Friday 30 December 2011

ఐ హేట్ టు 2011

యస్. ఇప్పటి వరకు నేను ద్వేషిస్తున్న సంవత్సరముల్లో 2011  సంవత్సరము కూడా ఉంది. నాకు మాత్రమే కాకుండా,  చాలా మందికి కూడా ఈ సంవత్సరము కలసి రాక ద్వేషిస్తూ ఉండొచ్చు. నాకు మాత్రము ఈ సంవత్సరము మానసికంగా చాలా ఇబ్బందికర పరిస్దితులు కల్గించింది. నాకు ఎంతో ఇష్టమైన కుటుంబ సభ్యులను కొంత మందిని దూరము చేసింది ఈ సంవత్సరమే. నేను మొదటి నుండి కూడా కుటుంబంతో ఉన్న క్షణాలను పూర్తి స్దాయిలో అస్వాదించేవాడిని. సరిగ్గా రెండేళ్ళ ముందునాటికి ఉన్న పరిస్దితికి, నేటికి ఎంతో మార్పు వచ్చేసింది. మార్పు ఎప్పుడైనా సహజమే అనుకొండి. కాని ఆ మార్పు నన్ను ఇబ్బంది పెట్టే స్దాయిలో ఉండడమే సమస్య. అదీ కుటుంబ సమస్య కావడమే అన్నింటికన్నా బాధాకరం.  అందరికి ఉన్న సామాజిక సమస్యలు నాకూ వచ్చాయి. కాని వాటిని ఎప్పుడూ సమస్యలుగా భావించలేదు. కాని నా కుటుంబ సభ్యులలో వచ్చిన కొన్ని మార్పులు మానసికంగా ఇబ్బంది కల్గించాయి. రెండేళ్ళ క్రితం వరకు మానసికంగా నేను చాలా హ్యాపిగా ఉండేవాణ్ణి.  ఎందుకంటే నా సోదరి మధుమతి, కజిన్ బ్రదర్స్ వేణు, ఆశోక్, మధు మరియు మా అత్తయ్య గారి పిల్లలుతో కలసి మొత్తముగా ఒక గ్రూప్ గా ఉండి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందులో బాగా తమ్ముడు మధుబాబు గాడితో అనుబంధం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మాలో ఎపరికన్నా కమ్యూనికేషన్ గ్యాప్ లేక చిన్నచిన్న మనస్పర్దలు ఏమైనా వస్తే వాటిని దగ్గరుండి పరిష్కరించి కలిపేవాడు. పైగా వాడు మాకు దగ్గరలోనే ఉన్న యానాం రీజెన్సీ కాలేజిలో ఇంజనీరింగ్ చదివేవాడు. దానితో ప్రతి అదివారము కాకినాడలో ఉంటున్న మా ఇంటికి వచ్చేసేవాడు. ఇక ఆ అదివారమంతా ఇక్కడే ఉండేవాడు. తర్వాత మా చెల్లితో కూడా ఎంతో అప్యాయతతో ఉండేది. ఇకపోతే తర్వాత చెప్పవలసినది ఆశోక్ గురించి. తాను కూడా నేనంటే చాలా అభిమానము చూపించేవాడు. అంత హ్యాపిగా ఉన్న మా అనుబంధం చాలా వేగముగా విచ్చిన్నమయిపోయిందంటే నమ్మలేకున్నా. చెల్లి పెళ్ళి జరగడంతో తనతో ఉన్న ఎటాచ్ మెంట్ కొద్దిగా తెగిపోయింది. తర్వాత సంవత్సరమే మధుబాబు ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడు. దానితో నా ఎంజాయ్ మెంట్ లైఫ్ లో శూన్యత ప్రవేశించింది. మా బ్యాచ్ కుదించుకుపోవడంతో ఇక మిగిలిన ఆశోక్ తో ఎటాచ్ మెంట్ బాగా పెరిగింది. ఎంతగా అంటే చాలా ఎక్కువగా, ప్రతి విషయము తనతో పంచుకోనిదే పడుకోకపోవడమంతగా....
 కాని పెరుగుట విరుగుట కొరకే అన్న నానుడిని నేను ఆలోచించలేకపోయాను. ఎంతో అన్యోనంగా ఉన్న మా మధ్య చిచ్చులేపింది ఈ సంవత్సరమే. అసలే నా సోదరి, నా తమ్ముడు చేసిన ఖాళిని పూరించలేక మానసికంగా ఇబ్బంది పడుతుంటే, దానికి తోడు ఇప్పుడు ఇంకో తమ్ముడితో మనస్పర్దలు. అదే ఇప్పుడు మా తమ్ముడు మధుబాబు గాడు ఉంటే ఈ విధముగా మనస్పర్దలు వచ్చిఉండేవి కావేమో. అశోక్ తో ఒక విషయములో వచ్చిన మనస్పర్ద కారణంగా తననే కాకుండా ఇంకో ఇద్దరిని దూరము చేసుకొన్నాను ఈ సంవత్సరము. అందులో నేను పెళ్ళి చేసుకోవాలనుకొన్న ఒక అమ్మాయి కూడా ఉండడం నా దౌర్బాగ్యాం. దేవుడు నాతో ఈ సంవత్సరము ఎందుకు ఇలా అడుకొన్నడా అని అనుకొని సందర్బం లేదు. ఇప్పటికి వాడితో మాట్లాడి సుమారు ఐదు నెలలు కావస్తుంది. నిశ్చయమైన పెళ్ళిని కాన్సిల్ చేసుకొని, అ అమ్మాయిని కూడా దూరం చేసుకొన్నాను. దీనికంతటికి కారణం మా తమ్ముడు ఆశోక్ లో ఉన్న చిన్న అనుమానము. ఆ అనుమానము నా అత్మాభిమానమును దెబ్బతీసి, వారందరిని దూరం చేసుకోవలన్న స్దితికి తెచ్చింది. అదంతా ఈ సంవత్సరము చేసుకొన్న పుణ్యమే. ఈ రోజు కంప్లీట్ గా నేను ఒక్కడినే ఆయిపోయాను. నా సంతోషాలు, బాధలు చెప్పుకోని సేదదీరే అత్మీయులు లేక మానసికంగా యాతన పడుతున్నాను.  ప్రస్తుతము నేను ఒక్కడినే రూమ్ లో ఉంటూ సోలో లైఫ్ ని అనుభవిస్తున్నాను. అనుబంధాలు, అత్మీయతల మధ్య పెరిగిన నాలాంటి వాడికి, ఒక్కసారే అలాంటి వాటికి దూరము కావడంలో ఉన్న కష్టమేమిటో అనుభవించిన వాడికే తెలుస్తుంది.  రూమ్ లో ఒక్కడినే ఉండి, నా మెబైల్ నుండి నా అత్మీయులు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండునని ఎదురుచూస్తున్నాను..... 

Monday 26 December 2011

పల్లె పాడవుతుంది.....

