Wednesday 25 January 2012

మరో అంబేద్కర్ రావాలి.....

ఆనాడు దేశంలో ఉన్న అసమానత్వ ప్రతిపాదికల
ఆధారముగా తయారుచేసిన అనాటి రాజ్యాంగం.......
ఈ నాటి పరిస్దితులకు అనుగుణంగా తయారుచేయడానికి
ప్రస్తుతం మనకు మరో అంబేద్కర్ కావాలేమో.......
అనాడు జనభాలో ఒకటొ శాతమున్న దొరల పాలనలో
అంటరానితనం వారిగా భావించిన జనభా యొక్క స్ధితిగతులను
మార్చాలనే ధ్యేయం, మరియు అంటరానితనాన్ని రూపుమాపి
సమానత్వము సాధించిండమే ధ్యేయంగా రాజ్యాంగంను రచించిన
అంబేద్కర్, నేటి పరిస్దితులను చూసిఉంటే, రాజ్యాంగాన్ని వేరే
విధముగా వ్రాసియుండే వాడేమో.....
అంటరానితనమును, అసమానత్వలను రూపుమాపడానికి విశేష
కృషి చేసినవాడుగా మాత్రమే అంబేద్కర్ ను భావించడం మన దౌర్బగ్యం.
ఆయన ప్రపంచ విపణిలో భారతదేశమును సౌర్వభౌమ్యదేశంగా
అవిర్బవించడానికి అవసరమైన సమగ్ర రాజ్యాంగంను తయారుచేసిన
అద్బుతమేధావి.....ఆయన మొదట భారత దేశ పౌరుడు... రాజ్యాంగ నిర్మాత...
భారతదేశము యొక్క ఆస్తి..... ఒక సుభాశ్ చంద్రబోస్, ఒక మహత్మ గాంధీ,
ఒక భగత్ సింగ్, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక ఝన్షీలక్ష్మిభాయి....
వీళ్ళందరు భారతమాత ముద్దుబిడ్డలు........ భారతదేశం యొక్క అమూల్యమైన అస్దులు...
అంతేకాని ఏదో ఒక వర్గానికి చెందిన వారు కాదు.....
అనాడు అంటరానితనం మరియు అసమానత్వల నిర్మూలన పూర్తయేవంతవరకే
ఆయా వర్గాలకు రిజర్వేషన్ లను అనుమతించాలని రాజ్యాంగంలోని చాలా
విపులంగా వివరించిన మేధావి.....
కాని ఆయన అశించిన అంటరానితనం మరియు అసమానత్వాలు
నిర్మూలన జరిగి నేటికి చాలా ఏళ్ళు గడుస్తున్నప్పటికి,
అనాటి పరిస్దితులకు అనుగుణంగా తయారుచేసిన విధానాలనే
నేటికి కొనసాగించడం పాలకుల ఓటుబ్యాంకు రాజకీయాలకు ఉదహరణ.
అదే విధముగా అంబేద్కర్ ని ఒక వర్గమునకు చెందిన నేతగానే భావించడం కూడా తప్పు.
ఆయన మీద అభిమానము ఉంటే, గుండెల్లో పెట్టుకొని అభిమానించాలి.
అంబేద్కర్ దేశములో అన్ని వర్గాల్లో సమానత్వాన్ని సాధించడానికి
రాజ్యాంగంలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించారు.
అంతే కాని తన స్వంత వర్గానికి రిజర్వేషన్లు కేటాయించలేదని,
ఆయన్ను ద్వేషించే యితర కులాల వార్కి తెలియజేసుకుంటున్నాను.
అదే విధముగా అంబేద్కర్ ను తమ వాడిగా భావిస్తున్న వర్గం వారు,
ఆయన వల్ల లాభపడి యుంటే గుండెల్లో పెట్టుకొని అభిమానించండి...
అంతేకాని ఆయనకు యూనిటిని అపాదించి
ఆయన హోదాని పాడుచేయవద్దు
, భారత దేశ అస్తిగా ఉన్న.ఈనాడు అంబేద్కర్ సామాజిక వర్గంను ఉపయెగించకొనని
రాజకీయనాయకుడు లేడు, పాలకులు లేరు....
నిజానికి ఈ రోజు అంబేద్కర్ పేరు చెప్పుకొని, అజమాయిషీ చేస్తున్న
వాళ్ళు అటు రాజకీయాల్లోను, ఇటు ప్రజాజీవితంలోను
కొకొల్లుగా ఉన్నారని వేరే చెప్పనక్కలేదనుకుంటా....
ఆనాడు అంబేద్కర్ అసమానత్వంను రూపుమాపడానికి
రాజ్యాంగంలో కొంత భాగము కేటాయించవలసివచ్చింది....
మళ్ళీ ఈనాడు వేరే విధముగా వేళ్ళునుకొన్న అసమానత్వంను
రూపుమాపడానికి మరో అంబేద్కర్ రావాలేమో??
 

