Monday 28 October 2013

వస్తున్నారు.. చూస్తున్నారు... వెళ్ళుతున్నారు...


పై చిత్రంను చూసారుగా......

“స్వాగతం...సుస్వాగతం.... 30వ వరద వార్షికోత్సహము... ప్రతీ సం.రం లాగే ఈ సం.రం కూడా మా E.B.C.కాలనీ వరదని తిలకించడానికి వస్తున్నా ప్రజాప్రతినిధులకు ఇదే మా స్వాగతం”..... అంటున్న వీరి కధ....

ఇది తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుండి కత్తిపూడి వెళ్ళె నేషనల్ హైవేకి అనుకొని ఉన్న గొల్లప్రోలు గ్రామం.  ఏ మాత్రం ఎడతెరిపి లేకుండా ఒక రోజంతా వర్షం పడిందంటే, వరదలు పొంగి పొరలి ఈ గ్రామములో గల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం ఆయిపోవడం ఎన్నాళ్ళ నుండో రివాజుగా మారింది..

వరదలు వచ్చి ఈ కాలనీ మునిగిపోయినప్పుడల్లా ప్రజాప్రతినిధులు వెళ్ళి పరామర్శించి రావడం, అధికారులు అప్పటికి పునరావసం కల్పించడం మినహాయించి శాశ్వత నివారణకి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు....

వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధికి, కనబడ్డ ప్రతి అధికారికి తమ గోడు చెప్పుకోవడం మినహాయించి వీరు ఏమి చేయలేకపోతున్నారు... అధికారులకు చేయాలంటే కొన్ని పరిమితులున్నాయి.. వాటిని తెంచుకొని చేయడమంటే మాటలు కాదు... కానీ అధికారాలన్ని తమ దగ్గర పెట్టుకొని కూడా వరద సమయాల్లో మాత్రమే కంటి తుడుపు చర్యగా ఇలా కనిపించి, అలా మాయమయిపోవడం పై గ్రామస్దులు తమ నిరసనని ఇలా తెలియజేసారు.

ఇది చూసాకైనా మన నాయకులు సిగ్గు తెచ్చుకుంటారంటారా???

ఏమో నాకైతే డౌటే...


1 comment:

  1. హహ..వ్యగ్యాస్త్రాలూ, మీ నిర్వచనం కూడా బాగున్నాయండీ :-)

    ReplyDelete