Showing posts with label సమాజం. Show all posts
Showing posts with label సమాజం. Show all posts

Friday, 9 October 2015

నేతాజీ మరణం - నిజాలు (?)


నేతాజి సుబాష్ చంద్రబోస్ ఎలా మరణించారన్న దానిపై ఇప్పటికీ సరయిన సృష్టత లేదు. ఒక్కొక్కొ చోట ఒక్కొక్కలా చెప్పుకోవడమే తప్పితే ఖచ్చితమైన కధనమంటూ ఏదీ బయటకు రాలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన బిజెపి వల్లనైనా ఆ పని ఆవుతుందనుకుంటే, వీళ్ళు కూడా ముందు ప్రభుత్వాలు పాడినట్టే పాత పాట పాడారు. ఇలాంటి సందర్బంలో నేతాజీ గురించి గతంలో వినని ఈ క్రింది  ఆస్తకికర కధనం నా కంటపడింది.  కానీ ఇందులో ఉన్న విశ్వసనీయ ఎంత అనేది తెలీదు.  ఈ మధ్యనే కులదీప్ నయ్యర్ వారి "అక్షరానికి అవల" ను పూర్తిచేసాను. అందులో నేతాజి అదృశ్యం గురించి ఏమైనా ఉంటుందెమో అనుకున్నా గానీ, అటువంటిదేది అందులో రాయలేదు.

                                                                                        ****

(ఎం.వి.ఆర్. శాస్త్రి, ఆంధ్రభూమి ఎడిటర్, ఉన్నమాట, 03/10/2015)

గాంధీగారు కాంగ్రెసుకు సర్వాధికారి.తిరుగులేని నియంత...
..
అంతటివాడికే ఎదురొడ్డి నిలిచి గెలిచినవాడు జాతీయ కాంగ్రెసు చరిత్రలో ఒకే ఒక్కడు:
నేతాజీ సుభాష్ చంద్ర బోస్.
...
1939 త్రిపురి కాంగ్రెసు అధ్యక్ష ఎన్నికలో నేతాజీకి పోటీగా పట్ట్భా సీతారామయ్యను నిలబెట్టి మహాత్ముడు సర్వశక్తులు ఒడ్డినా బోసుబాబే ఘనవిజయం సాధించాడు.
* * *
దేశాన్ని అడ్డగోలుగా చీలుస్తూంటే మీరెలా ఊరుకున్నారు? ఎందుకు తిరగబడలేదు అని విదేశీ పత్రికా ప్రతినిధి ఆ తరవాత అడిగితే స్వతంత్ర భారత ప్రధాని నెహ్రు పండితుడు ఏమన్నాడు?
..
అప్పటికి మా శక్తులు సన్నగిల్లాయి. పోరాటాలు చేసిచేసి అలసిపోయాం. మళ్లీ ఉద్యమించి జైళ్లకు వెళ్లే ఓపిక మాకెవరికీ లేదు. స్వాతంత్య్రానికి దేశ విభజన దగ్గరిదారి చూపింది. అందుకే ఒప్పేసుకున్నాం.
..
నెహ్రులాగే, ఆయనకు తోడుబోయిన కాంగ్రెసు మహానాయకుల్లాగే మిగతా దేశం కూడా కాడికింద పారేసి కాళ్లు బారజాపి కూచుని ఉంటే బహుశా నెత్తుటి ముద్ద స్వాతంత్య్రం కూడా సిద్ధించేది కాదు. మిగిలిన అగ్రనేతలు అలిసి సొలిసి దిక్కులు చూస్తున్న సమయాన ఒక నేతాజీ చిచ్చర పిడుగులా చెలరేగాడు. ఆంగ్లేయ సర్కారు కళ్లుకప్పి రహస్యంగా దేశం వదిలిపోయి బ్రిటిషు వారిపై పోరుకు సాయుధ సైన్యాన్ని కూడగట్టాడు. ఏకంగా ప్రవాస భారత ప్రభుత్వమే నడిపాడు. స్వతంత్ర రాజ్యాధినేతగా పనె్నండు దేశాల గుర్తింపు పొందాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆజాద్ హింద్ ఫౌజ్‌తో దండెత్తివచ్చి, తెల్లవారి పీచమణచి, దేశవాసుల సహకారంతో భరతమాతను విముక్తి చేయగలిగేవాడే.

