Saturday 3 November 2012

రాంబాబూ.... ఇలా ఆయిపోయావేంటి?


నా ఇంటర్ మీడియట్ చదివే రోజులు.... అప్పటి వరకు కార్పోరేటు కాన్వెంటులో చదివి, మన ప్రమేయం లేకుండానే జీవితమంతా ఒక అర్డర్ ప్రకారం జరిగిపోయేది...

ఇంటర్ కి వచ్చాకా, స్వేచ్చా ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తున్న రోజులవి. అందులో ఇప్పుడు మాట్లాడబోయేది సినిమా లోకం గురించి...

అప్పటి వరకు నాన్న గారు దయతలచి సినిమాకు తీసుకువెళ్తే్ అదే పండుగ. మరలా ఎప్పుడు తీసుకువెళ్తారో మనకు తెలియదు. ఆయన ఏ సినిమాకు తీసుకువెళ్తే, ఆ సినిమానే నోర్మూసుకొని చూడాలి. నా సినిమా నాలెడ్జ్ ఎలా ఉండేదంటే, టి.వి.లో వచ్చే పాటలను చూసి ఆ సినిమా రిలీజ్ ఆయిందో, లేదో కూడా తెలేసేది కాదు. 

అలాంటి సమయంలో నేను ఇంటర్ లోకి వచ్చాను. నాకు టెన్త్ లో మంచి మార్కులు రావడంతో మంచి గవర్నమెంటు కాలేజిలో సీటు వచ్చింది. దానితో మా నాన్నగారు ఏమీ ఆలోచించకుండా జాయిన్ చేసేశారు. అంతే కాదు క్రమశిక్షణలో కూడా కొద్దిగా సడలింపు యిచ్చారు. కాని నేను ఏనాడు దానిని దుర్వినియెగం చేయలేదు. 

మేము ఇంటర్ గవర్నమెంటు కాలేజిలో చేరడంతో, నోట్సు కోసం బయట వేరేగా సబ్బెక్సు కోసం ట్యూషన్ లకి వెళ్ళేవాళ్ళము. కాలేజి ఒక పూటే ఉండేది.  సాయంకాలం సమయములో ట్యూషన్స్ కి వెళ్ళేవాళ్ళము. ట్యూషన్స్ ఆయిపోయిన తర్వాత సైకిలు మీద వెళ్తూ సినిమా వాల్ పోస్టర్స్ ని గమనిస్తూ వెళ్ళేవాళ్ళము. అలా నాకు సినిమాలంటే లైక్ ఏర్పడింది. సినిమాను సినిమాగా కాకుండా అందులో ఉన్న సాంకేతిక అంశాల మీద కూడా లైక్ ఏర్పడింది. దానితో ప్రతి సినిమా వాల్ పోస్టర్ ని గమనించి, ఆ సినిమా బాగుంటుందో , లేదో అని గెస్ చేసేవాడిని.

అలా ఉండగా, ఒక రోజు ట్యూషన్స్ ఆయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంటే, ఒక పోస్టర్ ని చూడమని నా స్నేహితుడు చెబితే, చూసా... చూడగానే ఆ పోస్టర్ మీద మంచి అభిప్రాయం కలగలేదు. అది “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”.  హిరో ఎవరో తెలియదు. అచ్చోచ్చిన వెధవలు అందరూ సినిమాల్లో నటిస్తే ఇలాగే ఉంటుంది అని అనుకొన్నాను.

ఏం పేరా అని చూస్తే కళ్యాణ్ బాబట....

ఇంకొక ఆరు నెలలు గడిచిన తర్వాత, అదే హిరోతో “గోకులంలో సీత” అనే సినిమా వచ్చింది. నా స్నేహితుడు ఆ పోస్టర్ చూపించి, అందులో హిరో చిరంజీవి తమ్ముడంట. సినిమా బాగానే ఉందట అని చెవిలో ఊదాడు. దానితో ఒక రోజు ఖాళీ చేసుకొని, ఇంటిలో చెప్పి ఆ సినిమాకు వెళ్ళా... ఏంటో సినిమా అంతా అదోలా అనిపించింది. బాగుందని కాదు.. బాగోలేదని కాదు... చిరంజీవి తమ్ముడు కాబట్టి పర్లేదులే అని అనిపించింది.