ఈ రోజు వృత్తిరీత్యా పట్టణాల్లో ఉంటున్న వారందరికి తప్పకుండా ఏదో ఒక సమయములో పల్లెలో గడిపిన నేపధ్యముంటుంది. వారందరిని ఒకసారి కదిపి చూస్తే, వాళ్ళ అంతరంగాల్లో పల్లెతో మమేకమైన అనేక అనుభూతులు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ప్రతి ఒక్కరికి తమ, తమ ఊళ్ళలో గడిపిన విషయాలు తల్చుకోవడం ద్వారా రీచార్జి ఆవుతుంటారు. ఎందుకు వారందరికి తమ తమ ఊరు లేక పల్లె లంటే ఇష్టం? ఇలా అడిగితే సమాధానము చెప్పడము కష్టం కదా! అంటారు. ఎందుకంటే పల్లెతో ముడిపడిన మన బాల్యం యొక్క ప్రతి తీపి గురుతు ఇప్పటికీ మన మనసుల్లో మెదలుతూ ఉంటుందీ కాబట్టి. ఉదయాన్నే తాతయ్య, నాన్నలతో కలసి చేనుకి వెళ్తాని మారాం చేసి వెళ్ళడం, అక్కడ గేదేలు మరియు యితర పశుపక్షాదులను చూడడం, లేగ దూడని కట్టు వివ్పేసి తల్లి గేదే దగ్గర వదిలేయడం. అది చూసి పెద్దవాళ్ళు మందలించడం. బడికి వెళ్ళడానికి మారాం చేస్తే, అమ్మ మన జేబులు నిండా తినుబండారాలు నింపి పంపడం, బళ్ళో ఎక్కాలు సరిగా చెప్పలేదని పంతులు గారు గోడ కూర్చిలు వేయించడం, చింత బద్ద తో తొట్టు తేలేలా కొట్టడం, బడి ఆయిపోయాక పొలం గట్టులంటా పరిగెట్టి ఊరి చివరనున్న చెరువులో దూకడం. ఇలా చెప్పుకుంటే పోతే, వాటనన్నిటిని రాయడానికి ఈ పేజి సరిపోదు., ముఖ్యంగా చెప్పుకోవలసినది, ఆనాడు పల్లెల్లో ఉన్న అనుబంధాలు గురించి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వలన వ్యక్తుల మధ్య అనురాగాలు ఏ విధముగా ఉండేవో చెప్పన్నక్కర్లేదు. అంతే కాదు.. కుటుంబం మాత్రమే కాకుండా ఇరుగు పొరుగు అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండేవారు. వారందరిని కూడా ఏదో ఒక వరుస కలపి అక్క, బావ, అత్త, పెద్దమ్మ, పిన్నమ్మ, చిన్నాన్న, మావయ్య అనే పేర్లుతోనే పలుకరించేవారు. భోజనాలు ఆయిపోయాక చుట్టుప్రక్కలా ఆడాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకొనే సందర్బాలు చూడడానికి చాలా బాగుండేవి. కష్టసుఖాలు అన్ని అందులోనే మాట్లాడుకొనేవారు. ఇక పోతే గురు శిష్య బంధముల గురించి. బళ్ళో మాస్టారంటే అందరికి ఉచ్చే.. అంత భయముండేది మాకు మా మాస్టార్లంటే... ఏ మాత్రము చిన్న తప్పు జరిగినా, దానికి తగిన శిక్ష ఖచ్చితముగా ఉండేది. పైగా ఆ విషయము ఇంట్లో తెలియకుండా జాగత్తపడేవాళ్ళం. ఎందుకంటే ఇంట్లో తెలిస్తే మమ్మల్లే తప్పుబడతారని భయపడేవాళ్ళం.
కాని ఇప్పుడు అదే పల్లెలకు వెళ్ళి చూడండి.. పైన చెప్పినవేవి ఇప్పుడు కనబడడం లేదు. ఉమ్మడి కుటుంబాలు పోయాయి. చుట్టుప్రక్కల వాళ్ళతో మాట్లాడాలంటే ప్రెస్టేజి. అందరితో బంధుత్వాలు కలుపుకొని మాట్లాడలంటే దాన్ని అతిచనువుగా భావించడం. ఆడాళ్ళందరూ ప్రక్కవాళ్ళ మీద చాడీలు చెప్పి గొడవలు పడడం. ఇలా చెప్పుకుంటే పోతే ఈ పేజి చాలాదేమో రాయడానికి. కాలముతో పాటు ఎన్ని మార్పులు వచ్చినప్పటికి మనకు మాత్రము మన పల్లెంటే ఉన్న మమకారము పోదు కాబట్టి, ఇంకా ఖాళి దొరికినప్పుడు, పల్లెకి వెళ్ళి కూసింత మనశ్శాంతి కోరుకుంటాము. కాని అక్కడ పరిస్దితులు పట్టాణాల కన్నా దారుణంగా తయారయ్యాయి. మొన్న ఆ మధ్య మా ఊరు వెళ్ళినప్పుడు, అక్కడ మా స్కూల్ లో జరుగుతున్న ఒక భాగోతం గురించి నా స్నేహితుడు చెప్పినప్పుడు ఒకింత షాక్ కి గురయ్యాను. అదేమిటంటే, మా ఊరి హైస్కూల్ లో తొమ్మిది మరియు పదవ తరగతి అమ్మాయిలను ఆ స్కూల్లో పని చేస్తున్న కొంత మంది మాస్టార్లు లొంగదీసుకొని వాడుకుంటున్నారని. ఎంత దౌర్బాగము ఈ పరిస్దితి. బంధాలన్నింటిల్లోను అత్యంత పవిత్రమైన గురుశిష్యుల బంధం ఈ స్దాయికి దిగజారుతుందని కలలో కూడా ఊహించలేదు. విద్యార్ది జీవితమును గాడిలో పెట్టి సరయిన దిశానిర్దేశము చూపించవలసిన గురువులు ఇటువంటి నీచపనులకు తెగబెడడం ఎంత దారుణమో తెలుస్తుంది. ఇంకా ఇంత కన్నా దుర్బరమేమిటంటే, విద్యార్దినులు కూడా ఈ రకమైన చర్యలకు ఉత్సాహము చూపించడం. విద్యార్దినిలకు తెలిసి, తెలియకో చేస్తున్న తప్పులను తల్లిదండ్రులు గుర్తీంచకపోవడం. ఈ విధమైన వాతావరణం వల్ల అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతుంది. ఈ విధముగా స్కూల్ స్దాయి నుండి బయటకు వచ్చిన విద్యార్దినిలు సదరు చర్యలను ఇంటర్ స్దాయిలో కూడా కొనసాగించడం చాలా దారుణం. ఇది మీకు నమ్మదగినదిగా కనబడకపోవచ్చు. కాని చాలా పల్లెల్లో ప్రస్తుతం ఇటువంటి పరిస్దితే రాజ్యమేలుతుంది. నిజానికి చెప్పాలంటే పల్లెటూర్ల అమ్మాయిల కన్నా, పట్టణాల అమ్మాయిలే కొంత నయము అనేపించేలా ఉన్నాయి ఈ సంఘటనలు. అలాగని పల్లెల్లో అందరూ అమ్మాయిలు అలాగే తయారయ్యరని చెప్పలేము. కొన్ని, కొన్ని పెద్ద కుటుంబాల్లోని పెద్దలు తమ పిల్లలను కనిపెట్టుకొని ఉండడం మరియు మంచి, చెడులు వివరించడం ద్వారా కొంత మంది పద్దతిగానే పెరుగుతున్నారు. మిగతా కుటుంబాలులోని తల్లిదండ్రులిరువురూ పని నిమిత్తము కూలి పనులకు వెళ్ళిపోవడం, మరియు తమ పిల్లలపై సరయిన దృష్టి పెట్టడం తదితర కారణాల వల్లన, కొంత మంది ఉపాధ్యాయులు ఇలాంటి విద్యార్దినులను ఎంచుకొని లొంగదీసుకుంటున్నారని తెలిసింది. ఇది ఎలాంటి నీచమైన సంసృతికి దారితీస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఈ విషయమై పిల్లల తల్లిదండ్రులు కూడా కలసికట్టుగా రావడం లేదు. మనది కానప్పుడు మనకెందుకొచ్చిన గొడవలే అని తప్పించుకుంటున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళ ఇంట్ళొ పిల్లకే ఆ ఘోరం జరిగినప్పుడు ఏంటి పరిస్దితి?? ఈ విధమైన పరిస్దితిని ఆ ఉపాధ్యాయులు గమనించి, తమ పనులను నిర్బయంగా కొనసాగించగలుగుతున్నారు. చివరికి విసిగివేసారి సీనియర్ స్టూడెంట్స్ కొంత మంది సదరు స్కూలుకి వెళ్ళి ప్రదానొపాధ్యాయలు వారిని నిలదీస్తే, ఆయన తనకు ఈ విషయము తెలియదని చెప్పారంట.. మీరే చెప్పండి ఇప్పుడు... పల్లె పాడవుతుందా... లేదా.........