చాతీ ఉప్పొంగే....

ఉదయము యదావిధిగా రన్నింగ్ కోసము పార్కుకు వెళ్ళా..
నేను వెళ్ళేసరికే అక్కడ కొద్దిగా హడావుడి పడుచూ
సీనియర్ సిటిజన్స్, మరియు యితర యువ వాకర్స్.
కొన్ని రౌండ్స్ పూర్తయిన తర్వాత స్టేడియము మధ్యనున్న
విశాలమైన స్దలములో ఆహద్లకరముగా తీర్చిదిద్దియున్న
స్దలము నుండి లయబద్దముగా నా చెవులకు తాకిన
వందేమాతరం గేయ అలాపన.....
వినిపించిన పైపు చూడగానే నీలిఅకాశన రెపరెపలాడుచూ
అపూర్వంగా కనిపించిన నా దేశ మువ్వన్నెల జెండా......
ఆ దృశ్యం చూడగానే సహజముగానే నా చాతి ఉప్పొంగింది....
ఇది ఒక్కసారి కాదు.... ప్రతి సారీ మువ్వన్నెల జెండా చూడగానే
నా చాతి ఉప్పొంగుతుంది...... ఎందుకంటే నేను భారతీయున్ని కాబట్టి.
మిత్రులందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....

Thursday 12 January 2012

దార్శనిక నాయకుడు- తరుణ్ గోగొయ్..

