Sunday 19 January 2014

“నేనేక్కడినే” ఓ సైకలాజికల్ ట్రాష్....... కామెంటు రాస్తే పోస్టు ఆయింది.



శ్రీ రమణ గారు రాసిన “నేనేక్కడినే” ఓ సైకలాజికల్ ట్రాష్ ని ఇప్పుడే చదివాను. ఈ మధ్యన పోస్టులు పెట్టడానికి కాదు కదా, అసలు ఇతర బ్లాగులు చదవడానికి కూడా తీరిక ఉండడం లేదు. (మనలో మాట... నిజానికి బ్లాగింగ్ మీద ఇంట్రెస్టు తగ్గింది. దానికి కారణం నాలో రాయాలన్న అతృత తగ్గిపోయిందనుకుంటా)....


నేనొక్కడినే సినిమా గురించి మాట్లాడతానని చెప్పి ఈ చెత్తంతా ఎందుకు చెబుతున్నావ్ అని అడుగుతున్నారా? ఆయితే దానికి సమాధానం చెప్తా...

1.      స్వంతంగా పోస్టు రాయడానికి కావలసిన ప్రేరణను బొత్తిగా కోల్పోవడం మూలంగా. (అందుకే అరువుగా శ్రీ రమణ గారి పోస్టుని ఒక దాన్ని తీసుకొని దాని మీద రాసేస్తున్నాను)
2.      సుకుమార్ గారు మరియు ఆయన గురువు రామ్మెహనరెడ్డి గారి దగ్గర నేను చదివాను కాబట్టి.
3.      కామెంటు పెడదామని మొదలుపెట్టాను. కానీ ఇది ఒక పోస్టుకి సరిపడ తయారయింది. అందుకని పోస్టుగా పడేయాలని కమిట్ ఆయ్యాను.

సరే, ఇక ఆసలు విషయానికి వద్దాం... నేనొక్కడినే సినిమా గురించి శ్రీ రమణ గారు తనదైన శైలిలో చీల్చి చెండాడేసారు.. ఆయన రచన శైలి చాలా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమాలో గల డాక్టర్ గురించి మరియు హీరోనకు అంటగట్టిన జబ్బు గురించి వృత్తిరీత్యా సైకలిజిస్ట్ ఆయిన డాక్టరు గారు బాగా విశ్లేషించారు. ఆయితే ఇప్పటి సినిమాల్లో ఒక డాక్టరనే కాదు, అన్ని రకాల వృత్తుల వారిని హేళనగా చూపిస్తున్నారు. సినిమాలో వారు చూపించేదానికి, నిజ జీవితంలో ఆయా వృత్తుల వారు ప్రవర్తించే దానిని అసలు సంబంధమే ఉండదు. కానీ దానినే కామెడీగా భావించి పేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

డాక్టరు గారు ఇప్పుడు వస్తున్నా సినిమాలు చూసి సుమారు 20 సం.లు ఆయివుంటుంది.. ఈ మధ్యన వచ్చిన సినిమాలు చూసి ఉంటే ప్రస్తుత తెలుగు సినిమాల దుస్దితి తలచుకొని ఇక సినిమాల జోలికే రాకపోయియుండేవారు...

ఇక నా ఉద్దేశానికి వస్తే నేనేక్కడినే సినిమాలో  హీరోకి గల జబ్బు మరియు డాక్టర్ చెప్పిన రోగమొక్కటే కాదు పట్టించుకోదగ్గ లోపాలు చాలానే ఉన్నాయి.. ఈ సినిమాలోనే కాదు సినిమా ప్రస్దానం ప్రారంభయిన నాటి నుండి ఎక్కడో ఒకటో ఆరా తప్ప అన్ని సినిమాలు వాస్తవానికి దూరంగానే ఉంటాయి. పాటలు పాడుకోవడాలు, గాల్లోకి ఎగిరి ఎగిరి తన్నుకోవడాలు ఇలాంటివన్నీ కేవలం కామెడీ లేదా పేక్షకులను ధ్రిల్ ఫీలయ్యేలా చేయడం కోసమే తప్ప అవన్నీ జరగడానికి అస్కారం ఉందా లేదా అని ఆలోచిస్తే సినిమానే ఉండదు కదా....