Tuesday 20 December 2011

రష్యన్ కోర్టు భగవద్గితని నిషేదించడం ద్వారా హైందవ సంస్కృతికి వచ్చిన నష్టమేమి లేదు................

రష్యన్ కోర్టు ఒకటి, గీతాసారాంశమును ఉన్మాద చర్యగా అభివరిస్తూ నిషేదము విధించిన వార్త భారతదేశములో హైందవుల విపరీతమైన కోపానికి కారణమయింది. దీనిపై దేశములో అన్ని పక్షాలు తమ నిరశనను తెలియజేసాయి. మరియు అన్ని టి.వి. చానల్స్ లోనే దీనిపైనే చర్చ. పని ఉన్నోడు, లేనోడు ప్రతి ఒక్కడూ వచ్చి తమకు తెలిసిన చరిత్రనంతా గడబిడ వాగేస్తున్నారు. కాని గీత సారాంశమును ఏ ఒక్కరో నిషేదించినంత మాత్రాన, దాని యొక్క పవర్ తగ్గిపోదు. దాని యొక్క అద్బుత శక్తి నాశనమయిపోదు.
 ఎవడూ ఉన్నా, పోయినా, ప్రపంచం ఉన్నా, లేకపోయినా దానిని మార్చగలిగే శక్తి ఎవరికి లేదు. నా ఉద్దేశములో అరచేతితో సూర్యున్ని ఆపడం ఎంత కష్టమో, భగవధ్గీత మీద విషము చిమ్మడం కూడా అంతే. ప్రపంచంలో ఏదో ఒక కోర్టు భగవధ్గీత మీద విమర్శలు చేసినంత మాత్రానా భగవద్గీతకి ఉన్న పవిత్రతకి నష్టమేమి లేదు. నిజానికి ఈ విధమైన విమర్శలు ఈ నాటివి కాదు. ప్రపంచం మొత్తం మీద అత్యంత పురాతనమైన సంస్కృతి హైందవ సంస్కతే అన్న సంగతి ప్రతి ఒక్కడికి తెలుసు. అటువంటి పురాతనమైన హైందవ సంస్కృతి పై చాలా కాలము నుండే దాడి మొదలయింది. ఆ దాడి, గత శతాబ్దములో జనించిన యితర మత సంస్దల నుండే కావడం చాలా దురదృష్టం. హైందవ సంస్కృతి అత్యంత పురాతనమైనప్పటికి పరమత సహనం పాటించింది. హైందవ మతము ఏ యితర మత గ్రంధాల జోలికి గాని, మత నియమాల జోలికి కాని వెళ్ళిన సందర్బాలు లేనేలేవు అని చెప్పవచ్చు. మొన్న ఆ మధ్యన వాటికన్ సిటి అధికార వర్గాలు యోగా అభ్యాసముపై విమర్శలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి యోగా అనేది మానవ ఆరోగ్య పరిరక్షణకి సంబందించినదని అందరికి తెలుసు. 
 అటువంటి యోగాకి ఈ మధ్యన ప్రపంచమంతా విపరీతమైన ప్రాచుర్యం పొందింది. దేశ విదేశాలలో అనేక మంది యోగాను అభ్యసించడం ద్వారా దానికి విశేష ప్రాచుర్యం వచ్చింది. అంతే కాకుండా విదేశాలలో కొన్ని యూనివర్శిటిలలో యోగా మీద స్పెషల్ కోర్సులు కూడా ప్రారంభించారు. అటువంటి యోగా మేనియా ప్రపంచం మంతటా విస్తరించడంతో దానికి మతపరమైన రంగుని పులిమి, వివాదస్పదం చేయడానికి వాటికన్ సిటి అధికార వర్గాలు పాల్పడ్డాయని తెలుస్తుంది. దీనికి కారణం యోగా ని హైందవ సంస్కృతిలో భాగంగా వారు పరిగణించడమే. వారికి చెందిన వ్యక్తులే తాజాగా భగవధ్గితలో గీతా సారాంశమును ఉన్మాద చర్యగా పరిగణించి, దానిపై చర్యలకు కోరడం జరిగినదని వార్తసాధనాల ప్రసారాల ద్వారా తెలుస్తుంది. చాలా దశబ్దాల క్రిందటే, అంటే విదేశియులు మన దేశములో ప్రవేశించేనాటికే మన దేశములో ఉన్న హైందవ సంస్కృతిని తుడిచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కాని అవేవి సఫలం కాలేదు. పైగా అందులో చాలా మటుకు హైందవంలో కలసిపోయిన దాఖలాలు ఉన్నాయి. హైందవం ఎప్పుడూ తన మతప్రచారము చేసుకోలేదు. యితర మతస్దులను తమ మతములోకి రమ్మని ఏనాడు పిలవలేదు. పిలవదు కూడా. ఎవరికైనా తమంతట తామే హైందవ సంస్కృతికి ఆకర్షితులై ఇందులోకి రావాలి తప్ప, ఎవరూ రమ్మని ఫోర్స్ చేయరు. కాని ఈ విషయములో భగవధ్గీత మీద విమర్శలు గుప్పిస్తున్న సంస్దలు సమాధానం చెప్పగలవా?? చాలా మంది విదేశియులు భారతదేశానికి వచ్చి ఇక్కడి సంస్కృతికి దాసోహామయి హైందవంలోకి మారారు. ఇంకా మారుతున్నారు. అందులో అనేక మంది సెలబ్రీటిలు ఉన్నారు కూడా... వారెవరిని ఇందులోకి రమ్మని పిలవలేదు. వారంటవారే వచ్చారు. అదీ హైందవ మతము గొప్పతనము. ఈ విధముగా హైందవ సంస్కృతికి పెరుగుతున్న ఆదరణ చూసి కొన్ని యితర మత సంస్దలకు గిట్టకపోవడం సహజమే. కాని అది ఈ రకమైన దుగ్దకి కారణమవుతుందని నేనుహించలేదు.


ఇకపోతే హైందవ సంస్కృతికి ఈ దుస్దితి రావడం చాలా వరకు హిందువుల పాత్ర కూడా ఉంది. అద్యాత్మిక స్వేచ్చ ఉండడం వలన మతపరమైన నిబంధనలను అందరూ పాటించడం లేదు. మరియు చాలా మందికి తమ సంస్కృతికి సంబందించిన పూర్తి సమాచారము తెలియదు. సంస్కృతి తరతరాలకి మెసుకువెళ్ళవలసిన పెద్దవాళ్ళు, సదరు భాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోవడం వలన సంస్కృతి యొక్క గొప్పతనమును తర్వాత తరమునకు అందించలేకపోతున్నారు. నిజానికి ఈ నిర్లక్ష్యమే హైందవ సంస్కృతికి నిజమైన శత్రువు.
హైందవ సంస్కృతి పై విమర్శలు చేయడం ద్వారా తమ మత ప్రాప్తిని పెంచుకొందామనుకొనే మత సంస్దలకు నేను చెప్పేదొక్కటే. గీత సారాంశము పై మీరు విమర్శలు చేసినంత మాత్రానా దాని యొక్క శక్తి నశించిపోదు. దాని వలన దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుందని యిందుమూలముగా యితర మతసంస్దలకు తెలియజేస్తున్నాను. మిగతా మతసంస్దల్లో లొసుగులు చెప్పాలంటే, ఇప్పటికిప్పుడే పలు అంశాలు చెప్పగలను. కాని వాటిని నేను ఎన్నటికి తెలియజెప్పను. ఎందుకంటే నా సంస్కృతి పరమత సహనము పాటించమని చెప్పింది. మరియు అన్ని మతాల సారాంశమొక్కటే అని చెప్పింది. ఈ సూక్తిని అన్ని ధార్మిక సంస్దలు పాటిస్తే చాలా మంచిది.
ధర్మమును నీవు రక్షిస్తే, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది

Wednesday 14 December 2011

మూలాలు వదిలి పరిగెడితే ఇలాగే ఉంటుంది...............

