Wednesday 24 August 2011

పెళ్ళి గోల మొదలయ్యింది....

చాలా రోజులయింది నా అర్టికల్ పోస్ట్ చేసి.... యాక్చువల్ గా నేను చాలా సబ్జెక్ట్స్ అనుకొన్నా వ్రాయడానికి.... కాని ఎందుకనో గాని నా సిస్టమ్ లో దీనికి సంబందించిన సైట్ ఒపెన్ కాలేదు... ఇదుగో మరల ఇన్నాళ్ళ తర్వాత ఈ రోజు ఒపెన్ అయింది... సైట్ ఒపెన్ ఆయితే ఆయింది కాని నా మైండ్ మాత్రం ఒపెన్ కాలేదు... కాని ఏదోకటి వ్రాసేయాలని తాపత్రయం... తాపత్రయం కుదురుకు ఉండనివ్వదు కదా మన మనస్సుని.... ఏమి రాయాల అని ఆలోచిస్తుంటే ప్రొద్దున అమ్మ చేసిన ఫోన్ కాల్ గుర్తుకు వచ్చింది... ఎందుకంటే నా పెళ్ళి గురించట... పెళ్ళి అంటే ఏమిటొ ఇప్పటికి మనకు అంతుచిక్కడం లేదు... సో.. దీని మీద మనకున్న అభిప్రాయాలన్ని కలపి ఇందులో వ్రాసేద్దమని కూర్చున్నా..... ఇక చదవండి.... నాకెందుకో తెలియదు మొదట నుండి కూడా పెళ్ళి మీద పెద్దగా నమ్మకం లేదు... నమ్మకం లేని వాణ్ణి నోరు మూసుక్కొని ఊరుకోవచ్చు కదా.... ఊరుకోకుండా బంధువుల దగ్గర, సన్నిహితుల దగ్గర అడిగిన, అడగక పోయినా నేను పెళ్ళి చేసుకొను అని స్టేట్ మెంట్స్ ఇచ్చి పారేసాను.... అలాగే చూద్దామని కొంత మంది అన్నప్పటికి వాటిని ప్రక్కకు తీసిపారేశాను.. ఇంతకి పెళ్ళి మీద సదబిప్రాయం ఎందుకు లేదో మాత్రము సరయిన కారణం లేదు... అలా కాలముతో పాటు మన అభిప్రాయములు కూడా మారాయి. (కాలము మారకపోయినా మన అభిప్రాయలు మాత్రము స్దిరంగా ఉన్నట్టు?)... పెళ్ళి మీద సదభిప్రాయము లేదన్నను గాని ప్రేమ మీద సదభిప్రాయము లేదనులేదు కదా అని అనుకొని మా మరదలును ఇష్టపడ్డాను.... ఇష్టపడ్డాననే మాటే గాని ఎందుకు ఇష్టపడ్డానో సరయిన కారణం లేదు.. బహుశా అందరికి లవర్స్ ఉన్నారు. మనకు మాత్రము లేరు అని అనుకొని ఉంటా..... మనకు ఎప్పుడైనా ఒక స్దిర అభిప్రాయములు ఉంటే కదా........ మరి ఆ విషయము కుదురుగా ఒక చోట ఉండదు కదా.. అది పల్లమెరిగిన నీరు లాగా ప్రవహించి ఆ విషయము ఆ నోటా, ఈ నోటా అలా పాకి మా అమ్మ గారి వద్దకి వెళ్ళింది.... వెళ్ళిన తర్వాత వారు ఊరుకోరు కదా, ఒక దుర్మమహుర్తంలో నన్ను పిలిచి నా మరదలుతో పెళ్ళి గురించి కదిపారు.... ఇంతకు ముందు పెళ్ళి చేసుకొను అని కూసిన కారుకూతలు మర్చిపోయి, సరేనని అనడంతో తదనంతర పనులు మొదలెట్టడం లో మునిగిపోయారు.... కాని పెళ్ళి మాత్రం ఒక సంవత్సరము తర్వాతేనని కండిషన్... నాకు అందులో అభ్యంతరం కనిపించలేదు... కాని ఒక సంవత్సరము కాలము గ్యాపే నా కొంప ముంచుతుందని అనుకొలే.... ఎందుకంటే మధ్యలోకి మా తమ్ముడు దిగాడు.... దిగడమంటే ఏ ట్రైన్ నుండో బస్సు నుండో దిగడం కాదు.. నాకు, నా మరదలికు మధ్య ఉన్న సం.రమ్ గ్యాప్ లోకి దిగి మొత్తము రసాభస చేసేశాడు.... అంతే నాకు, నాతో పెళ్ళి కుదిరిన మరదలికి అండర్ స్టాండింగ్ కుదరక యు టర్న్ తీసుకున్నా(దీనికి మాత్రము సరయిన కారణముందిలెండి. అపరిపక్వ నిర్ణయము మాత్రము కాదు. ఆ స్టోరి చెప్పాలంటే సీరియల్ కధలు రాయాలి).. ఈ విషయాలన్ని మా అమ్మగారికి తెలియవు కాబట్టి, నేను తీసుకొన్న యు టర్న్ కి తాను కొద్దిగా ఫైర్ అయ్యారు... కొద్ది రోజులకు ఆ ఫైర్ సద్దుమణిగిందనుకొండి... ఇది జరిగిన తర్వాత మరల మనకి పెళ్ళి మీద ఉన్న ఆ కొద్దిపాటి ఇంప్రెస్ కూడా పూర్తిగా పోయింది... అంతే పెళ్ళి చేసుకోకూడదని మరల స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను... నాకు మాత్రం ఈ బ్యాచిలర్ లైఫ్ బెటర్ లా అనిపించింది..
