Tuesday 25 February 2014

ఒకే ఒక్కడు-2.....

ఒకేఒక్కడు మొదటి భాగం కొరకు దీనిపై క్లిక్ చేయండి..


ఒకేఒక్కడు తరువాయి భాగం:-
డిసెంబరు 9 ప్రకటన తదుపరి శ్రీకృష్ణ కమిటి నివేదిక సమర్పించిన తర్వాత కూడా తెలంగాణా ఏర్పడగలదని ఎవరూ ఊహించలేదు. తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి కేసిఆర్ అక్రమ దందాలకు  పాల్పడుతున్నారని, కుటుంబ ఆస్దులు పెంచుకుంటున్నారనీ, తెలంగాణా కావాలన్న చిత్తశుద్ది అసలు కేసిఆర్ కు లేనే లేదని ఇలా ఎన్ని రకాల విమర్శలు చేసినప్పటికీ తెలంగాణా ఉద్యమ గాడతని, కేసిఆర్ దూకుడుని తగ్గించలేకపోయాయి.

ప్రజల్లో కూడా ప్రత్యేక తెలంగాణా కావాలన్న కోరిక ఎక్కువడం, అది ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిచుచుండడంతో మిగతా తెలంగాణా ఇతర పార్టిలకు చెందిన నాయకులు ప్రత్యేక తెలంగాణావాదం వైపునకు మరిలారు....

కానీ ఇక్కడ చెప్పుకోవలసిన విషయమేమిటంటే...

కేసిఆర్ ఒక ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. పోని టి.ఆర్.ఎస్. బలమైన ప్రాంతీయ పార్టీనా అంటే అదీ కాదు.. కేవలం ఒక ఉపప్రాంతీయ పార్టి మాత్రమే.. కానీ తన ప్రాబల్యంను ఢీల్లీ వరకు తీసుకువెళ్ళడమే కాకుండా తన మాట ప్రతి స్దాయిలో చెల్లుబాటు ఆయ్యేలా చేసుకోగలిగారంటే కేసిఆర్ రాజకీయ చతురతని మెచ్చుకోకుండా ఉండలేము.

తొమ్మిది సం.రాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, దేశ రాజకీయాల్లో ఒక శక్తిగా అవిర్బవించిన చంద్రబాబునాయుడు కానీ, రాష్ట్రంలో బలమైన నాయకుడుగా అవతరించి మొత్తం పార్టిని తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగిన వై.ఎస్.ఆర్ కానీ కేసిఆర్ ని ఎదుగుదల ఆపలేకపోయారని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా వారిలా ఎటువంటి పెద్దస్దాయి పదవులు అనుభవించకుండానే వారిద్దరిని మించిన స్దాయిలో లాబీయింగ్ చేయించగలగడం నిజంగా ఆశ్చర్యకరమే...

కాంగ్రెసు ఆధిష్టానం కూడా కేసిఆర్ కి అంత విలువ ఏ విధంగా యివ్వగలిగిందో ఇప్పటికీ నాకు అర్ద్రం కాదు. లాలూ, పాశ్వాన్, పవార్, కరుణానిధి, జయలలిత, మమతాబెనర్జీ, ములాయం, మాయవతి లాంటి వారెందరినో చూసింది. వారిని ఎప్పుడు ఎలా ఉపయెగించుకోవాలో అలా ఉపయెగించుకోనేది. దారిలోకి రాకపోతే సి.బి.ఐ.కొరడాని గుళిపించడం ద్వారా దారిలోకి తెచ్చుకోనేది..

పైన చెప్పిన నాయకులు కన్నా కేసిఆర్ ఎక్కువేమి కాదు. కానీ వారెవరికి ఇవ్వలేని ప్రాధాన్యతని కేసిఆర్ కి ఇవ్వడంలోని అంత్యరం ఏమిటన్నది అంతుపట్టడం లేదు. కాంగ్రెసు ఆధిష్టానానికి కేసిఆర్ లొంగగలిగారు అనే దాని కన్నా కేసిఅర్ తన మాటని నెగ్గించుకోగలరు అనే విధంగా తన కార్యాచరణని రూపొందించగలిగారు.

