Friday 9 October 2015

నేతాజీ మరణం - నిజాలు (?)


నేతాజి సుబాష్ చంద్రబోస్ ఎలా మరణించారన్న దానిపై ఇప్పటికీ సరయిన సృష్టత లేదు. ఒక్కొక్కొ చోట ఒక్కొక్కలా చెప్పుకోవడమే తప్పితే ఖచ్చితమైన కధనమంటూ ఏదీ బయటకు రాలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన బిజెపి వల్లనైనా ఆ పని ఆవుతుందనుకుంటే, వీళ్ళు కూడా ముందు ప్రభుత్వాలు పాడినట్టే పాత పాట పాడారు. ఇలాంటి సందర్బంలో నేతాజీ గురించి గతంలో వినని ఈ క్రింది  ఆస్తకికర కధనం నా కంటపడింది.  కానీ ఇందులో ఉన్న విశ్వసనీయ ఎంత అనేది తెలీదు.  ఈ మధ్యనే కులదీప్ నయ్యర్ వారి "అక్షరానికి అవల" ను పూర్తిచేసాను. అందులో నేతాజి అదృశ్యం గురించి ఏమైనా ఉంటుందెమో అనుకున్నా గానీ, అటువంటిదేది అందులో రాయలేదు.

                                                                                        ****

(ఎం.వి.ఆర్. శాస్త్రి, ఆంధ్రభూమి ఎడిటర్, ఉన్నమాట, 03/10/2015)

గాంధీగారు కాంగ్రెసుకు సర్వాధికారి.తిరుగులేని నియంత...
..
అంతటివాడికే ఎదురొడ్డి నిలిచి గెలిచినవాడు జాతీయ కాంగ్రెసు చరిత్రలో ఒకే ఒక్కడు:
నేతాజీ సుభాష్ చంద్ర బోస్.
...
1939 త్రిపురి కాంగ్రెసు అధ్యక్ష ఎన్నికలో నేతాజీకి పోటీగా పట్ట్భా సీతారామయ్యను నిలబెట్టి మహాత్ముడు సర్వశక్తులు ఒడ్డినా బోసుబాబే ఘనవిజయం సాధించాడు.
* * *
దేశాన్ని అడ్డగోలుగా చీలుస్తూంటే మీరెలా ఊరుకున్నారు? ఎందుకు తిరగబడలేదు అని విదేశీ పత్రికా ప్రతినిధి ఆ తరవాత అడిగితే స్వతంత్ర భారత ప్రధాని నెహ్రు పండితుడు ఏమన్నాడు?
..
అప్పటికి మా శక్తులు సన్నగిల్లాయి. పోరాటాలు చేసిచేసి అలసిపోయాం. మళ్లీ ఉద్యమించి జైళ్లకు వెళ్లే ఓపిక మాకెవరికీ లేదు. స్వాతంత్య్రానికి దేశ విభజన దగ్గరిదారి చూపింది. అందుకే ఒప్పేసుకున్నాం.
..
నెహ్రులాగే, ఆయనకు తోడుబోయిన కాంగ్రెసు మహానాయకుల్లాగే మిగతా దేశం కూడా కాడికింద పారేసి కాళ్లు బారజాపి కూచుని ఉంటే బహుశా నెత్తుటి ముద్ద స్వాతంత్య్రం కూడా సిద్ధించేది కాదు. మిగిలిన అగ్రనేతలు అలిసి సొలిసి దిక్కులు చూస్తున్న సమయాన ఒక నేతాజీ చిచ్చర పిడుగులా చెలరేగాడు. ఆంగ్లేయ సర్కారు కళ్లుకప్పి రహస్యంగా దేశం వదిలిపోయి బ్రిటిషు వారిపై పోరుకు సాయుధ సైన్యాన్ని కూడగట్టాడు. ఏకంగా ప్రవాస భారత ప్రభుత్వమే నడిపాడు. స్వతంత్ర రాజ్యాధినేతగా పనె్నండు దేశాల గుర్తింపు పొందాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆజాద్ హింద్ ఫౌజ్‌తో దండెత్తివచ్చి, తెల్లవారి పీచమణచి, దేశవాసుల సహకారంతో భరతమాతను విముక్తి చేయగలిగేవాడే.