ఎందుకంటే మంచి ఫ్రెండ్స్, రూమ్మెట్స్ ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది... కాని మేమందరము జీవితాంతం అలాగే ఉంటామంటే కుదరదు కదా... రూమ్మేట్స్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసము బయటకి వెళ్ళినప్పుడు పెద్దగా ఏమనిపించలేదు... అలాగే ప్రెండ్స్ కు మాత్రము నా అభిప్రాయాలే వాళ్ళకు ఉండాలని రూల్ లేదు కదా... ఉన్నదాంట్లో బెస్ట్ ప్రెండ్స్ అన్నవాళ్ళలో శ్రీకాంత్ పెళ్ళి చేసుకొని లండన్ వెళ్ళిపోయాడు.. పోనిలే వాడు లండన్ లో సంసారం తిప్పలు పడతాడులే అని సరిపెట్టుకొన్నా.. ఇంకొక ప్ర్రెండ్ గత రెండు సంరల క్రితమే ఒక అమ్మాయిని చూసుకొని పెళ్ళి కోసము ఎదురు చూస్తున్నాడు.. ఇంకొకడు ఎంగైజ్ మెంట్ చేసేసుకొని, ఈ రోజే ఫస్ట్ ఎంగైజ్ మెంట్ అన్యువెర్సరి అని పార్టి చేసుకుంటున్నాడట. ఆరు నెలలు తిరక్కుండనే నా బెస్ట్ జోస్త్ బాపూరావు కూడా పెళ్ళికి రెడి అయిపోయి, పెళ్ళి కూడా చేసేసుకున్నాడు.... పోనిలే అందరూ బాగుపడుతున్నారులే అనుకొన్నా..... నిజముగానే వాళ్ళందరూ బాగుపడ్డారు, పెళ్ళాలతో... నన్ను ఒక్కడు పట్టించుకుంటే ఒట్టు... పెళ్ళయిన వెధవలందరూ అంతే అని సరిపెట్టుకున్నా..... కాని మొదట నుండి అలవాటు ఆయిన ప్రెండ్స్ లేకపోయేసరికి మన షెడ్యుల్ మొత్తము తలక్రిందులయిపోయింది... నా మరదలుతో పెళ్ళి వద్దనుకున్నప్పుడు కూడా నా షెడ్యుల్ ఇలా తలక్రిందలవలేదు.... కాని చిన్నప్పటి నుండి అలవాటు ఆయిన షెడ్యుల్, ప్రెండ్స్ లేకపోయేసరికి తలక్రిందలయిందన్నమాట....
ఇప్పుడు చెప్పండి... నేను ముందులాగా పెళ్ళి చేసుకొను అనే నా మాటకి కట్టుబడి ఉండాలా.. లేక ఇంకొకసారి మరల మాట తప్పితే పోలా....
డైలమాలో ఉన్నా.... దానికి తోడు మా ఆఫీసులో ఒకటే రోద.... పెళ్ళెప్పుడని?? అడిగినా ప్రతివాడికి సమాధానము చెప్పలేక తిక్కరేగిపోతుంది.... ఆయినా నా వయస్సు ఇప్పుడు ఎంతని... జస్ట్ ఇరవై తొమ్మిది.... ఇరవై తొమ్మిదా అని నోరు వెళ్ళబెట్టకండి... నా దృష్టిలో అది ఎక్కువ కాదని నా అభిప్రాయము. కాలము ఎంత విచిత్రం చూడండి.... అప్పుడు అడగని ప్రతి ఒక్కడికి చెప్పేవాడిని, పెళ్ళి చేసుకొనని.... కాని ఇప్పుడు ప్రతి ఒక్కడు అడుగుతున్నా చెప్పడానికి తిక్కరేగుతుంది..... ఏమి చేస్తాం కలికాలం.... ఇప్పటికి కూడా కన్ ప్యుజ్ లో ఉన్నాను పెళ్ళి చేసుకోవడం గురించి... ఎప్పటికి వస్తుందో క్లారిటి.,... మరి మనకు క్లారిటి వచ్చేవరకు ఇంట్లో ఆగరు కదా.... అందుకే ప్రొద్దున మా అమ్మగారు ఫోన్.... అర్జంటుగా పోలిస్ స్టేషన్ లో దొంగలకి నాల్గు ప్రక్కల నుంచి తీసిన పోటోస్ తరహాలో పూల్ పోటొ ఒకటి, ఆఫ్ పోటొ ఒకటి, కూర్చున్నది ఒకటి, నిలబడినది ఒకటి తీసుకొని పంపాలట.... నెవ్వర్.. పంపే ప్రస్తక్తే లేదని తెగేసి చెప్పేసా.. ఆయితే సరే అని ఫోన్ పెట్టేసారు.. ఆశ్చర్యం. కొద్దిసేపు బ్రతిమాలతారేమో అనుకున్నా... అబ్బే.. బ్రతిమాలలేదు... ఏంటొ బొత్తిగా నన్ను ఎవరు అర్దం చేసుకోవడం లేదని ఒకటే బాధ.... అదేంటిరా బాబు వీడికి వెళ్ళి చేయకూడదని మా ఇంట్లో కూడా ఫిక్సయిపోరా ఏంటి అని బెంగ మొదలయింది నాలో....
ఆయితే పెళ్ళి విషయములో నాకు క్లారిటి వచ్చే వరకు ఆగాలా?? లేక పెళ్ళి చేసుకొని క్లారిటి తెచ్చుకోవాల అని అర్దం కావట్లేదు.....