రోజు భారతదేశంలో ఉన్న అరుదైన నాయకుల్లో ఒకడు. ప్రస్తుతం అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈయన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు... అది సహజము కూడా. ఎందుకంటే ఈ రోజు మీడియా వార్కి, యువతకు ఇలాంటి దార్శనికుల గురించి తెలుసుకొనే అవకాశము, సమయము లేదు. అన్నాహజరే అవినీతిపై ఉద్యమం దరిమిలా, ఒక్కసారిగా దేశప్రజానికలో అవినీతిరహిత నాయకుడు ఉన్నాడా? అనే సందేశాలు చాలా మందికి వచ్చాయి. ఈ రోజుల్లో ఎవరైనా స్వంతలాభం కొరకే రాజకీయాల్లోకి వస్తారు కాని, ఉన్న అస్దులను అమ్ముకొని ప్రజలకు సేవ చేద్దామని వచ్చేవారెవరుంటారు అని ప్రశ్నించుకొనేవార్కి సమధానం... తరుణ్ గోగొయ్, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన పూర్తి పేరు తరుణ్ కుమార్ గోగొయ్. అస్సాం రాష్ట్రంలోని జోర్హాత్ జిల్లాలో గల రంగజన్ టీ ఎస్టేట్ లో జన్మించారు. ఈయన మొదటిసారిగా రాసిన హెచ్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో ఫెయిలయ్యారు. కాని చివరకు ఆయన గౌహతి యూనివర్సిటి నుండి గ్రాడుయెట్ పట్టా అందుకున్నారు. తర్వాత అయన ఇండియన నేషనల్ కాంగ్రెసు పార్టిలో సభ్యత్వం పుచ్చుకొని, జోర్హాత్ నియెజకవర్గం నుండి 1971 సం.లో తొలిసారిగా పార్లమెంటుకి ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో అనేక ముఖ్య పదవులను చేపట్టిన తరుణ్ గోగొయ్ 2001సం.లో అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక్కడ వరకు ఆయన ప్రస్దానం గురించి చెప్పుకుంటే అందరిలాగే ఈయన గురించి అనుకోవచ్చు. ముఖ్యమంత్రి పీఠం అదిష్టించినప్పటికి, ఆయన మొదట్లో తను అనుకొన్న విలువలకు ఎటువంటి మచ్చ లేకుండా ఇప్పుడు వరుసగా మూడవ పర్యాయము అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ మూడు పర్యాయముల పదవి కాలములో ఈయనపై ఒక అరోపణ కూడా లేదంటే, ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవచ్చు. ఆయనకు తన వ్యక్తిగత బ్యాంకు బాలెన్స్ ఎంత ఉంటుందో మీరు ఊహించగలరా? కేవలం పదిహెను వేల రూపాయలు. మీరు నమ్మకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది రాజకీయనాయకులు చెప్పేది ఇటువంటి లెక్కలే. తరుణ్ గోగెయ్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయినప్పటికి, ఆయన భార్య విశ్వవిద్యాలయములో అధ్యాపక వృతిలో కొనసాగుతున్నారు. ఆయన తన స్వంత ఖర్చులకు ఆవిడ వేతనం మీదే ఆధారపడతారు. మరియు అధికారిక కార్యక్రమాల్లో అవిడ ఎక్కడా కనబడరు. అంతే కాకుండా అవిడ తన కార్యాలయమునకు ఒక ముఖ్యమంత్రికి బార్యగా ఉండి కూడా, ముఖ్యమంత్రి భార్య హొదాలో అధికార వాహనము కాదని అటోలోనే వెళతారు. అధికారక కార్యక్రమాలకు కూడా ఈవిడ ముఖ్యమంత్రితో కాకుండా సాధారణంగానే వెళతారు. తరుణ్ గోగొయ్ తనకు వచ్చే గౌరవ వేతనం పదమూడు వేల రూపాయలను కూడా ప్రభుత్వ ఖజానాకే జమచేస్తారు. దేశములో ఎక్కడైనా ఒక స్దాయికి చేరిన రాజకీయ నాయకుడు కొంత కాలం గడిచేసరికి ఏదొక కుంభకోణ మకిలితో అంటకాగుచున్నారు. ఈ రోజు దేశములో రాజకీయాలను ఉన్నత స్దానానికి ఎదగడానికి ఉపయెగపడే ధన సోపానలుగానే బావిస్తున్నారు. అంతేకాక ఈ రోజు రాజకీయాలను కేవలం స్వంత ఎదుగుదలకు మాత్రమే ఉపయెగించుకుంటున్న అనేక మంది రాజకీయనాయకులను ఈ రోజు గల్లి, గల్లీకి చూడవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఈ రోజుల్లో అసలు అంత నిజాయితిగా, నిక్కచ్చిగా రాజకీయాల్లో కొనసాగడం సాధ్యమేనా అనేది అనేక మందికి వచ్చే పెద్ద సందేహం. వాటన్నింటికి సమాధానం తరుణ్ గోగొయ్.
మన మీడియాకు, వార్తపత్రికలు కూడా ఇలాంటి నిజాయితిగా ఉండగల్గుతున్న వారిని ప్రజలకు తెలియపరిచే సమయం ఉండడం లేదు. వాళ్ళకు ఇలాంటి వారి కంటే అవినీతి కంపు కొడుతున్న నేటి నాయకులంటేనే మెజు. వాళ్ళ గురించి పేజిలకు, పేజిలు కవరేజిలు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఏ రోజూ కూడా ఇలాంటి నాయకుల జీవనశైలి గురించి కాని, లేక వారి గురించి కాని పతాక శీర్షికల్లో కనబడవు. ఒక వేళ ఉన్నా చిన్న కాలమ్ లో వార్త రాసేసి దుమ్ము దులిపేసుకుంటాయి. అదే పనికిమాలిన రాజకీయ నాయకులు డ్రమ్ము కొట్టిన, మందు త్రాగిన, ముక్క తిన్న, డాన్స్ లు వేసిన, తిట్టుకొన్న, అదొదే పెద్ద ఇష్యూలా పేజిలకు, పేజిలు వాటి గురించే. ఇక మీడియా పనితీరు ఇలాగుంటే మనకి తరుణ్ గోగొయ్ లాంటి వారి గురించి ఏమి తెలుస్తుంది. అలాంటి ఉదహారణే మీకు ఇంకోకటి చెప్పగలను. కాకినాడకి ప్రక్కన గల యానాం ఎమ్.ఎల్.ఎ. మల్లాడి కృష్ణారావు గారు.
 ఈయన తరుణ్ గోగెయ్ అంతటి ఆదర్శవాది కాకపోయినా చాలా మంచి భావాలు కల్గిన వ్యక్తి. మొన్న పుదుచ్చేరి రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో, ఈయన ప్రచారానికి బయటకు రాకుండా, ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా, ఎవరిని ఓట్లు అడకకుండా విజయము సాధించారు. ఎందుకంటే ఆయన ప్రజలను తాను చేసిన అభివృద్ది చూసి ఓట్లేయవలసినదిగా కోరారు. ప్రజలు ఆయనను అఖండ మెజారిటితో గెలిపించారు. ఆయన తన నియొజక వర్గానికి చేసిన అభివృద్ది అలాంటిది. యానాం పట్టణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారీ మాట. మరి ఈ రోజుల్లో ఎంత మంది ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా గెలవగలుగుతున్నారు? ఏది ఏమైనా మనం విలువలను త్రికరణ శుద్దిగా పాటించినప్పుడు నిజాయితిగా ఉండగలమని నిరూపించారు తరుణ్ గోగెయ్ మరియు మల్లాడి కృష్ణారావు గార్లు.