* * *
కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొనే్నళ్ల కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలూ లేవు. మీ పెత్తనానికి వచ్చిన గత్తరలూ లేవు. మరి మీరేమిటి - కొంపలేవో మునుగుతున్నట్టు అలా ఆదరాబాదరా జెండా పీక్కొని పలాయనం చిత్తగించారు? అంత అర్జంటుగా స్వాతంత్య్రం ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవడానికి మిమ్మల్ని పురికొల్పిన కారణాలేమిటి?’
-అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చిన జవాబు ఇది: ‘‘అతి ముఖ్యకారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం.’’
* * *
అంటే - ఈనాడు మనం విచ్చలవిడిగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. అసలు సిసలు జాతీయ నాయకుడు అని నిస్సంకోచంగా పేర్కొన్నదగ్గవాడు సుభాష్ బోస్ ఒక్కడే. జాతికి, దేశానే్నలే వారికి కృతజ్ఞత అనేది ఉంటే నిత్యం స్మరించి, పూజించవలసింది ఆయననే.
చెప్పుకుంటే సిగ్గుచేటు. పూజించే మాట దేవుడెరుగు. కనీస మర్యాద, మన్ననలకే ఆ మహానుభావుడు నోచుకోలేదు.
....
ప్రపంచంలో ఏ దేశంలోనైనా - విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధులను వెంటాడి, వేటాడుతుంది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆ యోధులే స్వదేశంలో ఘన నీరాజనాలందుకుంటారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా జాతీయ వీరులను ప్రమాదకారులుగా పరిగణించి, వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పనికి సాధారణంగా ఏ స్వతంత్ర ప్రభుత్వమూ ఒడిగట్టదు.
మహా ఘనత వహించిన నీతులమారి భారత సర్కారు మాత్రం సరిగ్గా ఆ పాపిష్టి పనినే పావుశతాబ్దం పాటు జంకులేకుండా సాగించింది.
...
ప్రజాస్వామిక విలువలను,
నెహ్రు పండితుడే బోసు కుటుంబీకులకు, ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాలను పొంచి చూడమని, వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట. ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘా యజ్ఞాన్ని ఆయన సుపుత్రిక ఇందిర కూడా 1971 దాకా యథావిధిగా నడిపించిందట. ఏ రాజకీయ లబ్ధిని ఆశించి, ఎవరిని సాధించడానికి అయితేనేమి పశ్చిమ బెంగాల్ ఏలిక మమతా దీదీ బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్తా రట్టు అయింది.
....
ఇక్కడో సందేహం సహజం.
నేతాజీ బోస్ 1945 ఆగస్టు 18నే ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు సర్కారు వారూ అంగీకరించారు కదా? ఆయన చితాభస్మమని చెప్పబడేదాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడమూ ఆ రోజుల్లోనే అయింది కదా? తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు, ఆయన వలె రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనెప్పి తేగలవారూ ఆయన బంధువుల్లో ఎవరూ లేనప్పుడు నెహ్రు ప్రభుత్వం ఎందుకు భయపడింది? తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గూఢచర్యం జరిపింది?
వారిని చూసి కాదు బెదురు. అసలు భయం నేతాజీకి ఏమయిందన్న రహస్యం దేశవాసులకు ఎక్కడ తెలిసిపోతుందోనని! అసలు సంగతి తెలిస్తే జనం తమ మొగాన పేడనీళ్లు ఎక్కడ కొడతారోనని!!
....
1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించాడన్న అబద్ధాన్ని 1956 నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత, 1970 ఖోస్లా కమిటీ చేత నొక్కి చెప్పించినా బూటకపు విచారణలను ఎవరూ నమ్మలేదు. 1999లో కోర్టు ఉత్తర్వువల్ల సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్‌కుమార్ ముఖర్జీతో ఏర్పాటైన విచారణ కమిషన్ విమాన ప్రమాదం అబద్ధం, ఆ తరవాత కూడా నేతాజీ బతికే ఉన్నాడు అని నిర్ధరించింది. కాని దాని నివేదిక వెలువడే సరికి ఎన్డీఏ సర్కారు పోయి యుపిఎ జమానా వచ్చింది. తమ ఇలవేల్పులను ఇరుకున పెట్టే నివేదికను మన్మోహన్ సర్దార్జీ బానిస ప్రభుత్వం ఎంచక్కా బుట్టదాఖలు చేసింది.
....
శత్రువుకు శత్రువు మిత్రుడని భావించి, దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయటానికి, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలని నేతాజీ ఆలోచన. ఈ ప్రణాళిక మొదట్లో బాగానే సాగింది. కాని నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక, జపాన్ సైతం చిక్కుల్లో పడ్డాక వ్యూహాన్ని మార్చుకోవటం తప్పనిసరి అయింది. సోవియట్ యూనియన్‌ను ఆశ్రయించి, బ్రిటన్‌పై పోరుకు సహాయం పొందాలని సుభాష్ బోస్ ఆశించాడు. ఆ ఉద్దేశంతోనే విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరాడు. వేగంగా మారిపోయిన సైనిక సమీకరణల్లో బ్రిటన్, రష్యాలు ఏకమయ్యాయి. మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు.
...
విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రేడియో చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. అతడు అజ్ఞాత వాసంలోకి వెళ్లదలచుకుంటే ఇలాంటి ప్రకటనే చేయిస్తాడని నా నమ్మకం. ఇంతకీ ఏమయిందో, అతడు ఎక్కడున్నాడో కనుక్కోమని అప్పటి ఇండియా వైస్రాయ్ వేవెల్ తన హోం మెంబరును పురమాయించాడు. ఆగ్నేయాసియాలోని బ్రిటిషు గూఢచారి దళం ద్వారా అతగాడు సమాచారం రాబట్టాడు. యుద్ధ నేరస్థుడిగా బోస్‌ను ఇండియాకు తీసుకొస్తే ప్రమాదం. ప్రజల సానుభూతి అతడికి దండిగా ఉంది. అతడిని ఉన్నచోటనే ఉండనివ్వటం మనకు క్షేమం అని హోం మెంబరు చెప్పాడు. వైస్రాయ్ తల ఊచాడు.
..
ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇండియాలో అధికారం చేతులు మారింది. దేశవాళీ సర్కారు పవర్లోకి వచ్చింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకథ అని నెహ్రు ప్రభుత్వానికి తెలుసు. బోస్ బతికే ఉన్నాడని గాంధీగారు కూడా చెబుతూనే ఉన్నాడు. కొత్త ప్రభుత్వం తలచుకుంటే నేతాజీని సైబీరియా చెరనుంచి విడిపించి స్వదేశానికి సగౌరవంగా తీసుకురాగలిగేదే.
..
కాని బోస్ వస్తే తమ పని ఖాళీ అని నవభారత నేతాశ్రీలకు తెలుసు. ప్రజాబలంలో అతడి ముందు వారు ఎదురు నిలవగలగటం కలలో మాట. కాబట్టి అతడిని ఉన్నచోటే ఉండనివ్వటం తమకూ క్షేమమని వారూ తలిచారు. ఏమి జరిగిందో ఎరగనట్టు మాయమాటలతో కాలక్షేపం చేశారు. ఈలోపు అసలు సంగతి బోస్ బంధుమిత్రులకు ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడి నేతాజీ సన్నిహితులందరి మీద గూఢచారులను పెట్టారు. వారికొచ్చే ఉత్తరాలను చించి, తమకు చిక్కులు తెచ్చే వాటిని సర్కారీ అరల్లో దాచేసేవారు. సైబీరియా ఖైదులో సుభాష్ బోస్‌ను తాను చూసినట్టు... ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద అధికారులు రష్యాలోని భారత రాయబారిని కూడా ఆయనను చూడనిచ్చినట్టు సోవియట్ గూఢచారి సంస్థ కె.జి.బి.లో పని చేసిన వాడు ఒకడు తాను రాసిన పుస్తకంలో కొన్ని సంవత్సరాల కిందే బయటపెట్టాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎవరెన్ని ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగినా భారత సర్కారు నోరు మెదిపితే ఒట్టు.