* * *
కాంగ్రెసు వారి క్విట్టిండియా పోరాటం కొనే్నళ్ల కిందటే ముగిసిపోయింది. కనుచూపు మేరలో పోరాటాలూ లేవు. మీ పెత్తనానికి వచ్చిన గత్తరలూ లేవు. మరి మీరేమిటి - కొంపలేవో మునుగుతున్నట్టు అలా ఆదరాబాదరా జెండా పీక్కొని పలాయనం చిత్తగించారు? అంత అర్జంటుగా స్వాతంత్య్రం ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవడానికి మిమ్మల్ని పురికొల్పిన కారణాలేమిటి?’
-అని అడిగితే 1947 నాటి బ్రిటిష్ ప్రధాని అట్లీ అనంతర కాలంలో ఇచ్చిన జవాబు ఇది: ‘‘అతి ముఖ్యకారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభావం.’’
* * *
అంటే - ఈనాడు మనం విచ్చలవిడిగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం ప్రధానంగా నేతాజీ శౌర్యఫలం. అసలు సిసలు జాతీయ నాయకుడు అని నిస్సంకోచంగా పేర్కొన్నదగ్గవాడు సుభాష్ బోస్ ఒక్కడే. జాతికి, దేశానే్నలే వారికి కృతజ్ఞత అనేది ఉంటే నిత్యం స్మరించి, పూజించవలసింది ఆయననే.
చెప్పుకుంటే సిగ్గుచేటు. పూజించే మాట దేవుడెరుగు. కనీస మర్యాద, మన్ననలకే ఆ మహానుభావుడు నోచుకోలేదు.
....
ప్రపంచంలో ఏ దేశంలోనైనా - విముక్తి పోరాట కాలంలో ప్రజాకంటక ప్రభుత్వం జాతీయ యోధులను వెంటాడి, వేటాడుతుంది. స్వాతంత్య్రం సిద్ధించాక ఆ యోధులే స్వదేశంలో ఘన నీరాజనాలందుకుంటారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా జాతీయ వీరులను ప్రమాదకారులుగా పరిగణించి, వారి కుటుంబాల మీద నిఘా పెట్టే తప్పుడు పనికి సాధారణంగా ఏ స్వతంత్ర ప్రభుత్వమూ ఒడిగట్టదు.
మహా ఘనత వహించిన నీతులమారి భారత సర్కారు మాత్రం సరిగ్గా ఆ పాపిష్టి పనినే పావుశతాబ్దం పాటు జంకులేకుండా సాగించింది.
...
ప్రజాస్వామిక విలువలను,
నెహ్రు పండితుడే బోసు కుటుంబీకులకు, ఆయన సన్నిహితులకు వచ్చే ఉత్తరాలను పొంచి చూడమని, వారి కదలికలను నీడలా వెంటాడమని కేంద్ర గూఢచారి దళాన్ని పురమాయించాడట. ఆయన నిష్ఠగా సాగించిన ఈ నిఘా యజ్ఞాన్ని ఆయన సుపుత్రిక ఇందిర కూడా 1971 దాకా యథావిధిగా నడిపించిందట. ఏ రాజకీయ లబ్ధిని ఆశించి, ఎవరిని సాధించడానికి అయితేనేమి పశ్చిమ బెంగాల్ ఏలిక మమతా దీదీ బయట పెట్టించిన ప్రభుత్వ రహస్య పత్రాల్లో ఈ గుట్టు కాస్తా రట్టు అయింది.