అదే విధంగా సినిమాను హాలీవుడ్ స్దాయిలో తీసారని చెప్పుకోవడం ఎందుకు? తెలుగుతనం ఉట్టిపడని తెలుగుసినిమా హాలివుడ్ స్దాయి సాంకేతిక ఉంటే ఉపయెగం ఏంటి అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఆయితే ఇక్కడ సినిమాని హాలివుడ్ స్దాయిలో తీయలేదు. మన సినిమా సాంకేతికతే మెరుగయింది అని అనుకోవచ్చు.  
ఒక ఇరవై సం.ల క్రితం ఇంటర్ నెట్ అనేదే లేదు. సెల్ ఫోన్లు అనేవి అంతకన్నా లేనే లేవు. కానీ ఇప్పటికీ, అప్పటికీ ఎంత తేడా వచ్చేసింది. కెమెరా, టేప్ రికార్డ్, టైమ్ వాచీ, టైమ్ అలారం, క్యాలండర్, కాలుక్యూలేటర్, డిక్షనరీ, కంప్యూటర్, నెట్ బ్రౌజింగ్ ఇలాంటివన్నీ వేటికవే సెపరేటుగా ఉండేవి వెనకటి కాలంలో... కానీ ఇప్పుడు అవన్నీ ఒక్క అర చేతిలో పట్టే సెల్ ఫోన్ లో ఇమిడిపోలేదూ!!... ఎందుకంటే మెరుగైన సాంకేతికతే కదా... అందుబాటులో ఉన్న సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ముందుకు పోతున్నామే తప్ప అది మన సంసృతా లేక విధానమా అన్న విషయాలను పట్టించుకోము కదా... అలాగే సినిమా కూడా.. ఒకప్పుడు సినిమా షూట్ చేయాలంటే పగలు మాత్రమే చేయవలసివచ్చేది. తర్వాత అందుబాటులోకి వచ్చిన సాంకేతికను ఉపయెగించుకొని రాత్రుళ్ళు కూడా షూట్ చేసేవారు. రీల్స్ మీద షూట్ చేసిన సినిమాలు నేడు డిజిటల్ కెమెరాల్లో కూడా ఎక్కుతున్నాయి.

అందువల్ల ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికతని ఉపయెగించి నేనొక్కడినే సినిమాను ఇప్పుడున్న సినిమాల కన్నా బాగా తీయగలిగారు. అంతే తప్ప హాలివుడ్ స్దాయినో, బాలీవుడ్ స్దాయినో అందుకోవలని తాపత్రయపడి మన తెలుగుదనంను వదిలేయడం కాదు కదా...

ఆయితే మన తెలుగు సినిమా కధల్లో తెలుగుదనం లోపించిదన్న విమర్శ నిజమే... అది ఇప్పుడు కాదు ఎప్పుడో మెదలయింది.... చివరకి  కధ అనేదే లేకుండా కేవలం ఆరు పైట్లు, ఆరు పాటలు, ఆరు కామెడి సీన్లు, ఒక క్లబ్ సాంగ్ ఉంటే సినిమా రెడీ అనే స్టేజికి వచ్చేసింది. ఈ ఫార్ములకు దూరంగా వచ్చిన సినిమాలన్నింటిని పేక్షకులు ఆదరించారు. అలాగే ఇప్పుడు వస్తున్న మూస సినిమాలకి భిన్నంగా వచ్చిన నేనొక్కడినే ప్రయత్నం కూడా బాగుంది. అంతే తప్ప సినిమాలో ఎక్కడ లొసుగులు లేవనో, లేక ఇదో గొప్ప కళాఖండమో, లేక ఇంకొకటనో భావించక్కరల్లేదు. అలాగాని సుకుమార్ కూడా ఎక్కడ చెప్పలేదు. సినిమా పేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాలేదని మాత్రమే అన్నాడయన...

