Wednesday 30 October 2013

చుక్కల్లో అమ్మాయిలు.... విలువల పతనంలో అబ్బాయిలు...

చాలా కాలం తర్వాత తీరిక దొరకడంతో మా ప్రెండ్ నాయుడు, నేను కలసి తీరిగ్గా టీ తాగుతూ కూర్చుని బాతాఖానీ మొదలుపెట్టాము...

రెండు నెలల క్రితమే మేముంటున్న రూమ్ ని ఇద్దరం ఖాళీ చేసేసి నేను కొత్తగా మొదలెట్టిన జీవితంలోకి, తనెమో ఊర్లోనే ఉన్న ఇంకొక ప్రెండ్ ఇంటికి మారిపోవడంతో మా మధ్య బాతాఖానీలకు సరైన సమయం కుదరలేదు....

ఇలా తన విషయాలు, నా విషయాలు చెప్పుకోవడం ఆయిన తర్వాత లోకాభిరామాయణం మొదలెట్టాము.. రాజకీయాల నుండి మొదలెట్టి అనేక అంశాలు మాట్లాడుకొన్నాము. అందులో తెలంగాణా, రాష్ట్ర విభజన గురించి చాలా వాదనలు జరిగాయి. ఇప్పుడున్న పరిస్దితుల్లో రాష్ట్ర విభజన గురించి, తెలంగాణా గురించి అసలు మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాను. ఇక మిగిలిన దాంట్లో ఈ మధ్యన హైదరబాద్ లో జరిగిన అభయ ఉదంతం గూర్చి చర్చ జరిగింది.... దీని పై ఈ పోస్టుని చాలా రోజుల క్రిందటే రాసాను. కానీ పోస్ట్ చేయలేదు. ఎందుకనో చేయాలనిపించలేదు.. ఈ రోజు దీన్ని చూసిన తర్వాత పోస్ట్ చేయాలనిపించి చేస్తున్నాను..

అభయ ఉదంతం గురించి బయటకు వచ్చిన తర్వాత రోజు మా ప్రెండ్స్ కొందరు, ఈ విషయమై మాట్లాడుతూ సదరు ఉదంతం విషయమై అమ్మాయిదే తప్పంతా అన్నట్టుగా మాట్లాడారు. స్టాప్ వేర్ ఉద్యోగాలు చేసుకొనే వాళ్ళు ఆఫీసు ఆయిపోయిన తర్వాత తిన్నగా ఇంటికి వెళ్ళిపోవడం మానేసి, రాత్రి వరకు షికార్లు, షాపింగులు అంటూ ఎవడు తిరగమన్నాడు అన్నట్టుగా వాదించారు. మరియు నాల్గు రోజుల వరకు పోలిస్ కంప్లైట్ యే ఇవ్వలేదు అన్నారు. అదే విషయం నాయుడు దగ్గర ప్రస్తావించాను...

అంటే ఏమి జరిగినా అమ్మాయిదే తప్పవుతుంది తప్ప, వెధవ పని చేసిన అబ్బాయిలది తప్పని మనకి అనిపించండం లేదా అని?  అర్దరాత్రి తిరగడం అమ్మాయిది మాత్రమే తప్పవుతుందా? అంటే అర్దరాత్రి అబ్బాయిలు ఏ విధంగా చేసిన అది సమ్మతం క్రింద లెక్క వస్తుందా?

నాయుడు కొద్దిగా నవ్వి, ఇందులో అమ్మాయిది, అబ్బాయిలది ఇద్దరిది తప్పే, అలాగని ఇద్దరిది తప్పు లేదు అన్నాడు...

నాకొద్దిగా కనుప్యూజ్ గా మరియు చిరాగ్గా అనిపించి, ఏంటింది అటూ, ఇటూ కాకుండా మాట్లాడుతున్నావు? ఇక్కడ తప్పంతా అబ్బాయిలది అని సృష్టంగా కనబడుతుంటే నువు అలా చెప్పడమేమి బాలేదన్నా....

అది కాదు బ్రదర్... మనం కాసేపు సమాజంలో ఉన్న వాస్తవ పరిస్దితుల గురించి మాట్లాడుకుందాం.. ఆ తర్వాత నీ అభిప్రాయం చెప్పు అన్నాడు.... సరే చెప్పు! అన్నట్టుగా తలాండిచించాను...