అసలు మిస్టరీ ఇది కాదు.
...
సాటిలేని జాతీయ వీరుడైన బోస్ జ్ఞాపకాలను తుడి చెయ్యాలని ఆయన ప్రత్యర్థి జవహర్లాల్ నెహ్రు ఆరాటపడ్డాడంటే అర్థం ఉంది. తమ కులదైవాల ప్రతిష్ఠ మసకబారకూడదన్న ఆదుర్దాలో కాంగ్రెసు ప్రభుత్వాలు గుట్టురట్టు కానివ్వలేదన్నా అర్థం చేసుకోవచ్చు. 
...
మీ రక్తం ఇవ్వండి; స్వాతంత్య్రం పొందండిఅని గర్జించిన మహానేతకు స్వతంత్ర దేశంలో ఇవ్వవలసిన నివాళి ఇదేనా? మన స్వాతంత్య్రం మేడిపండేనా?



Friday, 31 October 2014

రెహనా – అఖరి కోరిక



రెహనా విషాదంతం గురించి “పని లేక” బ్లాగులో ఇదివరకే డా.రమణ గారు ప్రచురించారు. ఆయితే రెహనా స్వయంగా తన తల్లికి పంపించిన వాయిస్ మెసెజ్ పూర్తి స్దాయిలో చదివిన తర్వాత చాలా చలించిపోయాను. మన భూమ్మీదే నరకం అంటే ఎలా ఉంటుందో రెహనా స్వయముగా చెప్పిన భావాలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

నరకం ఎక్కడో లేదు. ఇక్కడే ఉంది. మన భూమ్మీదే ఉంది.  ఇరాక్ లో ఆయితే ఇంకా గొప్పగా ఉంటుంది. రెహనా మాటల్లో.......

రేప్‌ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆత్మరక్షణలో భాగంగా హతమారిస్తే అది మన దేశంలో నేరం కాదు. కానీ ఇరాన్‌లో అతి పెద్ద నేరం. దానికి శిక్ష ఉరి. ఇలాంటి కేసులో రెహనా జబ్బారీని గత వారం ఇరాన్‌లో ఉరి తీసారు. ఇస్లామిక్‌ షరియత్‌ చట్టాలు అమలులో ఉన్న ఇరాన్‌లో జరిగిన ఈ సంఘటనపై అంతర్జాతీయంగా పెనుతుపాను చెలరేగింది. ఈ నేపథ్యంలో- తనకు మరణ శిక్ష పడిందని తెలిసిన తర్వాత రెహనా తన తల్లికి ఒక వాయిస్‌ మెసేజ్‌ను పంపింది. గత శనివారం ఆమెను ఉరితీసిన తర్వాత అధికారులు దీనిని విడుదల చేశారు. భగవంతుడి న్యాయస్థానంలో మనం ముద్దాయిలం కాదు అని తన తల్లికి ధైర్యం చెప్పటానికి ప్రయత్నించిన రెహనా తన శరీర అవయవాలను దానం చేయమని కూడా కోరింది. కరుడుగట్టిన హృదయాలను సైతం కరిగించే ఆమె పంపిన సందేశానికి తెలుగు అనువాదమిది..

డియర్‌షోలి, నేను క్విసాస్‌ (ఇరాన్‌ న్యాయవ్యవస్థలో ఒక అంశం)ను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమయిందనే విషయం ఈ రోజే నాకు తెలిసింది. ఈ విషయాన్ని నువ్వే నాకు చెప్పి ఉండాల్సింది. నా జీవితంలో ఆఖరి అధ్యాయానికి చేరుకున్నానని తెలిసిన తర్వాత నువ్వు నాకు ఈ విషయం చెప్పకపోవటం బాధ కలిగించింది. నాకు ఈ విషయం తెలుస్తుందని నువ్వు అనుకోలేదా? నువ్వు విషాదంగా ఉన్నావనే ఆలోచనే నన్ను ఇబ్బంది పెడుతోంది.. నీ చేతిని, నాన్న చేతిని ముద్దాడే అవకాశాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు.? ఈ ప్రపంచం నన్ను 19 ఏళ్లు బతకనిచ్చింది. నన్ను చంపేసి నా శరీరాన్ని నగరంలో ఏ మూలో విసిరేసి.. కొద్ది రోజుల తర్వాత మార్చురీలో నా శవాన్ని గుర్తించమని నిన్ను తీసుకువెళ్లేవారు. నన్ను రేప్‌ చేశారనే విషయం కూడా నీకు అప్పుడే తెలిసేది. నన్ను చంపిన వ్యక్తి ఎవరో కూడా ఎవ్వరికి తెలిసి ఉండేది కాదు. ఎందుకంటే- వాళ్ల దగ్గర ఉన్నంత సంపద, శక్తి మన దగ్గర లేదు. ఆ తర్వాత నువ్వు సిగ్గుతో తలదించుకొని జీవితాన్ని గడపాల్సి వచ్చేది.. అలా గడిపి.. గడిపి.. బాధతో కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా మరణించి ఉండేదానివి. కథ అక్కడితో ముగిసిపోయి ఉండేది. 

అయితే ఒక్క దెబ్బతో మొత్తం కథంతా మారిపోయింది. నా శరీరాన్ని నగరంలో ఏ మూలో పడేయలేదు. మొదట ఈవిన్‌ జైలులోను, ఇప్పుడు శ్మశానంలాంటి షరార్‌ ఈ రే జైలులోను ఉంచారు. అయితే ఈ విషయాలు వేటికీ నేను ఫిర్యాదు చేయదలుచుకోలేదు. జీవితానికి మరణం ఒకటే ముగింపు కాదనే విషయం నీకు కూడా తెలుసు. ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కొన్ని అనుభవాలను సంపాదించుకోవటానికి, కొన్ని గుణపాఠాలు నేర్చుకోవటానికి, కొన్ని బాధ్యతలు నెరవేర్చటానికి వస్తాడని నువ్వు నాకు చెప్పేదానివి. ఈ ప్రయాణంలో కొన్ని సార్లు మనం పోరాడాల్సి వస్తుందనే విషయాన్ని నేను నేర్చుకున్నా. నన్ను ఒక వ్యక్తి కొరడాతో కొట్టినప్పుడు అక్కడే ఉన్న మరొక వ్యక్తి ప్రతిఘటించాడు. అతనిని కూడా కొరడాతో కొడితే ఆ దెబ్బలకు అతను మరణించాడని నువ్వు నాకు చెప్పావు. ఒక వ్యక్తి చనిపోయినా పర్వాలేదు.. కానీ ఈ మరణం వెనకున్న కారణం, దానికున్న విలువ గురించి అందరికీ తెలియాలి.

