సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. దీనికి చిన్న, పెద్ద తారతమ్యం లేదు. నగరాలలో పెద్ద పెద్ద కార్పోరేటు కొలువులు చేస్తున్న వాళ్ళ దగ్గర నుండి, రోజు కూలీ చేసుకొనే వాడి వరకు ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ కోసము ఎదురుచూస్తారు. ఎందుకంటే నగరాల్లో రణగోలల మధ్య నిమిషం ఖాళి లేని షెడ్యూలుతో గడిపే సాప్ట్ వేర్ ఇంజనీర్లు మరియు యితర ఉద్యోగులు ఎప్పుడు వెళ్ళిన, వెళ్ళకపోయిన సంక్రాంతికి మాత్రం తమ ఊరు వెళ్ళడానికి రెండు నెలల ముందుగానే టిక్కెట్సు బుక్ చేసుకొంటారు. ఇక చదువుకొనే విద్యార్దులయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆయిన వెంటనే వాళ్ళకు సంక్రాంతి వచ్చేసినట్టే (అంటే ఈ బాపతు వాళ్ళకు ముందుగానే వచ్చేస్తుంది అన్నమాట), ఇకపోతే మనం చెప్పుకోవలసినది పల్లెల్లో ఉన్న జనం గురించి. వీళ్ళకి సంక్రాంతి అంటే వేరే ఏమి గుర్తుకు రావు. ఒక్క కోడి పందాలు తప్ప. పల్లెటూళ్ళలోకి ఇంటర్ నెట్ వాడకం పూర్తిగా వెళ్ళలేదు గాని, ఒక వేళ ఉంటే కనుక, కోడి పందాలు అనే అంశానికి గూగుల్ సెర్చ్ లో ఎక్కువ హిట్ లు పడేవి. ఇంకా చెప్పాలంటే, కొలవరి డి సాంగ్ కూడా ఒక ప్రక్కకు రాదు కోడి పందాలకు. అంత క్రేజ్ కోడిపందాలంటే మా తూర్పుగోదావరి జిల్లాలో.... ప్రతి ఒక్కడూ సంక్రాంతి వస్తుందంటే, మొదటగా స్పురణకు వచ్చేది కోడిపందాలే. ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సీజన్ లో జరిగే కోడి పందాలు అటలకు పెద్ద పేరు పెట్టింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయితే ప్రజాప్రతినిధులే దగ్గరుండి జరిపించిన దాఖలాలు ఉన్నాయి. మా జిల్లాలో ప్రజాప్రతినిధులే జరిపించే అంత సీను లేదు కాని, కోడి పందాలు ఎక్కడికక్కడ భారీ స్దాయిలో జరుగుతాయి. దీని కోసము ముందస్తుగానే ఏర్పాట్లు జరుగుతాయి. ఏర్పాట్లు అంటే, అవేవి సాధారణ స్దాయిలో ఉండవు.. దీనికి పోలిసుల నుండి అనుమతి తెచ్చుకోవడం ఒక ఎత్తు. వీటి నిర్వహణకి పోలిసుల అనుమతి వచ్చిందంటే ఇక కోడిపందాల రాయుళ్ళ ఉత్సాహమును ఎవడూ కాయలేడు. కాని సర్వసాధారణంగా పోలిసుల అనుమతి లభించదు. ఆయినప్పటికి జరగవలసిన కోడి పందాలు జరుగుతునే ఉంటాయి. ఈ పందాలు కోసము పెంచే కోడి పుంజుల అహర మోను చూస్తే దిమ్మతిరగవలసినదే. వాటికి ప్రతి రోజూ బాదం పప్పు, జీడి పప్పులతో కూడిన మేతను వేస్తారు. మరియు శారీరక ధృడత్వం కోసము వాటికి ఒక రకమైన వ్యాయమం చేయిస్తారు. ఆ విధంగా దానిని ఎంతో జాగత్తగా తయారుచేస్తారు. మా తాతయ్యగారు ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా కొన్ని కోడిపుంజులను పెంచేవారు. ఆయన వాటిని చాలా జాగత్తగా చూసుకొనేవారు. ఇప్పుడూ ఉన్నయియనుకొండి. కాని వాటికి దగ్గరుండి జాగత్తగా మేనేజ్ చేసేవాళ్ళు లేరు. పైగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందాలును వినోద భరితం అంశంగా కాకుండా పరువు సంబందిత అంశం గా పరిగణిస్తారు. వీటిపై ఎంత ఇంట్రెస్టు ఉంటుందో ఈ రోజు ఈనాడు పేపరులో వేసిన కార్టున్ ని చూస్తే మీకే తెలుస్తుంది.