Monday 9 January 2012

సంక్రాంతి-కోడి పందాలు

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. దీనికి చిన్న, పెద్ద తారతమ్యం లేదు. నగరాలలో పెద్ద పెద్ద కార్పోరేటు కొలువులు చేస్తున్న వాళ్ళ దగ్గర నుండి, రోజు కూలీ చేసుకొనే వాడి వరకు ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ కోసము ఎదురుచూస్తారు. ఎందుకంటే నగరాల్లో రణగోలల మధ్య నిమిషం ఖాళి లేని షెడ్యూలుతో గడిపే సాప్ట్ వేర్ ఇంజనీర్లు మరియు యితర ఉద్యోగులు ఎప్పుడు వెళ్ళిన, వెళ్ళకపోయిన సంక్రాంతికి మాత్రం తమ ఊరు వెళ్ళడానికి రెండు నెలల ముందుగానే టిక్కెట్సు బుక్ చేసుకొంటారు. ఇక చదువుకొనే విద్యార్దులయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆయిన వెంటనే వాళ్ళకు సంక్రాంతి వచ్చేసినట్టే (అంటే ఈ బాపతు వాళ్ళకు ముందుగానే వచ్చేస్తుంది అన్నమాట), ఇకపోతే మనం చెప్పుకోవలసినది పల్లెల్లో ఉన్న జనం గురించి. వీళ్ళకి సంక్రాంతి అంటే వేరే ఏమి గుర్తుకు రావు. ఒక్క కోడి పందాలు తప్ప. పల్లెటూళ్ళలోకి ఇంటర్ నెట్ వాడకం పూర్తిగా వెళ్ళలేదు గాని, ఒక వేళ ఉంటే కనుక, కోడి పందాలు అనే అంశానికి గూగుల్ సెర్చ్ లో ఎక్కువ హిట్ లు పడేవి. ఇంకా చెప్పాలంటే, కొలవరి డి సాంగ్ కూడా ఒక ప్రక్కకు రాదు కోడి పందాలకు. అంత క్రేజ్ కోడిపందాలంటే మా తూర్పుగోదావరి జిల్లాలో.... ప్రతి ఒక్కడూ సంక్రాంతి వస్తుందంటే, మొదటగా స్పురణకు వచ్చేది కోడిపందాలే. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సీజన్ లో జరిగే కోడి పందాలు అటలకు పెద్ద పేరు పెట్టింది.
 పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయితే ప్రజాప్రతినిధులే దగ్గరుండి జరిపించిన దాఖలాలు ఉన్నాయి. మా జిల్లాలో ప్రజాప్రతినిధులే జరిపించే అంత సీను లేదు కాని, కోడి పందాలు ఎక్కడికక్కడ భారీ స్దాయిలో జరుగుతాయి. దీని కోసము ముందస్తుగానే ఏర్పాట్లు జరుగుతాయి. ఏర్పాట్లు అంటే, అవేవి సాధారణ స్దాయిలో ఉండవు.. దీనికి పోలిసుల నుండి అనుమతి తెచ్చుకోవడం ఒక ఎత్తు. వీటి నిర్వహణకి పోలిసుల అనుమతి వచ్చిందంటే ఇక కోడిపందాల రాయుళ్ళ ఉత్సాహమును ఎవడూ కాయలేడు. కాని సర్వసాధారణంగా పోలిసుల అనుమతి లభించదు. ఆయినప్పటికి జరగవలసిన కోడి పందాలు జరుగుతునే ఉంటాయి. ఈ పందాలు కోసము పెంచే కోడి పుంజుల అహర మోను చూస్తే దిమ్మతిరగవలసినదే. వాటికి ప్రతి రోజూ బాదం పప్పు, జీడి పప్పులతో కూడిన మేతను వేస్తారు. మరియు శారీరక ధృడత్వం కోసము వాటికి ఒక రకమైన వ్యాయమం చేయిస్తారు. ఆ విధంగా దానిని ఎంతో జాగత్తగా తయారుచేస్తారు. మా తాతయ్యగారు ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా కొన్ని కోడిపుంజులను పెంచేవారు. ఆయన వాటిని చాలా జాగత్తగా చూసుకొనేవారు. ఇప్పుడూ ఉన్నయియనుకొండి. కాని వాటికి దగ్గరుండి జాగత్తగా మేనేజ్ చేసేవాళ్ళు లేరు. పైగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందాలును వినోద భరితం అంశంగా కాకుండా పరువు సంబందిత అంశం గా పరిగణిస్తారు. వీటిపై ఎంత ఇంట్రెస్టు ఉంటుందో ఈ రోజు ఈనాడు పేపరులో వేసిన కార్టున్ ని చూస్తే మీకే తెలుస్తుంది.
 పల్లెల్లో పెద్ద పేరున్న వ్యవసాయదారులందరూ తమ స్వంత కోళ్ళతో పందెలకు తరలి వస్తారు. అంతే కాదు పందెంలో డబ్బు కాయడానికి ఎంత వరకైనా వెళ్తారు. ఇక పోతే మా ఊరు తూర్పుగోదావరి జిల్లాకు, విశాఖ జిల్లా సరిహద్దులో ఉంటుంది. మా ఊర్లో వాళ్ళకు కోడిపందాల సరదా అంత ఇంత కాదు. అందుకని వాళ్ళు సంక్రాంతి వచ్చేవరకు ఆగలేరు. దానితో ఏది అయితే అది ఆయిందిలే అని చెప్పి కోడి పందాలు ఎప్పుడు పడితే అప్పుడే జరిపిస్తారు. పైగా మా ఊరు విశాఖ జిల్లా సరిహద్దులో ఉండడంతో, ఒకవేళ పోలిసులకు ఉప్పంది రైడ్ చేస్తే, వీళ్ళందరూ పోలోమని విశాఖ సరిహద్ధులోకి పారిపోయేవారు. ఎవడూ దొరికేవాడు కాదు. దీనితో పోలిసులకు ఇది ఒక పెద్ద సమస్యగా పరిగణించింది. ఎంత పడక్బందీగా వ్యవహరించిన, సరిహద్దు ప్రాంతం కావడం వలన కోడి పందాలను అదుపు చేయలేకపొయారు. ఆ విధముగా మా ఊళ్ళో వాళ్ళు చాలా కాలము పాటు కోడిపందాలను ఎంజాయ్ చేశారు. కాని ఒక సారి ఇరుజిల్లాలు పోలిసులు అటు నుండి ఒకరు, ఇటు నుండి ఒకరూ వచ్చి దాడి చేయడంతో మొత్తము అందరూ దొరికిపోయారు. అందులో చాలా మంది బయటవాళ్ళే. వాళ్ళ జిహ్వ చావక కోడి పందాలకు వచ్చి ఇలా దొరికిపోయారు. పోలిసులు ఒక్కసారిగా రైడ్ చేయడంతో భీతిల్లిన జనం పోలోమని చేల వెంట, తుప్పల వెంట పారిపోవడంతో, ఆ కంగారులో వాళ్ళ ఖరిదైన మైబైల్ ఫోన్సు మరియు యితరములు క్రింద పడిపోయాయి. అవన్నీ ఆ తర్వాత ఆ దారి వెంట వెళ్ళిన పశువుల కాపరులకు దొరికాయంట. దానితో వాళ్ళ పంట పండింది. కోడి పందాల అనుభవాలు ఈ విధముగా ఉంటాయి. ఇక చెప్పుకొంటు పోతే ఈ పూటకు ఆవదు. కోడిపందాలు తర్వాత చెప్పుకోవలసిన ప్రధాన అంశం. "కోస" మాంసం. అంటే కోడి పందాల్లో ఓడిపోయిన సాధారణంగా చనిపోతుంది. ఆ ఓడిపోయిన కోడిపుంజు మాంసంనే కోస మాంసం అంటారు. ఆ మాంసం చాలా రుచిగా ఉంటుందని చెపుతుంటారు. అందుకని దీనికి చాలా డిమాండ్. నేను మాంసాహారము తినను. అందుకని దాని రుచి ఎలాగుంటుందో నాకు తెలియదు. సర్లేండి దీనిని ఇక్కడితే అపేద్దాం. రాసుకుంటే పోతే ఈ పూట సరిపోదు. పైగా పోలిసులు మన కోడి పందాల వ్యాసం మీద రైడ్ చేస్తే కష్టం.....
పి.ఎస్.: కోడి పందాల గురించి రాసాను అని చెప్పి, నేనొదే కోడిపందాలకు వెళ్ళుతుంటానని అపార్దం చేసుకోకండి. నేనస్సలు ఒక్కసారి కూడా కోడిపందాలు చూడడానికి వెళ్ళలేదని తమరికి మనవి చేసుకుంటున్నాను.