స్కూలుకు వెళ్లినప్పుడు, దెబ్బలాటలు వస్తాయని.. ఫిర్యాదులు చేస్తూ ఉంటారని- వాటిని మనం ఎదుర్కోవాలని నువ్వు చెబుతూ ఉండేదానివి. మా ప్రవర్తనకు నువ్వు ఎంత ప్రాధాన్యం ఇచ్చేదానివో గుర్తుందా? అయితే నీ అనుభవం తప్పు. నన్ను ఒక వ్యక్తి రేప్‌ చేయటానికి ప్రయత్నించినప్పుడు నీ పాఠాలేమి పనిచేయలేదు. కోర్టులో హంతకురాలిగా చిత్రీకరించినప్పుడు అవి నన్ను కాపాడలేదు. కోర్టులో నన్ను ఒక హంతకురాలిగా చిత్రీకరించారు. నేను కోర్టులో ఏడ్వలేదు. నన్ను క్షమించమని ప్రాధేయపడలేదు. నేను న్యాయాన్ని నమ్మాను. అందుకే ఒక్క కన్నీరు బొట్టు కూడా కార్చలేదు. నేను ఎప్పుడూ దోమలను కూడా చంపలేదని నీకు తెలుసు. బొద్దింకలను కూడా వాటి మీసాలు పట్టుకొని బయటపడేసేదాన్ని. అంతే తప్ప చంపేదాన్ని కాదు. అలాంటి నేను ఇప్పుడు ఒక కరుడుకట్టిన హంతకురాలిని అయిపోయాను. నాపై రకరకాల ఆరోపణలు మోపారు. న్యాయమూర్తుల దగ్గర నుంచి న్యాయం ఆశించటం కూడా ఆశావాద థృక్పథమేమో అనిపిస్తుంది. న్యాయమూర్తి నన్ను ఎటువంటి ప్రశ్నలు వేయలేదు. నన్ను ఇంటరాగేషన్‌ సమయంలో కొడుతున్నప్పుడు.. అత్యంత హీనంగా దుర్భాషలాడుతున్నప్పుడు ఎవ్వరూ నా వైపు మాట్లాడలేదు. నా అందానికి చిహ్నంగా నేను భావించే జుట్టును తీసేసి గుండు చేయించినప్పుడు నాకు దక్కిన బహుమానం ఏమిటో తెలుసా- జైలులో 11 రోజుల ఏకాంత నిర్భందం.

ఇదంతా వింటూ నువ్వు ఏడవకు. మొదటి రోజు పోలీసు ఆఫీసులో ఒక పెళ్లికాని ముసలి పోలీసు నా గోళ్లను విరిచేశాడు. అప్పుడు అందాన్ని ఇక్కడ హర్షించరనే విషయం అర్థమయింది. ఒక అందమైన ఆకృతి, అందమైన ఆలోచన, అందమైన భావన, అందమైన రాత, అందమైన చూపు, అందమైన గొంతు- వీటి వేటికి ఇక్కడ విలువ లేదు. అమ్మా, నా ఆలోచనా విధానం మారిపోయిందేమిటా అనుకోకు. దానికి నువ్వు బాధ్యురాలివి కావు. నా మనసులోంచి అనేక మాటలు ప్రవాహంలా వస్తున్నాయి. నువ్వు లేకుండా, నీకు తెలియకుండా నన్ను ఉరితీసినప్పుడు- నా జ్ఞాపకాలుగా నీకు మిగిలేవి ఈ మాటలే. నేను మరణించే ముందు నాదో కోరిక.. నీ శక్తిమేరకు దాని కోసం ప్రయత్నించు. నేను నిన్ను, ఈ దేశాన్ని కోరేది ఇదొక్కటే. దీనిని సాధించాలంటే కొంత సమయం పడుతుందని నాకు తెలుసు. అమ్మా.. ఏడవకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఒక విల్లు రాయాలనుకుంటున్నా
. జైలులో ఉత్తరం రాయాలన్నా అధికారి అనుమతి కావాలి. అందువల్ల నువ్వు కోర్టుకు వెళ్లి నా తరపున అభ్యర్థనను వారి ముందు ఉంచు. నా వల్ల నువ్వు కూడా బాధపడుతున్నావనే భావనే నన్ను ఇబ్బంది పెడుతోంది. అమ్మా.. నేను నిన్ను అభ్యర్థించేది ఇది ఒక్కటే. కోర్టులో నాకు శిక్ష వేయవద్దని న్యాయమూర్తులను అభ్యర్థించమని చాలా సార్లు చెప్పావు. కానీ నేను అంగీకరించలేదు. కానీ నా ఈ చివరి అభ్యర్థనను మాత్రం నువ్వు మన్నించాలి. అమ్మా.. నువ్వు నాకు నా జీవితం కన్నా ఎక్కువ. అందుకే నువ్వు నాకీ పని చేసిపెట్టాలి. మరణించిన తర్వాత నా శరీరం మట్టిలో కలిసిపోకూడదు. నా అందమైన కళ్లు, చలాకీగా పనిచేసే నా గుండె ఎందుకూ పనికిరాకుండా పోకూడదు. అందువల్ల- నన్ను ఉరితీసిన వెంటనే నా గుండె, కాలేయం, కళ్లు- ఇలా- అవయవ మార్పిడికి పనికొచ్చే అవయవాలన్నింటినీ ఈ ప్రపంచానికి నా బహుమతిగా ఇచ్చేయండి. అవి అమర్చిన వారికి నా పేరు తెలియనివ్వకండి. అంతే కాదు. నాకు నువ్వు సమాధి కట్టద్దు. దాని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. నా కోసం నువ్వు నల్లబట్టలు వేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను కష్టపడిన రోజులన్నీ మర్చిపోవటానికి ప్రయత్నించు.