ఒక అర్దికవేత్త అత్యంత ముఖ్యమైన ప్రధానమంత్రి పదవిలో ఉంటే ఇలాగే జరుగుతుంది. ఈ రోజు దేశములో పారిశ్రామికరంగం అభివృది రేటు దారుణంగా పడిపోవడంతో మన దేశ కరెన్సీ విలువ చాలా కిందకి దిగజారిపోవడంతో దేశ అర్దిక పరిస్దితి సంకటంలో పడింది. దేశాన్ని అభివృద్ధి పధంలో పరిగెట్టించడానికి ప్రణాళిక సంఘాలను ఏర్పాటు చేసింది ప్రస్తుత ప్రదాని అర్దిక మంత్రిగా ఉన్న సమయములోనే... ఏ దేశానికైనా, ఆ దేశంలో ఎప్పటినుండో నడుస్తున్న అర్దిక విధానాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారానే ఎదగగలుగుతుంది.. కాని మన పరిపాలకులైన అర్దికవేత్తలు మూలాలు వదిలి పరిగెట్టి, ప్రస్తుత దేశ అర్దిక స్దితిని ఇబ్బందికరమైన స్దితికి తెచ్చారు. మన దేశములో అర్దిక రేటులో ఎప్పటి నుండో అధిక శాతము కల్గిన వ్యవసాయ రంగంను ప్రతి ప్రణాళిక సంఘంలోను నిర్లక్ష్యం చేసి, అభివృద్ధి పేరిట పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేసారు. అది తప్పని నేననడం లేదు. ఒక దేశ పాలకులుగా ప్రదానమంత్రి వారు దేశములో ఉన్న అన్ని రంగాలను సమాన దృష్టితో చూసి వాటి ఎదుగుదలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. కాని మన ప్రధాన మంత్రి తన అర్దిక మేధో సంపత్తితో ఆలోచించి, దేశ అభివృద్దికి ఒక పారిశ్రామిక రంగం మాత్రమే సరయినదని భావించి మిగతా రంగాలను ముఖ్యముగా వ్యవసాయ రంగంను నిర్వీర్యం చేయడానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపోందించారు. 
 ప్రభుత్వ విధానాలు కారణంగా వ్యవసాయ రంగంతో పాటుగా చాలా దేశియ చిన్న స్దాయి పరిశ్రమలు అనేకం కనుమరుగైపోయాయి. ఇక ప్రభుత్వాలు వృద్ధి రేటు, ద్రవోల్బణం అదుపు అంటు సామాన్యులకు అర్దం కాని అనేక ప్రతిపాదనలు పెట్టి బడా పారిశ్రామిక వేత్తలను విపరీతముగా ప్రోత్సహించారు. వారు అడిగిన, అడగకపోయినా ప్రభుత్వము మాత్రము వారి మీద తమ ప్రేమను తగ్గించుకోలేదు. నిలబెట్టినంత కాలము పారిశ్రామిక రంగం అభివృద్ధి బాగానే సాగింది. కాని ప్రతికూల పరిస్ధితులు ఎదురవగానే మొత్తము వృద్ది రేటు మందగించి, మన కరెన్సీ విలువను పాతాళానికి తీసుకెళ్ళాయి. నిజానికి చెప్పాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి పేరిట ప్రభుత్వము చేపట్టిన ఉద్దీపణలు, ప్యాకెజీలు కొంత మంది మిలియనర్లగా అవతరించడానికి దోహదపడ్డాయని ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. భారిగా పెరిగిన వారి ఆదాయాలను చూపి మన దేశము అభివృద్ధి చెందుతుందన్నదానికి నిదర్శనంగా చూపారు. ఎప్పుడు లేనిది ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల స్దానాలు ఎక్కువ కావడం కూడా ప్రభుత్వ విధానాలు వారికి దోహదం చేసాయని చెప్పోచ్చు. కాని మిగతా రంగాల్లోని వారు చాలా హీన స్దితికి దిగజారడానికి కారణం ప్రభుత్వ విధానాలే.
అప్పట్లో ఒక సామెత ఎక్కువగా వినబడేది. "భారతదేశము చాలా ధనిక దేశము. కాని భారతీయులు మాత్రము పేదవారు" అని. ఎన్ని అటుపోట్లు ఎదురయినప్పటికి, మరియు ప్రభుత్వాల నుండి సరయిన సహకారము లేకపోయినప్పటికి వ్యవసాయ రంగము మరియు యితర చిన్న పరిశ్రమలు తమ మనుగడను కొనసాగించడం ద్వారానే ఈ మాత్రము అర్దిక స్దిరత్వం ఉందని చెప్పవచ్చు. సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధి పధంలో పరిగెట్టిస్తామని చెప్పిన అర్దికవేత్త మహశయులు, నేటి అర్దిక దుస్దితికి ఏమని సమధానము చెపుతారు?? తాము చేసిన చర్యలు ఫలితముగానే నేడు ఈ దుస్దితి దాపురించిదని చెపుతారా??? చెప్పరు..... ఎందుకంటే తాము అర్దికవేత్తలు కాబట్టి. దీనికి కారణముగా ప్రపంచ మార్కెట్టులో పతనంను ఒక కారణంగా చూపిస్తారు. అటువంటప్పుడు మన అర్దిక వ్యవస్దను ప్రపంచ మార్కెటుకి అనుబందంగా ఎందుకు తయారుచేసారని అడిగితే, సమాధానము ఉండదు. ఏది ఏమైనా దేశ అర్దిక వ్యవస్ద అనేది ఏదో ఒక రంగం మీద ఆధారపడియుండ కూడదు. అదే విధముగా వేరొక దేశ అర్దిక వ్యవస్ద ఆధారముగా ఉండకూడదని ఈ ఉందతమ్ తెలియజేస్తుంది
...

ఐ.ఎ.ఎస్. లు రాజ్యాంగ అతీతులా?? వారిని విచారించకూడదా??