Thursday 5 January 2012

అయ్యో.. మళ్ళీ మిస్సయింది....


నా దగ్గరున్నది ఏమి మిస్సవలేదులెండి.... నేను అంటున్నదీ మన క్రికెట్ దేవుడి గారి వందో సెంచరీ గురించి..
ఈ రోజు ప్రొద్దున్నే లేచి పేపరు చదివేసి, టి.వి. పెట్టి చానల్స్ అన్ని మార్చుకుంటూ, అలవాట్లో పొరబాటుగా స్టార్ స్పోర్ట్స్ చానల్ ని చూడడం...
అప్పటికి సచిన్ గారు డైబ్బయి రన్స్ తో దిగ్విదయంగా క్రీజులో ఉండడం చూసి......
మనోళ్ళు అస్టేలియా మీద విజయము మాట దేవుడెరుగు, కనీసము డ్రా మాట ఆయిన దేవుడెరుగు, ఈ రోజు మొత్తము పూర్తిగా ఆడతారా లేదా అన్న మీమాంసలో ఉన్న సమయములో సచిన్ డెబ్బయి పరుగుల వద్ద ఉన్నాడు.....
పోతేపోనీ సచిన్ గారు ఎప్పటినుండో చూస్తున్న వందో వంద ఆయిపోతే, తర్వాత నుండి దాని గురించి న్యూస్ పేపర్లలో వచ్చే విశ్లేషణలు చూసే భాద తప్పుతుంది కదా అని సంబరపడ్డా....
ఈ లోపులో స్నానానికి వెళ్ళి, తిరిగి వచ్చాక చూద్దునూ... సచిన్ ఆవుట్ అని ఉంది..... ఉసూరుమనిపించింది.....
సచిన్ ఆవుటయినందుకు బాధ లేదు. ..... కాకపోతే ఆ వందో వంద గురించి ఇంకా ఎన్ని విశ్లేషణలు చదవాలో తలచుకొనేసరికి ఒక్కసారిగా నీరసం ఆవచించింది...... ఆ వంద ఆయిపోయి ఉంటే, కొత్త న్యూస్ చదవచ్చు కదా అని ఆశపడ్డందుకు దేవుడి తగిన శాస్తే చేశాడు నాలాంటి వాళ్ళందరికి.....
పి.ఎస్: ఈ విషయములో ఎవరి మనసైనా నొప్పించిన యెడల  ఎవరికి క్షమాపణలు చెప్పే ప్రస్తక్తే లేదు.

