈ సారి అందరం కలిసే గజదొంగలం). హలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తక్కువకాని స్ల్రీన్ ప్లే తో ప్రసంగం మంచి రంజుగ్గా సాగిపోతుంది. ఇక ఆ ప్రసంగం ఎప్పటికి అవదులెండి....
ఇంతకి ఆనం గారు చెప్పేదేమిటంటే
.. వై.ఎస్. జమనాలో మేమందరం దొంగలం..... ఆయన గారు పోయాక మేము ఆయన ప్రవేశపెట్టిన పధకాలను ఇంకా అభివృద్ది చేయడం ద్వారా గజదొంగలం ఆయ్యాము... ఆ విధంగా వై.ఎస్. జమనాతో పోల్చుకుంటే మేము బాగా ఇంప్రూవ్ అయ్యాము.. అర్ద్రం చేసుకొండి రా వెదవల్లారా అని చెప్పుతున్నారు. (ఫైనల్ గా అవన్నీ వెళ్ళేవి స్విస్ ఖాతాలకే)
వెధవలకు మాత్రం ఎప్పుడూ అర్ద్రం అవ్వదు లెండి
.... ఎందుకంటే బడ్జెటులో కేటాయించబడిన నిధులు లెక్కల వివరములు, అవి ఖర్చు ఆయిన తీరు, ఎంత మొత్తము నిజానికి ఖర్చు చేసారు? ఎంత మొత్తము స్విస్ ఖాతాలకు వెళ్ళింది? అనే వివరాలు వెధవలకు ఎపుడూ అర్ద్రం కావులెండి.
అర్ద్రం ఆయిన వాడు ఏమి పీకలేక ఇదిగో ఇలా బ్లాగులో పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటాడు
.. అంతేనండి... అంతే....

Wednesday 22 February 2012

శ్రద్దాంజలి (ఐ మిస్ యు బ్రదర్)

ఎందుకో పాత రోజులు చాలా మధురం అని చాలా మంది చెపుతుంటారు....నీవు తలంపుకు వచ్చినప్పుడల్లా అవెంత నిజమె కదా అనిపిస్తుంది రా....దేవుడు చాలా గొప్పవాడు అని అంటారు అందరూ....కాని కొన్ని కొన్ని విషయాల్లో దేవుడు కూడా పొరబాట్లు చేస్తాడు అనిపిస్తుంది రా
నిన్ను చూసినప్పుడు......

నీ సహచర్యంను మర్చిపోలేకపోతున్నా.....నీ ముఖంపై ఎల్లవేళలా ఉండే స్వచ్చమైన చిరునవ్వును మర్చిపోలేకపోతున్నా......నీతో కలిసి పంచుకొన్న ప్రతి విషయమును మర్చిపోలేకపోతున్నా......కాని, నువ్వు ప్రంపంచంలో లేని విషయమును మాత్రం మర్చిపోతున్నాను.......సరిగ్గా రోజు, సమయానికి నన్ను, ప్రంపంచంను మర్చిపోయిన నిన్ను నేటికి కూడా మర్చిపోలేక.......
 
 
(
నా ప్రియతమ సోదరుడు, స్నేహితుడు మదన్ మెహన్ రెండు సం. క్రితం ఇదే రోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. మమ్మల్లందరిని వదిలేసి శాశ్వతంగా)

Monday 20 February 2012

అమ్మ మీద అలక.....

నిన్న, మొన్న వరుసగా రెండు రోజులు శెలవులు వచ్చినప్పటికీ ఇంటికి వెళ్ళలేదు.
ఒక్క రోజు శెలవు దొరికితే చాలు ఇంటికి పారిపోయే నేను, ఈ సారి వెళ్ళకపోవడానికి
ఒక కారణముంది...
బహుశా నేను ఒంటరిగా ఉన్నప్పటి నుండి, శెలవులకు ఇంటికి వెళ్ళకపోవడం రెండో సారి అనుకుంటా...
అలవాటుగా ఎపుడూ శనివారము మధ్యాహ్నం అమ్మ నుండి ఫోన్ వచ్చింది...
ఎప్పుడు బయలుదేరుతున్నావు?? రాత్రికి టిఫిన్ ఏమి చేయమంటావు అని??
నాకెంతో ఇష్టం అమ్మతో మాట్లాడుతుంటే...
ఇంత వయసు వచ్చినప్పటికి అమ్మ నన్నింకా చిన్నపిల్లాడిలానే చూస్తుంటుంది...
అమ్మ ఫోన్ చేసి, ఎపుడు వస్తున్నావు అని అడిగితే, నా సమాధానం నాకు రావడం వీలుపడదని!!
అమ్మ గొంతులో కొద్దిగా మార్పు.... ఎందుకు రావడం లేదని కొద్దిగా తేడాగా మారిన గొంతుతో అమ్మ ప్రశ్న!!
రేపు వి.ఆర్.వొ. పరీక్షకు ఇన్విజిలేషన్ డ్యూటి పడిందని చిన్న అబద్దం తనతో....
ఆయిన సరే, పరీక్ష ఆయిపోయిన వెంటనే బయలుదేరి వచ్చేయి..ఎలాగు సోమవారం శెలవు కదా.. అని..
నిజానికి నాకు ఏ పరీక్షకు ఇన్విజిలేషన్ పడలేదు.. వెళ్ళకూడదని ముందుగానే నిర్ణయించుకున్నందున అబద్దం చెప్పేశా....
ఆయిన నాకు రావడానికి కుదరదు.. వేరే పని కూడా ఉన్నదని అబద్దం చెప్పి మొత్తానికి రావడం లేదని
తనకు సర్దిచెప్పడానికి చాలా కష్టపడవలసివచ్చింది.....
అసలు ఇంతగా వెళ్ళకూడదని నిర్ణయించుకోవడానికి కారణమేముంది??
అమ్మ నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తుంది అన్న అలక..
నాకు అన్ని విషయాలు చెప్పడం లేదన్న బాధ....
ఇదే విషయము నా సోదరితో చెప్పాను.. నేను ఎందుకు రావడం లేదొ!!

