వినాయక చవితి పర్వదినానికి ఇంకా ఎన్నో రోజులులేవు... మన రాష్ట్రంలో వినాయక చవితిని అందరూ చాలా భక్తిశ్రద్దలతో కొలుస్తారనే సంగతి అందరికి తెలుసు.. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉత్సహముగా చేస్తారు ఈ పండుగని. మా చిన్నప్పుడు వినాయక చవితి కోసము చాలా అతృతగా ఎదురుచూసేవాళ్ళం.. ఎందుకంటే సం.లో జరిగే ప్రతి పండుగలోని చిన్నపిల్లల భాగస్వామ్యం ఉండదు.. కాని వినాయక చవితి పూజలో మాత్రము చిన్న, పెద్ద వాళ్ళ బాగస్వామ్యంలో జరుగుతుంది. వినాయక చవితికి పది రోజుల ముందుగానే మేము పండుగకు కావలసిన వాటికోసం సిద్దపడేవాళ్ళం... ముందుగా విగ్రహం కోసము ఊరి చివర పోలాలలో ఉండే చెరువులోని బంక మట్టిని తెచ్చి సాధ్యమయినంతలో వినాయక విగ్రహాన్ని తయారుచేసి, గట్టి పడడం కోసము ఎండలో ఎండపెట్టేవాళ్ళం. ఆ తర్వాత వినాయక మందిరం ను ఊరిలో ఉన్న కంసాలి దగ్గర తయారుచేయించేవాళ్ళం. దాని కోసము కావలసిన చెక్కలను ఇంట్లోనే సేకరించేవాళ్ళం. ఆ విధముగా తయారయిన మందిరమునకు రంగుల కాగితాలంటించి అందంగా తయారుచేసేవాళ్ళం..
ఇక పండుగ రోజు నాడు హడవిడి అంతా మాదే. ఇంట్లో అందరూ కూర్చుండడానికి అనువైన స్దలమును ఎంపిక చేసుకొని అక్కడ మందిరం పెట్టి వినాయకుడిని అరాధించేవాళ్ళం. రోజు ప్రొద్దున, సాయంత్రం పూజలు చేసి నైవేద్యం సమర్పించేవాళ్ళం. అలా తొమ్మిది రోజులు శ్రద్ద్దగా చేసిన తర్వాత వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళం.. మేమే కాక ఊళ్ళో అలా చాలా మంది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేవాళ్ళం.. అవన్ని మట్టితో చేసిన విగ్రహాలు కావడం మూలంగా కరిగిపోయి, చెరువులు కలుషితం కాకుండా ఉండేవి.. కాని ఇప్పుడు వినాయక విగ్రహాలన్ని హనికర పదార్దలతో తయారవడం వలన మరియు అవి కరిగే గుణం లేకపోవడం వలన చెరువులు, నదులు ఆ విగ్రహాలతో నిండిపోయి కలుషితం ఆయిపోతున్నాయి. మరియు ఆ నీళ్ళు త్రాగడం వలన, వాడడం వలన అనేక జబ్బులు అంటుకుంటున్నాయి. మరియు మనము ఎంతగానే అరాధించే ఆ విగ్రహాలను నిమజ్జనం తర్వాత ఆయా నదుల, చెర్వులలో తేలియాడుతూ ఉంటే చూడలేకపోతున్నాము... కాబట్టి నా తోటి సహోదరులందరికి ఇదే నా విన్నపం.... దయచేసి అందరూ ఈ వినాయక చవితికి మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే పూజిద్దాం. పర్యావరణమును రక్షించుకోవడానికి మనము ఈ మాత్రము పని ఖచ్చితముగా చేయాలి. పర్యావరణానికి హనికరము కాని రీతిలో మట్టి చేసిన విగ్రహాలను వాడడం వలన అటు మనకి, ఇటు దేవుడికి ఉపయెగమే......
No comments:
Post a Comment