....
ఇక్కడో సందేహం సహజం.
నేతాజీ బోస్ 1945 ఆగస్టు 18నే ఫార్మోసా వద్ద విమాన ప్రమాదంలో మరణించినట్టు సర్కారు వారూ అంగీకరించారు కదా? ఆయన చితాభస్మమని చెప్పబడేదాన్ని టోక్యోలోని రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరచడమూ ఆ రోజుల్లోనే అయింది కదా? తమకు సింహస్వప్నమైన నేతాజీ మరణించినప్పుడు, ఆయన వలె రాజకీయాల్లోకి దూసుకొచ్చి తమకు తలనెప్పి తేగలవారూ ఆయన బంధువుల్లో ఎవరూ లేనప్పుడు నెహ్రు ప్రభుత్వం ఎందుకు భయపడింది? తమ మానాన తాము బతుకుతున్న సామాన్య కుటుంబీకుల కదలికల మీద ఎందుకు గూఢచర్యం జరిపింది?
వారిని చూసి కాదు బెదురు. అసలు భయం నేతాజీకి ఏమయిందన్న రహస్యం దేశవాసులకు ఎక్కడ తెలిసిపోతుందోనని! అసలు సంగతి తెలిస్తే జనం తమ మొగాన పేడనీళ్లు ఎక్కడ కొడతారోనని!!
....
1945 విమాన ప్రమాదంలో బోస్ మరణించాడన్న అబద్ధాన్ని 1956 నాటి షానవాజ్ ఖాన్ కమిటీ చేత, 1970 ఖోస్లా కమిటీ చేత నొక్కి చెప్పించినా బూటకపు విచారణలను ఎవరూ నమ్మలేదు. 1999లో కోర్టు ఉత్తర్వువల్ల సుప్రీంకోర్టు మాజీ జడ్జి మనోజ్‌కుమార్ ముఖర్జీతో ఏర్పాటైన విచారణ కమిషన్ విమాన ప్రమాదం అబద్ధం, ఆ తరవాత కూడా నేతాజీ బతికే ఉన్నాడు అని నిర్ధరించింది. కాని దాని నివేదిక వెలువడే సరికి ఎన్డీఏ సర్కారు పోయి యుపిఎ జమానా వచ్చింది. తమ ఇలవేల్పులను ఇరుకున పెట్టే నివేదికను మన్మోహన్ సర్దార్జీ బానిస ప్రభుత్వం ఎంచక్కా బుట్టదాఖలు చేసింది.
....
శత్రువుకు శత్రువు మిత్రుడని భావించి, దేశానికి బ్రిటిష్ పెత్తనం పీడ విరగడ చేయటానికి, బ్రిటన్ శత్రువులైన జర్మనీ, జపాన్‌లతో చేతులు కలిపి సాయుధ సమరం సాగించాలని నేతాజీ ఆలోచన. ఈ ప్రణాళిక మొదట్లో బాగానే సాగింది. కాని నాజీ హిట్లర్ నమ్మదగిన వాడు కాదని అర్థమయ్యాక, జపాన్ సైతం చిక్కుల్లో పడ్డాక వ్యూహాన్ని మార్చుకోవటం తప్పనిసరి అయింది. సోవియట్ యూనియన్‌ను ఆశ్రయించి, బ్రిటన్‌పై పోరుకు సహాయం పొందాలని సుభాష్ బోస్ ఆశించాడు. ఆ ఉద్దేశంతోనే విమాన ప్రమాదం మిషతో మాయమై రష్యా చేరాడు. వేగంగా మారిపోయిన సైనిక సమీకరణల్లో బ్రిటన్, రష్యాలు ఏకమయ్యాయి. మిత్రదేశపు రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు నేతాజీని సోవియట్ నియంత స్టాలిన్ సైబీరియాలో నిర్బంధించాడు.