తాను ఏమందో తెలుసా!!

నేను ఎటువంటి ఇబ్బంది పడకూడదని అమ్మ ఏ విషయాలు నాకు చెప్పడం లేదట...
ఇబ్బందికర విషయాలు (కుటుంబ సమస్యలు, అర్దిక వ్యవహారాలు) నాకు కూడా
చెప్పి నన్ను స్ట్రగుల్ చేయడం ఇష్టం లేకట....
నాన్న గారు, తాతయ్య గారు చనిపోయిన దగ్గర నుండి మొత్తము వ్యవహారములన్నీ
అమ్మే చూస్తుంది. నలభై ఎకరాల మాగణికి సంబందించిన పనులన్నీ తనే చూసుకుంటుంది..
ఇంటికి అసరాగా ఉండవలసిన పెద్దవాళ్ళు తొందరగానే కాలం చేసినప్పటికీ, బెంబేలు పడక,
మొత్తము తన మీద వేసుకొని మమ్మల్లి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది...
అలా చూసుకోవడంలో ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులు... అవేవి మాకు తెలియనివ్వదు....
నేను చాలా సార్లు ప్రయత్నించా... అమ్మకు అన్ని విషయాల్లో చేదెడు వాదోడుగా ఉండాలని...
కాని అమ్మ ఎపుడూ తన సమస్యల గురించి నా దగ్గర చర్చించదు......
తను పడే ఇబ్బందులు నాకెందుకులే అన్న నిర్ల్యక్షం......

అంటే నేను ఏమన్నానో తెలుసా?

ఇబ్బందులు, కష్టాలన్నీ తను పడి, సుఖాలు మాత్రము మనకి ఇస్తే, అటువంటి సుఖం నాకొద్దు....
అమ్మ ఎదుర్కొనే కష్టాల్లో నేను కూడా పాలుపంచుకుంటేనే, సుఖాలు కూడా పాలుపంచుకుంటాను అని చెప్పాను....

ఎందుకు మా కోసము అమ్మ తన కష్టాలు దాచుకోవాలి??

నేనేమన్నా పరాయివాడినా?? తమ కష్టాలు నాకు చెప్పవలసిన అవసరం లేదా?
మాకు కావలసినపుడూ అన్ని వండిపెట్టేసి, కావలసినపుడు అడిగినంత డబ్బు ఇచ్చేస్తే,
విశ్వమంతా ప్రేమను మాకు పంచేస్తే సరిపోతుందా??

సరిపోదు... నాకు అమ్మ మనసు కావాలి.... ఆవిడ అంతరంగం నాకు తెలియాలి....
ఆవిడ కష్టాలు నాకు తెలియాలి.. ఆ కష్టాల్లో నేను కూడా పాలు పంచుకోవాలి.......
అప్పుడే అమ్మ నా కోసం చేసిన ఏ పని ఆయిన నేను అస్వాదించగలను....

ఇది నా మాట......

అందుకే అమ్మ మీద అలిగాను.... నువ్వు ఏ విషయాలు నాతో పంచుకోవడం లేదని....
అవన్నీ నీకు ఎందుకురా!! అని పుచిక పుల్ల తీసి పారేసినట్టు పారేస్తుంది నా మాటలను...

అందుకనే నేను వెళ్ళలేదు ఇంటికి నిన్న....

ఆదివారము పొద్దున్నంతా రూమ్ లో ఉండిపోయి... మధ్యాహ్నం అలా సరదాగా బీచ్ కి వెళ్ళాను...
సాయంత్రం వరకు తిరిగి, బోజనం చేసి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చా.
ఎక్కడా ఎంజాయ్ చేయలేకపోయాను.. రోజంతా అమ్మను మిస్ ఆయ్యానన్న ఫీలింగ్ నా మదినిండా....
అమ్మే కాదు... నేను కూడా అమ్మ లేకపోతే ఉండలేనన్న సంగతి చూచయగా తెలిసింది.....
ఇంటికి వెళ్ళిపోవలనిపించింది.... కాని పంతం కొద్ది వెళ్ళలేదు....

మర్నాడు మహశివరాత్రి.... రూమ్ లో ఉండబుద్దికాలే....
ఒక ప్రెండ్ ని తీసుకొని ద్రాక్షరామ శివాలయానికి వెళ్ళాను. దర్శనం అయ్యేసరికి మద్యాహ్నం ఆయిపోయింది...
దర్శనంను కూడా పూర్తి స్దాయిలో అస్వాదించలేకపోయాను.
ఎందుకంటే నా మనసు నిండా అమ్మే ఉండిపోయింది.......
అమ్మ లేకుండా ఉండడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది.....
అమ్మ మీద విజయం సాధించడం చాలా కష్టం....

అందుకే వచ్చే అదివారము కోసము చాలా అత్రుతగా ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నాను....
శనివారం మద్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోవాలి.... తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి...
 
