కాంగ్రెసు పార్టి యువరాజు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో పార్టికి తిరిగి పునరవైభవం తేవడానికి చేస్తున్న విసృత్త పర్యటనలు ఈ మధ్య న్యూస్ లో అడపాదడపా వస్తున్నాయి... ముఖ్యంగా తన పర్యటనల్లో హంగులు ఏమి లేకుండా సాదాసీదాగా, పైగా అధికార వర్గాలకు ఎవరికి తెలియకుండా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన మంచిదే.. ఎందుకంటే అధికారముకముగా వెళ్ళే పర్యటనల వలన సామాన్య జనాల మనస్సుల లోతుల్లోకి వెళ్ళలేమనే భావనతో సాదాసీదగా వెళ్ళడం అభినందనీయమే... ముఖ్యంగా దేశప్రధాని కాబోయో వ్యక్తి ఈ విధముగా క్షేత్రస్దాయి విషయాలలో అవగాహన పెంపొందించుకోవడం, తదనంతర కాలములో అ పర్యటనల అనుభవాలు ఉపయెగపడవచ్చు... ఈ పర్యటనలను మిగతా రాజకీయ పార్టిలు రాజకీయ లాభాలు కోసం చేసే జిమ్మికులుగా వర్ణించడం జరిగింది.. అందులో కొంత వరకు నిజము ఉండోచ్చు.. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ లో పార్టి బలోపతం కోసమే ఈ పర్యటనలు చేస్తున్నారని అనుకోవచ్చు.... స్వలాభము కోసము చూసుకొనే సమయములో ప్రజల అవసరములు తెలుసుకోవడంలో తప్పు లేదు కదా..... దీని వలన అటు ప్రజలు సమస్యలు తెలుసుకోవచ్చు, అటు తన పార్టి ప్రతిష్టను పెంచుకోవచ్చు.... ఈ రోజు ఉన్న చాలా మంది రాజకీయనాయకులు చాలా అరుదుగా మాత్రమే ప్రజల్లోకి వెళ్ళుతున్నారు... పైగా ఏ రాజకీయ నాయకుడు కూడా తమ ప్రాంత ప్రజల అంక్షాకలను కనీస స్దాయిలో కూడా తీర్చలేకపోతున్నారని మోజారిటి ప్రజల అభిప్రాయం. కాని రాహుల్ గాంధీ మాత్రం డైరెక్టుగా ప్రధాని పీఠం అధిరోహించే అవకాశము ఉన్నప్పటికి, దాని కోసము ఆరాటపడకుండా, పూర్తి స్ధాయి అనుభవం కోసము కష్టపడడం నాకు చాలా నచ్చింది... పైగా తనకు తాను పెద్ద రాజకీయ సెలబ్రిటి అని ఊహించికోకుండా, పార్టికి సాధారణ కార్యకర్తగా మెలగడం అతని పట్ల నేటి యువతలో చాలా మందికి గౌరవ భావం ఉంది.... అతని జీవన విధానము కూడా చాలా సాదాసీదగా ఉంటుంది.... అతని పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నప్పటికి మనకు అనవసరం.. కాని అతను ప్రజల్లో ఉన్నప్పుడు తన బిహేవియర్ విషయములో తగు శ్రద్ద తీసుకొంటాడు... అతని నుండి దేశములో ఉన్న యువ రాజకీయనాయకులు స్పూర్తి పొంది, వారందరూ ప్రజల్లోకి వెళ్ళగలిగితే అంత కన్నా దేశానికి కావలసినదేమున్నది.... రాహుల్ గాంధిని పొగుడుతున్ననని మీరు నన్నేదో కాంగ్రెస్ వాదినని అనుకొవద్దు.. నేను కేవలం అతని రాజకీయ మరియు జీవన శైలి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను..... కాని రాహుల్ గాంధీ ఈ పర్యటనలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కూడా జరిపితే ప్రజల్లో విశ్వసనీయత సంపాదించుకోవచ్చు.... కేవలం ప్రతిపక్ష పార్టి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే పర్యటనలు చేయడం వలన దేశ యువత మనసుల్లో పూర్తి స్దాయి స్దానము సంపాదించుకోలేకపోతున్నారు.... ఏది ఏమైనప్పటికి నేటి పార్లమెంటియన్లలో రాహుల్ గాందితో పాటు చాలా మంది యువ రాజకీయ నాయకులున్నారు... వారందరిని కలుపుకొని రాహుల్ గాంధి తన పర్యటనలను విస్త్రతపరచగలగితే, ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్యలకు ఎంతో కొంత పరిష్కారము కనుగొన్నట్టే....
No comments:
Post a Comment