ఎమ్మార్, ఓబుళాపురం మైనింగ్ ఆక్రమాలు తదితర కేసులలో సి.బి.ఐ. దర్యాప్తు చేపట్టిన దరిమిలా, ఈ మధ్యన అయా కుంభకోణాలతో సంబందం ఉన్న అప్పటి ఐ.ఎ.ఎస్. అధికారులను సి.బి.ఐ. అధికారులు విచారణ నిమిత్తము పలు పర్యాయములు తమ కార్యాలయాలకు పిలిపించుకోవడం, మరియు అవసరమైతే అరెస్టులు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు రాజగోపాల్ మరియు శ్రీలక్ష్మి తదుతరులను అరెస్టు చేసారు. ఇందులో రాజగోపాల్ ఇదివరకే రిటైర్ కాగా, శ్రీలక్ష్మి విధినిర్వహణలో ఉండగా అరెస్టు జరిగింది. ఇది జరిగిన తర్వాత ఐ.ఎ.ఎస్.లు అందరూ సదరు అరెస్టులను ముక్తకంఠంతో ఖండించి, సదరు అరెస్టుల విషయములో సి.బి.ఐ.కి ముకుతాడు వేయవలసినదిగా ప్రధాన కార్యదర్శిని కోరడం వరకు వెళ్ళింది. దానితో ప్రదాన కార్యదర్శి వారు సదరు సి.బి.ఐ. వారితో సమావేశము ఏర్పాటు చేసి, తమ వారిని ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని సూచించారు. ఇదంతా చదివిన తర్వాత అహా.... ఏమి ఔదార్యం... తోటి ఐ.ఎ.ఎస్.లు అవినీతి వ్యవహారముల్లో పీకలదాక మునిగితేలి ఉంటే, ఆ విషయాలను చూసి చూడనట్టు వదిలేయాలని సి.బి.ఐ. వార్కి సూచించడం ఏ సంస్కారము క్రిందకి వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. సామాన్య ఉద్యోగులు ఏ మాత్రము చిన్న అవినీతికి పాల్పడిన కఠినంగా వ్యవహరించే ఈ ఐ.ఎ.ఎస్.లు, తన దాకా వచ్చిన తర్వాత దానిని యిబ్బందులగా అభివర్ణిస్తారా?? సామాన్యుడు తప్పు చేస్తే ఒకలా, వీరు తప్పు చేస్తే ఒకలా చూడాలా?? వాస్తవానికి సామాన్య ఉద్యోగి కన్నా, పై స్దాయి అధికారులే నిబద్దత కల్గిఉండవలసిన అవసరము లేదా?? పై అధికారి నిబద్దతతో ఉంటే వారి క్రింద స్దాయి సిబ్బంది నిబద్దతతో ఉండరా?? ఇండియన్ సివిల్ సర్వీసు అధికారులుగా వారు ప్రభుత్వానికి, రాజ్యాంగానికి రక్షణగా వ్యవహరించవలసిన వారు డబ్బులు కోసము తమ కున్న అధికారాలను కుంభకోణాలు చేయడానికి ఉపయెగిస్తారా??? అవినీతి కుంభకోణాలకు జరగడానికి అస్కారమిచ్చిన జి.ఒ.లను విడుదల చేసిన వారిని ఏమనకూడదట....... పైగా వాటనన్నింటిని రాజకీయ ఒత్తిళ్ళు వల్లనే అని వివరణ ఇచ్చుకోవడం చూస్తుంటే, ఇక ఆ అధికార స్దానాలలో వారు ఎందుకు??? తప్పు చేసిన వాడు ఎవడన్న సరే శిక్ష అనుభవించవలసినదే..... ఎమ్మార్, ఓబుళాపురం గనుల కుంభకోణాల విషయములో ముఖ్యమైన జి.ఒ.ల విడుదల విషయములో సంబందిత మంత్రులతో బాటుగా ఐ.ఎ.ఎస్.ల పాత్రను కూడా ఖచ్చితముగా చూపవలసినదే... అదే ప్రస్తుతం సి.బి.ఐ. చేస్తుంది..... కాని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి మరియు ఐ.ఎ.ఎస్.ల సంఘం అధ్యక్షులు కలసి సి.బి.ఐ. జాయింట్ సెక్రటరీతో తమ వారిని యిబ్బంది పెట్టడం మానుకోవాలని సూచించడం చూస్తుంటే, అది చూస్తున్న ప్రభుత్వం, కోర్టులు ఏమి స్పందించకపోవడం ఏంటొ నాలాంటి సామాన్యుడికి అర్దం కావడం లేదు.

Friday 2 December 2011

నాగచైతన్యకి సూట్ కాని ’బెజవాడ’

అందరిలాగే నేను కూడా రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపుదిద్దుకొన్న బెజవాడ సినిమా మీద అంచనాలు పెట్టుకున్నాను. కాని సినిమా చూసిన తర్వాత గొప్ప అనుభూతి ఏమీ కలగలేదు. నాగార్జునతో శివ సినిమా తీసి సక్సెస్ ఆయిన దగ్గరి నుండి రామ్ గోపాల్ వర్మ తను తీసే ప్రతి సినిమా శివ సినిమా నేపద్యం ఉండేలా చూసుకుంటున్నాడు. అది కొన్ని సార్లు సక్సెస్ ఆయింది. కొన్ని సార్లు విఫలమయింది. ఇక సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాను కేవలం నాగ చైతన్య ను మాస్ హిరోగా నిలబెట్టడం కోసమే తీసినట్టుగా అనిపించింది. సినిమా అద్యంతం నటులందరూ వారి వారి పాత్రలో ఇమిడిపోయారు. కాని సీరియస్ నెస్ లేని ముఖంతో నాగ చైతన్య తన పాత్రకి పూర్తి న్యాయం చేయలేకపోయాడు. శివ సినిమాలో నాగార్జున చూపించిన ధీరత్వం, గాయం సినిమాలో జగపతిబాబు చూపించిన సీరియస్ నెస్, రక్తచరిత్ర సినిమాలో వివేక్ ఒబేరాయ్ చూపించిన కర్కశత్వంలను నాగచైతన్య ఏ స్దాయిలోను చేయలేకపోయాడు. ఐదో తరగతి చదువుకొనే బుడతడు మన ముందుకు వచ్చి పౌరుషమైన డైలాగులు చెప్తే ఎలాగుంటుందో, బెజవాడ సినిమాలో నాగచైతన్య నటన అలాగుంది. వాస్తవానికి చెప్పాలంటే ఈ సినిమాలో హీరో పాత్రధరికు కావలసినటువంటి గంభీరమైన ముఖం నాగచైతన్యకి లేకపోవడమే. అతను చెప్పిన ప్రతి డైలాగు, అతని బాడీ లాంగ్వేజికి సూట్ కానట్టుగా అనిపించింది. ఇదే సినిమాను ప్రభాస్ తోనే, లేక ఎన్టిఆర్ తోనే తీస్తే బాగుండునేమో అనిపిస్తుంది. నాగచైతన్యలో ఇంకా పసితనపు చాయలు పోలేదు. దాని వలన అతనికి తన వయసుకు తగ్గట్టుగా ప్రేమ కధా చిత్రాలు చేసుకుంటే బాగుంటుంది. తనకు ఇంకా వయసు వచ్చిన తర్వాత ఇలాంటి బరువైన పాత్రలు చేయవచ్చు. ఇక్కడ ప్రాబ్లెమ్ ఏమిటంటే, నాగార్జున శివ సినిమాతో హిట్ హీరోగా మారడడంతో, తన కొడుకు కూడా అలాంటి సినిమాతో హిట్ హీరోని చేయాలని అత్రుతపడుతున్నారనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చేయడానికి నాగచైతన్యకి ఇంకా సమయము ఉంది. కాబట్టి ప్రస్తుతానికి తన వయసు తగ్గ పాత్రలను ఎంచుకొని విజయాలు సాధిస్తే మంచిదని నాగార్జున ప్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దానికి ఉదహారణగా ఏ మాయ చేసావే, 100% లవ్ సినిమాలను ఉదహారిస్తున్నారు.

Friday 25 November 2011

ఒకసారి ఏమైందంటే......