Tuesday 16 August 2011

పుట్టినరోజు జరుపుకొని అన్నాహజారే అవినీతికి పాల్పడరట... మరి మన రాజకీయ నాయకుల సంగతి ఏంటి???

    ఆవును నిజమండి.. నిన్న ఈనాడు పేపరులోని వార్త ఇది.. పటిష్ట జనలోక్ పాల్ బిల్లు కోసము ప్రభుత్వమును ముప్పతిప్పలు పెట్టిన అన్నాహజారే ని దారిలోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తన విచక్షణాధికారాలను ఉపయోగించి అన్నాహజారె నేతృతంలో జరుగుతున్న ట్రస్ట్ ల లావాదేవిలను పరిశీలించి నిగ్గుతేల్చిన అవినీతి ఇది. అన్నాహజారే పుట్టినరోజుల వేడుకల నిమిత్తం ట్రస్ట్ సొమ్ము నుండి లక్షలు సొమ్ము ఖర్చు పెట్టరని కొండన్ త్వవ్వి ఎలుకను పట్టిన చందంగా కేంద్రం ద్వారా అదేశించబడిన కమిటి తేల్చింది.. అది తప్ప అన్నాహజారే మీద ఇక ఎటువంటి అవినీతి అరోపణలు లేవని కూడా తేల్చి చెప్పింది.. కేంద్ర ప్రభుత్వం వాదనల ప్రకారము అన్నాహజారే పుట్టినరోజు వేడుకలు నిమిత్తము ట్రస్ట్ సొమ్ము దుర్వినియెగం కావడం అవినీతి క్రిందకు రావడమైతే, తమ ప్రభుత్వంలోని ఉన్న అశేష మంత్రులు, మరియు పార్లమెంటేరియన్ల విచ్చలవిడి అధికార దుర్వినియెగం ఏ అవినీతి పరిధిలోకి వస్తుందో చెప్పితే ఇంకా బాగుండును కదా.... ఈ రోజు ఏ రాజకీయ నాయకుడైన ప్రభుత్వ ధనమును తన స్వంత అవసరములకు వాడుకోవడం లేదని నిక్కచ్చిగా చెప్పగలడా...... నన్ను అడిగితే అధికారములో ఉన్న రాజకీయ నాయకులు అధికారమును అడ్డుపట్టుకొని స్వంత వేడుకలు నిర్వహించుకొన్న అనేక సందర్బాలను ప్రస్తావించగలను.... మరి ఆ అవినీతిని అసరాగా తీసుకొని ఆ రాజకియ నాయకులందరి మీద అవినీతి ఆరోపణలు చేసి చర్యలు తీసుకొనే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి ఉందా??


లోకంలో ఏ వ్యక్తి ఆయిన ఏదో ఒక సందర్బంలో తప్పు చేయకపోడు... అది మానవ నైజం....
అదే విధముగా అన్నా హజారే కూడా తప్పు చేసియుండవచ్చు.... ఆంత మాత్రానా అయన అవినీతి మీద పోరాటం చేయకుడదంటే ఎలా???
అంటే ఎవరన్న తప్పును నిలదీస్తే, దానిని సరి చేసుకోవలనది పోయి.. అతని తప్పుఒప్పులను వెతకడం ఏ సంస్కారము క్రిందకి వస్తుందో కేంద్ర ప్రభుత్వం వారే జాతిజనులకు సెలవివ్వాలి.
అవినీతిరహిత సమాజం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికే నిజమైన చిత్తశుద్ది ఉంటే, వారు అవినీతికి వ్యతిరేకంగా తాము చేసిన చర్యలు ద్వారా అన్నాహజారేని ఎదుర్కొండి... ఆయన ఆరోపణలకు ధీటుగా సమాధానమివ్వండి.... అలా చేయకపోగా తిరుగు ఆరోపణలు చేస్తున్నారంటే, వారికి జన లోక్ పాల్ బిల్లు తెచ్చే విషయములో చిత్తశుద్ది లేనట్లేగా....
అన్నా హజారే, బాబా రామ్ దేవ్ లను కట్టడి చేయడానికి వారి ఆధీనములొ ఉన్న సంస్దలపై దాడుల చేయించడంలో ఉన్న శ్రద్ద అవినీతి నిర్మూలనలో పెడితే, వెయ్యి మంది అన్నాహజారేలు, వెయ్యి మంది రామ్ దేవ్ లు వచ్చిన మిమ్మల్లి ఎవరు ఏమి చేయలేరు.....
ఎవరు ఏమి పీకుతారులే అనుకుంటే దానికి అన్నా హజారెలే అక్కరల్లేదు...... ఒక్క సామాన్య పౌరుడు చాలు. మిమ్మల్లి చరిత్రలో కలపడానికి.......