...
విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని టోక్యో రేడియో చేసిన ప్రకటన అనుమానాస్పదంగా ఉంది. అతడు అజ్ఞాత వాసంలోకి వెళ్లదలచుకుంటే ఇలాంటి ప్రకటనే చేయిస్తాడని నా నమ్మకం. ఇంతకీ ఏమయిందో, అతడు ఎక్కడున్నాడో కనుక్కోమని అప్పటి ఇండియా వైస్రాయ్ వేవెల్ తన హోం మెంబరును పురమాయించాడు. ఆగ్నేయాసియాలోని బ్రిటిషు గూఢచారి దళం ద్వారా అతగాడు సమాచారం రాబట్టాడు. యుద్ధ నేరస్థుడిగా బోస్‌ను ఇండియాకు తీసుకొస్తే ప్రమాదం. ప్రజల సానుభూతి అతడికి దండిగా ఉంది. అతడిని ఉన్నచోటనే ఉండనివ్వటం మనకు క్షేమం అని హోం మెంబరు చెప్పాడు. వైస్రాయ్ తల ఊచాడు.
..
ప్రపంచ యుద్ధం ముగిసింది. ఇండియాలో అధికారం చేతులు మారింది. దేశవాళీ సర్కారు పవర్లోకి వచ్చింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణం కట్టుకథ అని నెహ్రు ప్రభుత్వానికి తెలుసు. బోస్ బతికే ఉన్నాడని గాంధీగారు కూడా చెబుతూనే ఉన్నాడు. కొత్త ప్రభుత్వం తలచుకుంటే నేతాజీని సైబీరియా చెరనుంచి విడిపించి స్వదేశానికి సగౌరవంగా తీసుకురాగలిగేదే.
..
కాని బోస్ వస్తే తమ పని ఖాళీ అని నవభారత నేతాశ్రీలకు తెలుసు. ప్రజాబలంలో అతడి ముందు వారు ఎదురు నిలవగలగటం కలలో మాట. కాబట్టి అతడిని ఉన్నచోటే ఉండనివ్వటం తమకూ క్షేమమని వారూ తలిచారు. ఏమి జరిగిందో ఎరగనట్టు మాయమాటలతో కాలక్షేపం చేశారు. ఈలోపు అసలు సంగతి బోస్ బంధుమిత్రులకు ఎక్కడ తెలిసి పోతుందోనని భయపడి నేతాజీ సన్నిహితులందరి మీద గూఢచారులను పెట్టారు. వారికొచ్చే ఉత్తరాలను చించి, తమకు చిక్కులు తెచ్చే వాటిని సర్కారీ అరల్లో దాచేసేవారు. సైబీరియా ఖైదులో సుభాష్ బోస్‌ను తాను చూసినట్టు... ఆ వైనాన్ని రహస్యంగా ఉంచే షరతు మీద అధికారులు రష్యాలోని భారత రాయబారిని కూడా ఆయనను చూడనిచ్చినట్టు సోవియట్ గూఢచారి సంస్థ కె.జి.బి.లో పని చేసిన వాడు ఒకడు తాను రాసిన పుస్తకంలో కొన్ని సంవత్సరాల కిందే బయటపెట్టాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎవరెన్ని ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగినా భారత సర్కారు నోరు మెదిపితే ఒట్టు.