అది ఈ సంవత్సరం ఏప్రిల్ మాసము. రౌతులపూడిలో ఉంటున్న మా అన్నయ్య వాళ్ళ కూతురు మధుర మొదటి పుట్టిన రోజుకి ఖచ్చితంగా రమ్మని ఫోన్ చేసాడు. నాతో పాటుగా కలెక్టర్ ఆఫీసులో పని చేస్తున్న నా చిన్ననాటి దోస్త్ బాపూరావు ని కూడా రమ్మని కబురు చేసాడు. అప్పుడు ఆఫీసు పనితో బిజీగా ఉన్నప్పట్టికి వెళ్ళక తప్పలేదు. సాయంత్రం ఆఫీసు ఆయిన తర్వాత బాపూరావుతో కలసి వెళ్ళి, తిరిగి మళ్ళి వచ్చేయాలని అనుకొన్నాము.
ఇకపోతే రౌతులపూడిలో ఉన్న గవర్నమెంటు జనరల్ హస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్ శ్రీహరి గారు మా అన్నయ్యకి స్నేహితుడు. ఆయనే కాదు, రౌతులపూడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మా అన్నయ్య తన స్నేహితులుగా చేసుకోనేవాడు. ఇంకా వివరముగా చెప్పాలంటే అతి ముఖ్యమైన వారందరిని తన స్నేహితుల జాబితాలో ఉండే విధముగా చూసుకొంటాడు. ఇలాంటి విషయాలలో మా అన్నయ్య చాలా ముందు చూపుతో ఉంటాడు. అంతే కాకుండా ఊళ్ళో ఉన్నవారందరితో మనవాడు చాలా టచ్ లో ఉంటాడు(రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పవనుకుంటాను). అందు కారణముగా పుట్టినరోజు వేడుకకు అందరిని పిలిచాడు. మరియు మా రైస్ మిల్లు దగ్గర ఆ రోజు రాత్రికి వారందరికి గ్రాండ్ గా పార్టి ఎరేంజ్ చేసాడు. ఇక నేను బయలుదేరే ముందుగా నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు తెమ్మన్నరని అని చెప్పి "నీకు ఒక మెసెజ్ పంపుతాను, దానిని మందుల షాపులో తీసుకొని వచ్చేటప్పుడు పట్టుకురా" అని చెప్పి మెసెజ్ చేసాడు. మెసెజ్ ఓపెన్ చేసి చూస్తే అందులో "Simmron Off" ఒక బాటిల్ అని రాసివుంది. ఆ మెసెజ్ లో మా వాడు తెమ్మని చెప్పిందేమోటొ మీకు తెలుసు ఉండవచ్చుమో కాని నాకు తెలియదు. ఎందుకంటే ఆ విషయములో నాకు అంత నాలెజ్ లేదు. అది ఒడ్కా బ్రాండ్ అని నాకు అసలు తెలియదు. మా అన్నయ్య సాధారణముగా తనకు కావలసిన మెడిసిన్స్ వాళ్ళ ఊరిలో దొరకపోతే నాకు మెసెజ్ పెట్టి సదరు మెడిసిన్స్ కాకినాడలో తీసుకొని పంపమనడం అలవాటు. ఆ విధముగా నేను ఎలాగూ రౌతులపూడి వస్తున్నాను కాబట్టి మెసెజ్ లో ఉన్న మెడిసిన్స్ తెమ్మని పురమాయించాడని భావించాను. అంటే వాడు పెట్టిన మెసెజ్ లొ అయిటమ్ ని నేను మెడిసిన్ గా భావించాను. పైగా మందుల షాపు అన్నాడు కాబట్టి అది ఖచ్చితముగా మెడిసిన్ ఆయివుంటుంది అని భావించాను. నిజము చెప్పాలంటే అసలు నేను ఆ మాత్రం కూడా ఆలోచించలేదు... ఇక సాయంకాలం ఆఫీసు ఆయిపోయిన తర్వాత బాపూరావు గాడితో రౌతులపూడికి బయలుదేరాను. దారిలో కనిపించిన మందుల షాపు దగ్గరకి వెళ్ళి, మా వాడు పంపిన మెసెజ్ చూపించి అందులో ఉన్న ఆయిటమ్ కావలని అడిగాము. ఆ అయిటమ్ ఏంటొ తెలియని బకారాలు మేము మాత్రమే అనుకుంటే, ఆ షాపు వాడు కూడా మాలానే బకారాల ఉన్నట్టున్నాడు.
మేము చూపించిన మెసెజ్ ని రెండు, మూడు సార్లు చదివి, ప్రక్కవాడిని అడిగి, చివరకు లేవని చెప్పి వేరే షాపుకు వెళ్ళమని సూచించాడు. సరే అని బయటకు వచ్చేసాము. నేను చూడనీ అని చెప్పి బాపూరావు కూడా మెసెజ్ చూసాడు. వాడికి లిక్కర్ బ్రాండ్స్ విషయములో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఆయినప్పటికి వాడికి స్ఫూరించలేదు అది లిక్కర్ లో ఒడ్కా చెందినదని.... మరల వేరే షాపుకి వెళ్ళితే అక్కడ లేదని చెప్పారు. దానితో ఒక ప్రక్క లేటు ఆయిపోతుందన్న భాద, ఇంకోక ప్రక్క ఆ అయిటమ్ దొరకలేదన్న బాధ ఎక్కువయిపోయాయి. ఈ లోపులో బాపురావు గాడు, మా వాడికి ఫోన్ చేసి ఆ అయిటమ్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోమని సలహా యిచ్చాడు. ఇది బాగానే ఉందనుకొని వెంటనే ఫోన్ చేసి, అన్న నువ్వు చెప్పిన మెడిసిన్ ఏ షాపులో దొరుకుతుందని అడిగా.. మా వాడికి అర్ద్రం కాలేదు నేను అన్నదేమిటో... దానితో తను పంపిన మెసెజ్ గురించి చెప్పా. ఆ తర్వాత అవతలి వైపు నుండి ఒక క్షణం నిశబ్దం, తర్వాత పెద్ద నవ్వు వినబడింది. అసలే చిరగ్గా ఉన్న నాకు దానితో ఇక చిరాకు వచ్చేసింది. అప్పుడు చెప్పాడు మా వాడు "నాయన అది మెడిసిన్ కాదు. అది ఒడ్కా బ్రాండ్... అది దొరికేది మందుల షాపులో కాదు బ్రాంది షాపులో". మరి మందుల షాపు అని చెప్పావు కదా అని అడిగాను ఉక్రోషంతో. మరి దానిని మందు షాపు కాకపోతే ఏమంటారని తిరిగి ప్రశ్నించాడు. దానిని బ్రాంది షాపు అనాలి అని చెప్పా నేను. అప్పటికే అవమానభారంతో నాకు మాట్లాడాలనిపించక ఫోన్ పెట్టేసి, మా వాడు అడిగిన బ్రాండ్ ..... తీసుకొని రౌతులపూడి బయలుదేరాను. అక్కడికి వెళ్ళిన ఆ విషయముతో మా డాక్టర్ గారితోటి మరియు అక్కడ ఉన్న వారందరికి చెప్పి ఒకటే నవ్వులు. మొదట్లో నాకు ఉక్రోషంగా అనిపించిన తర్వాత నేను కూడా వాళ్ళతో జతకలిపాను. ఇప్పటికి కూడా డాక్టర్ గారు, మా అన్నయ్య సదరు విషయమును గుర్తు చేసి ఏడిపిస్తుంటారు....

Thursday 24 November 2011

వారి నిర్లక్ష్య పాలనకు ఒక్క చెంప దెబ్బ సరిపోదు....