 

Friday 17 February 2012

బడ్జెట్ నిధులన్ని ఏమవుతున్నాయి.?..(ఒక తెలివితక్కువ క్వొశ్చన్)

నిన్న విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్ ను చూసి కళ్ళు అంటుకున్నాయి... ఇప్పుడే కాదు. ఎపుడూ అంతేలెండి..
అంతోటి మొత్తాలతో బడ్జెట్ ని తయారుచేస్తే మన ఇండియా ఇప్పటికీ ఎందుకు డెవలప్ కాలేదో అర్ద్రం కావడం లేదు..
గత కొన్ని సం.రాల నుండి ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయలతో వివిధ రంగాలకు ఖర్చుచేసిన ఇప్పటికీ ఆ పనులన్నీ
భూతద్దం పెట్టినా ఎక్కడ కానరావడం లేదెమిటొ?
నాకు బడ్జెటు సంబందిత అంశాల్లో నాలెడ్జ్ తక్కువలెండి. అందుకనే దీనిలో కొన్ని తెలివి తక్కువ క్వొశ్చన్లు వేస్తే ఏమనుకోకండి.
ఉదహారణకు
1. రోడ్లు నిర్వహణకు ఈ బడ్జెటులో రమారమి మూడు వేల కోట్ల చిల్లర కేటాయించినట్టుగా చెప్పారు...
వాస్తవానికి వాళ్ళు చెప్పిన ప్రకారమే మూడు వేలు కోట్లు కాదు కదా... కనీసము వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా మన రోడ్లు ఇంత అద్వాన్నంగా ఎందుకు
ఉంటున్నాయో చెప్పగలరా?(మిగతా రెండు వేల కోట్లు లంచాలకు పోయాయనుకొండి)
2. అదే విధంగా వ్యవసాయానికి గత బడ్జెటులో నాల్గు వేల ఒక వంద కోట్లు కేటాయించగా, నాల్గు వేల కోట్లను ఖర్చు చేసినట్టుగా చూపించారు. నిజానికి అంత మొత్తంను ఖర్చు పెట్టి వుంటే వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి చెందాలి?
3. జలయజ్ణానికి గత సం.రం బడ్జెటులో పదిహేను కోట్ల రూపాయలు కేటాయించగా, తొమ్మిది వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా చూపించారు. అవి కూడా పోలవరం కాలువల తయారుచేయడానికి మాత్రమే. ఇలా ఎన్ని సం.రాలు బడ్జెటులో కేటాయించిన తర్వాత పోలవరం కాలువ పనులు ఆవుతాయి? తదుపరి ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని స.రాలు బడ్జెటులో నిధులు కేటాయించాలి?

ఇలా ఒక్కొక్కొ రంగానికి వెయ్యి కోట్లకు పైగా కేటాయిస్తున్నప్పటికీ, అందులో సగం సొమ్ము లంచాల రూపేణా తినేసినప్పటికి, మిగిలిన సగం డబ్బులతోనన్న పనులు నిజంగా చేసి యుంటే, ఇప్పటికి ఆయా రంగాల అభివృద్ది ఎక్కడ యుండాలి?

ఈ డౌటు ఏ ఒక్క మేధావికి రాలేదా? మేధావులమని అనుకుంటున్న రాజకీయ నాయకులకు ఎవరికి ఈ విషయము స్పురించలేదా? లేక నేనే తెలివితక్కువ క్వొశ్చన్ వేసానా?

నా డౌటు ఏమి లేదు. కేటాయించబడిన డబ్బులో సగం లంచాల రూపేణా పోయినప్పటికి మిగతా సొమ్ము అంతా ఏమయిపోతుందో అని?

ప్రభుత్వమన్నక రకరకాల ఖర్చులుంటాయి. అవన్నీ వీడికి అర్ద్రం కావులే అంటారా?
పిల్లకాయగాడికి ఉండేలు దెబ్బ రుచి ఏమి తెలుసులే.. అన్నట్టుగా
కుర్ర వెధవకు ప్రభుత్వ సంబందిత ఖర్చులు లేక వ్యవహరణ గురించి ఏమి తెలుసు అని వ్యంగాస్త్రం సంధిస్తారా నా మీద?

Monday 13 February 2012

ఇడియట్ చెప్పిన ప్రేమ నిర్వచనం...

యమ సీరియస్ గా లవ్ అనే సబ్జెక్టు మీద క్లాస్ జరుగుతుంది..
క్లాస్ గురించి చెప్పుతున్న మేడమ్ లవ్ గురించి తన్మయత్వంతో పాఠం చెప్పుకుంటు పోతుంది....
క్లాస్ లో ఒక ప్రక్క మేడమ్ చెపుతున్న పాఠం గురించి వినకుండా అమీర్ ఖాన్ మాధవన్, శర్వాన్ జోషితో
కబుర్లు ఆడుతున్నాడు.

మేడమ్ చూడనే చూసింది ఆ దృశ్యాన్ని.. అంతే ఇక్కడ లవ్ మీద ఇంత సీరియస్ గా పాఠం చెపుతుంటే,
వీళ్ళు వినకుండా సొల్లు కబుర్లు చెపుకుంటున్నారా? అని కోపం తారాస్దాయికి చేరిపోయింది..
వెంటనే అమీర్ ఖాన్ ని నిలబడమని, వ్యాట్ ఆర్ యూ డ్యుయింగ్ అని గర్జించింది..
మనోడు దానికి సమాధానం చెప్పాకుండా మాధవన్ వైపు, నేల చూపులు చూస్తూ ముసి ముసిగా నవ్వుతుంటాడు.
దానితో మేడమ్ కి ఇంకా తిక్క రేగిపోయింది. నేను ఇక్కడ లవ్ మీద పాఠం చెపుతుంటే
వీడి పాఠం వినకుండా గీర పెడుతున్నాడని అనుకొని, అసలు లవ్ కి మీనింగ్ చెప్పమని గర్జించింది.
మనోడు కొద్దిగా తటాపయించాడు. చెప్పాలా వద్దా అని.
మేడమ్: ఏంటి తటాపయింస్తున్నావు. టెల్ మీ అన్సర్ అని అడిగింది.

