Tuesday 3 January 2012

పూనం మాలకొండయ్య మార్క్ పనితీరు...


గడిచిన పది రోజులలో ఎ.పి.పి.యస్.పి. ద్వారా వెలువడిన వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు బుర్ర నిండా పని కల్పించాయి. యిందులో ముఖ్యంగా ఎ.పి.పి.యస్.పి. చైర్మన్ ఆయిన పూనం మాలకొండయ్య గార్కి మనసూర్పిగా అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లో విడుదల చేయడంలో ఆవిడ తన పనితీరును నిరూపించుకొన్నారు. దేశములో నిజాయితిపరులయిన అధికారులలో పూలం మాలకొండయ్య గారు స్దానం దక్కించుకొన్న విషయము మీరందరికి తెలిసిందే. ఆవిడ ఎక్కడ పని చేసిన తన మార్క్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఆ మార్క్ నే మనందరం నిజాయితిగా చెప్పుకోవచ్చు. పూనం మాలకొండయ్య గారు రాకముందు వరకు ఎ.పి.పి.యస్.పి. బాగా తుప్పు పట్టిపోయిఉంది. ఈవిడ వచ్చిన తర్వాత దానికున్న తుప్పునంతా వదలిగొట్టి, ప్రభుత్వ సంస్దల్లో ఉన్న ఖాళీలను గుర్తించి, ఆ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళడంలో ఆవిడ చూపించిన పనితీరు, రాష్ట్రంలో ఉన్న అనేక మంది నిరుద్యోగుల పాలిట వరమయ్యింది.
 దానికి తోడు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా నిర్ణయము తీసుకోవడంతో మొన్నటికి మొన్న వరుస పెట్టి పది నోటిఫికేషన్స్ పరీక్షా తేదిలతో సహ విడుదల చేసారు. ఇప్పటికే సరయిన ఉద్యోగాలు లేక నిరాశవాదంలో ఉన్న అనేక మంది విద్యార్దులు, ఈ వరుస నోటిఫికేషన్స్ తో ఉక్కిరి బిక్కిరి ఆయిపోతున్నారు. పైగా ఇంకా గ్రూప్.4 మరియు డి.ఎస్.ఎసి పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్స్ భారీ స్దాయిలో  విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయములో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రాజకీయాలను ప్రక్కన బెట్టి కొంత వరకు ప్రజా ప్రయెజన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విధమైన ప్రోత్సాహము ముఖ్యమంత్రి నుండి ఉంటే, ఇంకా చాలా మంది నిజాయితిపరులైన అధికారులు ఇంకా సమర్దవంతంగా తమ తమ శాఖలను అభివృద్ది చేస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకని ఈ సంవత్సరమును నిరుద్యోగుల పాలిట ఉద్యోగ నామ సంవత్సరముగా పేర్కొనవచ్చు... చివరగా తన సర్వీసులో ఏ విషయములో రాజీ పడకుండా నిజాయితిగా పనిచేస్తున్న శ్రీమతి పూనం మూలకొండయ్య గార్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను..

7 comments:

  1. Great to hear it! పూనం మాలకొండయ్య గారికి అభినందనలు.

    ReplyDelete
  2. పేపర్‌లో ఈవిడ పేరు చదివేవాళ్ళు ఎవరూ ఈవిడ ఆడది అనుకోరు. పేరు చివర భర్త పేరు పెట్టుకోవడం మహిళాభ్యుదయానికి ఎలాగూ వ్యతిరేకమే కానీ ఇక్కడ ప్రజలు ఐడెంటిఫై చెయ్యగల విధంగా పేరు పెట్టుకున్నా బాగుండేది. పేరులో మాలకొండయ్య అని చూసి మగవాడు అని కంఫ్యూజ్ అయిన చాలా మందిలో నేను ఒకణ్ణి.

    ReplyDelete
  3. @మధురవాణి వార్కి
    ఎంత బాగుందండీ మధురవాణి అనే పేరు...
    ధన్యవాదములు నా అర్టికల్ చూసినందుకు...

    @మెట్టసీమ వార్కి,
    దన్యవాదములు.....

    @తెలుగు వెబ్ మీడియా వార్కి
    ఆవిడ కున్న పేరుపఖ్యాతులు మరియు నిజాయితితనం ముందు పేరుది ఏముందిలెండి....
    దన్యవాదములు....

    ReplyDelete
  4. Dear friend Mr rajeev raghava, go head nenu badilee ayyanante daniki karanam,smt.Punam malakondayya madam G.O vallane.

    ReplyDelete
  5. Great..Hats of to Smt.Poonam...Good contribution Rajeev Keep it up......

    ReplyDelete
  6. Great Lady officer of Andhra Pradesh... She in fact deserves higher responsibilities than what is given..Good work Rajeev...Keep it up..
    :)

    ReplyDelete