Tuesday 3 January 2012

నువ్వు సారా తాగుట మానురన్నో, లేకుంటే పైకి పోతావురన్నా......

జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడి వినిపించినిదీ పాట..
నిజంగానే ఇది మన రాష్ట్రంలో ఈ మధ్య కల్తీ సారా మృతుల గురించి
విన్నప్పుడు, ఆ పాటలో నిజముందీ కదా అనిపిస్తుంది...
సారాలో కల్తీ జరిగి, అది అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైతే,
రాజకీయపక్షాలు మాత్రము ఒకరిపై ఒకరు బురద జల్లుకొంటున్నాయి....
సారా తయారీదారులు మీరంటే మీరు అని...........
ఆయిన సారా త్రాగి ఎవరో చనిపోతే, అది ప్రభుత్వ భాద్యత ఎలాగవుతుంది....
ఓహో.... సారాలో కల్తీ జరగకుండా ప్రభుత్వం చూడనందుకా???
మరి సారా త్రాగమని ప్రభుత్వం చెప్పలేదుగా......
వింతడవాదం చేస్తున్నానని అనుకోవద్దు.....
అసలు సారా త్రాగడం తప్పని తెలిసి, ఎగదొప్పుకొంటు పోయి రావడం ఎవడబ్బ తప్పు?
తీరా అందులో తేడా వస్తే తప్పు ప్రభుత్వాలుదా??
ఎక్కడికి పోతున్నారు మన మీడియా మరియు రాజకీయ పార్టీలు......
బుద్దొన్నోడు ఎవడూ సారా త్రాగడానికి వెళ్ళడు....
త్రాగి తందనలాడి, దానికి వేరొకరు భాద్యత వహించలంటే చెప్పు తీసుకొని కొట్టాలి....
ముందుగా జనాలు సారా త్రాగడం మానివేయాలి....
ఒక వేళ ఎవరైనా సారా త్రాగదొద్దురా అంటే, నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి
అని కూతలు కూసి, ఈ రోజు ప్రాణాలు మీదికి తెచ్చుకొన్న చవటల గురించి బాదపడవలసిన అవసరం లేదు.....