మనోడు గొంతు సవరించుకొని చెప్పడం మొదలెట్టాడు..
మేడమ్ ని ఉద్దేశించి, మీ బ్యాగ్ లో ఎపుడూ మేకప్ కిట్ ఉంటుంది. దానితో ప్రతి అరగంటకి మేకప్ రూమ్ కి
వెళ్ళి మేకప్ చేసుకుంటారు. దాన్నే మేకప్ కిట్ తో మీకున్న అనుబంధాన్ని లవ్ అంటారు.
అదే విధంగా ప్రక్కనున్న మెడరన్ క్లాస్ మేట్ ను చూపిస్తూ, వాడు ఎప్పుడూ మార్కెట్లోకి వచ్చే ప్రతి
ఫోన్ ను కొని జేబులో పెట్టుకోకపోతే నిద్దర పట్టదు. దానినే లవ్ అంటారు..
అటు ప్రక్కనున్న ఈ లోకంలో లేని అమ్మాయిని చూపిస్తూ, ఆ అమ్మాయికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మరోకోరి
ఎవరుతోనే తిరిగుతున్నాడనో అని అనుమానం. దానిని కూడా లవ్ అనోచ్చు...
మా ఇంట్లో కుక్క పిల్లకి ఎప్పుడూ దాని ప్లేట్ లో పెట్టిన పుడ్ కన్నా ప్రక్కన ఉన్న ఎంగిలి పుడ్ మీదే
ఇంట్రెస్ట్ ఎక్కువ. దానినే లవ్ అంటారు.
ఇంకా చెప్పాలంటే, నేను ఎపుడు డెనిమ్ బ్రాండ్ జీన్స్ వాడతాను. దానినే లవ్ అంటారు అని చెప్పుకుంటు పోతున్నాడు.
క్లాస్ లో మాధవన్ తో సహ అందరూ పసుక్కున నవ్వారు. అమీర్ ఖాన్ మాటలకి
మేడమ్ చిరెత్తుకుపోయింది. గెట్ అవుట్ అని అరిచింది గేటు వైపు వేలు చూపిస్తూ..
తలోంచుకొని గేటు పైపు వెళ్ళిపోయాడు అమీర్ ఖాన్..
ఒక క్షణం అగి, లవ్ గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు...
ప్రేమ అనేది ఒక అద్బుతం.....
అదొక అందమైన ప్రపంచం...
అది అనుభవించిన వాడికే తెలుస్తుంది దాని యొక్క బాధ...
ప్రేమకి మరణం లేదు. అది ఎల్లప్పుడూ సజీవమే....
అని అనుకొన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు ఆయిపోయారు...
వాడి పుట్టు పూర్వీత్తరాలు ఏమియూ తెలియకుండానే పై తోలుచూసి
ఇష్టపడడాన్నే ప్రేమ అంటారు......
ఇరవై సం.రాల నుండి కంటికి రెప్పలా కాపాడుతున్న తల్లిదండ్రులను కాదని
అడ్డమైన వాడితో అంటకాగడన్నే ప్రేమ అంటారు.
చదువుకొని బుద్దిగా లైఫ్ లో సెటిలవ్వండిరా అని చెప్పి కాలేజిలకు పంపితే,
అడ్డమైన సినిమాలకు, షికార్లకు వెళ్ళడమే (లవర్ తో) ప్రేమ అంటారు........ అని చెప్పుకుంటూ పోతున్నాడు
(మరి మిగతాది ఎందుకు రాయలేదు అని అడక్కండి. నాకు అంత వరకు రాయడమే చేతనయింది)
క్లాస్ లో మేడమ్ నోరెళ్ళబెట్టి ఉండిపోయింది అమీర్ ఖాన్ చెప్పిన సరయిన ( చ్చ) నిర్వచనానికి...
క్లాస్ లో మాధవన్ తో సహ అందరూ చప్పట్లు కొట్టేసారు.....
పి.ఎస్: ఈ బిట్ త్రీ ఇడియట్స్ సినిమాలోనిదని మీకందరికి తెలుసు కదా..
అందులో ఈనాటి చదువుల మీద అమీర్ ఖాన్ విసిరిన వ్యంగ్యాస్తమే ఈ బిట్ యొక్క ఉద్దేశము.
అదే విధముగా ఈనాటి ప్రేమ మీద నాకున్న అభిప్రాయాన్నే వ్యంగ్యాస్తంగా చెప్పాను.

Thursday 9 February 2012

అగ్నిపధ్ - విందు భోజనం లాంటి సినిమా....


నిన్నంత ఎందుకో కాని చిరగ్గా ఉంది. ఏ పని చేయబుద్ది కావడం లేదని చెప్పి మధ్యాహ్నం సినిమాకు పోదామని ప్లాన్ చేసుకొన్నా. భోజనానికి వెళ్ళేటప్పుడు మెస్ దగ్గర గ్రూప్ సర్వీసులకు ప్రిపేరవుతున్న నా రూమ్మేట్ నాయుడుని అడిగా సినిమాకు వెళ్దాం వస్తావా అని? కాసేపు అలోచించి సరేనన్నాడు. ఏ సినిమాకు వెళ్దామని అడిగితే, వేరే అలోచన లేకుండా అగ్నిపధ్ సినిమాకు వెళ్దామని చెప్పా. అగ్నిపధ్ సినిమా రిలీజ్ ముందు నుండి దాని మీద మనకి చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. అసలు మనకు హిందీ సినిమాల మీద ఇష్టం కలగడమే అశ్చర్యం.

నేను చదువుల నిమిత్తం, ఆ పై ఉద్యోగ రీత్యా కాకినాడలో ఎప్పుటి నుండొ ఉంటున్నాను. కాకినాడ ప్రశాంతతకు మారుపేరు అని మీకు వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఎందుకంటే మంచి మంచి ధియేటర్లు ఉండడం వలన. నాలాంటి వారందరూ బుద్దిగా సినిమాలకు పోయి సోది చేయకుండా చూడడం వలన కాకినాడ ప్రశాంతంగా ఉంటుందని మా ప్రెండ్స్ నన్ను ఆట పట్టిస్తుంటారులెండి. మరి అంతలా చూస్తుంటాను సినిమాలను..