తెలంగాణా యితర పార్టిల నాయకులు కలిసి రాకపోయినా, కాంగ్రెసు ముఖ్యమంత్రులు/యితర నాయకులు విభజన వ్యతిరేకముగా ఉన్నప్పటికి, ప్రధాన ప్రతిపక్షనేత కూడా విభజన వ్యతిరేకముగా ఉన్నప్పటీకిని ఒంటి చేత్తో తెలంగాణాని సాధించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.

ముఖ్యంగా స్వంత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తినా పలు సాంకేతిక/పరిపాలనపరమైన/యితర అంశాలకు ఎటువంటి విలువ ఇవ్వకుండానే తెలంగాణా ఏర్పాటుకు ముందుకు వెళ్ళడం వెనుక కేసిఆర్ ఉన్నారని వేరే చెప్పక్కర్లేదు.

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి దేశ రాజకీయాల్లో మంచి పట్టు కల్గిన చంద్రబాబునాయుడు ఒక వైపు, స్వయాన స్వంత ముఖ్యమంత్రే ఒక వైపు విభజన అడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ, తాను చెప్పిన దాని ప్రకారమే తెలంగాణాని సాధించుకురాగలిగారు. చంద్రబాబునాయుడు, జగన్ ల లాబీయింగ్ కేసిఆర్ లాబీయింగ్ ముందు పనిచేయకుండా పోయింది.

తెలంగాణా బిల్లుని అసెంబ్లీలో ఓడించి రాష్ట్రపతికి పంపినప్పుడు, కేసిఆర్ ఏమన్నారు....

“నేను రేపు డిల్లీ వెళ్ళి తిరిగి తెలంగాణా రాష్ట్రంతోనే తిరిగివస్తాను” అని. ఈ మాట విని చాలా మంది నవ్వుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని. వీడికి కాకమ్మ కబుర్లు చెప్పడం అలవాటే కదా అని...

“రేపు మధ్యాహ్నం నాటికి మీరందరూ సంబరాలు జరుపుకోవడానికి సిద్దంగా ఉండండి” అని పార్టి కార్యకర్తలకు పిలుపు ఇచ్చినప్పుడూ ఏమనుకున్నారు అందరూ.... చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడురా వీడు. లోక్ సభలో బిల్లు పాసు అవుతుందని ఎలా అనుకుంటున్నాడో అని...

కానీ ఏమయింది>>>>

అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ తాను చెప్పినట్టుగానే లోక్ సభలో ఎవడినీ లోపలకి రానివ్వకుండా తలుపులు బిడాయించి, ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేయించి మరీ బిల్లును ఆమోదించగలిగారు. తాను ముందు చెప్పినట్టుగానే తెలంగాణా ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

అలాగె తాను ముందు చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ నుండి డిల్లి వెళ్ళి, తిరిగి వచ్చేటప్పటికి తెలంగాణాలోనే అడుగుపెట్టగలుగుతున్నారు.....

నాయకులు చాలా మంది ఉండోచ్చు ..... కానీ వారందరిలో కేసిఆర్ ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు....

అరవై సం.రాల కోరికను నెరవేర్చి తెలంగాణా రాష్టా సాధకుడిగా తెలంగాణా ప్రజల దృష్టిలో ఉండిపోతారు.


తెలుగుజాతిని విడగొట్టినవాడుగా, విద్వేషాలు, అసత్యాలు ప్రసారం చేసి విభజన చేసిన వాడుగా సీమాంధ్రుల దృష్టిలో ఉండిపోతారు.

ఒకే ఒక్కడు..


కల్వకుంట్ల చంద్రశేఖరరావు..

పరిచయం అక్కర్లేని రాజకీయ నేత...

నేటి తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధనలో క్రెడిట్ ని చాలా మంది కోరుకోవచ్చును గానీ వాస్తవానికి తెలంగాణాని ఇంత వరకు తీసుకురావడంలో కేసిఆర్ పాత్ర లేకుండా చెప్పుకోవడానికి అస్కారం లేదు.

ఎన్టీఆర్ హయాంలో శాసనసభ్యుడిగా రాజకీయ ప్రస్దానం మొదలెట్టి, నేడు తెలంగాణా రాష్ట్ర పితామహుడుగా అవతరించడం వరకు గల కేసిఆర్ ప్రస్దానంను చూస్తే అతని రాజకీయ చతురతని మెచ్చుకోకుండా ఉండలేమనిపిస్తుంది..