అసలు మిస్టరీ ఇది కాదు.
...
సాటిలేని జాతీయ వీరుడైన బోస్ జ్ఞాపకాలను తుడి చెయ్యాలని ఆయన ప్రత్యర్థి జవహర్లాల్ నెహ్రు ఆరాటపడ్డాడంటే అర్థం ఉంది. తమ కులదైవాల ప్రతిష్ఠ మసకబారకూడదన్న ఆదుర్దాలో కాంగ్రెసు ప్రభుత్వాలు గుట్టురట్టు కానివ్వలేదన్నా అర్థం చేసుకోవచ్చు. 
...
మీ రక్తం ఇవ్వండి; స్వాతంత్య్రం పొందండిఅని గర్జించిన మహానేతకు స్వతంత్ర దేశంలో ఇవ్వవలసిన నివాళి ఇదేనా? మన స్వాతంత్య్రం మేడిపండేనా?



Saturday 5 September 2015

రాము మాస్టారు



నిన్న సాయంత్రం “రాము మాస్టారు”కి ఫోన్ చేసా.  ఆయనకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు చెబుదామని కారణంతో. ఈ విషయం మొన్నటికి మొన్న మా ఊరి నుండి టీచరు ఉద్యోగం చేస్తున్న చిన్ననాటి జోస్త్ కన్నబాబు ఫోన్ లో చెప్పడంతో తెలిసింది. అంతే కాదు ఈ అదివారం పూర్వ విద్యార్దులతో కల్సి ఆయనకు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి తప్పక రావల్సినదే అని మరి మరీ చెప్పాడు.

ఉపాధ్యాయుల దినోత్సహం నాడు కాకినాడ అంబేద్కర్ భవన్ నందు ఆయనకు అవార్డ్ ప్రధానోత్సహం జరిగిందట. ఈ విషయం ఆయన చెపితేనే తెల్సింది. నేను ఆ సమయానికి కాకినాడలో ఉన్నప్పట్టికి సమాచారం లేని కారణంగా వెళ్ళడానికి వీలుపడలేదు. ఈ విషయమై నొచ్చుకొన్నాను కూడా.

ఆయితే ప్రభుత్వం వారు ప్రకటించే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఎంపికలో రాజకీయ పైరవీలు, ఇతర పైరవీలు ఉంటాయనే విషయంలో అనేక అపోహలు అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి. కానీ ఈ సందర్బంలో “రాము మాస్టారు”కి అవార్డు వచ్చిన విషయంలో నాకు ఎటువంటి అపోహ లేదు. ఆయనకు  ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకోవడానికి అర్హత ఎందుకు ఉందో ఆయన దగ్గర శిష్యరికం చేసి వివిధ ఉద్యోగాల్లో సెటిల్ ఆయిన అనేక మంది విద్యార్దులే ఇందుకు సాక్ష్యం. అందులో నేను ఒకడిని కావడం కొద్దిగా గర్వంగా ఫీలవుతున్నాను.

వాస్తవంగా చెప్పాలంటే, ఒక మాస్టారు ఉత్తమమైన బోధన చేస్తున్నారనే  అసలైన సర్టిఫికెట్ ఇచ్చేది విద్యార్దులు, తల్లిదండ్రులు, గ్రామస్దులే... ఆ విషయంలో మా “రాము మాస్టారు” ఎప్పుడో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్దు పొందినట్టే..  మా “రాము మాస్టారు” కి ప్రభుత్వం ప్రకటించిన ఆవార్డు జస్ట్ ఒక అభరణం మాత్రమే అని నా ఫీలింగు. ఆ స్టేజి ఆయన ఏనాడో దాటేసారు.

ఎలిమెంటరీ నుండి పి.జి వరకు నేను చేసిన చదువు ప్రయాణంలో అత్యధిక ప్రాముఖ్యత కల్గిన ఉపాధ్యాయుల్లో “రాము మాస్టారు”దే ప్రధమ స్దానం. ఆయనంతగా ప్రభావితం చేసిన వారు ఒక్కరూ లేరు. నాకు లెక్కలు సబ్బెక్టు అంటే ఉన్న మమకారం కారణంగా ఇంటర్ లో ప్రెవెటు మాస్టారు ఆయిన గిరిశం గారు కూడా నా మీద అభిమానం చూపించేవారు. ఆయితే తర్వాత కాలంలో ఆయనతో నా ప్రయాణం ఆగిపోయింది.