అలా ఇంకోక ఆరు నెలలు గడిచింది, ఈ సారి సుస్వాగతం సినిమా రిలీజ్... చాలా రోజుల వరకు ఆ సినిమా గురించి పట్టించుకోలేదు. కాని కాలేజిలో మాత్రం ఆ సినిమా గురించి గోల గోల ఆయిపోయింది. ఇంటిలో చెప్పి సినిమాకు వెళ్ళా... బయటికొచ్చిన తర్వాత అనుకున్నా... సెంటిమెంటు సీన్స్ అదరగొట్టేసాడు. ప్రకాశ్ రాజ్ ఇరగదీసేశాడు అనుకున్నాను. బానే ఉందిలే అనుకున్నాను.

మరల సంవత్సరం గడిచింది... ఈ సారి “తొలిప్రేమ” రిలీజ్... రిలీజ్ నుండి యూత్ మొత్తం ఆ సినిమా గురించే మాట్లాడుకోవడం. అప్పటికే కళ్యాణ్ బాబు మీద ఒక బెస్ట్ ఇంప్రెస్ ఏర్పాడంతో, సినిమా చూసా. బయటికి వచ్చాక మైండ్ బ్లోయింగ్...

ఎందుకంటే ఈ సారి సినిమాలో నటించింది కళ్యాణ్ బాబు కాదు... పవన్ కళ్యాణ్....

వావ్.. ఏం తీసాడు. చాలా సీన్లు నన్ను చూసి కాపీ కొట్టినట్టుగా కూడా అనిపించింది.... కాదు కాదు... నేనే ఆ సినిమాను కాపీ కొట్టానేమో అనిపించింది. చాలా సీన్లు నిజజీవితంలో జరిగినట్టుగా ఎంత నేచురల్ గా యాక్ట్ చేసాడు. ముఖ్యంగా పాటలు... అబ్బో... ఎక్కడ చూసిన అవే.... అప్పటి మా నాలెడ్జ్ కి అదే సూపర్ క్లాసికల్ సినిమాగా కనబడింది. మరల మరల చూడాలనిపించేది. చెల్లిగా నటించిన దేవకి, ప్రియురాలుగా నటించిన కీర్తిరెడ్డి సూపర్ గా యాక్ట్ చేసారు. రెండో సారి చూడాలనిపించి మరల వెళ్ళా, అమ్మకి చూపించాలని మరల వెళ్ళా, చెల్లికి చూపించాలని మళ్ళి వెళ్ళా... అలా పద్దెనిమిది సార్లు చూసా ఆ సినిమాను(ఇంట్లో తెలియదులెండి)...

అప్పటికి పవన్ కళ్యాణ్ స్టైల్ కి పూర్తిగా ఫిదా ఆయిపోయా.....

ఆ స్టైల్, కళ్ళలో ఆ పవర్, బాడీ లాంగ్వేజీ ఇలా అన్ని కూడా తనను మిగతా హిరోల నుండి వేరు చేసేవి.

ఆ తర్వాత ఇంకొక సంవత్సరం పోతే కాని రాలేదు “తమ్ముడు” సినిమా... అది కూడా సూపర్ హిట్టే.. ముఖ్యంగా కాలేజికి బంక్ కొట్టి చదువులో వెనుకబడిన వారిని బాగా సంతృప్తి పరిచింది.( నేను అప్పుడు కూడా ’ఎ’ క్లాస్ విద్యార్దినే). ముఖ్యంగా పాటలు... అందులోను రమణ గోగుల అందించిన “వయ్యారిభామ నీ హంస నడక....” మాట సూపర్ హిట్... అది కూడా సూపర్ హిట్ మూవీ ఆయి కూర్చుంది.. మా కాలేజి మొత్తం పవన్ కి ఫిదా ఆయిపోయారు.

మరల ఇంకో సంవత్సరం గ్యాప్...

ఆయినా సినిమా రాదే... వాడికి ఇంత బద్దకమేంటిరా బాబూ అనుకొనేవాళ్ళం.