పల్లెల్లో పెద్ద పేరున్న వ్యవసాయదారులందరూ తమ స్వంత కోళ్ళతో పందెలకు తరలి వస్తారు. అంతే కాదు పందెంలో డబ్బు కాయడానికి ఎంత వరకైనా వెళ్తారు. ఇక పోతే మా ఊరు తూర్పుగోదావరి జిల్లాకు, విశాఖ జిల్లా సరిహద్దులో ఉంటుంది. మా ఊర్లో వాళ్ళకు కోడిపందాల సరదా అంత ఇంత కాదు. అందుకని వాళ్ళు సంక్రాంతి వచ్చేవరకు ఆగలేరు. దానితో ఏది అయితే అది ఆయిందిలే అని చెప్పి కోడి పందాలు ఎప్పుడు పడితే అప్పుడే జరిపిస్తారు. పైగా మా ఊరు విశాఖ జిల్లా సరిహద్దులో ఉండడంతో, ఒకవేళ పోలిసులకు ఉప్పంది రైడ్ చేస్తే, వీళ్ళందరూ పోలోమని విశాఖ సరిహద్ధులోకి పారిపోయేవారు. ఎవడూ దొరికేవాడు కాదు. దీనితో పోలిసులకు ఇది ఒక పెద్ద సమస్యగా పరిగణించింది. ఎంత పడక్బందీగా వ్యవహరించిన, సరిహద్దు ప్రాంతం కావడం వలన కోడి పందాలను అదుపు చేయలేకపొయారు. ఆ విధముగా మా ఊళ్ళో వాళ్ళు చాలా కాలము పాటు కోడిపందాలను ఎంజాయ్ చేశారు. కాని ఒక సారి ఇరుజిల్లాలు పోలిసులు అటు నుండి ఒకరు, ఇటు నుండి ఒకరూ వచ్చి దాడి చేయడంతో మొత్తము అందరూ దొరికిపోయారు. అందులో చాలా మంది బయటవాళ్ళే. వాళ్ళ జిహ్వ చావక కోడి పందాలకు వచ్చి ఇలా దొరికిపోయారు. పోలిసులు ఒక్కసారిగా రైడ్ చేయడంతో భీతిల్లిన జనం పోలోమని చేల వెంట, తుప్పల వెంట పారిపోవడంతో, ఆ కంగారులో వాళ్ళ ఖరిదైన మైబైల్ ఫోన్సు మరియు యితరములు క్రింద పడిపోయాయి. అవన్నీ ఆ తర్వాత ఆ దారి వెంట వెళ్ళిన పశువుల కాపరులకు దొరికాయంట. దానితో వాళ్ళ పంట పండింది. కోడి పందాల అనుభవాలు ఈ విధముగా ఉంటాయి. ఇక చెప్పుకొంటు పోతే ఈ పూటకు ఆవదు. కోడిపందాలు తర్వాత చెప్పుకోవలసిన ప్రధాన అంశం. "కోస" మాంసం. అంటే కోడి పందాల్లో ఓడిపోయిన సాధారణంగా చనిపోతుంది. ఆ ఓడిపోయిన కోడిపుంజు మాంసంనే కోస మాంసం అంటారు. ఆ మాంసం చాలా రుచిగా ఉంటుందని చెపుతుంటారు. అందుకని దీనికి చాలా డిమాండ్. నేను మాంసాహారము తినను. అందుకని దాని రుచి ఎలాగుంటుందో నాకు తెలియదు. సర్లేండి దీనిని ఇక్కడితే అపేద్దాం. రాసుకుంటే పోతే ఈ పూట సరిపోదు. పైగా పోలిసులు మన కోడి పందాల వ్యాసం మీద రైడ్ చేస్తే కష్టం.....
పి.ఎస్.: కోడి పందాల గురించి రాసాను అని చెప్పి, నేనొదే కోడిపందాలకు వెళ్ళుతుంటానని అపార్దం చేసుకోకండి. నేనస్సలు ఒక్కసారి కూడా కోడిపందాలు చూడడానికి వెళ్ళలేదని తమరికి మనవి చేసుకుంటున్నాను.
Raghav, is the "sport" legal? I am under the impression that it has been banned long ago. I ask because you speak about police permissions.
ReplyDeleteజై గార్కి,
Deleteస్పందించినందుకు ధన్యవాదములు. మీరడిగినట్టు కోడి పందాలు చట్ట విరుద్దమే.
ఇక వాటిపై ఎప్పటినుండో బ్యాన్ అమలులో ఉంది. కాని కొన్ని కొన్ని ప్రాంతాల్లో
అనధికారముగా పోలిసుల అనుమతికి లోబడి పందెంలు నిర్వహిస్తారని విన్నాను.
ఆ విషయమునే ఇందులో సరదాగా ప్రస్తావించాను. వ్యక్తిగతంగా నేను కోడి పందాలుకు వ్యతిరేకం.