అబ్బాయి యుక్త వయసు వచ్చిన తర్వాత సరైన జోడి కొరకు చూస్తాడు.. కాదు ప్రయత్నిస్తాడు.. అది ప్రకృతి ధర్మం.. దానిని తప్పు బట్టలేము... అందుకే పూర్వ కాలములో యుక్త వయసు రాగానే అటు అబ్బాయికి, అమ్మాయికి పెళ్ళిళ్ళు చేసేసేవారు. అందుకే మన తాతల కాలములో అందరికి పదిహేను, పదహారు సం.లు నిండకుండానే పెళ్ళిళ్ళు ఆయిపోయాయి. అంత చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు కావడం వల్ల వారికి ప్రక్క దారి పెట్టే అవకాశం ఉండేది కాదు.

అలాగే ఏదైనా సందర్బంలో అమ్మాయి చనిపోతే, అతి కొద్ది సమయంలోనే మరొక అమ్మాయిని పెళ్ళి చేసుకోనేవారు తప్ప ఒంటరిగా మిగిలిపోయేవారు కాదు. ఎక్కడో ఒకరిద్దరు తప్ప... దాని వలన చాలా మందికి అమ్మాయి సానిహిత్యం కోసం ఎక్కడో వెతుక్కోవలసిన అవసరం ఉండేది కాదు... ఒక వేళ అంతగా కావలసి వచ్చిన పక్షంలో బయటకు వెళ్తే బోలెడన్నీ అవకాశాలు ఉండేవి... అంటే వేశ్య వాటికలకు వెళ్ళడం వంటివి.. ఆ రోజుల్లో ప్రతి ఏరియాకి  ఒక వేశ్య వాటిక ఉండేది...

దాని వలన ఒక మగాడు తన వాంచలు తీర్చుకోవడానికి ఇంట్లో ఇల్లాలు ఆయిన ఉండేది, లేకపోతే బయట వేశ్యవాటికైనా ఉండేది... దాని వలన బలత్కరాలు ఉండేవి కావు... అమ్మాయిలు అప్పుడు ఎక్కువగా స్వతంత్రంగా ఉండక పోవడం కూడా కొంత కారణం కాకపోవచ్చు. ఒక వేళ ఎక్కడికైనా వెళ్ళవలసివచ్చినా, తన తరపు బంధువులు ఎవరైనా రక్షణ లేకుండా బయటకు వెళ్ళేవారు కాదు.

రాను రాను తర్వాత కాలములో చాలా మంది పై చదువులకు వెళ్ళడం, మరియు విద్యాధికత పెరగడంతో యుక్త వయసులో పెళ్ళిళ్ళు జరగడం ఆగిపోయాయి. అలాగే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడటంతో వేశ్యావృత్తిని చట్టవిరుద్దంగా ప్రకటించడంతో క్రమంగా వేశ్యా వాటికలు కనుమరుగు ఆయిపోయాయి. ముందుగా అబ్బాయిలకు మాత్రమే ఉన్నత విద్య చదివించడానికి పెద్దవాళ్ళు ఒప్పుకోనేవారు. చదువయిపోయిన తర్వాత వారికి తగిన అమ్మాయిని చూసి సంబందాలు చేయడం చేసేవారు. చదువుకున్న వాళ్ళకే కాకుండా, చదువుకొననివారికి, వివిధ వృత్తుల్లో ఉన్న వారికి కూడా అమ్మాయిలు సమృద్దిగా దొరికేవారు. అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తి సరయిన రీతిలో ఉండడంతో ఎవరికీ పెళ్ళిళ్ళు కావడానికి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.

ఇక ఆ తర్వాత కాలములో అమ్మాయిలను కూడా ఉన్నత విద్య చదివించడానికి పెద్ద కుటుంబాలు ముందుకు వచ్చాయి. ఆ తర్వాతర్వాత మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలు కూడా తమ అమ్మాయిలకి ఉన్నత విద్యని అందుబాటులోకి తెచ్చారు.

గతములో వైద్య శాస్ర్తం అభివృద్ది అంతగా లేనందున, మరియు ప్యామిలీ ప్లానింగంటూ ఏమి లేకపోవడం వలన అబ్బాయి, అమ్మాయి అంటూ లింగ బేధం ఉండేది కాదు. ఎంత మందిని కనగలిగితే అంత మందిని కనేయడమే.....
తర్వాత కాలములో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందడం, ఫ్యామిలీ ప్లానింగులు రావడంతో అబ్బాయి, అమ్మాయి పట్టింపులు ఎక్కువయ్యాయి.  బిడ్డ పుట్టడానికి ముందే కడుపులో ఉన్న బిడ్డ లింగం తెలిసిపోతుండంతో అబార్షన్ లు ఎక్కువయ్యాయి... క్రమంగా అర్దిక భారం మరియు యితర కారణాల వల్ల అబ్బాయిలు మాత్రమే కావాలనుకొనే దంపతులు విపరీతంగా పెరిగిపోయారు. దాని ఫలితం అమ్మాయిల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం....