నిన్న కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్ పవార్ పై చెంప దెబ్బ పడిన ఉదంతానికి నేనేమి చింతించడం లేదు. పైగా అది చాలా తక్కువ చర్యగా భావిస్తున్నాను.. ఆ మాత్రమున నన్ను తప్పుగా అర్దం చేసుకోకండి. నిన్న శరద్ పవార్ పై పడిన దెబ్బ ఒక్క హర్విందర్ సింగ్ ది మాత్రమే కాదు, ఈ దేశ రాజకీయనాయకుల నిర్లక్ష్య పాలనకు ప్రతి సామాన్యుడు చేయలనుకొన్న పని అదే. కాని అసంఖ్యాక సామాన్యుల మనసులో ఉన్నదాన్ని హర్విందర్ సింగ్ చేసి చూపించాడు. దేశములో ఒక ప్రక్క తమ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లభించక, మరో ప్రక్క కూరగాయలు మరియు యితర వస్తువుల ధరలు సామాన్యుడినకు అందనంత ఎత్తులో ఊరేగితున్నప్పటికి, చీమ కుట్టునట్టు కూడా చలనం లేకుండా ఇంకా ఆ పదవినే పట్టుకు వేలాడుతున్న విలువల్లేని మనిషి అతను. ఒక వైపు దేశములో సామాన్యులు ఆకలి మరియు ధరల భారముతో అలమటిస్తూ ఉంటే, ఈయన గారు మాత్రము దేశానికి ఎందుకు కొరగాని క్రికెట్ అధ్యక్ష పదవిలో అంటగాగుచూ అమూల్యమైన సమయమును దానికే కేటాయిస్తున్న సదరు అమాత్యుల వారిని చెంప దెబ్బ కాకపోతే మరేమి చేయాలి. నిరసన తెలియజేయాలంటే చాలా మార్గాలున్నాయి. అంతేకాని ఇలాంటి దాడులకు దిగడం అనైతికము అంటూ, దాడి తదనంతరం పలువురు రాజకీయనాయకులు వ్యాఖ్యానించారు. కాని ఎప్పుడైనా సదరు దగాకోరు రాజకీయనాయకులూ ఏ నాడైనా సామాన్యుల రాజ్యాంగబద్ద నిరసనలను పట్టించుకొన్నారా?? ఏనాడు కూడా ఏ అమాత్యులు కూడా రాజ్యాంగ బద్దంగా తెలియజేసిన నిరసనను పరిగణనలోకి తీసుకొన్న దాఖలలు లేవు. అందుకే వారికి నిరసన ఈ విధముగా తెలియజేయవలసివచ్చింది. శరద్ పవార్ మీద పడ్డ దెబ్బ, ఒక్క అతని మీదే కాదు., అది మొత్తము ప్రభుత్వ మంత్రివర్గానికి అని తెలుసుకోవాలి. దానిని దేశములో ప్రతి సామాన్యుడి దెబ్బగా భావించాలి.. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రిగా ఎంతో భాద్యతగా వ్యవహరించవలసిన శరద్ పవార్, దానికి పూర్తి సమయమును కేటాయించకుండా లేదా దానికి రాజీనామా చేయకుండానే దేశానికి ఏ మాత్రము పనికిరాని క్రికెట్ అధ్యక్ష్య పదవిలు చేపట్టడం ఎందుకు?? ఒక వేళ దాని మీదే అంత మోజు ఉంటే వ్యవసాయ శాఖను వదులుకోవాలి. దానిని పూర్తి సమయమును కేటాయించగలిగే వేరొక రాజకీయనాయకుడికి అప్పగించడం మేలు.....

Tuesday 15 November 2011

పరులుకొక న్యాయము, తమవారికొక న్యాయమా?? ఎల్లో మీడియా వివక్ష.......

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆస్తులపై శ్రీమతి వై.ఎస్.విజయలక్ష్మి గారు వేసిన పిటిషన్ ఆధారముగా చంద్రబాబునాయుడు గారి హయాంలో జరిగిన కేటాయింపులు మరియు ఆయన అస్తులపై సి.బి.ఐ. ఎంక్వైరికి హైకోర్టు ఆదేశాలు యిచ్చింది. ఇది సాధారణమే... మన ప్రజాస్వామ్య దేశంలో కోర్టులు మరియు యితర వ్యవస్దలు ఎవరిపని వారు చేసుకుపోతుంటాయి. ఆయితే ఇక్కడ ఒకే రకమునకు చెందిన విషయములో మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియా తన కధనాల్లో ఎంత తేడా చూపిస్తుందో చూస్తుంటే, మీడియా మీద అస్యహం వేయకుండా ఉండడం లేదు. మొన్నటికి మొన్న ఆక్రమ సంపాదన విషయములో జగన్ పై సి.బి.ఐ. ఎంక్వైరికి ఇదే కోర్టు అదేశించినప్పుడు మరియు ఇప్పుడు చంద్రబాబునాయుడు పై సి.బి.ఐ. ఎంక్వైరికి ఆదేశించినప్పుడు ఎల్లో మీడియా యొక్క రాతలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. జగన్ పై ఎంక్వైరికి ఆదేశించినప్పుడు మన చంద్రబాబునాయుడు గార్కి మరియు ఎల్లో మీడియాకు ప్రజాస్వామం పై నమ్మకం కల్గినట్టు, కోర్టు వర్గాలు నిజాయితిగా వ్యవహరించినట్టు అనేక కధనాలు ప్రచురించి, జగన్ పై ఎంక్వైరికి అదేశించినందుకే, అతనేదో పెద్ద నేరగాడు అనేటట్టు సి.బి.ఐ. ఎంక్వైరి మొదలుకాకముందే తీర్పులు ఇచ్చేసాయి. అదే కోర్టు ఇప్పుడు నారా చంద్రబాబునాయుడు గారిపై ఎంక్వైరికి అదేశించినప్పుడు మాత్రం, కోర్టుదే తప్పు అన్నట్టుగా కధనాలు వ్రాయడం ఎంత వరకు సబబు.. సి.బి.ఐ. ఎంక్వైరికి సహకరించి తన సచ్చీలత నిరూపించుకోవలసినదిగా జగన్ కి సూచించిన తెదేపా నేతలు, నేడు తమ అధినేతకు అదే సలహా యివ్వడం మాని, దీనిని దురుద్దేశపూర్విత చర్యగా అభివర్ణించడం ఏ సంస్కారము క్రిందకి వస్తుంది. జగన్ తప్పు చేశాడు కాబట్టి సి.బి.ఐ. ఎంక్వైరి అనగానే భయపడినట్టు తెలుస్తుంది.. అతని అక్రమ సంపాదనను నిగ్గు తేల్చి శిక్ష విధించే చర్యలు కోర్టులు చూసుకుంటాయి. మరి చంద్రబాబునాయుడు గారు నిజాయితిగా తన సచ్చీలత నిరూపించుకోవచ్చు కదా.... తమ మీద ఇరవై ఆరుకు పైగా కమిటిలు వేసారని, ఎవరు ఏమి పీకలేకపోయారని డాంబికాలు పలికే బదులు, నిజాయితిగా సి.బి.ఐ. ఎంక్వైరిని అహ్హానించవచ్చు కదా.... (ఇవన్నీ జగన్ విషయములో చంద్రబాబునాయుడు గారు వెలిబుచ్చిన విషయాలే).
జనాలు తాము రాసిందే నిజమని నమ్ముతారన్న భ్రమలో ఎల్లో మీడియా ఉంది. ఎల్లో మీడియా యొక్క ఈ రకమైన వివక్షను ఏనాడో పసిగట్టిన ప్రజలు సదరు ఎల్లో మీడియాను పూర్తి స్దాయిలో విశ్వసించడం లేదన్నది నిజము.... దీనిని గుర్తించుకొని ఎల్లో మీడియా కేవలం జరుగుచున్న విషయాలను యధాతదముగా మాత్రమే ప్రజలకు తెలియజేప్పెవిధముగా ఉండాలి/. అంతే కాని స్వంత తీర్పులు మరియు స్వంత కధనాలు ఇచ్చే విధముగా ఉండకూడదు..... మనకి కావలసినది సమాజములో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడమే. ... అంతే కాని వాటిపై ఎల్లో మీడియా యొక్క తీర్పులు అక్కరల్లేదు.....

Sunday 13 November 2011

చేతన్ భగత్ కన్నా గొప్ప రచయితలున్నారు మన దగ్గర.. కాని......