ఒక చోట ఒక పది మంది తెల్లపంచెలతో ఒకే రకమైన డ్రెస్ కోడ్ తో ఉన్నారనుకొండి. ఆ సమయంలో మంచి జీన్స్ మరియు టి.షర్ట్ కాంబినేషన్ తో ఒక వ్యక్తి వస్తే సహజంగా అందరి దృష్టి అతని మీద పడుతుంది కదా..... నేనొక్కడినే సినిమా కూడా అలాంటిదే... ఒకే మూస ధోరణిలో పరిగెడుతున్న తెలుగు సినిమాలో మిగతా వాటికి భిన్నంగా రావడం ఈ సినిమా స్పెషల్... అంతే తప్ప ఇంకొకటేది కాదు..

ఇకపోతే తెలుగు సినిమా గతములో తెలుగుదనం ఉట్టిపడేటట్టు కధలు మొత్తం ఆంధ్ర రాష్ట్ర పరిధిలోనే జరిగినట్టుగా చూపించేవారు. ఆ తర్వాతర్వాత కధ అప్పుడప్పుడు ముంబయి, న్యూఢిల్లీ, గోవా లాంటి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళడం మొదలయింది. అది ఇప్పుడు ఫారిన్ వెళ్ళడం కూడా మొదలెట్టి, కధ మొత్తం ఫారిన్ లోనే ఉండడం అనే స్టేజికి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు కధలు వలే తెలుగు ప్రజలు కూడా ఇక్కడే ఉండేవారు. ఆ తర్వాతర్వాత విద్యావకాశములు మరియు యితర అవకాశములు మెరుగవ్వడంతో అంది వచ్చిన  అవకాశాల దృష్ట్యా చాలా మంది తెలుగువారు దేశంతో పాటు, యితర దేశాలకు వలస వెళ్ళి అక్కడ స్దిరపడడం జరిగింది.

ఒకప్పుడుతో పోల్చుకుంటే బయట ప్రాంతాల్లో ఉంటున్న తెలుగువారి జనాభా బాగా పెరిగింది. దానితో పాటే సినిమా కధలు కూడా మన ప్రాంతాల్ని దాటుతున్నాయి. అమెరికా, లండన్ లో ఉంటున్నంత మాత్రానా వారు తెలుగువారు కారు అనలేము కదా... వారు అక్కడ కల్చర్ దృష్ట్యా వేషబాషల్లో మార్పు ఉన్నప్పటికి అంతర్లీనంగా వారిలో ఉండేది తెలుగుతనమే కదా... విదేశాల్లో ఉన్న తెలుగువారు పంచె, ధోవతి కట్టలేనంత మాత్రానా తెలుగువారు కాకుండా పోతారా? అలాగే మన సినిమాలు విదేశాల్లో షూట్ కానంత మాత్రానా తెలుగుదనం కోల్పోయినట్టుగా కాదు కదా..

ఎక్కువగా విదేశాల్లోనే షూటింగ్ జరగడానికి ప్రభుత్వ అనుమతులు కూడా ఒక కారణమే...  మన దేశంతో పోల్చుకుంటే విదేశాల్లో చాలా సులువుగా అనుమతులు దక్కుతుండడం కూడా ఒక కారణంగా చెప్పోచ్చు..