అమ్మాయిల సంఖ్య ఎప్పుడయితే గణనీయంగా తగ్గిపోయిందో, అప్పటి నుండి అబ్బాయిల పెళ్ళిళ్ళకి  వధువుల కొరత వచ్చింది. పైగా అమ్మాయిలను చాలా మంది తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించడంతో, అమ్మాయిలకు కూడా తమ భాగస్వామిగా నచ్చిన వ్యక్తిని ఎంచుకోనే స్వేచ్చ వచ్చింది. చదువుకున్న అమ్మాయిలు తమ భాగస్వామిగా తన కన్నా పై స్దాయిలో ఉన్న అబ్బాయిలనే కావాలని కోరుకుంటున్నారు...

దానితో మిగతా అబ్బాయిలు పెళ్ళిళ్ళ కోసం సాదాసీదా చదువులు ఉన్న పల్లెటురి అమ్మాయిల కోసం క్యూ కడుతున్నారు.. అమ్మాయిలకు కొరత రావడంతో పల్లెల్లో చదవకుండా ఉండిపోయిన అమ్మాయిలకు కూడా చదువుకున్న అబ్బాయిల నుండి గిరాకీ పెరిగింది. దానితో చదువుకోకుండా ఉండిపోయిన నిరుద్యోగులు, యితర వృత్తిల వారికి త్రీవమైన అమ్మాయిల కొరత వచ్చింది.... ఇక అమ్మాయిలు చుక్కల్లో చందమామే ఆయింది వీళ్ళకి.

వయసు ముదిరిపోతున్నా కూడా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఈ నాటికి పల్లెల్లో కుప్పలు తెప్పలుగా కనబడుతున్నారు. పెళ్ళి కాకుండా సొంత ఊళ్ళలో ఉండలేక హైదరబాద్, ముంబయి, చైన్నై లాంటి మహ నగరాలకు వలస పోతున్నారు. తమకి పెళ్ళి కాకపోవడం , లేదా అమ్మాయిల దొరకపోవడం అన్న విషయం వారిని ఒక రకమైన త్రీవమైన డిప్రెషన్ లోకి నెట్టేస్తుంది. పైగా పెళ్ళి కాకపోవడం అన్నదాన్ని సమాజంలో చిన్నచూపుగా చూస్తున్నారు.  దాని వలన వారు కనిపించే ప్రతి అమ్మాయి మీద ఒక రకమైన కక్ష లేదా దేహ్యభావం పెంచుకుంటున్నారు.  అందుకే చాలా చోట్ల అత్యాచార సమయంలో హింసాత్మకంగా ప్రవరిస్తున్నారు. ఆ విధంగా తమ దుస్దితిని, సమాజంపై ఉన్న దుగ్దను ఆ అమ్మాయిని హింసించడానికి ప్రేరేపిస్తుంది.

తర్వాత ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు సరాసరిగా ఉండేవారు. దానితో వారికి చిన్నప్పటి నుండి కుటుంబంలో ఉన్న అమ్మ, చెల్లి, అక్క, వదిన, మరదలు ఇలా అమ్మాయిలతో మానసిక అనుబంధం ఉండడంతో బయట ప్రపంచంలో అమ్మాయిల పట్ల చెడు అభిప్రాయాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఇద్దరు లేదా ఒకరు మాత్రమే సంతానం ఉన్న కుటుంబాలు వచ్చాయి. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆయితే పర్వాలేదు.  అదే ఇద్దరు అబ్బాయిలో లేదా ఒక్క అబ్బాయే సంతానమయితే, వాడికి ఆడపిల్లలతో అనుబంధమనేది లేకపోవడం/తెలియకపోవడం వలన బయటి ప్రపంచంలోని అమ్మాయిల పట్ల చులకనభావం ఉంటుంది. చిన్నప్పటి నుండి కుటుంబంలో సోదరి  ప్రాతినిద్యం లేకపోవడం వల్ల  బయటి ప్రపంచంలో అమ్మాయిలతో సరయిన అనుబంధం ఉండడం అరుదు... గౌరవించడం రాదు... అమ్మాయిలను గౌరవించడం అనేది మన కుటుంబం నుండే ప్రారంభం కావాలి.. కానీ అలా జరుగతుందా?