నో టార్గెట్స్ ఇన్ 2012

ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరము వస్తుందనగానే, తాము మార్చుకోవలననుకొంటున్న అలవాట్లు, మరియు మొదలుపెడదమనుకొన్న పనులను కొత్త సంవత్సరము ప్రారంభం నుండి మొదలుపెట్టాలని అనుకుంటారు. కాని ఎంత మంది తాము అనుకొన్న విధముగా ఖచ్చితముగా చేయగలరో ఆ దేవుడికే తెలియాలి. ఇకపోతే నేను మాత్రము కొత్త సంవత్సరము వస్తుందనగానే, ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోలేదు. పెట్టుకోదలచుకోలేదు కూడా. ఎందుకంటే అవి అలోచించడానికి కూడా బద్దకం కాబట్టి. నిజమండీ, టార్గెట్స్ ఏర్పరచుకోవడానికి కనీసము ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే బద్దకం.. అలోచించి బుర్ర పాడుచేసుకోవడం ఎందుకని. ఇంకా చెప్పాలంటే అప్పటి వరకు చేస్తున్న కొన్ని కొన్ని పనులకు ఎగనామం పెట్టాను ఈ సంవత్సరములో. ఇంకా కొత్తగా ఏమి టార్గెట్ పెట్టుకుంటాము చెప్పండి.
 ఏదో ఒకటి చేస్తున్నామనిపించికోవడానికి ఉదయము పూట వాకింగ్ కి వెళ్తున్నాను. నిజానికి అసలు కారణము వేరే, అదేమిటంటే ఎక్కువసేపు పడుకుంటే బుగ్గలు పెరుగుతాయి అని నాకులాంటి ఎవరో తలకుమాసిన వెధవ నాతో గోకాడు. ఇక అప్పటి నుండి మన నిద్ర ఎక్కువయిపోతుందని బెంగపడిపోయి (అంటే బుగ్గలు పెరుగుపోతాయని) ఉదయము తొందరగా మెలకువ తెచ్చుకోవడం అలవాటు చేసుకొన్నాను. మరి బుగ్గలు తగ్గాయా? అని అడక్కండి.. అవి అలాగే ఉన్నాయిలెండి. ఇదిలా ఉండగా, ఇందకా పైన చెప్పుకొన్నట్టు అందరూ కొత్త సంవత్సర ప్రారంభం నుండి ఏదొక మంచి అలవాటు చేసుకోవాలని చూస్తే, నేను మాత్రము అప్పటి వరకు నాకున్న మంచి అలవాటయిన వాకింగ్ కి ఎగనామము పెట్టేసా.. అదేంటొ అప్పటి వరకు బాగానే చేసిన వాకింగ్ ని కరెక్టుగా ఈ నెల ఒకటి నుండే మానేసాను. విచిత్రం.. నాల్గు రోజులు వాకింగ్ మానివేస్తేనే, నా బుగ్గలు కొద్దిగా పెరుగినట్టుగా అనిపించిందండీ పొద్దున్న నా ముఖం అద్దంలో చూసుకొన్నప్పుడు. అదేంటొ వరుసబెట్టి కంటిన్యూగా వాకింగ్ కి వెళ్ళినప్పుడు బుగ్గలు కొంచెం కూడా తగ్గలేదు కాని ఓ నాల్గు రోజులు మానేస్తే పెరగడం ఎంత అన్యాయమండీ. ఏం చేస్తామండి మన ఖర్మ అలా తగలడింది. అందుకని రేపటి నుండి ఎలాగయిన మళ్ళి మొదలెట్టాలి వాకింగ్. అలా మనము టార్గెట్ కాని టార్గెట్ పెట్టుకున్నానండి ఈ వేళ. ఇకపోతే మొన్నటికి మా ఫ్రెండ్ ఒకడూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, "గత సంవత్సరములో చేసిన తప్పులు గురించి అలోచించి సమయము వృధా చేయకు, ఈ సంవత్సరము కొత్త తప్పులు ఎలా చేయాలా అని అలోచించు" అని మెసెజ్ పెట్టాడు. చదవగానే అహా ఎంత బాగా రాశాడనిపించిందండి.(నిజానికి మీకు కూడా అలానే అనిపించింది కదా). తప్పులు చేయడాన్ని అందరూ ఎంత నామోషిగా తీసుకుంటారు కానీ, నిజానికి తప్పులు చేయలంటే గట్స్ ఉండాలి కదండీ: విజయాలన్ని ముందుగా ప్లాన్ చేసుకుంటే వస్తాయి. దాని కోసము బోలెడంతా స్కెచ్ తయారుచేసుకోవాలి. అదే తప్పులు చేయాలంటే అవేవి అవసరము లేదు. ఇంకా చెప్పాలంటే దానికి ఎటువంటి స్కెచ్ తయారుచేసుకొనవసరం లేదు. బాగుంది కదా నా ధియరీ.. పోయినేడాది బోలోడన్ని టార్గెట్స్ పెట్టేసుకొని, అందులో ఒకటి టార్గెట్ పూర్తి చేయలేక, పైగా నా టార్గెట్స్ మాట దేవుడెరుగు... నేను అసలు ఊహించని బోలెడన్ని ఫెయిలర్స్ నా గత సంవత్సర ఖాతాలోకి తన్నుకుంటు వచ్చేయడంతో నా ధియరీ ఈ విధముగా మారిపోయిందని మీరు అనుకోకండేయి. (నిజానికి అదే అసలు కారణం). అందుకని ఈ సంవత్సరము ఎన్ని ఫెయిల్యర్స్ చేయగలమో ఇప్పటి నుండి తెగ అలోచించడానికి కూడా బద్దకం వచ్చేస్తుందండి బాబు. ఈ లెక్కన మనకి ఈ సంవత్సరము ఏ చిన్న విజయము పొందినా, అది గొప్పదిగా మిగిలిపోవచ్చుననుకొంటా(అంటే ఈ సంవత్సరము మహేష్ బాబుకి దూకుడు లాంటి సాధారణ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా అనిపించి ఫీలయినట్టు) (మహేశ్ బాబు ఫాన్స్ కి కోపం వస్తే వార్కి నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను). అందుకని ఈ సంవత్సరము ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోకుండా ప్రస్తుతానికి బాగానే ఉన్నానండి. కాని ఇప్పుఇప్పుడే తప్పుడు అలోచనలు వచ్చేస్తున్నాయండి నా బుర్రలోకి. వాకింగ్ కే తిన్నగా వెళ్ళి రావడం చేతకాలేదు కాని, జిమ్ కి వెళ్ళాలని తెగ ఉబలాటం వచ్చేస్తుంది ఈ మధ్య... అంతే కాదండొయ్, గ్రూప్ పరీక్షలకు కూడా రాసేయాలని తెగ అనిపిస్తుంది కూడా. ఈ సంవత్సరము పొద్దున్నే ఎవడి ముఖం చూసానో కాని. ఇలాంటి అలోచనలు వచ్చి, వాటిని అచరణలో పెట్టడం మొదలెడితే ఏమయిపోతానన్న బెంగ నాకి మధ్య ఎక్కువయిపోయింది.
 ఈ గ్రూప్ లు గొడవ అలా అయిందో లేదో... మరల ఇంకొక కొత్తగా బిజినెస్ స్టార్ చేయాలన్న అలోచన వచ్చేస్తుంది.. అయ్యబాబోయ్ నాకేదో దెయ్యం పట్టుకున్నట్టుంది ఈ వేళ... లేకపోతే ఇన్ని టార్గెట్స్ పెట్టుకుంటే నేను ఎలా బ్రతకాలని తెగ మధనపడిపోతుందండి నా అంతరాత్మ(చ్చ. వీడికో అంతరాత్మ కూడానా?). అలా అనకండి. ఈ మాట కనుక వాడు విన్నాడనుకొండి.. నిజంగానే వాటనన్నిటిని చేసేయాలంటాడు. కాబట్టి గమ్మున యుండండి. మీరు మాత్రము నాకు మల్లే కాకుండా మంచి మంచి టార్గెట్స్ పెట్టుకొండి... ఒక వేళ మీరు కూడా బొర్లాపడ్డారనుకొండి.. అప్పుడు మీరు కూడా నా ధియరీని ఫాలో అయిపోదురు కాని. సరేనా>>>
పి.ఎస్. బుడుగు బొమ్మలని నా అర్టికల్ లో వాడుకున్నందుకు బాపూ గార్కి క్షమపణలు చెప్పుకుంటూ...