మట్టితో చేసిన వినాయక విగ్రహాలను పూజించండి.....


వినాయక చవితి పర్వదినానికి ఇంకా ఎన్నో రోజులులేవు... మన రాష్ట్రంలో వినాయక చవితిని అందరూ చాలా భక్తిశ్రద్దలతో కొలుస్తారనే సంగతి అందరికి తెలుసు.. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉత్సహముగా చేస్తారు ఈ పండుగని. మా చిన్నప్పుడు వినాయక చవితి కోసము చాలా అతృతగా ఎదురుచూసేవాళ్ళం.. ఎందుకంటే సం.లో జరిగే ప్రతి పండుగలోని చిన్నపిల్లల భాగస్వామ్యం ఉండదు.. కాని వినాయక చవితి పూజలో మాత్రము చిన్న, పెద్ద వాళ్ళ బాగస్వామ్యంలో జరుగుతుంది. వినాయక చవితికి పది రోజుల ముందుగానే మేము పండుగకు కావలసిన వాటికోసం సిద్దపడేవాళ్ళం... ముందుగా విగ్రహం కోసము ఊరి చివర పోలాలలో ఉండే చెరువులోని బంక మట్టిని తెచ్చి సాధ్యమయినంతలో వినాయక విగ్రహాన్ని తయారుచేసి, గట్టి పడడం కోసము ఎండలో ఎండపెట్టేవాళ్ళం. ఆ తర్వాత వినాయక మందిరం ను ఊరిలో ఉన్న కంసాలి దగ్గర తయారుచేయించేవాళ్ళం. దాని కోసము కావలసిన చెక్కలను ఇంట్లోనే సేకరించేవాళ్ళం. ఆ విధముగా తయారయిన మందిరమునకు రంగుల కాగితాలంటించి అందంగా తయారుచేసేవాళ్ళం..

ఇక పండుగ రోజు నాడు హడవిడి అంతా మాదే. ఇంట్లో అందరూ కూర్చుండడానికి అనువైన స్దలమును ఎంపిక చేసుకొని అక్కడ మందిరం పెట్టి వినాయకుడిని అరాధించేవాళ్ళం. రోజు ప్రొద్దున, సాయంత్రం పూజలు చేసి నైవేద్యం సమర్పించేవాళ్ళం. అలా తొమ్మిది రోజులు శ్రద్ద్దగా చేసిన తర్వాత వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళం.. మేమే కాక ఊళ్ళో అలా చాలా మంది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేవాళ్ళం.. అవన్ని మట్టితో చేసిన విగ్రహాలు కావడం మూలంగా కరిగిపోయి, చెరువులు కలుషితం కాకుండా ఉండేవి.. కాని ఇప్పుడు వినాయక విగ్రహాలన్ని హనికర పదార్దలతో తయారవడం వలన మరియు అవి కరిగే గుణం లేకపోవడం వలన చెరువులు, నదులు ఆ విగ్రహాలతో నిండిపోయి కలుషితం ఆయిపోతున్నాయి. మరియు ఆ నీళ్ళు త్రాగడం వలన, వాడడం వలన అనేక జబ్బులు అంటుకుంటున్నాయి. మరియు మనము ఎంతగానే అరాధించే ఆ విగ్రహాలను నిమజ్జనం తర్వాత ఆయా నదుల, చెర్వులలో తేలియాడుతూ ఉంటే చూడలేకపోతున్నాము... కాబట్టి నా తోటి సహోదరులందరికి ఇదే నా విన్నపం.... దయచేసి అందరూ ఈ వినాయక చవితికి మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజిద్దాం. పర్యావరణమును రక్షించుకోవడానికి మనము ఈ మాత్రము పని ఖచ్చితముగా చేయాలి. పర్యావరణానికి హనికరము కాని రీతిలో మట్టి చేసిన విగ్రహాలను వాడడం వలన అటు మనకి, ఇటు దేవుడికి ఉపయెగమే......

Sunday 14 August 2011

రెపరెపల నా మువ్వన్నెల జెండా......