ఒక నియెజకవర్గానికి మాత్రమే పరిమితమైన శాసనసభ్యుడిగా ఉన్న కేసిఆర్ తదనంతరం కాలంలో చంద్రబాబు మంత్రివర్గంలో స్దానం దక్కలేదన్న కారణంతో వేరుకుంపటి పెట్టి ఆ కుంపటి ద్వారానే తెలంగాణా పది జిల్లాల్లో తిరుగులేదనిపించుకోవడమే కాక ఢిల్లీ స్దాయిలో లాబీయింగ్ చేయించి తన అభిష్టానుసారం తెలంగాణాని సాధించుకురాగలిగిన ఒకే ఒక్కడు కేసిఆర్....

ప్రపంచంలో చాలా మంది నాయకులు తమ మనసులో గూడుకట్టుకున్న అసంతృప్తి జ్వాలల కారణంతోనే పైకి వచ్చారు. కేసిఆర్ కూడా అంతే... తెలుగుదేశంలో పార్టిలో ఉన్న కేసిఆర్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేబినేట్ లో కేసిఆర్ కు చోటు కల్పించకపోవడంతో అసంతృప్తితో బయటకు రావడంతోనే కేసిఆర్ యొక్క రాజకీయ పెరుగుదల ప్రారంభమయిందని చెప్పొచ్చు.

పాకిస్తాన్ ఏర్పాడడానికి కారణమయిన మహమ్మద్ ఆలీ జిన్నా వెళ్ళిన బాటలోనే కేసిఆర్ కూడా వెళ్ళాడని చెప్పుకోవచ్చు.

స్వాతంత్రోద్యమం జరుగుతున్న సమయంలో భారతదేశంలో గల పలు పేరేన్నిక గల నాయకుల ముందు తాను ప్రత్యేకమయిన నాయకుడుగా ఎదగలన్న ఆశతోనే ముస్లింలో తన ప్రాబల్యం పెంచుకొనే దిశగా అడుగులేసి ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్న నివాదంతో జాతిలో చీలిక తేవడం ద్వారా పాకిస్తాన్ ఏర్పరచడం, దాని ద్వారా పాకిస్తాన్ జాతిపితగా చరిత్రలో నిలిచిపోవడం జరిగింది.

అలాగే కేసిఆర్ కూడా చంద్రబాబు నాయుడు కేబినేట్ లో స్దానం దక్కకపోవడంతో బయటకు వచ్చిన కేసిఆర్ తెలంగాణా రాష్ట్ర సమితి పార్టిని స్దాపించారు. ఆ పార్టి స్దాపించిన  పన్నెండు సం.రాల తర్వాత చరిత్ర సృష్టించగలదని సాక్షాత్తు కేసిఆరే ఆ సమయంలో ఊహించియుండకపోవచ్చును.

టి.అర్.ఎస్ (తెలంగాణా రాష్ట్ర సమితి)ని స్దాపించేనాటికి తెలంగాణావాదమనేది అస్సలు ఎక్కడ లేనేలేదు. అంతకు ముందు పలు పర్యాయములు ప్రత్యేక తెలంగాణావాదము వినిపించినప్పటికీ మారిన పరిస్దితుల దృష్ట్యా అది మరుగున పడిపోయింది.

టి.ఆర్.ఎస్. ఏర్పడేనాటికి/దాని తర్వాత చాలా కాలం వరకు కూడా దాని ఉనికిని ఆ ప్రాంత నాయకులే పట్టించుకోలేదు. ఆయినప్పటికీ అత్మస్దెర్యం కోల్పోకుండా పార్టీని ముందుకు నడపడానికి సిద్దపడ్డారు..
 
