Sunday, 5 February 2012

నా బ్లాగు పుట్టినరోజు....(ఇది చదివిన వారికి పొట్ట చెక్కలవ్వడం ఖాయం)

నా బ్లాగులో వాగుడు మొదలెట్టి సంవత్సరం ఆయింది. తెలుగు బ్లాగర్లందరికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరమంతా నా పిచ్చి పిచ్చి వాగుడు రాతలతో మీరు బాగానే వేగగలిగినందుకు... ఆయిన జీవితమన్నక కొంత కంప్రమైజింగ్ ఉండాలండి.... అన్ని మీకు నచ్చినట్టుగానే ఉండాలంటే కుదరదుగా.... అందుకే నాలాంటి వాడిని భరించవలసివచ్చింది మీ అందరికి....

పోస్టు మీరందరు చదివేస్తారని రాయడం లేదులెండి. ఏదో బ్లాగు మొదలెట్టి సంవత్సరమయిన సందర్బంగా, అసలు నేను బ్లాగు మొదలెట్టే సమయానికి నాకున్న బ్లాగు పరిజ్ణానం గురించి నెమరువేసుకుందామని రాస్తున్నాను అంతే.

నిజ్జంగా నిజమండీ, బ్లాగు మొదలెట్టే సమయానికి అసలు బ్లాగర్లు అనే వాళ్ళు అప్పటికే కుప్పులు తెప్పలుగా ఉన్నారని, వాటన్నింటికి కేంద్రబిందువుగా అగ్రిగ్రేటర్స్ అనేవి ఉంటాయని నాకు అస్సలు తెలియదు. (నా మీద ఒట్టు). మనం చదివిన చదువులు అలాంటివిలెండి.

ఏదో ఖాళీగా ఉన్నాం కదాని కంప్యూటర్ లోకి దూరి అడ్డమైన చెత్త అంతా చూస్తు ఉంటే, గూగుల్ లో కొత్తగా బ్లాగ్ అనే పదం కనబడితే, ఏంటబ్బా అని లోనికి వెళ్ళి చూస్తే, అప్పుడు తెలిసింది బ్లాగ్ గురించి. వెంటనే దాన్లోకి వెళ్ళి గెలికి, గెలికి చివరికి బ్లాగు యొక్క ప్రాధమిక అంశాలు కనుగొని  బ్లాగుని క్రియెట్ చేసి ఏదో కనిపెట్టేసాన్న అనందం కల్గింది.

అప్పటి వరకు నాకు వాటి గురించి చూడకపోవడం (లేక) వినకపోవడం (లేక) తెలియక పోవడం వలన తెలుగులో తొలి బ్లాగుని నేనే క్రియేట్ చేసానేమో అని ధ్రిల్ ఫీలయిపోయాను. ఇంకా నయం భూమాక్షర్షణ సిద్దాంతం గురించి, న్యూట్రన్ గురించి  చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మా ఇంటిలో ఉన్న కొబ్బరిచెట్టు క్రింద కూర్చుని , కొబ్బరి కాయ క్రిందకి పడగానే యురేకా అని అరిచి కొత్తగా భూమాక్షర్షక సిద్దాంతం కనిపెట్టేవాడినేమో.

ఇకపోతే బ్లాగు క్రియేట్ చేసిన తర్వాత దానిని ఏమి చేయాలో తెలియలేదు... బ్లాగు మెయిన్ పేజిలో టాప్ లో నెక్ట్స్ బ్లాగ్ అని ఉంటే దాని మీద క్లిక్ చేస్తే ఏవో ఇంగ్లీషు బ్లాగులు వచ్చేవి. వాటిని చూసి పోస్ట్ లు వ్రాయాలని తెలిసుకొన్నా. వెంటనే ఒక పోస్ట్ వ్రాసేసి పడిసేసా. కాని ఎవడు చదువుతాడో తెలియదు. అలానే రోజులు గడిచిపోతున్నాయి. (జల్లెడ, కూడలి, మాలిక లాంటి అగ్రిగ్రేటర్స్ ఉంటాయని, అందులో మన బ్లాగ్ ని లిస్ట్ చేస్తే, మన పోస్ట్ లు అందులో యాడ్ ఆవుతాయని నాకు అస్సలు తెలియదు).