ఎటువంటి హడావుడి లేకుండా “బద్రి” సినిమా రిలీజ్.... తొలిరోజే సినిమాకి వెళ్ళిపోయా.... ఆయిపోయిన తర్వాత అనిపించింది. సినిమా కిరాక్ ఎక్కించాడనిపించింది. అంతే కాదు పాటలు, స్టెప్స్, మేనరిజమ్స్ అన్ని పవన్ కి కొత్త స్టైల్ ని సంపాదించిపెట్టాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ “ఐయామ్ ఇండియన్...” మాకు బాగా కనెక్ట్ అయింది. నాకు తెలిసి అప్పటి నుండి తన ప్రతి సినిమాలో దేశభక్తి పాటను పెట్టుకునే హిరో ఒక పవన్ మాత్రమే...

“నువ్వు నంద ఆయితే, నేను బద్రి.. బద్రినాధ్.. ఆయితే ఏంటి”” డైలాగ్ టచ్ ఆయింది బాగా మాకు...
 

ఇక “ఏ చికితా..” సాంగ్ లో వేసిన కౌబాయ్ గెటప్, ఆ పాటలో స్టిల్స్, మేనరిజమ్స్ అంతా కొత్తకొత్తగా సాగిపోతుంది.... ధండర్ బర్డ్ బైక్ పై పాటలు ఇలాంటివన్నీ పవన్ కే సాధ్యమయ్యాయి.

మరల సంవత్సరం గ్యాప్ తర్వాత వచ్చింది

“ఖుషి” సినిమా..... పవన్ ని ఆగ్రస్దానానికి తీసుకువెళ్ళిన సినిమా ఇది. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్... దేశభక్తి సాంగ్.... తర్వాత “ఆడువారి మాటలకు అర్దాలు వేరులే...” పాట రీమిక్స్.... భూమిక అందాలు వెరసి సినిమాను ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాయి.

అక్కడితో పవన్ మేనియా నెమ్మదించింది... కాని పాపులారిటీ మాత్రం తగ్గలేదు...

ఆ స్టైల్ ని జనాలు మర్చిపోలేదు... తర్వాత ఎన్ని ప్లాప్స్ ఇచ్చిన జనాలకు అతనంటే క్రేజ్ తగ్గలేదు.

అలా ఒక సంవత్సరం కాదు... పది సంవత్సరాలుగా ప్లాప్స్ ఇస్తునే ఉన్నాడు.... ఆయినప్పటికి పీల్డ్ లో ఇప్పటికీ కౌబాయే.... ఎందుకంటే చాలా మంది పవన్ సినిమాల కంటే, అతని మేనరిజమ్స్ ని ఇష్టపడేవారు.

చివరికి పది సం.రాల తర్వాత గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టాడు...

కాని అది రొటీన్ సినిమాగానే అనిపించింది నాకు.... అందులో గత పవన్ కళ్యాణ్ కనబడలేదు. పైగా ముఖంలో డల్ నెస్... మెడ క్రింద మడతలు, ముందుకు తన్నుకువచ్చిన పొట్ట మొత్తానికి ఇది వరకు పవన్ లో ఉన్న ఫైర్ లేదు అనిపించింది...

తర్వాత ఆరు నెలలు తిరక్కుండానే “కెమెరామెన్ గంగతో రాంబాబు” సినిమా రిలీజ్ అయింది...
 

సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొంది. వారం రోజుల తర్వాత గానీ చూడడానికి కాని కుదరలేదు నాకు... సినిమా చూసిన తర్వాత నాకు ఏమనపించలేదు....

ఏంటీ.. అతను పవన్ కళ్యాణేనా? అని డౌటయితే మాత్రం వచ్చింది....

ఒకప్పుడు ఎలా ఉండే వాడు పవన్ కళ్యాణ్... చూరకత్తుల లాంటి చూపులు, పర్ ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్, ఢిపరెంట్ వాకింగ్ స్టైల్ అని వెరశి యంగ్రియంగ్ మ్యాన్ లా ఉండేవాడు...

మరి ఇప్పుడు? చూడలేకపోతున్నాను... ఆనాటి పవన్ ని నేడు ఈ విధంగా చూడలేకపూతున్నా.,...

వయసు ప్రభావం సహజమే అనుకోండి? కాని నాకే ఒప్పుకోబుద్ది కావడం లేదు.. ఏం నాగార్జున లేడా, సల్మాన్ ఖాన్ లేడా, సైఫ్ అలీ ఖాన్ లేడా యంగ్ గా?