ఆయితే తర్వాత కాలములో రాష్ట్రంలో మారిన సమీకరణాల దృష్ట్యా టి.ఆర్.ఎస్. కార్యాకలపాలు కూడా ఊపందుకున్నాయి. దానికి అప్పటి ముఖ్యమంత్రి నుండి సహయసహకారాలు అందియుండోచ్చు.  ఆయితే ప్రత్యేక తెలంగాణా వాదమును జనాల్లోకి తీసుకువెళ్ళాలంటే ఇదొక్కటే సరిపోదని భావించారు. మహమ్మద్ అలీ జిన్నా తరహా ఆలోచనను అచరణలో పెట్టడానికి సిద్దపడ్డారు.  దానితో తన మాటల్లో, చేతల్లో దూకుడుని పెంచారు. ప్రజల మధ్య చీలిక తేవడం మరియు ప్రాంతాల మధ్య సారూప్యాలను ఎత్తి చూపడం ద్వారా దుందుడుకు ధోరణిని అవలంభిచడం మొదలెట్టారు. ఆయన దుందుడుకు స్వభావం పై తెలంగాణా ప్రాంతపు నాయకులే విరుచుకుపడేవారు. ఆయితే రాన్రాను అక్కడి ప్రజల్లో కూడా నెమ్మదిగా విడిపోవాలనే విషపు బీజాలు మొగ్గ తొడగడంలో కొంత వరకు సఫలీకృతుడయ్యారు.  తన మాటల్లో కాఠినత్యని పరుష పదజాలంను చొప్పించడం ద్వారా బలమైన నాయకుడిగా ఎదగడానికి మార్గం సుగమం చేసుకున్నారు. అంతే కాకుండా పార్టి బలాన్ని కూడా నెమ్మదిగా పెంచుకుంటూ ఒక స్దాయికి తీసుకురాగలిగారు. ఆయితే ఆయన పరుష పదజాలన్ని అన్ని ప్రాంతాల నాయకులు ఖండిస్తూ వచ్చినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

తన రాజకీయ గురువు ఎన్టీఆర్ కి తన జీవిత చరమాంకంలో జరిగిన రాజకీయ పరాభవంను దృష్టిలో పెట్టుకొని పార్టిలో  తనకు సమాంతరంగా వేరేవరు ఎదగకుండా జాగత్తపడిన ముందుచూపు కల్గిన నాయకుడు కేసిఆర్... తన పార్టి ప్రతిష్టను పెంచుకోవడంలో భాగంగా ఎంతో దోహదపడిన అలె నరేంద్రని పార్టి నుండి సాగనంపడం కూడా అందులో భాగమే... అలె నరేంద్ర తర్వాత పార్టిలో ఒక ఒన్ మేన్ ఆర్మీగా తన స్దానంను స్దిరపర్చుకున్నారు. అదే విధంగా టి.ఆర్.ఎస్. పార్టిలో రాకెట్ వేగంతో దూసుకువస్తున్న మేనల్లుడు హరీశ్ రావుని కట్టడి చేయడానికి కొడుకుని కూతురిని రంగంలోకి ముందుగానే దింపిన మేధావి. తద్వారా పార్టి తనను కాదని ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోకుండా కాపాడుకున్నాడు.

తెలంగాణాలో టి.ఆర్.ఎస్.కి పెరుగుతున్న ప్రాబల్యంను గుర్తించో లేక రాజకీయ అవసరాల దృష్ట్యానో మిగతా పార్టీలు కొన్ని సందర్బాల్లో టి.ఆర్.ఎస్.తో పొత్తునకు సుముఖత చూపాయి. తొలుత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఆయితే తెలుగుదేశం అప్పటి ఎన్నికల్లో ఘోరపరాభవం చెందడంతో దానికి దూరంగా జరిగి అధికార పార్టి కాంగ్రెసుకు దగ్గరవడం ప్రారంభించారు. అప్పటి కాంగ్రెసు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా తన రాజకీయ అవసరాల దృష్ట్యా కేసిఆర్ తో చెలిమి చేసారు. ఆ విధంగా కాంగ్రెసుకి దగ్గర కాగలిగిన కేసిఆర్ అనంతర కాలంలో కేంద్రమంత్రిగా కూడా కొంత కాలం పనిచేయగలిగారు. అంతే కాకుండా కాంగ్రెసు ఎన్నికల మేనిపోస్టోలో తెలంగాణా అంశాన్ని చేర్చగలిగారు.