కాకినాడలో భానుగుడి వద్ద నున్న గీత్ లేక సంగీత్ ధియేటర్లో ఎప్పుడూ ఏదో ఒక హింది సినిమా ఆడుతుంది. మనం కాలేజి చదువులు వెలగ పెట్టిన రోజుల్లో చూడడానికి తెలుగు సినిమాలన్ని అయిపోతే, మిగిలిన హీంది సినిమాలు, ఇంగ్లీషు సినిమాలకు(పెద్దల సినిమాలు కాదులెండి) వెళ్ళడం అలవాటు ఆయింది. హింది సినిమాల్లో పాటలు, వారి యాక్టింగ్ చూసి, చూసి దిమ్మ తిరిగిపోయి హింది సినిమాలంటే పడిచచ్చేపోయేటంతగా తయారయింది మన కళాపోషణ. ఆ విధముగా కాకినాడలో వచ్చే ప్రతి హింది సినిమాకు నేను రెగ్యులర్ పేక్షకుడుగా మారిపోయాను.

వీడెంటి రా... అగ్నిపధ్ సినిమా టైటిల్ పెట్టి సొల్లంతా చెబుతున్నాడు అని అనుకుంటున్నారా?
అరె నిజమే కదా.... గమనించలేదు... వీడు సినిమా గురించి చెప్పాకుండా వీడి సొల్లు చెబుతున్నాడు అని అనిపించిందా మీకు.....

సరేలే విషయములోకి వచ్చేస్తున్నలెండి..
భోజనమవగానే నేను, నా రూమ్మేట్ కలసి తిన్నగా దేవి మల్టిప్లెక్స్ కి వెళ్ళిపోయాము (సినిమా అక్కడే అడుతుంది మరి). హింది సినిమాలన్ని గీత్, సంగీత్ ధియేటర్లో ఆడతాయని చెప్పి వీడెంటీ దేవి మల్టిప్లెక్స్ పోయాడు అని అనుకోకండి. ఎందుకంటే అగ్నిపధ్ సినిమాను ఇక్కడే రిలీజ్ చేసాడు మరి.

పోయి సినిమా ధియేటర్లో కూర్చున్నాము. మహ ఆయితే ఒక యాబయి మంది వరకు ఉండి యుంటారు లోపల.. ఎ.సి. అన్ చేయడంతో చల్లని గాలులు మమ్మల్లి సీటులో ఒదిగి కూర్చునేలా చేసాయి(చలి వేస్తుంది మరి). ఇంతలో మావోడు అన్నాడు. నాకు హింది రాదు ఎలా అని. వెంటనే నేను ఏమి పర్లేదు... సినిమాను అలా చూస్తుండు... మధ్యలో ఏదైనా జోకులోస్తే, హాలులో మిగతా వాళ్ళందరూ నవ్వుతారు కదా, అప్పుడు మనము కూడా నవ్వుదాం, క్లాప్స్ పడితే, మనము కూడా క్లాప్స్ కోడదాం అని చెప్పా. (నాకు హింది కొద్దిగా అర్ద్రమవుతుంది లెండి)..
ఇక సినిమా విషయానికి వస్తే అగ్నిపధ్ సినిమా విందు భోజనమ్ లాంటి సినిమా అని చెప్పోచ్చు.

చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది (అల్రెడి ఒకసారి చూసేశాను లెండి.. అప్పుడు రాయడానికి కుదరలేదు). అల్రెడి గతములో అమితాబ్ బచ్చన్ తో తీసిన అగ్నిపధ్ సినిమాను, మరల నేడు హృతిక్ రోషన్ ని పెట్టి తీయడమంటే సాహసమే...ఆయినప్పటికి హృతిక్ రోషన్ తన నటన ద్వారా సినిమాకు ప్రాణం పోశాడు. సినిమా చూస్తున్నంత సేపు నాకు ఒక్కప్పటి చిరంజీవి సినిమా చూస్తున్నట్టుగానే ఉంది.

ఇప్పుడు మనము చూస్తున్న సినిమాలన్ని సమెసాలు, బజ్జిలు, బర్గర్ లు ఆయితే, ఈ సినిమా విందు భోజనం లాంటి సినిమా అని చెప్పోచ్చు. ముఖ్యాంగా ఇందులో కధే మెయిన్ రోల్ అని చెప్పోచ్చు. రోటిన్ సినిమాలా కాకుండా కధకు తగ్గట్టుగా సినిమా తీయడంతో బాగా వచ్చింది.

కధకి ఇందులో ఎంత ప్రాముఖ్యత యిచ్చారంటే, సినిమా ప్రారంభమైన ముప్పావు గంట వరకు హిరో ఎంట్రన్స్ ఉండదు. కాని మనకు హిరో ముప్పావు గంట వరకు రాలేదన్న సంగతి తెలియనివ్వలేదు డైరెక్టరు. ఎందుకంటే అందులో నటులు కంటే పాత్రలే ఎక్కువగా కనిపించాయి.
హృతిక్ రోషన్ విజయ్ చౌహన్ పాత్రలో ఇమిడిపోయిన విధానం బాగుంది. ఇక తర్వాత చెప్పుకోవలసినది సంజయ దత్ పోషించిన విలన్ పాత్ర....

ఒకప్పటి బలమైన ప్రతినాయకులుగా ముద్ర వేసిన అంజాద్ ఖాన్, అమ్రిశ్ పురి, రఘవరన్ లాంటి వారిని గుర్తుకు తెచ్చాడు.

మిగిలిన పాత్రల్లో రిషికపూర్, ప్రియాంక చోప్రా, ఓం పురి మె.గు వారు వారి పాత్ర పరిధి వరకు అద్బుతంగా నటించి సినిమా అద్యంతం రక్తికట్టించారు.