అందుకే ఇక్కడి నుండి పవన్ సినిమాలకి సెలవు ఇద్దామనుకుంటున్నా.....

అందుకే అడుగుతున్నా నా అభిమాన నటుడుని...

ఏంటి రాంబాబూ... అలా ఆయిపోయావు? అని

10 comments:

  1. ...gabbar isngh nachaleda...??? niku?
    10 years back la leda Gb lo?
    pavan kaadu evvadu kuda 10 yers back ni compare chesthe okela undadu....
    how could you compare????

    n CGR Lo em leda????
    ante chusina janalu ...nachina vallu andaru pp la r????

    thokka la blogspot pettukoni istamochinattu rayaku...ok na
    rase scene niku ledu..

    ReplyDelete
    Replies
    1. రాహుల్ గార్కి,

      ముందుగా మీకు ప్రత్యేక ధాంక్స్ అండీ, ఎందుకంటే నా అభిమాన నటుడి మీద మీకున్న అభిమానానికి. పవన్ సినిమాల్లో సబ్జెక్ట్ తో పని లేదండీ... అందులో పవన్ ఉన్నాడా లేదా అనే విషయాన్ని చూసే సినిమాకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది పవన్ కి ఉన్న క్రేజ్... ఇకపోతే నేను మాట్లాడింది పవన్ లో కనిపిస్తున్న వయసు తాలుకూ ప్రభావం గురించి మాత్రమే... అది మీరు అర్ద్రం చేసుకోలేదు అనుకుంటా.... ఇకపోతే తొక్కలో బ్లాగ్ ఎందుకు పెట్టుకుంటారండీ... మన అభిప్రాయాలు రాయడానికే కదా... మీకు నచ్చినట్టుగా రాయాలంటే, మీ గురించి నాకు తెలియదు కదా! నాకు రాసే సీను ఉందా? లేదా? అనే విషయము మీతో చెప్పించుకోవడానికి నేను బ్లాగ్ రాయడం లేదు. ఎందుకంటే నాకు రాసే సీను లేదని నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి. ధన్యవాదములు

      Delete
    2. మీరన్నట్టు పది ఏళ్ళ నాటికి, నేటికి కంపైర్ చేయడం సరికాదు. కాని పవన్ మీద నాకున్న అభిమానం, తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకనే అలా రాసాను. పైగా అందరిలా పవన్ గారిది జిమ్ బాడీ కాదు. అది మార్షల్ ఆర్ట్స్ ద్వారా సంపాదించుకున్న బాడీ... అది త్వరగా పోదంటారు....

      Delete
  2. nagarjuna young ga unnada king cinema chusara?

    ReplyDelete
    Replies
    1. అంత డైరెక్టుగా అడిగేస్తే ఎలాగండీ,
      నిజమే మీరన్నట్టు కింగ్ సినిమాలో నాగార్జున అన్ గ్లామర్ గానే ఉంటాడు...
      పవన్ గారి మీద అభిమానంతో ఏదో అలా అన్నానండీ.....

      Delete
  3. nice post.
    మరొక్క విషయం ఎంటంటే పవన్ సినిమాల్లోని inspirational songs చాలా బావుంటాయి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములండీ,
      పవన్ గారు తన సినిమాల్లో మరియు పాటల్లో దేశభక్తి అంశాలు సృశిస్తారు. అందుకే ఆయనంటే నాకు ఇష్టం...

      Delete
  4. gabbar sing cinema lo meeru cheppinattu kaastha potta munduki vachi kanipinchaadu, kaani style, looks, body language vishayam lo maatram naaku meeru cheppinantha thedaa kanipinchaledu.. gabbarsingh cinema kante Rambabu cinema lo inkaastha baagunnaadu..

    ReplyDelete
    Replies
    1. ధ్యాంక్స్ శర్మ గారు,
      ఇదే ఫిట్ నెస్ ను పవన్ గారు జాగత్రగా మెయిన్ టెయిన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందండి నాలాంటి అభిమానులకు....

      Delete
  5. Pavan to paatu meeku kooda Age Vachhesindi . kaani pavan ku nag , salman and kaif to comparison emti?

    ReplyDelete