చూశారా నా దేశ మువ్వన్నెల జెండా ఎలా ఠీవిగా నిలబడి రెపరెపలాడుతుందో....
ఆవునండి ఏ దేశ జెండాలతో పోల్చి చూసిన నా జెండా ప్రత్యేకతే వేరు.....
ఎందుకంటే అది నా దేశ సౌర్వబౌమ్వతమును ప్రతికగా నిలిచే మువ్వన్నెల జెండా.......
నా దేశమునకు ఉన్న అత్యంత పురాతనమైన మరియు అద్బుతమైన ఘనమైన చరిత్రను ప్రతిబింబిస్తుంది......
నా దేశమునకు చెందిన మహనుభావుల ఉనికిని చాటి చెప్తుంది..........
అత్యంత పురాతన హిందు చరిత్ర ఉనికి నా దేశములోనే.......
రామాయణ, మహ భారత గాధలు జరిగింది నా దేశములోనే.......
గణితశాస్త్రంలో సున్నా విలువను రచించిన ఆర్యభట్ట నా దేశమున పుట్టినవాడు.........
ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను ఆనాడే స్దాపించిన ఆశోకుడు నా దేశమును ఏలినవాడు......
అన్ని మతాలను సమానంగా స్వీకరించి లౌకిక రాజ్యముగా విరసిల్లితున్న ఏకైక దేశం నా దేశమే.....
ఒక గౌతమ బుద్దుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక శివాజి, ఒక పురుషోత్తముడు, ఒక గాంధీజి, ఒక నేతాజి సుభాష్ చంద్రబోస్, ఒక అల్లూరి సీతరామరాజు, ఒక కందుకూరి వీరేశలింగం వంటి మహామహులు బాసిల్లినది నా దేశములోనే.......
ఇన్ని సౌభాగ్యములతో అలరారుతున్న నా దేశ మువ్వన్నెల జెండా ఎందుకు ప్రత్యేకముగా ఉండదు.........
నా దేశమునకు ఉన్న అద్బుతమైన చరిత్రే నా మువ్వన్నెల జెండాలోని వెలుగును ప్రతి భారతీయుడి గుండెల్లో పదిలంగా ఉంచుతుంది......
నేను నా దేశమును ప్రేమించుచున్నాను....
నేను భారతీయుడయినందుకు గర్వపడుతున్నాను..........

Monday 8 August 2011

స్నేహితులు కోసము ప్రత్యేక దినోత్సవం అవసరమా??...


ఏటా అగష్టు నెలలో మొదటి ఆదివారము స్నేహితుల దినోత్సవము జరుపుకుంటున్న మన వాళ్ళకి, అసలు ఆ రోజును ఎందుకు స్నేహితుల దినోత్సవముగా జరుపుకుంటున్నారో మనలో ఎంత మందికి తెలుసు??? తల్లిదండ్రులు మనము ఎంచుకోలేము.. ఎందుకంటే అది దేవుడి నిర్ణయము.. అదే విధముగా బంధువులను కూడా మనము ఎంచుకోలేము.... కేవలము మన స్నేహితులను మాత్రమే ఎంచుకోగలము... అందుకే స్నేహితుల ఎంపికలో పూర్తిగా మన ఇష్టాలకనుగుణంగానే ఎంచుకొంటాము.... స్నేహము యొక్క విలువ ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య గల నమ్మకమును బట్టి ఉంటుంది... కొంత మంది స్నేహితులకు చాలా విలువనిస్తారు... కొంత మంది స్నేహితులను తమ కాలక్షేప అవసరముల కోసము ఉపయెగించుకొంటారు... కాని నాకు తెలిసి స్నేహితుడు లేని వ్యక్తులు ఉండరు.... ప్రతి ఒక్కరూ స్నేహమనే మధురనుభూతిలో ఈదితీరతారు...
అటువంటి స్నేహానికి సం.రం.లో ఒకరోజు కేటాయించుకొని విషెస్స్ చెప్పుకొంటే దాని విలువ పెరిగిపోతుందా........ పెరగదు.... ఇదే కాదు తల్లిదండ్రుల దినోత్సవము, పిల్లల దినొత్సవములు జరుపుకోవడం మన సంపద్రాయం కాదు... ఎందుకంటే పైన ఉదహరించిన వారందరూ మన భారత సంస్కృతిలో భాగముగా మన డైలీ జన జీవనంలో భాగము..... కాని పాశ్చాతులు మాత్రము అలా కాదు.... వారికి మనలాగా కుటుంబంలతో కలసియుండరు...... అందుకని ప్రత్యేకముగా దినోత్సవములు ఏర్పరచుకొని ఆ రోజున తల్లిదండ్రులతో కలసి ఆనందిస్తారు..... అదే విధముగా ఏర్పడినదే స్నేహితుల దినోత్సవం... ఈ దినోత్సవానికి మూలకారణం....1935 సం.లో ఆగష్టు నెలలో మొదటి శనివారం నాడు ఆమోరికా ప్రభుత్వం ఒక వ్యక్తిని కాల్చి చంపింది. అది జరిగిన మరునాడు మరణించిన ఆ వ్యక్తి యొక్క స్నేహితుడు దానికి నిరసనగా అత్మహత్య చేసుకొన్నాడు. అతని సంస్మరణార్దం ఆగష్టు నెల మొదటి ఆదివారమును స్నేహితుల దినోత్సవంగా పరిగణించి వేడుకలు చేసుకుంటున్నారు..... కాని దానిని మన వాళ్ళు పక్క వ్యాపార అంశంగా మార్చివేసి సొమ్ము చేసుకుంటున్నారు... యువతలో ఉన్న పిచ్చిని చాలా దారుణంగా క్యాష్ చేసుకుంటున్నాయి.... దానికి మనవాళ్ళు ఎప్పుడొ అలవాటు పడిపోయారు.... పాశ్చాతులు ఏమి చేస్తే అదే ఫ్యాషన్ అనే భ్రమలో ఉన్నంతకాలము బహుళ జాతి కంపెనీలు ఇలా ఏదో ఒక దినోత్సవమును క్రియేట్ చేసి ప్రజల జేబులు గుల్లకొడుతునే ఉంటాయి......