ఈ ప్రపంచం మనల్ని ప్రేమించలేదు. అందుకే నేను మృత్యువు ఒడిలోకి వెళ్లిపోతున్నాను. భగవంతుడి న్యాయస్థానంలో- నన్ను కొట్టినందుకు ఇన్‌స్పెక్టర్‌ షామోలపైన, అతనిని నివారించలేకపోయినందుకు సుప్రీం కోర్టు జడ్జీలపైన కేసు పెడతాను. అదే కోర్టులో నా హక్కులను హరించినందుకు డాక్టర్‌ ఫార్వాడిపైన, ఖాసీం షబానీపైన కేసులు పెడతాను. కొన్ని సార్లు మనం నిజమనుకున్నదంతా నిజం కాదు. అమ్మా.. ఆ సృష్టికర్త ప్రపంచంలో నువ్వు నేను ఒకటి. మనం ముద్దాయిలం కాదు. మనపై ఫిర్యాదులు చేసిన వారందరూ ముద్దాయిలు. భగవంతుడు ఏం చేస్తాడో అప్పుడు చూద్దాం.. నేను మరణించేదాకా నిన్ను కౌగిలించుకోవాలని ఉంది.  ఐ లవ్ యూ..
ఇట్లు...
నీ రెహనా


సౌజన్యం: ఆంధ్రజ్యోతి

Monday, 20 October 2014

భారతదేశం - సెక్యులరిజం

ఏ దేశానికైనా తమ శతాబ్దలనాటి చరిత్రని ప్రతిబింబిచే విధంగా మసలుకోవడం, సాంస్కృతిక  సంప్రదాయాలను మర్చిపోకుండా కొనసాగించడం అంటే తమ ప్రాంతానికున్న విశిష్టతని, చరిత్రని భావి తరాలకు తెలియజేయాలనే. ఆయితే ప్రస్తుతం ఎన్ని దేశాలు ఇటువంటి పని చేస్తున్నాయో తెలియదు కానీ, ఇండోనేషియా దేశంకు సంబంధించి “హిందూ జ్వాల” నామం కల్గిన పేసుబుక్కు వాల్ నుండి సేకరించిన సమాచారం బాగుందనిపించి ఉన్నదున్నట్టుగా ఇక్కడ పోస్టు చేస్తున్నాను.
                                                          ***


ఇండోనేసియా ప్రపంచంలోకెల్లా పెద్ద ముస్లిం దేశం. అక్కడి జనాభాలో నూటికి 87 మంది మహమ్మదీయులు. తమ సాంస్కృతిక మూలాలను ఇండోనేసియన్లు మరచిపోరు. ఏవగించుకోరు.

అక్కడి నేషనల్ ఎయిర్‌లైన్ పేరు గరుడ

(
ప్రస్తుతం మూతపడ్డ) డొమెస్టిక్ ఎయిర్‌లైన్ పేరు జటాయు’.

ఇండోనేసియన్ కరెన్సీ నోటుమీద గణేశుడి బొమ్మ!

రాజధాని జకార్తాలో ముఖ్యకూడలివద్ద అర్జునుడికి కృష్ణుడు రథం మీద గీతోపదేశం చేస్తున్న నిలువెత్తు ప్రతిమ!!
గరుత్మంతుడు, జటాయువు, కృష్ణుడు, గణేశుడు హైందవ మత సంబంధంగల పేర్లు. తమ దేశంలో హిందూమతం శతాబ్దాలకిందటే దాదాపుగా అంతరించిపోయి, ఐదింట నాలుగొంతుల జనాభా ఇస్లాం మతాన్ని తరతరాలుగా ఆచరిస్తుండగా... తమదికాని, ... అందునా విగ్రహారాధకుల మతం తాలూకు పేర్లను ప్రభుత్వ సంస్థలకు పెట్టటమేమిటి? ప్రభుత్వ కరెన్సీపై అన్యమతానికి చెందిన దేవతామూర్తిని ముద్రించటమేమిటి?... అన్న అభ్యంతరం ఇండోనీసియన్లకు లేదు. తమ ప్రాచీన హిందూ సంస్కృతి అన్నా, వాటి ప్రతిరూపాలన్నా వారికి మహా ఇష్టం.

కొద్దినెలల కిందటి ముచ్చటే చూడండి. ముస్లిం దేశమైన ఇండోనేసియా, (ప్రధానంగా) క్రైస్తవ దేశమైన అమెరికాకు 16 అడుగుల ఎత్తు సరస్వతీదేవి విగ్రహాన్ని కళాత్మకంగా చెక్కించి, స్నేహానికి గుర్తుగా పంపించింది. వేరే మతానికి చెందిన దేవతావిగ్రహాన్ని ప్రభుత్వ కానుకగా పంపించటం అపరాధమని ఇండోనేసియా సర్కారు అనుకోలేదు. తమది కాని మతం ప్రతిమను తామెందుకు తీసుకోవాలని అమెరికన్ గవర్నమెంటూ చిరాకు పడలేదు. సంతోషంగా దాన్ని స్వీకరించి, వాషింగ్టన్ డి.సి.లో వైట్ హౌసుకు కిలోమీటరు దూరంలో టూరిస్టులకు ప్రత్యేకాకర్షణగా దాన్ని ఉంచారు.
పైన చెప్పుకున్న వాటిలో ఏ ఒక్కదాన్నయినా ఇండియా దటీజ్ సెక్యులర్ భారత్‌లో కలనైనా ఊహించగలమా?

కర్మంచాలక అదే సరస్వతీదేవి విగ్రహాన్ని అమెరికాకు కాక ఇండియా సర్కారుకు ఇండోనేసియా బహూకరించిందనుకోండి! ఏమయ్యేది? విగ్రహం ఎంత ముచ్చటగా ఉంటేనేమి? అది ఒక మతానికి సంబంధించినది కదా? ఆ మతం ఎంత ప్రాచీనమైనది అయితే మాత్రమేమి? మా దేశంలో నూటికి 80 మంది ఇప్పటికీ అనుసరిస్తున్నదే అయితే నేమి? ఫలానా మతానికి చెందిన దేవతా ప్రతిమను ముట్టుకుంటే మా సెక్యులర్ మడి మైలపడుతుంది. కాబట్టి వద్దే వద్దని ఘనత వహించిన భారత సర్కారు ఆ కానుకను తిరుగు టపాలో వెనక్కి పంపించేది. సమయానికి సెక్యులర్ మతి తిన్నగా పనిచేయక మన్మోహన్ సర్దార్జీగారో, మరో పెద్దతలకాయో ఆ విగ్రహాన్ని స్వీకరించి ఉంటేనా...?! దేశంలోని సెక్యులర్, లిబరల్, లెఫ్టిస్టు, అనార్కిస్టు తక్కుంగల మేధావిగణం యావత్తూ రేచుకుక్కల్లా మీదపడి పీకిపెట్టేది. జాతి ఎంచుకున్న సెక్యులర్ జీవన విధానానికి, రాజ్యాంగ వౌలిక స్ఫూర్తికి, మానవతా విలువలకు జరిగిన ఆ మహాపచారం సభ్య సమాజానికి సిగ్గుచేటు అంటూ ది హిందూపత్రిక ఘాటైన సంపాదకీయం రాసేది. వీరనారి అరుంధతీరాయ్ డిటోడిటోగా ఔట్‌లుక్వీక్లీనిండా చెడామడా చెలరేగేది. పాఠశాలల్లో, పబ్లిక్ కార్యక్రమాల్లో సరస్వతీ ప్రార్థన చేయటమే సెక్యులర్ వ్యతిరేక దురాగతమని జాతీయ ఏకాభిప్రాయం ఎంచక్కా నెలకొని ఉన్న పవిత్ర భారతదేశంలో బాధ్యతగల ప్రభుత్వమే బరితెగించి ఏకంగా సరస్వతీ విగ్రహానే్న అందుకోవటాన్ని రాజ్యాంగ వ్యతిరేక దుశ్చర్యగా ప్రకటించమంటూ వీర సెక్యులరిస్టులు ఏ ఉన్నత న్యాయస్థానంలోనో అర్జంటుగా ప్రజాహిత వ్యాజ్యం వేసేవారు.