ఇకపోతే సుకుమార్ గారు మాకు లెక్కలు చెప్పడానికి వచ్చేవారు. ఆ సమయంలో అయనకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందని మాకు లేశమాత్రం కూడా తెలీదు. లెక్కలను అద్బుతంగా భోదించేవారయన. తన విద్యార్దులతో ఆయనకు చాలా మంచి సంబంధాలుండేవి. అప్పుడు నాకు లెక్కలు తప్ప మిగతా సబ్బెక్టుల్లో నాలెడ్జి తక్కువగా ఉండేది. రామ్మోహనరెడ్డి గారని ఒకాయన కెమిస్ట్రీ చెప్పేవారు.  ఎంత బాగా చెప్పేవారంటే అప్పటి వరకు నాకు కొరుకుడు పడకుండా ఉన్న కెమిస్ట్రీ ఆయన పుణ్యమాని దారిలోకి వచ్చింది. మంచితనంలో ఆయనకు ఉన్న ఇమేజ్ తిరుగులేనిది. ఆ విషయం అదిత్యలో చదువుకున్న ఏ స్టూడెంట్ ఆయినా చెబుతారు... అలాగే సుకుమార్ గారు కూడా నిగర్వి..
నాకు తెలిసి ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా డైరెక్టరులతో పోల్చుకుంటే సుకుమార్ గారు వంద రెట్లు బెటర్ పర్సన్...




6 comments:

  1. yv ramana blogpost ki hyperlink okati pedithe inka bagundedi... http://yaramana.blogspot.in/2014/01/blog-post_2653.html

    ps: sambandham leni vishayame, kani nenu kuda ramohan reddy sir student ne.

    ReplyDelete
    Replies
    1. ప్రణీత్ గారు,
      మీరన్నట్టుగానే వై.వి.రమణ గారి పోస్టునకు లింక్ ని మొదటి పేరాలోనే ఇచ్చాను. ఆయితే దానికి అండర్ లైన్ చేయకపోవడం సరిగా హైలెట్ ఆయియుండకపోవచ్చు.
      రామ్మెహన్ రెడ్డి గారు స్టూడెంట్ అంటే మీరు కాకినాడ లేదా చుట్టుప్రక్కల ప్రాంతం వారి ఆయి ఉండొచ్చును...
      స్పందించినందుకు ధన్యవాదములు..

      Delete
  2. its a good movie!
    brave concept to attempt on telugu screen
    nice blog

    ReplyDelete
    Replies
    1. కృష్ణ గారు,
      స్పందనకు ధన్యవాదములు..

      Delete
  3. మీ ఉద్దేశ్యం అది కాకపోవచ్చు. కాని, కుక్క తోక పట్టుకొని గోదారి ఈదేసినట్టుగా... అన్న సామెత రమణ గారిని కించపరచినట్టుగా ఉంది. దాన్ని తొలగిస్తే మంచిదేమో!

    ReplyDelete
  4. ఫణీంద్ర గారు,
    మీరన్నట్టుగా నాకసలు అలాంటి ఉద్దేశమే లేదు.... చాలా కాలం నుండి ఏ కొత్త ఆలోచనను పొందలేకపోవడం వలన కొత్త పోస్టుని రాయలేకపోయాను... అలాంటి సమయంలో రమణ గారి పోస్టుని ఆధారంగా చేసుకొని ఒక పోస్టుని చాలా కాలానికి రాయగలిగాను. ఇది రాయడానికి ప్రేరణ కేవలం రమణ గారి మీద ఉన్న అభిమానమే... రమణ గారి ఆర్టికల్స్ యితర ఆర్టికల్స్ తో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటాయండి.. ఆయన రచన శైలి అంటే నాకు చాలా ఇష్టం....అంత బాగా రాయగలగడం, విశ్లేషించడం చూసిన తర్వాత ఎవరైనా అయన ఆర్టికల్స్ కు బానిస కాకుండా ఉండలేరు....
    ఆయితే చివరి తోకగా పెట్టిన వాక్యం యిబ్బందికరంగా ఉందని రాసేటప్పుడు నాకు అనిపించలేదు. కానీ మీరన్న తర్వాత ఆలోచిస్తే తొలగించడమే ఉత్తమం అనిపించి, తొలగించాను.... పొరపాటునకు క్షమించండి...
    స్పందనకు కృతజ్ణతలు...

    ReplyDelete