ఆయన ఈ స్టేజికి రావడానికి పట్టిన సమయం తక్కువేమి కాదు. అలాగే ఆయన నడిచొచ్చిన దారి పూలదారి కాదు కదా కనీసం మట్టి దారి కూడా కాదు. అలాంటి ప్రతికూలతలు అన్నింటిని తట్టుకొని “శాంతినికేతన్” ని నిర్మించి నాలాంటి వారికి అక్షరాలు దిద్దించి పదాలు నేర్పించి మాట్లాడడం నేర్పించి, రాయడం నేర్పించి విజేతలుగా తీర్చిదిద్దడం అనేది మామూలు విషయం కాదు.

“శాంతినికేతన్” రాము మాస్టారుకి తొలి మజిలీ ఆయితే నా విద్యాబ్యాసంనకు తొలి మజిలీ “రాము మాస్టారు”. “ఇనుమును బాగా కాల్చినపుడే మనకి కావల్సిన విధంగా మార్పు చేసుకోగలము” అన్నట్టుగా ప్రాధమిక విద్యాభ్యాసంలో గురువులు విద్యార్దులును మలిచే తీరు ఆధారంగానే అయా విద్యార్దుల భవిష్యత్తు ఉంటుంది.  అందుకనే చాలా మంది చెబుతుంటారు, ప్రాధమిక విద్యలో సరయిన గురువును పొందగలిగితే సరయిన విద్యాబుద్దులు అందితే ఆ తర్వాత తిరుగుండదు అని.  ఆ అదృష్టం చాలా మంది విద్యార్దులకు దొరకదు. కానీ మా ఊరిలో మా బ్యాచ్ మరియు ఆ తర్వాత చదివిన వారందరికీ “రాము మాస్టారు” ప్రాధమిక గురువు కావడం వలన  అందరూ సరయిన దారిలో ప్రయాణించగలిగారు. ఈ విషయం నేను కాదు, ఆయన దగ్గర చదువుకున్న ఏ విద్యార్ది ఆయినా అదే మాట చెబుతాడు..

“రాము మాస్టారు”కి ఫోన్ చేసినపుడు అదే మాట చెప్పాను ఆయనతో.. సార్, మీకు ఉత్తమ ఉపాద్యాయుడు ఆవార్డు రావడం అనేది ఒక అభరణం మాత్రమేనండీ... మాకు మీరు గతములోను, ఇప్పుడు, రేపు కూడా మాకు ఉత్తమ ఉపాధ్యాయుడే. ఆ విషయం మీ విద్యార్దులు సాధించిన విజయాలే చెబుతున్నాయి అన్నా..... నేను అన్న మాటలకు “రాము మాస్టారు” నవ్వేసారు. ఆ నవ్వు నాకు చాలా ఆనందంగా అనిపించింది.

ముందుగా ప్లాన్ చేసుకున్న అఫీసు ప్రొగ్రాం కారణంగా ఈ రోజు మా ఊరిలో “రాము మాస్టారు”కు జరుగుతున్న సన్మాన కార్యక్రమంనకు హాజరు కాలేకపోవడం వలన గిల్టీగా ఉంది. ఆయితే వీలు చేసుకొని మా ఊరు వెళ్ళినప్పుడు ఆయనని కలవకుండా మాత్రం తిరిగి రాను అని మాత్రం గ్యారంటీగా చెప్పగలను.


“రాము మాస్టారు”కి అభినందనలతో.....