ఆయితే కాంగ్రెసు మేనిపోస్టోలో  తెలంగాణా అంశాన్ని కేవలం రాజకీయ జిమ్మిక్కు గానే భావించారు కానీ, తదుపరి కాలంలో అది తెలంగాణా విభజనకి దారి తీయగలదని ఆంధ్రప్రదేశ్ లోని ఏ రాజకీయ నాయకుడు కూడా ఊహించలేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణా కాంగ్రెసు నాయకులే ఊహించియుండరు.  అందుకనే ఆ సమయంలో తెలంగాణా అంశంపై ఏ పక్షం వారు  కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే అది అచరణ సాధ్యంకానీ హమీ గా భావించడం వలనే...


కానీ దానిని నిజం చేసి చూపించిన ఘనత మొత్తం కేసిఆర్ కే దక్కుతుంది...

కాంగ్రెసులో అప్పటి వరకు బలమైన నాయకుడుగా ఉన్న వైఎస్ ఆర్ దుర్మరణం పాలవడంతో తెలంగాణాలో కేసిఆర్ ని నిరోధించగల నాయకుడంటూ ఎవరూ లేకుండా పోయారు. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణా కోసం దీక్షకు పూనుకోవడంతో తెలంగాణా ఉద్యమంను తారాస్దాయికి తీసుకురాగలిగారు. అప్పటికి కూడా తెలంగాణా కాంగ్రెసు నాయకులకు నమ్మకం కలగలేదు భవిష్యత్తులో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకలదని.

ఆయితే సీమాంధ్రుల మీద తన దూకుడు స్వభావం కొనసాగించడంతో పాటుగా దోపిడివాదమును కూడా పైకి తీసుకువచ్చారు. తెలంగాణా వెనుకబాటుతనానికి సీమాంధ్రులే కారణమని,  నిరుద్యోగాలకు, వెనుకబాటుతనానికి ఇలా పలురకముల రుగ్మతలకు కారణం సీమాంధ్రులే కారణమని చెప్పడం ద్వారా ప్రజల్లో విద్వేషన భావలను తారాస్దాయికి తీసుకురాగలిగారు. అందులో ఎక్కువ అసత్యాలే కావడం దురదృష్టకరం. రాజధాని హైదరబాద్ నకు పొట్టకూటి/చదువు కోసం తెలంగాణా మిగతా ఎనిమిది జిల్లాల నుండి ప్రజలు ఎలా తరలివచ్చారో, సీమాంధ్ర పదమూడు జిల్లాల నుండి ఆ విధంగానే తరలివచ్చారు అనే విషయమును మర్చిపోయి సీమాంధ్రులను ద్వేషించడం మొదలెట్టారు.

ఈ విధంగా తన రాజకీయస్వలాభం కోసం తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టిన వాడుగా కేసిఆర్  అపఖ్యాతి మూటకట్టుకున్నారు. 
                                                                                                              ఇంకావుంది....

Monday 17 February 2014

1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం..



వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం. 

పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే. 

స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే.

చాలా దూరం వాళ్ళు అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు. 

స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.. 

మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం. 

రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం. అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం. అలాగే ఇంటర్నెట్ లో చాట్ రూం లలో మాట్లాడినవాళ్ళం. 

VCR
ని ఎలా వాడాలో తెలుసుకొని, వాడిన తరం మనదే.. అలాగే అటారి, సూపర్ నిటేండో లో విడియో టేపుల ద్వారా ప్రోగ్రామ్స్ 56 K బిట్ మోడెం లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తరం. 

కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. 

సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం.. 

సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన రోజులు మనవే. 

మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో అందుబాటులో, టచ్ లో ఉండేవాళ్ళం. 

స్కూల్ కి మామూలు బట్టలూ, కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా వెళ్ళాం. ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు. 

స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం. 

స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం. 

ఎవరి ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం, క్లాసులో బేధాలు చూపే వాళ్ళం కాదు. 

చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం. జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం. 

పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే. 

క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే. 

ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే.. 

మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్....... లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం. 

ఆనందం మరెన్నడూ తిరిగిరాదు కదూ.. మీరేమంటారు. ?
:) 

(ఫేసుబుక్ నుండి)