Friday 5 August 2011

రాహుల్ పర్యటనల నుంచి స్పూర్తి పొందవచ్చునేమో....

కాంగ్రెసు పార్టి యువరాజు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో పార్టికి తిరిగి పునరవైభవం తేవడానికి చేస్తున్న విసృత్త పర్యటనలు ఈ మధ్య న్యూస్ లో అడపాదడపా వస్తున్నాయి... ముఖ్యంగా తన పర్యటనల్లో హంగులు ఏమి లేకుండా సాదాసీదాగా, పైగా అధికార వర్గాలకు ఎవరికి తెలియకుండా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన మంచిదే.. ఎందుకంటే అధికారముకముగా వెళ్ళే పర్యటనల వలన సామాన్య జనాల మనస్సుల లోతుల్లోకి వెళ్ళలేమనే భావనతో సాదాసీదగా వెళ్ళడం అభినందనీయమే...  ముఖ్యంగా దేశప్రధాని కాబోయో వ్యక్తి ఈ విధముగా క్షేత్రస్దాయి విషయాలలో అవగాహన పెంపొందించుకోవడం, తదనంతర కాలములో అ పర్యటనల అనుభవాలు ఉపయెగపడవచ్చు... ఈ పర్యటనలను మిగతా రాజకీయ పార్టిలు రాజకీయ లాభాలు కోసం చేసే జిమ్మికులుగా వర్ణించడం జరిగింది.. అందులో కొంత వరకు నిజము ఉండోచ్చు.. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ లో పార్టి బలోపతం కోసమే ఈ పర్యటనలు చేస్తున్నారని అనుకోవచ్చు.... స్వలాభము కోసము చూసుకొనే సమయములో ప్రజల అవసరములు తెలుసుకోవడంలో తప్పు లేదు కదా..... దీని వలన అటు ప్రజలు సమస్యలు తెలుసుకోవచ్చు, అటు తన పార్టి ప్రతిష్టను పెంచుకోవచ్చు.... ఈ రోజు ఉన్న చాలా మంది రాజకీయనాయకులు చాలా అరుదుగా మాత్రమే ప్రజల్లోకి వెళ్ళుతున్నారు... పైగా ఏ రాజకీయ నాయకుడు కూడా తమ ప్రాంత ప్రజల అంక్షాకలను కనీస స్దాయిలో కూడా తీర్చలేకపోతున్నారని మోజారిటి ప్రజల అభిప్రాయం. కాని రాహుల్ గాంధీ మాత్రం డైరెక్టుగా ప్రధాని పీఠం అధిరోహించే అవకాశము ఉన్నప్పటికి, దాని కోసము ఆరాటపడకుండా, పూర్తి స్ధాయి అనుభవం కోసము కష్టపడడం నాకు చాలా నచ్చింది... పైగా తనకు తాను పెద్ద రాజకీయ సెలబ్రిటి అని ఊహించికోకుండా, పార్టికి సాధారణ కార్యకర్తగా మెలగడం అతని పట్ల నేటి యువతలో చాలా మందికి గౌరవ భావం ఉంది.... అతని జీవన విధానము కూడా చాలా సాదాసీదగా ఉంటుంది.... అతని పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నప్పటికి మనకు అనవసరం.. కాని అతను ప్రజల్లో ఉన్నప్పుడు తన బిహేవియర్ విషయములో తగు శ్రద్ద తీసుకొంటాడు... అతని నుండి దేశములో ఉన్న యువ రాజకీయనాయకులు స్పూర్తి పొంది, వారందరూ ప్రజల్లోకి వెళ్ళగలిగితే అంత కన్నా దేశానికి కావలసినదేమున్నది.... రాహుల్ గాంధిని పొగుడుతున్ననని మీరు నన్నేదో కాంగ్రెస్ వాదినని అనుకొవద్దు.. నేను కేవలం అతని రాజకీయ మరియు జీవన శైలి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను..... కాని రాహుల్ గాంధీ ఈ పర్యటనలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా జరిపితే ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకోవచ్చు.... కేవలం ప్రతిపక్ష పార్టి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే పర్యటనలు చేయడం వలన దేశ యువత మనసుల్లో పూర్తి స్దాయి స్దానము సంపాదించుకోలేకపోతున్నారు.... ఏది ఏమైనప్పటికి నేటి పార్లమెంటియన్లలో రాహుల్ గాందితో పాటు చాలా మంది యువ రాజకీయ నాయకులున్నారు... వారందరిని కలుపుకొని రాహుల్ గాంధి తన పర్యటనలను విస్త్రతపరచగలగితే, ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలకు ఎంతో కొంత పరిష్కారము కనుగొన్నట్టే....