Wednesday 26 August 2015

టెడ్డీ…


ఇది పూర్తిగా చదివితే మీ గుండె లోతులలో ఉన్న తడి బయటకు వస్తుంది 
.
.
జీన్ థామ్సన్ రోజు ఐదవ తరగతి క్లాసులోకి వెళ్ళింది . పిల్లలతో ఒక అబద్ధం చెప్పింది . " నేను మిమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తాను " అని . అబద్ధం ఎందుకు అంటే మూడో వరసలో ఉన్న Teddy Stoddard ఆమెకు నచ్చలేదు . క్రిందటి సంవత్సరం అతడిని చూసింది . అతడు మిగిలిన పిల్లల్లా ఆటల్లో ఉండకపోవడం , సరిగా డ్రెస్ చేసుకుని రాకపోవడం గమనించింది . అయితే అప్పుడు అతడు తన క్లాస్ కాదు . అయినా ఆమెకు అతడంటే సదభిప్రాయం లేదు . 
.
నెలలు గడుస్తున్నాయి . అతడి పేపర్స్ లో ఆమె రెడ్ మార్కులూ , తక్కువ మార్కులూ వేస్తోంది . అతడు మిగిలిన పిల్లలతో కలవలేక పోవడమూ గమనించింది . 
.
ఆమె పని చేసే స్కూల్ లో పిల్లలను గురించి టీచర్ రికార్డు రాయాలి . అందరి రికార్డు లూ రాసేసినా ఎందుకో ఆమెకు టెడ్డీ రికార్డు రాయాలనిపించక ఆలస్యం చేసింది . క్రిస్మస్ వచ్చేస్తోంది . రికార్డు రాసి అప్పగించాలి . 
.
ఒక రోజు అతడి పాత రికార్డు తిరగేసింది . 
.
అతడు ఒకటవ తరగతి లో టీచర్ ఇలా రాసింది " టెడ్డీ చాలా సరదా కుర్రాడు . అతడితో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు . హోం వర్క్ నీట గా చేస్తాడు . బ్రిలియంట్ బాయ్ " 
.
రెండో తరగతి టీచర్ రిపోర్ట్ " టెడ్డీ ఎక్సలెంట్ కుర్రాడు . కానీ అతడి తల్లికి వచ్చిన జబ్బు వలన అతడు కొంత కుటుంబం లో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు " 
.
మూడో తరగతి టీచర్ రిపోర్ట్ " టెడ్డీ చాలా కష్ట పడుతున్నాడు .. చదువులో బాగానే ఉన్నాడు కానీ అతడి తల్లి మరణం అతడిని కుంగ తీసింది . అతడి తండ్రి అతడిని పట్టించుకోవడం లేదు . అది అతడిపై విపరీతమైన ప్రభావం చూపవచ్చు " 
.
నాల్గో తరగతి టీచర్ రిపోర్ట్ " టెడ్డీ చదువులో వెనుకబడి పోయాడు . అతడు ఫ్రెండ్స్ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటున్నాడు . క్లాస్ లో నిద్ర పోతున్నాడు . అతడు ఒక ప్రోబ్లం చైల్డ్ కాబోతున్నాడు " 
.
.
థామ్సన్ కి ప్రాబ్లం అర్ధం అయ్యింది . ఇన్నాళ్ళూ తను తెడ్డె గురించి తెలుసుకోనందుకు బాధ పడింది ఆమె . అయితే ఆమె క్రిస్మస్ వేడుకలకు పిల్లలను తయారు చెయ్యడం లో తలమునకలు ఐపోయింది . టెడ్డీ ని సానుభూతితో చూడడం తప్ప ఏమి చెయ్యాలో ఆమెకు తోచలేదు . 
.
.
క్రిస్మస్ కు అందరు పిల్లలూ టీచర్ కి కానుకలు ఇవ్వడం ఆచారం 
.
పిల్లలు ఆమెకు విలువైన కానుకలు ఇస్తున్నారు అందమైన రేపర్లు చుట్టిన కాగితాలలో విలువైన గిఫ్ట్స్ . 
.
ఇంటికి సరుకులు తెచ్చిన పేపర్ బాగ్ లో ఏదో పెట్టి తెచ్చి ఇచ్చాడు టెడ్డీ . బేగ్ సగం చిరిగి ఉంది . అందులో ఒక ఇమిటేషన్ రాళ్ళ నెక్లెస్ ఉంది అందులో సగం ఊడిపోయాయి . ఒక ఉడుకులాం బాటిల్ ఉంది అందులో సగం ఉడుకులాం ఉంది . 