-
ఇప్పుడు బృహదీశ్వరాలయం బొమ్మతో ప్రత్యేక నాణేన్ని రిజర్వు బ్యాంకు చలామణీ చేయడం మీద ఢిల్లీ హైకోర్టులో లక్షణమైన పిల్పడ్డట్టు!

పనిలేనివాడు దావావేస్తేనేమి? అన్నీ తెలిసిన న్యాయస్థానం అడ్డగోలు వాదాన్ని ఎందుకు మన్నిస్తుంది - అంటారా?
తాజా నాణెం కేసులో ఏమయింది?

బృహదీశ్వరాలయం బొమ్మతో మూడేళ్ల కింద రిజర్వు బ్యాంకు ప్రత్యేక నాణేన్ని వెలువరించింది తంజావూరు గుడికీ హిందూ మతానికీ వల్లమాలిన పబ్లిసిటీ తెచ్చిపెట్టటానికి కాదు. ప్రపంచ హెరిటేజ్ సెంటరుగా యునెస్కోగుర్తింపు పొంది, కళాత్మక నిర్మాణ వైభవానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ పెద్ద గుడికి వెయ్యేళ్లు నిండిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యమది. అయితేనేమి? సెక్యులరిజం మంట కలిసిందంటూ నఫీస్ కాజీ, అబూ సరుూద్ అనే ఇద్దరు ఢిల్లీ పౌరులు ప్రజాహితవ్యాజ్యం వేసీ వెయ్యగానే అన్నీ తెలిసిన ఢిల్లీ హైకోర్టు న్యాయపీఠం ప్రభుత్వంమీద ఫైర్ అయింది. మీపై వచ్చిన అభియోగానికి ఏమంటారో చెప్పుకోమని కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వుబ్యాంకుకు నోటీసులిమ్మని ఆదేశించిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ బి.డి. అహమ్మద్‌గారు ఆ సమాధానమేదో వచ్చేదాకా ఆగకుండానే ప్రభుత్వానికి సెక్యులర్ వ్రత విధానం గురించి పెద్ద క్లాసు తీసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెయ్యేళ్లు నిండిన అరుదైన సందర్భాన్ని పురస్కరించుకునే నాణేన్ని వెలువరించామని ప్రభుత్వం పనుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏ ఒక్క మతానికీ ప్రచారం చేయరాదు; సెక్యులరిజాన్ని సక్రమంగా అర్థం చేసుకోవలెను అంటూ ఎడాపెడా ఉతికేశారు. పాతికేళ్లకు ఇది, వందేళ్లకు అది అంటూ తడవతడవకూ ప్రత్యేక నాణేలేమిటని తెగచిరాకు పడ్డారు. శభాష్!

న్యాయం, ధర్మం సర్వం ఎరిగిన ఉన్నత న్యాయస్థానం వారి ఉపదేశమే ఈ రీతిన ఉన్నప్పుడు ప్రాచీన కళలను, సంస్కృతిని రూపుమాపడమే సెక్యులర్ సర్కారు స్పెషల్ డ్యూటీగా పెట్టుకుని, ఓటు బ్యాంకుల కోసం ఎంత చేటుపనికైనా ఉరకలేయడంలో వింతేముంది? శ్రీనగర్ దాల్ సరస్సు దాపున ఉండే జగత్ప్రసిద్ధి చెందిన శంకరాచార్య హిల్ను తఖ్త్-ఎ-సులేమాన్గా పేరుమార్చి, కొత్త చరిత్రను బనాయించే పవిత్ర కార్యాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ.) వారు రాజకీయ యజమానుల పురమాయింపు మీద జయప్రదంగా పూర్తిచేశారు. తమ కబంధ హస్తాల్లో చిక్కిన ఎన్నో ప్రాచీన దేవాలయ కట్టడాలను పరిరక్షణపేరిట కూల్చి కుప్పపోసే మహత్కార్యక్రమంలో ఈ సర్కారీ సంస్థ వారు ఔరంగజేబు ఆవహించినట్టు చాలాకాలం నుంచీ నిర్ణిద్ర దీక్షతో పాటుపడుతున్నారు. హిందూ మతం గురించి, హిందూ సంస్కృతి గురించి, వాటి సంరక్షణ గురించి మాట్లాడితే సెక్యులర్శీలం చెడి, కమ్యూనల్ ముద్ర పడుతుంది కనుక హిందూ సంస్థల పెద్దలూ నోళ్లు కుట్టేసుకున్నారు.
ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి సెక్యులరిజం నేర్పింది. ప్రపంచాన్ని చూసి భారతదేశం సెక్యులరిజాన్ని నేర్చుకోవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.

(Post courtesy: The FB wallpage of “Hindu Jwala”)

(Picture courtesy: google)

Thursday, 16 October 2014

వ్యవస్దగత లోపాలు



హుదుద్ తుఫాన్ కారణంగా వినాశనమునకు గురైన విశాఖపట్నం పరిస్దితి చూస్తే చాలా బాధనిపించింది. అంతే కాదు దానితో పాటుగా నష్టానికి గురైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిస్దితి కూడా ఇంచుమించుగా అలానే ఉంది.