ఇక చివరలో వచ్చిన కత్రినా కైఫ్ సాంగ్ గురించి చెప్పాలంటే, నోరు చాలదు. చుక్ను చమేలి అంటు సాగిన సాంగ్ తో సినిమాకు ఒక్క ఊపు తెచ్చేసింది.
ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారని విన్నాను. ఒక వేళ అదే నిజమయితే కనుక, తెలుగులో ప్రభాస్ తప్ప వేరే ఎవరూ సూట్ కారు.
ప్రభాశ్ బాడీ ల్వాంగేజికి బాగా సూట్ అవుతుంది సినిమా. మరి సంజయ్ దత్ పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుందంటారు?? ఆ... మెహన్ బాబు ఆయితే కరెక్టుగా సూటవుతాడునకుంటా..... కాని మనోడు ఒప్పుకుంటాడంటారా? ఇక హీరోయిన్ గా తమన్నను తప్ప ఎవరిని తీసుకున్న వేస్టే. ఎందుకంటే ఇందులో హిరోయిన్ యాక్ట్ చేయవలసియుంటుంది కనుక. (ఇప్పుడున్న హిరోయిన్సులో ఎవరికి యాక్టింగ్ చేస్తున్నారో చెప్పండి?)
మీలో ఎవరయినా ఇప్పటికే అగ్నిపధ్ సినిమా చూసియుంటే, మీ అభిప్రాయమేమిటన్నది నాకు కొద్దిగా చెప్పండేయి....
మీకు వీలయితే తప్పక చూడమని రిఫర్ చేస్తాను నేను..........

Wednesday 8 February 2012

చిన్నప్పటి ఆటలు- కర్ర-బిళ్ళ....

మొన్న "నేనింతే-రవితేజని కాను" బ్లాగులో గిరిష్ గారు వ్రాసిన టపా "ఆటలు-పాటలు-పాఠాలు" చదివిన తర్వాత నా చిన్నప్పటి రోజులన్ని సినిమా రీలుగా గిర్రున వెనక్కి తిరిగిపోయాయి. నిజానికి గిరిష్ గారి టపాకి కామెంటు రాద్దామనుకొని, టపా రాసేస్తున్నాను. నేను పంచుకోవలనుకొన్న చిన్నప్పటి అనుభూతులన్ని అల్రెడి అందరూ చెప్పేసారు. అవన్నీ నన్ను చూసి రాసేశారెమిటా అని అనుకున్నా కూడాను. నేను ఒక్కడినే సర్కారీ బడిలో చదువుకొని, నాదైనా ప్రపంచంలో మారుమూల పల్లెలో అందమైన బాల్యంను గడిపానేమో అనుకొన్నాను. కాని నాకు తోడు చాలా మంది ఉన్నారీ ఈ బ్లాగు ప్రపంచంలో... (తప్పుగా అర్ద్రం చేసుకోకండి. బ్లాగర్లందరూ పట్నాం బాబులేమో అనుకొనేవాడిని). కాని మీ అనుభవలన్నీ చదివిన తర్వాత చాలా మంది పదహరణాల పల్లెల నుండి వచ్చినవారే అని నాకు క్లియర్ గా అర్ద్రమయిపోయింది. కాని మీరందరూ వాటన్నింటిని ఈ కాలం పిల్లల్లో మిస్ అయ్యారేమో కాని, నేను మాత్రం ఇంకా అటువంటి ఆటలను మిస్ కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ నేను ప్రతి వీకెండ్ మా ఊరుకి వెళ్ళిపోతాను. మహ అయితే ఓ మూడు వేల జనభా ఉంటారెమో మా ఊరిలో. అక్కడ మా ఇంటికి వచ్చే కుర్రాళ్ళతో మన చిన్నప్పటి ఆటలు కొన్ని ఆడిస్తాను. (మనమాడిన మొత్తం ఆటలు అడించడం మన వల్ల కాలేదు లెండి). కొన్నయిన ఆడించడం ద్వారా నా బాల్యంను గుర్తుచేసుకుంటున్నాను. అందులో భాగంగా మా ఇంటి దగ్గరు కుర్రాళ్ళతో కర్ర-బిళ్ళ అట ఆడించా. ముచ్చటపడి దాన్ని సెల్ ఫోన్ ద్వారా వీడియా తీశా. దాన్ని మీ కోసము క్రింది పెడుతున్నాను.

Tuesday 7 February 2012

వారెవ్వా... వ్వాట్ ఎన్ కోటేషన్..


                                      పాతతరం నటుల్లో నాకు రాజబాబు గారంటే నాకు చాలా ఇష్టం...
                                      ఆయనకు సంబందింది ఒక అద్బుతమైన కోటేషన్ పేస్ బుక్ లో
                                      కనబడితే మీ కోసం ఇక్కడ పెట్టాను..

ప్రియాంక గాంధి.....

నాకిష్టమైన రాజకీయనాయకుల్లో ప్రియాంక గాంధి ఒకరు. (ప్రియాంక రాజకీయనాయకురాలు కాదేమో?). ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మధ్య ఎక్కువగా ప్రియాంక గాంధీ వార్తల్లో కనిపిస్తున్నారు. ఈవిడ ఎక్కువగా బయటకు కనిపించరు. అంతేకాదు ప్రత్యక్ష రాజకీయాల్లో ఈవిడ ప్రమేయం నామమాత్రం. నాకు ఎందుకో తెలియదు కాని, ఆవిడను చూస్తే స్వచ్చమైన నాయకురాలుగా కనిపిస్తుంది. నిండైన ముఖం, సింపుల్ గా ఉండే ఆహర్యం, మాటతీరు, ఆకట్టుకొనే హుందాతనం.. ఇవన్నీ కలగలసి తానంటే నాకు అభిమానం. పైగా తాను ఇందిరా గాంధీ పోలికలతో ఉండడం, ఇటలీ దేశస్దురాలైన తల్లికి జన్నించినప్పటికి, తన అహార్యం పూర్తిస్దాయి భారతీయతను ప్రతిబింబిచండం మొదలైనవన్నీ ఆవిడ మీద అభిమానమునకు కారణం కావచ్చు.

ఉత్తరప్రదేశ్ లో తన తల్లి, సోదరుల స్వంత నియెజకవర్గాల ఎన్నికల ప్రచారానికి మాత్రమే సారి పరిమితమయ్యారు. రాహుల్ గాంధీతో సమానమైన ఫాలోయింగ్ (చెప్పాలంటే, రాహుల్ కన్నా ఎక్కువే)ఉన్నప్పటికి ప్రియాంక గాంధీ కేవలం రెండు నియెజకవర్గాల ప్రచారానికే పరిమితమవుతారు. విషయమ్మీదే అన్న, చెల్లెలిద్దరిని ప్రతిపక్షాలు "వర్షాకాలపు కప్పలు"గా అభివర్ణించాయి. ఆయితే విమర్శను ప్రియాంక గాంధీ బాగానే త్రిప్పిగొట్టగలిగారు. విమర్శ నాకు వర్తింస్తుదేమో కాని, రాహుల్ కి కాదని కౌంటర్ ఇచ్చింది.



Rahul గాంది కంటే ప్రియాంకకు ఎక్కువ విషయజ్ణానం,మరియు వాక్చాతురం, ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవడమేమిటో నాకు అర్ద్రం కాదు. ఎవరైనా గమనించవచ్చు. రాహుల్, ప్రియాంకలను పోల్చుకున్నప్పుడు ప్రియాంకనే బెటరనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తారు.

 బహుశా, విషయములో సోనియా గాంధీకి పుత్రవాత్సలం ఎక్కువగా ఉన్నట్టుంది.మరియు తమ వంశ వారసత్వ బదిలీ గాంధీలకే చెందాలని ఆవిడ బావిస్తుండొచ్చు. ప్రియాంకను తీసుకువస్తే రాహుల్ తేలిపోతాడని, తద్వారా పార్టీ పగ్గాలు తమ కుటుంబం నుండి వాద్రాల కుటుంబానికి బదలాయింపు అవుతుందని భావిస్తుండొచ్చు. కారణంగా ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కుదరల్లేదని అనుకోవచ్చు.

ఇప్పటికే రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి ఏళ్ళు గడిచిపోయాయి. ఎంత సేపు కాంగ్రెసు పాలన లేని రాష్ట్రాలలో మారుమూల గ్రామల్లో పర్యటించి, మరియు వారితో గడిపి, అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప, తాను చేసిందేమిటన్నది ఆయన వివరించడం లేదు. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికి, మరియు కీలకమైన స్దానములో ఉన్నప్పటికి ఆయన ప్రజలకు ఏమి చేయకుండానే, పాతతరం రాజకీయనాయకుల వలె రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆడిపోసికోవడం ఆయన అసమర్దతను సూచిస్తుంది. సాంకేతిక విప్లవం పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఇంటర్ నెట్ అందుబాటులో వచ్చిన రాహుల్ గాంధీ చేసే పనులను అందరూ గమనిస్తున్నారు. దురదృష్టావత్తు రాహుల్ ఈ విషయమును విస్మరిస్తున్నారు.

కేంద్రంలో తన ప్రభుత్వమే ఉన్నందున, తన పలుకుబడిని ఉపయెగించి, తద్వారా మంచి పనులు (ప్రాజెక్టులు) చేసియుంటే, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా విశ్వసనీయతను పెంచుకోవలసినది. కాని ఎంత సేపు మాటలతోనే కాలము గడిపేస్తున్నారు. అందువలన ఆయన మీద ప్రజలకు నమ్మకం సడలింది.

దేశ ప్రధాని అభ్యర్ది విషయములో రాహుల్ గాంధీ కున్నా పాపులారిటి తగ్గిపోయి, నరేంద్రమెడికి పావులారిటి పెరిగిపోయిన నేపధ్యంలో కాంగ్రెసు పార్టికి ధీటైన అభ్యర్దిగా ప్రియాంక గాంధీ వస్తే మేలని చాలా మంది భావిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెసు పార్టి మరల అధికారములోకి వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు.

పైగా ప్రియాంక గాంధీ ప్రజల్లో ఉన్న పాపులారిటి కూడా కాంగ్రెసు పార్టికి ఉపయెగపడగలదని బావిస్తున్నారు. ప్రియంకా గత ప్రసంగాలు విన్నవారు, ఆవిడలో, తన నానమ్మ ఇందిరా గాంధీ పోలికలు ప్రస్పూటంగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు. నేను కూడా అదే భావిస్తున్నాను.

Sunday 5 February 2012

నా బ్లాగు పుట్టినరోజు....(ఇది చదివిన వారికి పొట్ట చెక్కలవ్వడం ఖాయం)

నా బ్లాగులో వాగుడు మొదలెట్టి సంవత్సరం ఆయింది. తెలుగు బ్లాగర్లందరికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరమంతా నా పిచ్చి పిచ్చి వాగుడు రాతలతో మీరు బాగానే వేగగలిగినందుకు... ఆయిన జీవితమన్నక కొంత కంప్రమైజింగ్ ఉండాలండి.... అన్ని మీకు నచ్చినట్టుగానే ఉండాలంటే కుదరదుగా.... అందుకే నాలాంటి వాడిని భరించవలసివచ్చింది మీ అందరికి....

పోస్టు మీరందరు చదివేస్తారని రాయడం లేదులెండి. ఏదో బ్లాగు మొదలెట్టి సంవత్సరమయిన సందర్బంగా, అసలు నేను బ్లాగు మొదలెట్టే సమయానికి నాకున్న బ్లాగు పరిజ్ణానం గురించి నెమరువేసుకుందామని రాస్తున్నాను అంతే.

నిజ్జంగా నిజమండీ, బ్లాగు మొదలెట్టే సమయానికి అసలు బ్లాగర్లు అనే వాళ్ళు అప్పటికే కుప్పులు తెప్పలుగా ఉన్నారని, వాటన్నింటికి కేంద్రబిందువుగా అగ్రిగ్రేటర్స్ అనేవి ఉంటాయని నాకు అస్సలు తెలియదు. (నా మీద ఒట్టు). మనం చదివిన చదువులు అలాంటివిలెండి.