నైతిక విలువలు పతనమవడం. ఈ రోజు చాలా కుటుంబాల్లోని పెద్దలు తమ పిల్లలు ఏమి చేస్తున్నారు? ఏమి నేర్చుకుంటున్నారు? నైతిక విలువలు అబ్బుతున్నాయా? అన్న విషయాలను ఏ కోశానా పట్టించుకోవడం లేదు. దానితో పిల్లలకు నైతిక విలువలు భోదించేవారు, భయం చెప్పేవారే కరువయ్యారు. పోనీ కళాశాలలో, పాఠశాలల్లో గురువులు నైతిక విలువలు భోదిస్తున్నారా? అంటే అదీ లేదు... వాళ్ళల్లోనే నైతిక విలువలు దిగజారిపోయాయి. ఇక పిల్లలకు ఏమి చెబుతారు వాళ్ళు?

ఇక సినిమాలు, అంతర్జాలం.. యువతని పెడదారి పెట్టించడానికి కూతవేటు దూరంలో అన్ని రకములు సదుపాయలున్నాయి ప్రస్తుత కాలంలో...

ఇక అమ్మాయిలు గురించి.. చదువులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఐదంకెల జీతాల కొలువులు కెరియర్ ప్రారంభంలో సాధించడం... మెట్రో సిటిల్లో మెజారిటి భాగం  నైతిక ప్రమాణాలను గాలికొదిలేసి సహ జీవనం పేరు చెప్పి ఒకటి కన్నా ఎక్కువ మందితో కలిసి ఎఫైర్స్ నడపటం... పేజ్ 3 లైఫ్ స్టైల్ కి అలవాటు పడడం.... వంటివి కూడా కొంత వరకు ఇలాంటి దారుణాలు జరగడానికి దోహదం చేస్తున్నాయి. వీరిని చూసి మిగతా అమ్మాయిలు ఆకర్షితులవడం మొ.వి కూడా.... ఇలాంటి అమ్మాయిలను చూసి మొత్తం అమ్మాయిలందరూ అంతే అన్న భ్రమల్లో ఉన్నారు చాలా మంది అబ్బాయిలు. సిటిల్లో ఉన్నా అమ్మాయిలందరూ ఇలానే ఉంటారు అనుకునే వాళ్ళే ఎక్కువ.

ప్రస్తుత సమాజంలో ఉన్న అన్ని వ్యవస్దలు విఫలమవ్వడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఎవరిది తప్పు అని అడిగితే అటూ నైతిక విలువలు గాలికి వదిలేసిన అబ్బాయిలది తప్పు అని చెప్పోచు... లేకపోతే వారిని కని పెంచిన తల్లిదండ్రులుది తప్పు అని చెప్పోచ్చు... లేక వారిని ఆ విధంగా ప్రేరేపించిన మెట్రో సిటి లైప్ స్టైల్ అని చెప్పోచ్చు.... లేదా పెళ్ళికి లేదా అమ్మాయి సాన్నిహిత్యానికి నోచుకోని తమ దుర్బర పరిస్దితి కావోచ్చు.. ఇలా ఏదైనా కావచ్చు ఒక ఘోరం జరగడంలో ఉన్న పాత్ర గురించి....

కానీ చివరకు బలయ్యేది అభం, శుభం తెలియని ఆమాయక అమ్మాయిలు మాత్రమే....

ఇకపోతే అత్యాచార నిరోధాలకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ, దాని వల్ల జాగర్తపడతారు తప్పితే, వారిలో ఉన్న పశుప్రవృత్తి పోదు.

ఇప్పుడు చెప్పు ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అని అడిగాడు నవ్వుతూ నన్ను చూస్తూ.....

ఎంత పరిస్దితులు ప్రభావం ఆయితే మాత్రం నైతిక విలువలు పట్టించుకొనని అబ్బాయిలదే తప్పు” ఇందులో సందేహమే లేదు అంది నా అంతరాత్మ...... కానీ బయటకు ఏమన్లేదు....

మరి వీటికి విరుగుడు ఏమి లేదా? అని అడిగా....

ఉంది అన్నాడు!........ ఏమిటి అన్నట్టుగా నా పేసు కొశ్చన్ మార్కు?

వేశ్యావాటికలను ప్రభుత్వం చట్టబద్దం చేయాలి”” అప్పుడే కొంత వరకు ఫలితం ఉండొచ్చు అన్నాడు చిన్నగా కన్ను గీటుతూ.....

?????????????...........


MARD- MEN AGAINST RAPE DISCRIMINATION  వేదికపై ప్రఖ్యాత నటులు అత్యాచారాలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం నిజంగా అభినందనీయం...  ఇలాంటి చర్యలు మీడియా ద్వారా లేదా సోషన్ నెట్ వర్క్ సైటు ల ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ఎంతో కొంత మార్పును తీసుకురావచ్చని అనుకుంటున్నాను...