పూనం మాలకొండయ్య మార్క్ పనితీరు...


గడిచిన పది రోజులలో ఎ.పి.పి.యస్.పి. ద్వారా వెలువడిన వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు బుర్ర నిండా పని కల్పించాయి. యిందులో ముఖ్యంగా ఎ.పి.పి.యస్.పి. చైర్మన్ ఆయిన పూనం మాలకొండయ్య గార్కి మనసూర్పిగా అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లో విడుదల చేయడంలో ఆవిడ తన పనితీరును నిరూపించుకొన్నారు. దేశములో నిజాయితిపరులయిన అధికారులలో పూలం మాలకొండయ్య గారు స్దానం దక్కించుకొన్న విషయము మీరందరికి తెలిసిందే. ఆవిడ ఎక్కడ పని చేసిన తన మార్క్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఆ మార్క్ నే మనందరం నిజాయితిగా చెప్పుకోవచ్చు. పూనం మాలకొండయ్య గారు రాకముందు వరకు ఎ.పి.పి.యస్.పి. బాగా తుప్పు పట్టిపోయిఉంది. ఈవిడ వచ్చిన తర్వాత దానికున్న తుప్పునంతా వదలిగొట్టి, ప్రభుత్వ సంస్దల్లో ఉన్న ఖాళీలను గుర్తించి, ఆ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళడంలో ఆవిడ చూపించిన పనితీరు, రాష్ట్రంలో ఉన్న అనేక మంది నిరుద్యోగుల పాలిట వరమయ్యింది.
 దానికి తోడు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా నిర్ణయము తీసుకోవడంతో మొన్నటికి మొన్న వరుస పెట్టి పది నోటిఫికేషన్స్ పరీక్షా తేదిలతో సహ విడుదల చేసారు. ఇప్పటికే సరయిన ఉద్యోగాలు లేక నిరాశవాదంలో ఉన్న అనేక మంది విద్యార్దులు, ఈ వరుస నోటిఫికేషన్స్ తో ఉక్కిరి బిక్కిరి ఆయిపోతున్నారు. పైగా ఇంకా గ్రూప్.4 మరియు డి.ఎస్.ఎసి పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్స్ భారీ స్దాయిలో  విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయములో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రాజకీయాలను ప్రక్కన బెట్టి కొంత వరకు ప్రజా ప్రయెజన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విధమైన ప్రోత్సాహము ముఖ్యమంత్రి నుండి ఉంటే, ఇంకా చాలా మంది నిజాయితిపరులైన అధికారులు ఇంకా సమర్దవంతంగా తమ తమ శాఖలను అభివృద్ది చేస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకని ఈ సంవత్సరమును నిరుద్యోగుల పాలిట ఉద్యోగ నామ సంవత్సరముగా పేర్కొనవచ్చు... చివరగా తన సర్వీసులో ఏ విషయములో రాజీ పడకుండా నిజాయితిగా పనిచేస్తున్న శ్రీమతి పూనం మూలకొండయ్య గార్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను..