Wednesday 29 February 2012

దొంగ- గజదొంగ..

నిన్న అసెంబ్లీలో అర్దిక శాఖా మాత్యులు అనం రామనారాయణరెడ్డి గారు ఒక నిష్టుర సత్యం ప్రకటించారు
.
తమ కుటుంబంను ఇబ్బందిపాల్జేస్తున్నారన్న విజయమ్మ ఆరోపణకి సమాధానమిస్తూ
, మేమెమి మీ ఆయన వై.ఎస్. గారు ప్రవేశపెట్టిన పధకాలను( స్విస్ బ్యాంకులకు నిధులు మళ్ళింపు కార్యక్రమాలు) ఆపుజేయలేదు. ఇంకా చెప్పాలంటే వై.ఎస్. హయంలో వివిధ పధకాలకు కేటాయించిన నిధుల కన్నా ప్రస్తుతం బోలెడు నిధులు కేటాయించేసాము. అలాంటపుడు వై.ఎస్. ప్రవేశపెట్టిన పధకాలను ( స్విస్ బ్యాంకులకు నిధులు మళ్ళింపు కార్యక్రమాలు) ఎలా అపుజేసామని ఆరోపిస్తున్నారు అని గయ్యిమన్నారు. ప్రజల సొమ్మును వివిధ పధకాల పేరు మీద హం ఫట్ చేయడం వై.ఎస్. జమనాలోనేనా... మా జమనాలో కూడా అటువంటి పధకాలు ఆగిపోతే, తమకు స్విస్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవా అని ఆనం గారు స్వగతంలో అనుకొని, చూడమ్మా విజయమ్మ గారు మీరు అనవసరముగా రచ్చకెక్కొద్దు... సంక్షేమ ఫలాలు పూర్తి స్దాయిలో ప్రజలకు అందితే, మనకు దిక్కులేదన్న సంగతి మీ అయనకే కాదు.. మాకు తెలుసు... అందుకనే సదరు పధకాలను బుద్దొన్నోడు ఎవడూ ఆపేయాలని అనుకోడు. మా కొత్త సి.ఎమ్. కిరణ్ నేతృత్వంలో మేము ఇంకా ముదురుపోయాము. మీ అయన హయాంలో ప్రజా సొమ్ము పై కేవలం దొంగతనాలు మాత్రమే చేసాము. కాని ఇప్పుడు గజ దొంగతనాలు చేస్తున్నాము. కాకపోతే ఆ నిధులు ప్రవహించే స్విస్ ఖాతాల ఎక్కౌంటు నెంబర్లు మాత్రమే మారతాయి. కాబట్టి అనవరసరంగా రచ్చ రచ్చ చేయొద్దు అని చెప్పారు. ఇకపోతే జగన్ పై సి.బి.. దాడుల విషయములో అవన్నీ ప్రధానమంత్రి పరిధిలో ఉన్న సి.బి.. చూసుకుంటుంది. దానికి, మాకు ఏంటి సంబంధం అని ఒక గొప్ప లాజిక్ క్వొశ్చన్ వేసారు. సి.బి.. మీద అధిపత్యం చెలాయించే ప్రధాని మంత్రి మీద ప్రస్తుతం ఎవరూ అధిపత్యం చెలాయిస్తున్నారన్న విషయము మాత్రం ఆమాత్యులు వార్కి జాతిజనులకు చెప్పలేదు. ఇలా సాగుతుండగా కొడుకు, కోడలు చదివిన ఉన్నత చదువులతో చాలా సంతృప్తి పడిపోతున్న చంద్రబాబునాయుడు గారు, అదేంటి మొత్తము మాటలన్నీ మీరిద్దరు మాట్లాడుకోవడమేనా? అని అనుకొని, వెంటనే లేచి, వై.ఎస్. జమనాలో అవినీతి గురించి మేము అప్పుడే చెప్పాము. అంతే కాకుండా అయ్యగారి అవినీతి మీద ఒక పుస్తకం కూడా వేసాము అని రెండు వేల మూడొ సారి గట్టిగా అరిచారు... నిధుల పంపకం గురించి విజయమ్మ గారు, నేను మాట్లాడుకుంటే మధ్యలో ఈ బాబు గాడొకడు అని చిన్న అసహానం ఫీలయ్యి, ఆయిన ఇదంతా మామూలే అని అనుకొని అనం గారు తిరిగి తన ప్రసంగించడం మొదలెట్టారు. చంద్రబాబు అరోపిస్తునట్టు వై.ఎస్. జమనాలో వై.ఎస్. గారు దొంగతనం చేసినట్టు మాకు తెలియనే తెలియదు. కావలంటే అమ్మ తోడు ఒట్టు... అప్పుడు వై.ఎస్. గారు మమ్మలందరిని కళ్ళకు గంతలు కట్టుకోమన్నారు. అంతే మేమందరం కట్టుకొన్నాము. అంతే తప్ప మాకు దానితో మాకేమి సంబంధం లేదు. ఒక వేళ ఎవరైనా గంతలు ఇప్పినట్టు తేలితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము.( ఇప్పుడు గంతలు కట్టుకోవలసిన అవసరం లేదులెండి. ఎందుకంటే ఈ సారి అందరం కలిసే గజదొంగలం). హలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తక్కువకాని స్ల్రీన్ ప్లే తో ప్రసంగం మంచి రంజుగ్గా సాగిపోతుంది. ఇక ఆ ప్రసంగం ఎప్పటికి అవదులెండి....
ఇంతకి ఆనం గారు చెప్పేదేమిటంటే
.. వై.ఎస్. జమనాలో మేమందరం దొంగలం..... ఆయన గారు పోయాక మేము ఆయన ప్రవేశపెట్టిన పధకాలను ఇంకా అభివృద్ది చేయడం ద్వారా గజదొంగలం ఆయ్యాము... ఆ విధంగా వై.ఎస్. జమనాతో పోల్చుకుంటే మేము బాగా ఇంప్రూవ్ అయ్యాము.. అర్ద్రం చేసుకొండి రా వెదవల్లారా అని చెప్పుతున్నారు. (ఫైనల్ గా అవన్నీ వెళ్ళేవి స్విస్ ఖాతాలకే)
వెధవలకు మాత్రం ఎప్పుడూ అర్ద్రం అవ్వదు లెండి
.... ఎందుకంటే బడ్జెటులో కేటాయించబడిన నిధులు లెక్కల వివరములు, అవి ఖర్చు ఆయిన తీరు, ఎంత మొత్తము నిజానికి ఖర్చు చేసారు? ఎంత మొత్తము స్విస్ ఖాతాలకు వెళ్ళింది? అనే వివరాలు వెధవలకు ఎపుడూ అర్ద్రం కావులెండి.
అర్ద్రం ఆయిన వాడు ఏమి పీకలేక ఇదిగో ఇలా బ్లాగులో పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటాడు
.. అంతేనండి... అంతే....

No comments:

Post a Comment