10 comments:

  1. దాని వలన ఒక మగాడు తన వాంచలు తీర్చుకోవడానికి ఇంట్లో ఇల్లాలు ఆయిన ఉండేది, లేకపోతే బయట వేశ్యవాటికైనా ఉండేది... దాని వలన బలత్కరాలు ఉండేవి కావు
    siggu lekapote sari deeni gurinchi goppa ga chepukovadaniki.naku okate anipistundi ila matlade valla intlo ilanti sanghatana okati jarigite kani vallaki ardham kadu ani.ayna appudu kuda ikkada bali ayyedi ammaye ayna kuda

    ReplyDelete
    Replies
    1. మీ వేదన అర్దవంతమే.. బలయ్యేది అభం, శుభం తెలియని అమాయక అమ్మాయిలే అని కూడా ఒప్పుకున్నాడు నా స్నేహితుడు... ఆ విషయము దిగువ పేరాలో రాసాను.....
      ఆయితే వాంచలు తీర్చుకోవడానికి మాత్రమే ఇల్లాలు లేదా వేశ్యలు ఉన్నారు అన్న విషయం నాకు కూడా ఎబ్బెట్టుగా ఉంది...

      Delete
  2. మీరీ రోజున మీ స్నేహితుడు కన్ను గీటుతూ చెప్పాడంతున్న దానిని చాణక్యుడు యెప్పుడో చెప్పాడు. కఠినంగా ఉన్నా అదే వాస్తవమయిన పరిష్కారం. కానీ పిల్లలు హాయిగా లెక్కలు చెయ్యగలిగే వేదగణితాన్ని ప్రవేశపెడతామంటేనే విద్యని కాషాయీకరించేస్తున్నారని లబలబ లాడిపోయే కమ్యునిష్టోళ్ళూ కాంగ్రెసోళ్ళూ పడనిస్తారా?

    ReplyDelete
  3. vesya vaatikallo tirigi aadavalle untaru kada.. mari vesya vaatikalanu chatta baddam cheyyadamante, mahilalanu chattabaddam ga EXPLOIT cheyyadame kada.. oka samsya ki pariskaram inkoka samasya kakudademo..

    ReplyDelete
  4. vesya vatikallo pani cheyyalisindi tirigi adavalle kada.. mari vesya vatikalanu chatta baddam cheyyadamahnte, mahilalalu chattabaddam ga EXPLOIT cheyyadame kada.. oka samsya ki pariskaram inkoka samasya kakudademo..

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. mee friend idea chethagaa undi.appudu knipinchina aadapillani vesya vaatikalaku tharalistharu.ammayilu gowravam utti padhe dress dharinchali.cinema llo heroine dresses nindugaa undaali. abbayilu samskaaram neervali.

    ReplyDelete
  7. ఈ పోస్టుతోకానీ.. మీ స్నేహితుడి వాదనతో గానీ ఏకీభవించలేను. ఆయన మామూలుగా చెప్పిన విషయాన్ని ఒకసారి లోతుగా ఆలోచిస్తే.. అది ఎంత అనర్థాలకు దారితీస్తుందో మీకే అర్థమవుతుంది.

    ఎవరు ఎన్ని శతాబ్దాల క్రితం పరిస్థితిని వివరించి చెప్పినా.. ఏ అమ్మాయీ వేశ్యా ప్రవృత్తికి సుముఖంగా ఉండుండదు. ఈ చిన్న ఆలోచనను మిస్ అవడం బాధగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. అను గారు,
      మీ బాధ అర్ద్రం చేసుకోగలను. అబ్బాయిల్లో నైతిక విలువలు పెరిగేలా చేయాలి. అందుకు గాను తల్లిదండ్రులు సరయిన నడవడిక నేర్పాలి. ఇది అత్యాచారాలను నిలువరించడానికి నేను ఇచ్చే సలహా...అంతే కానీ ఎన్ని కఠిన చట్టాలు అమలులో పెట్టినా ఉపయెగం లేదననేది నా ఉద్దేశం..\
      ఆయితే నా స్నేహితుడు వెలుబుచ్చిన అంశాలల్లో నిజం ఉందని అనిపించింది. ఆయితే దీనికి విరుగుడుగా అతని చెప్పిన సలహా సరయినది కాదు.
      నైతిక విలువలు అలవర్చుకోవడం/అలవాటు చేయడం ఒకటే దీనికి పరిష్కారం.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం..

      స్పందనకు ధన్యవాదములు..

      Delete