.
అందరు పిల్లలూ అది చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు . థామ్సన్ వారిని కసిరి నెక్లెస్ మెడలో వేసుకుంది . ఉడుకులాం చేతి మీద వేసుకుంది .
.
"
చాలా బావుంది " అని అంది .
.
ఆమె వెనుకగా నించున్న టెడ్డీ " మీరు రోజు మా అమ్మలా వాసన వేస్తున్నారు " అన్నాడు .
.
.
అందరు పిల్లలూ వెళ్లి పోయారు . అయినా క్లాసును వదల లేక పోయింది థామ్సన్ . క్లాసులో కూర్చుని గంట సేపు ఏడ్చింది . 
రోజు నుండి ఆమె వాడి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టింది . టెడ్డీ లో మార్పు చాలా త్వరగా వచ్చింది . ఆమె ప్రోత్సహిస్తున్నకొద్దీ చురుకుగా తయారయ్యాడు . వాడు సంవత్సరం తరగతి ఫస్ట్ గా వచ్చాడు . 
.
.
ఇక్కడితో అయిపోలేదు . 
.
.
నెక్స్ట్ సంవత్సరం ఆమెకు వచ్చిన ఉత్తరం లో " ప్రాధమిక విద్యాభ్యాసం లో నాకు నచ్చిన ఉపాధ్యాయిని మీరు " అది ఉత్తరం సారాంశం . 
.
6
సంవత్సరాల తర్వాత వచ్చిన ఇంకో ఉత్తరం " నేను సెకండరీ విద్య క్లాస్ లో థర్డ్ గా కంప్లీట్ చేశాను . అయినా మీరే నా ఫేవరెట్ టీచర్ " 
.
నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకో ఉత్తరం " నేను ఇపుడు చదువు విషయం లో కష్టపడుతున్నాను . ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా చదువు కొనసాగిస్తున్నాను . ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ఫేవరెట్ టీచర్ "
.
ఇంకో నాలుగు సంవత్సరాలు గడిచాయి . ఇంకో ఉత్తరం " డిగ్రీ తర్వాత ఇంకో నాలుగు సంవత్సరాలు చదవాలి అనుకున్నాను . చదివాను . సాధించాను . ఇదంతా మీ చలవే . మీరే నాకు ఫేవరెట్ టీచర్ " ఈసారి అతడి సంతకం లో Theodore F. Stoddard, M.D. అని సంతకం చేశాడు . 
.
.
ఇంతటితో కధ అయిపోలేదు . 
.
ఇంకో ఉత్తరం వచ్చింది .
"
నేను ఒక అమ్మాయిని చూశాను చర్చిలో పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను . మా నాన్న రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు . చర్చిలో పెళ్ళికొడుకు తల్లి కూర్చునే బెంచి మీద మీరు కూర్చోవాలని నా కోరిక " 
.
.
.
.
థామ్సన్ పెళ్ళికి వెళ్ళేటపుడు టెడ్డీ ఇచ్చిన నెక్లెస్ పెట్టుకుంది . అందులో సగం రాళ్ళు ఊడిపోయాయి . ఉడుకులాం రాసుకుంది . 
.
.
.
.
రోజు టెడ్డీ కి వాళ్ళ అమ్మ కనిపించి ఉంటుంది . 
.
.
.
.
.
(
మనం మన ప్రభావం ఎవరి మీద అయినా ఎలా పడుతుందో ఊహించలేము . అందుకని మిత్రులారా ! ఎదుటి వ్యక్తి తో ప్రేమగా ఉండండి . ప్రేమను పంచండి ------ ----- శోభన్ రాయ్ గారి పోస్టుకు అనువాదం )Stories like this, always have a way of putting the right perspective on life.

సేకరణ : ముఖపుస్తకం నుండి