Wednesday 3 August 2011

భృష్టుపట్టిన రాజకీయాలు(తయారి: భారతీయ ప్రజల ద్వారా)...



కర్ణాటకలో తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగ స్పూర్తిని మంటగలిపేలా ఉన్నాయి. ప్రజాపాలకులు రాష్ట్ర అవసరములు, ప్రజల అవసరముల కోసము కాకుండా స్వంత అవసరములు కోసము రాజకీయక్రీడల్లో మునిగిపోవడం బహుశా మన దేశములోనే ఉంటుందేమో... లోకాయుక్త అభిశంసనతో బలవంతంగా పదవి త్యాగము చేయవలసి వచ్చిన యడ్యురప్ప, తదనంతరం జరిగిన సంఘటనలతో దేశములో తన రాష్ట్ర పరువు నవ్వులపాలవుతుందన్న ఇంగీత సృహ కూడా లేకుండా ఆడిన రాజకీయ క్రీడను జాతి జనులందరూ అస్యహించుకొనేలా చేసారు. కర్ణాటకలో భారతీయ జనతాపార్టి అధికారములోకి తీసుకురావడానికి యడ్యూరప్ప కృషిని మర్చిపోలేకపోవచ్చు.. అవకాశవాద రాజకీయాలతో విసిగిపోయిన కర్ణాటక వాసులు గత ఎలక్షన్ ల్లో నిబద్దత కల్గిన యడ్యూరప్పను గద్దెనెక్కించారు.. కాని ఆయన కూడా అవకాశవాద రాజకీయాలకు అతితుడుని కానని నిరూపించుకొన్నారు.. లోకాయుక్త అభిశంసన తర్వాత కూడా అధిష్టానం కోరితేనే కాని తనంతాట తాను రాజీనామాకు అంగీకరించని యడ్యూరప్ప భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఎటువంటి సందేశం ఇవ్వదలచారు?? ఆ రాజీనామా చేయడానికి తనకు అమోద యెగ్యమైన డిమాండ్లును పెట్టడం ఏ విధముగా సహేతుకం.. కర్ణాటక పౌరుడిగా తన రాష్ట్రానికి ఎవరైతే తన తదనంతరం ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలో ఆలోచించడం మాని, తన స్వంత ప్రయోజనాలకు ఇబ్బంది కలగని రీతిలో నడిపిన రాజకీయ జూదం ఏ విధముగా సమర్దనీయము....ఈయన గారిది ఒకెత్తు అయితే గాలి సోదరులది ఇంకొకెత్తు... ఇప్పటి వరకు యడ్యూరప్ప వర్గంలో ఉన్న గాలి సోదరులు, ఆగ్రనేత అద్వాని జగదీష్ షెట్లర్ కి అనుకూలముగా ఉన్నారని తెలియగానే రాత్రికి రాత్రే అవతలి పక్షంలోకి ప్లేటు ఫిరాయించడం అవకాశరాజకీయాలలో పరాకాష్ఠకి అర్దం పడుతుంది... ఇలాంటి రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించిన కాలము ఇలాంటి నీచరాజకీయాలను మనము భరించవలసియుంటుంది... ఏనాడైతే మనము మారాగలమో ఆ రోజే మన వ్యవస్దలో మార్పు రాగలదని ఖరాఖండిగా చెప్పగలను... ఈ అర్టికల్ చదివిన వారందరూ ఒక్కసారి ఆలోచించండి.... మీరు మీ రాజకీయ నాయకులను ఎన్నుకొనే ముందు భవిష్యతుని ఆలోచించండి... అంతేకాని పార్టి మీద అభిమానంతోనో, లేక ఆ వ్యక్తికి గల వ్యక్తిగత చరిష్మాతోనో ఓటు వేయవద్దు... ఏ పార్టి ఆయిన అతని నిజాయితిని అంచనా వేయండి..... మనము ఏ రోజయితే సరయిన నేతను ఎన్నుకోవాలని అనుకున్నామో, అటోమేటిక్ గా మిగతా ప్రాంతాలలో ఆ మార్పు తప్పక కనబడుతుంది.... ముందుగా మీ ప్రాంతంలో సరయిన నాయకుడ్ని ఎన్నుకొండి..... మీరు నిజాయితిగా ఉంటే, మిగతావారందరూ నిజాయితిగానే ఉంటారు..... ఆలోచించండి.... మనము నిజాయితిగా ఉండకుండా అవతలి వాడు నిజాయితిగా ఉండాలంటే అది మూర్ఖత్వమవుతుంది..... నాకు తెలిసి ఓటర్లలో చాలా మంది మనలాంటి యువకులే ఉంటారు..... మనలాంటి యువకులందరూ కలిస్తే ఈ దేశ భవిష్యతునే మార్చగలము.... దాని కోసము మనము మన వ్యక్తిగత త్యాగాలను బలిపెట్టవలసిన అవసరము లేదు..... సరయిన నాయకుడిని ఎన్నుకుంటే చాలు...... ప్రతి ఎలక్షన్ లోను ప్రధాన రాజకీయ పక్షాలతో బాటుగా ఎంతో కొంత మంది స్వతంత్రులు కూడా పోటి చేస్తారు.... ప్రదాన పక్షాలలో పోటి చేసే ఆభ్యర్దులు చాలా మంది అవినీతిపరులే ఆయి ఉంటారు.... అటువంటప్పుడు మిగతా స్వతంత్రులలో నిజాయితిపరుడ్ని ఎంచుకోవచ్చు.... ఉదహారణకు గత ఎలక్షన్ లో పోటి చేసిన లోక్ సత్తా పార్టి అభ్యర్దులను సమర్దించవచ్చు...... మిగతా వారితో పోల్చితే లోక్ సత్తాలో చదువుకొన్న మనలాంటి యువకులుండడం దానికి గల సానుకూలంశం...... ఏది ఏమైనా ఓటు వేసే ముందు మీ స్వలాభాల గురించి ఆలోచించడం మాని,  మీ ప్రాంత అభివృద్ధి గురించి అలోచించడం ఉత్తమ పౌరుడి లక్షణం.... మీరందరూ ఉత్తమ పౌరులనే నేను ఖచ్చితముగా నముతున్నాను.... అవినీతి లేని భారతదేశాన్ని నిర్మించండి.