ఏదో ఖాళీగా ఉన్నాం కదాని కంప్యూటర్ లోకి దూరి అడ్డమైన చెత్త అంతా చూస్తు ఉంటే, గూగుల్ లో కొత్తగా బ్లాగ్ అనే పదం కనబడితే, ఏంటబ్బా అని లోనికి వెళ్ళి చూస్తే, అప్పుడు తెలిసింది బ్లాగ్ గురించి. వెంటనే దాన్లోకి వెళ్ళి గెలికి, గెలికి చివరికి బ్లాగు యొక్క ప్రాధమిక అంశాలు కనుగొని  బ్లాగుని క్రియెట్ చేసి ఏదో కనిపెట్టేసాన్న అనందం కల్గింది.

అప్పటి వరకు నాకు వాటి గురించి చూడకపోవడం (లేక) వినకపోవడం (లేక) తెలియక పోవడం వలన తెలుగులో తొలి బ్లాగుని నేనే క్రియేట్ చేసానేమో అని ధ్రిల్ ఫీలయిపోయాను. ఇంకా నయం భూమాక్షర్షణ సిద్దాంతం గురించి, న్యూట్రన్ గురించి  చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మా ఇంటిలో ఉన్న కొబ్బరిచెట్టు క్రింద కూర్చుని , కొబ్బరి కాయ క్రిందకి పడగానే యురేకా అని అరిచి కొత్తగా భూమాక్షర్షక సిద్దాంతం కనిపెట్టేవాడినేమో.

ఇకపోతే బ్లాగు క్రియేట్ చేసిన తర్వాత దానిని ఏమి చేయాలో తెలియలేదు... బ్లాగు మెయిన్ పేజిలో టాప్ లో నెక్ట్స్ బ్లాగ్ అని ఉంటే దాని మీద క్లిక్ చేస్తే ఏవో ఇంగ్లీషు బ్లాగులు వచ్చేవి. వాటిని చూసి పోస్ట్ లు వ్రాయాలని తెలిసుకొన్నా. వెంటనే ఒక పోస్ట్ వ్రాసేసి పడిసేసా. కాని ఎవడు చదువుతాడో తెలియదు. అలానే రోజులు గడిచిపోతున్నాయి. (జల్లెడ, కూడలి, మాలిక లాంటి అగ్రిగ్రేటర్స్ ఉంటాయని, అందులో మన బ్లాగ్ ని లిస్ట్ చేస్తే, మన పోస్ట్ లు అందులో యాడ్ ఆవుతాయని నాకు అస్సలు తెలియదు).

మూడ్ ఉన్నప్పుడు బ్లాగులో పోస్ట్ లు వ్రాసి పడేయడడం, లేకపోతే బ్లాగులో నెక్ట్స్ బ్లాగు అన్నదానిమీద క్లిక్ చేయడం, వాటిని పరిశీలించడం చేస్తుండేవాడిని. అలా చూస్తు ఉండగా సత్యవతి గారి మా గోదావరి బ్లాగు, వనజవనమాలి వారి బ్లాగు తగిలాయి. వార్ని! తెలుగులో కూడా బ్లాగులు ఉన్నయా అని బోలెడు ఆశ్చరపోయి, వాటిని పరిశీలించాను( నా అజ్ణానానికి నవ్వుకోకండి ప్లీజ్). అలా మా గోదావరి, వనజావనమాలి వారి బ్లాగులకి ఫ్యాన్ ఆయిపోయాను. ఇకపోతే వారి పోస్ట్ లకు కామెంట్లు ఎవరు పెడతారో అర్ద్రమయ్యేది కాదు(దయచేసి నవ్వకండి, అప్పటికి నా నాలెజ్ద్ అంతే మరి).

అలా ఉండగా ఒకసారి శరత్ గారి బ్లాగు "శరత్ కాలమ్"కి వెళ్ళినప్పుడు, ఆయన పోస్ట్ ఒక దానికి కామెంట్ ఇచ్చి, నా బ్లాగ్ చూడవలసినదిగా రిక్వెస్ట్ పెట్టా. వెంటనే నా బ్లాగ్ చూసి, నా బ్లాగ్ తెలుగు బ్లాగ్ అగ్రిగ్రేటర్స్ లో లిస్ట్ చేయమని సూచించారు. తెలుగు బ్లాగు అగ్రిగ్రేటర్స్ అంటే ఏమిటి రా బాబు అనుకొని కొన్ని రోజులు బుర్ర పీక్కున్నా..

సరేలే అని గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి అగ్రిగ్రేటర్స్ అని క్లిక్ చేస్తే నా తలకాయంత మేటర్ వచ్చింది. మొత్తానికి కొన్ని రోజులు బుర్ర పీక్కున తర్వాత నా బ్లాగుని జల్లెడ, కూడలి, మాలిక లోకి లిస్ట్ చేయగలియాను. అప్పటికే అందులో తెలుగు బ్లాగర్ల లిస్టు చూసి, తొలి రోజుల్లో బ్లాగు నేనే కనిపెట్టనని ఫీల్ ఆయిన సందర్బం గుర్తుకువచ్చి నా మెకాలిలో ఉన్న బల్బు టక్ మని ఆరిపోయింది..

అలా మొత్తానికి నా బ్లాగు పట్టాల మీదికి వచ్చి మీ ముందుకు వచ్చింది. ఎందరో మహనుభావులు, ఎందరో రచయితలు, అన్ని రంగాల వారు వ్రాస్తున్న బ్లాగ్ లు చదువుతుంటే, వారి యొక్క రచన సామర్ద్యానికి ముగ్దుడునయ్యాను. ఒక్కొక్కొరిది ఒక్కొక్క శైలి. అందరూ మేధావులే... వార్కి "కలం" నైపుణ్యాన్ని ఇచ్చిన దేవుడుకు మనస్పూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.