ఆయితే వైజాగ్ పరిస్దితి వీటికి పూర్తిగా భిన్నంగా ఉంది. విద్యుత్ లేక సకల సౌకర్యాలు మొత్తం బంద్ ఆయ్యాయి. ఈ రోజుల్లో ప్రతిదీ విద్యుత్ తో ముడిపడియున్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఒక్క విద్యుత్ ఉంటే చాలు సామాన్యుల రోజూవారీ అవసరాల్లో ఒక ఎనబై శాతం పనులు చక్కబట్టుకోవచ్చు అని నా అభిప్రాయం. అదే విధంగా విద్యుత్ పై ఆధారపడి పనిచేసే పరిశ్రమలు,  ఏ.టి.ఎం.లు, పెట్రోలు బంకులు, వాటర్ సప్లై లాంటి వాటికి కొరత లేకుండా చేసుకోగలిగితే సగం సమస్యలు జయించినట్లే....

ధ్వంసం ఆయినా అనేక సర్వీసులు కాదు కానీ ముఖ్యమైన విద్యుత్ సర్వీసు గురించి మాట్లాడుకుంటే,

ఆహర పదార్దలు, కూరగాయలు ముఖ్యమైన జాబితాలో ఉన్నప్పట్టికీ, తుపానుకి వారం రోజుల నుండే హెచ్చరికలు జారీ చేసినందున ప్రజలు ముందుగానే కావల్సిన సరుకులు ఇంట్లోకి తెచ్చుపెట్టుకున్నప్పట్టికీ, విద్యుత్ లేకపోవడం అనే కారణంగా వంట చేసుకోవడానికి మరియు త్రాగడానికి అవసరమైన మంచి నీరు మరియు కూరగాయలు నిల్వ ఉంచుకొనే సదుపాయం లేకపోవడం మూలాన రెండు రోజుల్లోపే ఇబ్బందులు గురయ్యారు.

ఆయితే ప్రకృతి విలయాన్ని ఏ సాంకేతికత అపలేదు కాబట్టి, సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి మరియు ప్రజలను అప్రమత్తం చేయుటలో గతముతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వం బాగానే పనిచేసింది. ఆయితే వచ్చిన సమస్యంతా తుఫాను భీబత్సం తదనంతరం అవసరమైన సేవలను పునరుద్దరించడంలో జరుగుతున్న జాప్యమే. ఇంత జాప్యం  చూస్తుంటే అసలు మనకున్న సమర్దత ఏపాటిది అన్న అనుమానం కల్గుతుంది.

తుఫాన్ కారణంగా వైజాగ్ లో గత  శనివారం అర్ద్రరాత్రి 11.00 గంటలకు పోయిన విద్యుత్ ని ఇప్పటికీ కూడా పునరుద్దరించలేకపోవడం మన వ్యవస్దల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుంది. తుఫానుకి గురైన రోజే సహయక చర్యలను దగ్గరుండి పర్యవేక్శించడానికి అఘమేఘాల మీద వెంటనే వైజాగ్ బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు ఎవరినీ చూడలేదు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన కార్యాలయం నుండి పర్యవేక్షిస్తూ క్రింది స్దాయి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం వేరు, స్వయంగా రంగంలోకి దిగి అవసరమైన చర్యలను తీసుకోవడం వేరు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే సచివాలయము నుండే పరిస్దితులను చక్కబెట్టే విధంగా వ్యవహరములను నడపచ్చు. కానీ ఆ విధంగా చేయకపోవడంలో పరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం గమనించవచ్చు. ఆయితే నేను ఇక్కడ చెప్పదలచుకున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తి స్వయంగా వైజాగ్ లోనే మకాం వేసి, పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని వైజాగ్ కి రప్పించినప్పటికీ, పునరావస చర్యల్లో అత్యవసరమైన విద్యుత్ ని పునరుద్దరించడానికి సుమారు ఐదు రోజులుకు పైగా పట్టడానికి గల కారణాలు ఏమిటి అన్న ప్రశ్న నన్ను తొలిచింది.  ఇదే ప్రశ్న నా స్నేహితుడిని అడిగాను.

కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించినంత వేగంగా ఇక ఎవరూ స్పందించగలరు్? ఇంత ఇదిగా వారం రోజుల నుండి వైజాగ్ లోనే మకాం వేసి పనుల్లో అంతగా నిమగ్నమైనప్పట్టికీ కూడా నువ్ అలా అనడం బాగోలేదు అన్నాడు.

ఆయితే నేను ఇక్కడ ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయడం లేదు. ముఖ్యమంత్రి స్దాయి వ్యక్తే అంత వేగంగా స్పందించినప్పటికీ కూడా విద్యుత్ పునరుద్దరణకి ఇంత సమయం పట్టిందంటే సమస్య ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. అంటే అత్యున్నత స్దాయిలో ప్రయత్నించినప్పటికీ కూడా విద్యుత్ పునరుద్దరణకి ఐదు రోజులకి పైగా పట్టే స్దాయి వ్యవస్ద మాత్రమే మనకు ఉందా? అంతకు మించి మెరుగైన వ్యవస్ద మనకి లేదా? అన్నది నా డౌట్... ఇదొక్కటే కాదు సమాచారం చేరవేయడంలో అత్యంత ముఖ్యమైన సెల్ ఫోన్ సిగ్నల్ సర్వీసును కూడా ఇప్పటి వరకు సరిదిద్దలేకపోయారు. ఆయితే ఇది ప్రెవేటు సంస్దల పరిధిలోని అంశం. ఆయితే సహయక చర్యల్లో ముఖ్యమైన అంశం కమ్యూనికేషన్ కాబట్టి సెల్ ఫోన్ సర్వీసు పునరుద్దరణ కూడా ముఖ్యమైన అంశమే....

ఇదే ఫీలింగును నిన్న మన ముఖ్యమంత్రి గారు ఈ క్రింద విధంగా వ్యక్తీకరించారు.

ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలదని అంటూ, ప్రస్తుత పరిస్దితులు తనకు సంతృప్తికరంగా లేవని, ప్రభుత్వం అనుకున్న తర్వాత కూడా పనుల్లో ఇంత అలస్యం జరగకూడదు”


సేమ్ నాకొచ్చిన ఫీలింగునే ముఖ్యమంత్రి గారు వ్యక్తీకరించడం చూసి నేననుకొన్నది నిజమే అనిపించింది. ప్రకృతి వైపరీత్యాలను మనం ఎలాగూ అదుపు చేయలేము. ఆయితే వాటి కారణంగా పాడయిన సర్వీసులను త్వరితగతిన చక్కదిద్దడానికి  అవసరమైన వ్యవస్దలను తయారుచేయడం ఎంత అవసరమో ప్రస్తుత పరిస్దితులు తెలియజేస్తున్నాయి. దీంట్లో భాగంగానే భూగర్బ విద్యుత్ లైన్ల వ్యవస్దను పరిశీలించడం చాలా ఉత్తమం. ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని ప్రధాన నగరాల్లో ఈ వ్యవస్ద అందుబాటులో ఉంది.  

ప్రకృతి వైపరీత్యాలు మనకు మాత్రమే కాదు కదా. మన కన్నా జపాన్, ఆమెరికా లాంటి దేశాల్లో ఇంత కన్నా భయంకరమైన వినాశానికి గురయిన సందర్బాలు ఉన్నాయి. ఆయితే అత్యంత ముఖ్యమైన సర్వీసులను గంటల్లోనే పునరుద్దరించగలిగే వ్యవస్దలు ఉండడం వలన వారు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను అధిగమించగల్గుతున్నారు.


కాబట్టి ఇప్పటికైనా మనం గుర్తించవలసినదేమంటే, వేగంగా స్పందించగలిగిన ప్రభుత్వాలు ఉన్నప్పట్టికీ అవసరమైనటువంటి సమర్ద వ్యవస్దలను కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యమే. 

Monday, 1 September 2014

మిమ్మల్లేల మరువగలము బాపూ...


సత్తిరాజు లక్ష్మినారాయణ అంటే అందరికి తెలియకపోవచ్చు గానీ,

బాపు అంటే తెలియని తెలుగువాడు ఉంటాడా?? ఒక వేళ తెలియదంటే ఆడు తెలుగోడే కాదంటాన్నేను...
ఆయినా మీరేమిటండీ బాపు గారు..... ఇలా తెలుగుబాషను, తెలుగువారిని ఆనాధలను చేసిఎల్లిపోవడం ఏ మాత్రం బాలేదు..

మొన్ననేగా రమణ గారిని కోల్పోయి బోలేడు బాధలో ఉన్నాము. పోనిలే మీరయినా ఉన్నారన్న భరోసా ఉండేది మాకు.. కానీ ఇప్పుడు రమణ గారి దగ్గరకి మీరు కూడా ఎల్లిపోవడం ఏమి బాలేదండి...
పదహరణాల తెలుగమ్మాయి ఎలా ఉంటుంది అని అడిగితే మీ కధానాయికని చూపిత్తే సరిపోతుంది కదా...

కధానాయిక స్నేహ అన్నా, చార్మి అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదండీ నాకు.. కానీ రాధాగోపాలం, సుందరకాండ చూసిన తర్వాత అహా..ఏమందం అనిపించకుండా ఉండలేకపోయా... దానికి కారణమేమిటంటారండీ... కేవలం మీ బొమ్మ కాబట్టేగా.....

“మడిసన్నాక కాసింత కలాపోసనుండాల” అని మీరు చెప్పించిన డవిలాగు ఇప్పటికీ అల్ టైమ్ ఫేమస్... ఆ డవిలాగుతోటే విలక్షణ నటుడైన రావుగోపాలరావు గారిని పరిచయం చేసిన ఘనత మీదే కదా!!

రేఖమాత్రముగానే గీసే మీ కుంచె చిత్రాలు ఒకటా, రెండా ఎన్నెన్ని విషయాలు చెప్పలేదు మాలోటివారికి... ఒక చిన్ని కార్టూన్ బొమ్మతో ఎన్నెన్ని కితకితలు పెట్టేవారండీ మీరు.... స్వాతి వారపత్రిక కానీ లేదా ఏ వారపత్రికలోనైనా మీ కార్టూన్ చూడగానే కింద పేరు చూడకుండానే మీ కుంచె నుండి జాలువారిన బొమ్మలను బట్టే చెప్పేసుకొనేవారము అది బాపూ గీసిన బొమ్మ అని.... ఒక మాట మాటడకుండానే బొమ్మతో కితకితలు పెట్టడం ఎవరికీ చేతనయింది బాపూ గారు... మీకు తప్ప....

ఎన్నెన్ని బొమ్మలండీ..మీ కుంచె నుండి రాలినవి... అన్నింటిలోనూ మాదుర్యమే.... దేవుళ్ళు, దేవతలు దగర నుండి అందాల నెరజాన వరకు.. ఒకటా, రెండా లెక్కేట్టుకోడానికి... వీటికి తోడు బుడుగు ఒకడు... ఏమి చెప్పమంటారు వాడు చేసే అల్లరి అంతా..ఇంతనా.......

ఇన్నిన్ని చేసి తెలుగువారిని కితకితలు పెట్టించి, నవ్వించి, ఇప్పుడు ఇలా ఏడిపించడం మీకు ఏ మాత్రం తగదండీ...

మీ రమణ గారు పోయినపుడు మీరేమన్నారు!! “నను గోడలేని చిత్తరును చేసి వెళిపోవాయా” అని..
మీరు ఇపుడు మీరు చేసిన పని ఏమిటండీ బాపుగారు... “తెలుగువారిని గోడలేని చిత్తరువును చేసి వెళ్ళిపోయార కదా”

శ్రీశ్రీ, అరుద్ర లాంటి లబ్దప్రతిష్టుల కాలములో నేను పుట్టలేదు కానీ, మీరున్న కాలములోనే నేను పుట్టానని నా తర్వాత తరం వారికి  గర్వంగా చెపుకోవచ్చుగా బాపూ గారు.... శ్రీశ్రీ, అరుద్ర గార్లు రాసిన రచనలు అందరికీ అర్ద్రం కాలేదెమో కానీ, మీరు పెట్టిన కితకితలు చిన్నపిల్లాడి దగ్గర నుండి పెద్దవయసు వారి వరకు అందరినీ నవ్వించడం చానా గొప్పండీ....


మీరు మీ రమణ గారితో కల్సి స్వర్గాన్ని కూడా కితకితలు పెట్టగలరు.. మీరు ఎలిపోయారంటే నమ్మబుద్దేయట్లేదండీ...