ఆలోచించండి....... మీ కోసము కాదు.... మీ దేశ భవిష్యత్తు కోసము......


Tuesday 2 August 2011

మనశ్శాంతి లేక....


చాలా
రోజులయింది మరల బ్లాగు ప్రపంచంలోకి వచ్చి.... పని భారము వలన మరియు నా మనసు బాగాలేకపోవడం వలన మధ్య బ్లాగులోకి రావడానికి కుదరలేదు... ఆయిన నా ఆర్టికల్స్ కోసము వెయిట్ చేసేంతటి ఫాలోయింగ్ నాకు లేదు... అర్టికల్ వ్రాసేనాటికి కూడా నాకు సరయిన మనశ్శాంతి లేదు.... దేనిమీద శ్రద్ద పెట్టలేకపోతున్నాను.. కేవలం మనసు నిండా ఉన్న అనిజి భావన కారణముగా సతమవుతున్నాను.... అందుకనే సడెన్ గా నాకు అనిపించింది.... అది ఏంటంటే మనశ్శాంతి కావాలంటే దానికి కొలమానం ఏమిటి అని?? ఎంత ఆలోచించిన దానికి సరయిన కొలమానాలు ఉండవని అనుకుంటున్నాను.... ఎందుకంటే అది వ్యక్తి యొక్క మానసిక స్దితి మీద ఆధారపడి యుంటుందని నా అభిప్రాయము...నాకు బ్యాంకు బాలెన్స్ కి ఇబ్బంది లేదు... గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాను... స్నేహితులున్నారు.. ఆయినప్పటికి నాకు మానసిక ప్రశాంతత సాధించలేకపోతున్నాను. అసలు మానసిక ప్రశాంతత అనేది ఎలా సాధించాలో తెలియక సతమవుతున్నాను... మధ్య చాలా పుస్తకాల్లో చదివాను నేటి యువత ఎక్కువగా డిప్రెషన్ తో భాదపడుతున్నరని.... అది చదివినప్పుడు అనుకున్నాను... ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు ఎవరైనా డిప్రెషన్ కి లోనవుతారు కదా... దానికి యింతంత అర్టికల్స్ వ్రాయడం అవసరమా అని... కాని ప్రాబ్లెమ్ ఏంటొ నాకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది... నాకైతే ఇప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లెమ్స్ లేవు.... కాని డిప్రెషన్ లో ఉన్నాననిపిస్తుంది.... నా డిప్రెషన్ నన్ను ఎక్కడికి తీసుకుపోతుందో చూడాలి...
ఇలాంటి
చెత్త పోస్ట్ వ్రాసి మీ అముల్యమైన టైమ్ ని వేస్ట్ చేశానని భావిస్తే క్షమాపణలు కోరుకుంటూ........