మూడ్ ఉన్నప్పుడు బ్లాగులో పోస్ట్ లు వ్రాసి పడేయడడం, లేకపోతే బ్లాగులో నెక్ట్స్ బ్లాగు అన్నదానిమీద క్లిక్ చేయడం, వాటిని పరిశీలించడం చేస్తుండేవాడిని. అలా చూస్తు ఉండగా సత్యవతి గారి మా గోదావరి బ్లాగు, వనజవనమాలి వారి బ్లాగు తగిలాయి. వార్ని! తెలుగులో కూడా బ్లాగులు ఉన్నయా అని బోలెడు ఆశ్చరపోయి, వాటిని పరిశీలించాను( నా అజ్ణానానికి నవ్వుకోకండి ప్లీజ్). అలా మా గోదావరి, వనజావనమాలి వారి బ్లాగులకి ఫ్యాన్ ఆయిపోయాను. ఇకపోతే వారి పోస్ట్ లకు కామెంట్లు ఎవరు పెడతారో అర్ద్రమయ్యేది కాదు(దయచేసి నవ్వకండి, అప్పటికి నా నాలెజ్ద్ అంతే మరి).

అలా ఉండగా ఒకసారి శరత్ గారి బ్లాగు "శరత్ కాలమ్"కి వెళ్ళినప్పుడు, ఆయన పోస్ట్ ఒక దానికి కామెంట్ ఇచ్చి, నా బ్లాగ్ చూడవలసినదిగా రిక్వెస్ట్ పెట్టా. వెంటనే నా బ్లాగ్ చూసి, నా బ్లాగ్ తెలుగు బ్లాగ్ అగ్రిగ్రేటర్స్ లో లిస్ట్ చేయమని సూచించారు. తెలుగు బ్లాగు అగ్రిగ్రేటర్స్ అంటే ఏమిటి రా బాబు అనుకొని కొన్ని రోజులు బుర్ర పీక్కున్నా..

సరేలే అని గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి అగ్రిగ్రేటర్స్ అని క్లిక్ చేస్తే నా తలకాయంత మేటర్ వచ్చింది. మొత్తానికి కొన్ని రోజులు బుర్ర పీక్కున తర్వాత నా బ్లాగుని జల్లెడ, కూడలి, మాలిక లోకి లిస్ట్ చేయగలియాను. అప్పటికే అందులో తెలుగు బ్లాగర్ల లిస్టు చూసి, తొలి రోజుల్లో బ్లాగు నేనే కనిపెట్టనని ఫీల్ ఆయిన సందర్బం గుర్తుకువచ్చి నా మెకాలిలో ఉన్న బల్బు టక్ మని ఆరిపోయింది..

అలా మొత్తానికి నా బ్లాగు పట్టాల మీదికి వచ్చి మీ ముందుకు వచ్చింది. ఎందరో మహనుభావులు, ఎందరో రచయితలు, అన్ని రంగాల వారు వ్రాస్తున్న బ్లాగ్ లు చదువుతుంటే, వారి యొక్క రచన సామర్ద్యానికి ముగ్దుడునయ్యాను. ఒక్కొక్కొరిది ఒక్కొక్క శైలి. అందరూ మేధావులే... వార్కి "కలం" నైపుణ్యాన్ని ఇచ్చిన దేవుడుకు మనస్పూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

6 comments:

  1. @ mr sai
    @ mr phaneendra

    thanks so much.....

    ReplyDelete
  2. రాఘవ్ గారూ మొదటగా మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు. నిజాయితీగా చక్కగా వ్రాశారు.

    మీలాగే నేనూ మొదటి బ్లాగ్ చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానంటే ఓ పదిరోజులు ఆ ఆశ్చర్య౦లోనే ఉండిపోయాను. ఇంత మంచి సాహిత్యం ఓ మౌస్ క్లిక్ లో అందుబాటులో ఉందా అని. బ్లాగ్స్ గురించి తెలిసాక నేను ఏం వ్రాయగాలనో తెలియదు కాని బ్లాగ్ అయితే మొదలు పెట్టాను. అలాగే అగ్రిగేటర్స్ ఉంటాయని కూడా బ్లాగ్స్ ద్వారానే తెలుసుకున్నాను.

    ReplyDelete
  3. రాఘవగారు యాపీ యాపీ బ్లాగ్ యానివర్సరీ.. కాని మిమ్మల్ని చూసింది ఇవాళేనండి.... తర్వాత తీరిగ్గా వచ్చి ఏమేం రాసారో చూస్తాను..హ్యాపీ బ్లాగింగ్..

    ReplyDelete
  4. @జ్యోతిర్మయి గార్కి,
    బ్లాగనవుభావలను మీరు కూడా నాతో పంచుకొన్నందుకు ధన్యవాదములు..

    @జ్యోతి గార్కి,
    మీరు నా బ్లాగ్ కి రావడమే పదివేలు, అంతే కాకుండా తర్వాత తీరిగ్గా ఏమి రాసానో చదువుతానంటే!! అంత కంటేనా...
    మీ అభిమానానికి ధన్యవాదములు.

    ReplyDelete