చేతన్ భగత్.... పరిచయం అక్కరలేని రచయిత... అతను రాసిన ఫైప్ పాయింట్ సమ్ వన్, త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ, టూ స్టేట్స్ లాంటి రచనలతో పేరు తెచ్చుకొన్న రచయిత.. ఈ రోజు అంద్రజ్యోతి పేపరులో ఆదివారము స్పెషల్ లో చేతన్ భగత్ ప్రోగాము గురించి వ్రాస్తే ఏమిటా గమనించా... అది చేతన భగత్ తన కొత్త రచన రివల్సుషన్స్. అనే పుస్తకమును లాంచ్ చేయడానికి హైదరబాద్ వచ్చిన సందర్బముగా వ్రాసిన అర్టికల్. అందులో ఇంకా సదరు పుస్తకావిష్కరణకి ముసలివాళ్ళు మరియు పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఎవరూ లేరని, అందరూ యూతే అని.. ఇలాంటి సంఘటనలు మన పుస్తకావిష్కరణకి కానరావని అందులో రాసారు. అది చదవగానే నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే చేతన్ భగత్ కంటే బాగా వ్రాయగలిగే రచయితలు మనకి చాలా మంది ఉన్నారు. కాని వారందరూ చేతన్ భగత్ కున్నంత క్రేజ్ ఎందుకు సంపాదించుకోలేకపోయారు అన్నదానికి సమాధానము చాలా ఈజీగా దొరుకుతుంది. ఒకప్పుడు మరియు ఇప్పుడు కూడా మనకి గొప్ప రచనలంటే శ్రీశ్రీ, జాషువా, చలం మొదలగు వారు రాసిన పుస్తకాలే.. కాని వారు రాసిన పుస్తకాలు మరొక సాహితివేత్రలకు మాత్రమే అర్దమయ్యే విధముగా ఉంటాయి. అంటే వారి రచనలు కేవలం జనభాలో కొంత మంది తోటి సాహితివేత్తలకి మాత్రమే అర్దమయ్యేవిధముగా ఉండడం. అంటే వారి రచనలు మిగతా వారికి అర్దం కాని రీతిలో ఉంటాయి. అందువలన వారి రచనలు మొత్తము జనాలకి అర్దంకాలేదు. అందువలనే వారి రచనలు ఒక ప్రత్యేక వర్గానికి మాత్రమే పరిమితమయ్యాయి. కాని చేతన్ భగత్ మాత్రము అందరికి అర్దమయ్యేరీతిలో సింపుల్ లాంగ్వేజిలో రాయడం వలన అతని రచనలు ఎవరికైనా సులభంగా అర్దం చేసుకోగలుగుతున్నారు. అంటే అలాంటి రచయితలు మన దగ్గర లేరా?? అన్న ప్రశ్నకు ఉన్నారనే చెప్పాలి.. ఆ విధముగా వ్రాసే వాళ్ళలో మధుబాబు, యుద్దనపూడి సులోచనరాణి, యండమూరి వీరేంద్రనాధ్ లాంటి అద్బుత రచయితలున్నారు.. వారి రచనలు కూడా చేతన్ భగత్ రచనలకు వలే బిగుతుని కల్గి ఉంటాయి.
 మరి ఎందుకు చేతన్ భగత్ లా పేరు తెచ్చుకోలేకపోయారు అంటే??? చేతన్ భగత్ ఉత్తరాదికి చెందిన అహ్మదబాద్ అనే నగరానికి చెందిన వ్యక్తి కావడం ఒక కారణం కావచ్చు.. ఆయితే ఏంటంట అని మీరు అనుకోవచ్చు.. ఉత్తరాదిలో నాకు తెలిసినంత వరకు ప్రజలు తమ రోజు మొత్తములో ఉద్యోగసమయులో కష్టపడడం పోను మిగిలిన సమయములో కొంత సమయమును పుస్తక పఠనం లేక యితర వ్యాపకాల మీద దృష్టి పెడతారు. ఇంచు మించుగా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పుస్తకపఠన అలవాటు ఉంటుంది. దాని వలన వారు అన్ని రకములు పుస్తకములను చదువుతారు. కాని మనకి అలాంటి పరిస్దితి లేదు. నాకు తెలిసి యువతలో సుమారు తొంభయై ఐదు శాతానికి పైగా యువతకు పుస్తకపఠన అలవాటు లేదని ఖరాఖండిగా చెప్పగలను. అటువంటప్పుడు మన రచయితలు పైకి ఎలా రాగలుగుతారు. నిజానికి చేతన్ భగత్ అంటే మన వాళ్ళకి అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమా వచ్చేంత వరకు తెలియదు. అమీర్ ఖాన్ నటించిన త్రీ ఇడియట్స్ ఘనవిజయము తర్వాత, పలు సందర్బాలలో అమీర్ ఖాన్ స్వయముగా చేతన్ భగత్ నవలను, మరియు అతని గురించి చెప్పినందున, అక్కడి నుండి చేతన్ భగత్ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.
చేతన్ భగత్ వ్రాసిన నవల అధారముగా త్రీ ఇడియట్స్ సినిమాను ఉన్నదున్నట్టు తీయడం మూలముగా ఆ సినిమా చాలా గొప్పగా వచ్చిందని చాలా మంది అభిప్రాయము. మన రచయితల్లో యండమూరి వీరేంద్రనాధ్, యుద్దనపూడి సులోచనరాణి వారి నవల్లో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. అప్పట్లో దాసరి నారాయణరావు మరియు చిరంజీవి ఎన్నో హిట్ సినిమాలు అందించింది మన రచయితల వ్రాసిన నవలల ద్వారానే.. అప్పట్లో ఆ నవలలకు ఉన్న క్రేజ్ అధారముగా అయా సినిమాలకు ముందే పాపులారిటి వచ్చిన సందర్బాలున్నాయి.
 కాని వారు నవల్లో వ్రాసిన విధముగా సినిమాల్లో చూపించలేదు. అయా సినిమాల్లో నటించే స్టార్ హిరోల ఇమేజికి అనుగుణంగా అందులో అనేక మార్పులు చేసేవారు. అందువలన వాస్తవానికి సదరు రచయిత చెప్పిన అసలైన ఫీల్ సినిమాలోకి వచ్చేసరికి ఎక్కడ కనబడదు. ఇది మన తెలుగు సినిమా దౌర్బగ్యం. అందుకనే మన రచయితలకు పెద్దగా పేరు రాలేదు. ఇంకా ఖచ్చితముగా చెప్పాలంటే మన రచయితలు పాపులర్ ల్లోకి రాకపోవడానికి కారణం మన సినిమానే. అదే విధముగా చేతన్ భగత్ ప్రాచ్యురంలోకి రావడానికి త్రీ ఇడియట్స్ సినిమానే కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇక పేరు ప్రఖ్యాతులు గురించి ప్రక్కన పెడితే చేతన భగత్ వ్రాసిన నవలలు అంత గొప్పవిగా నాకనిపించలేదు. ఎందుకని మీరు అడగవచ్చు. ఆపాటి నవలలను మన మధుబాబు గారు ఎన్నో రాసారు. చేతన భగత్ ఎక్కువగా తన నవలకు మూల కధ ని ఏదైనా కొంతమంది యువకులు మధ్యన మరియు వారి సంఘర్షణల చుట్టు నడుపుతారు. మరియు అతను రాసిన విధానము, మన జీవితములో కూడా అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నమా అన్నట్టుగా ఉంటాయి. సాధారనముగా మన నిజజీవితములో సామాన్యముగా మన చుట్టు జరిగే అంశాలతోనే కధనం వ్రాస్తారు. దాని వలన అతని రచనల్లో బిగుతు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని అంతకన్నా బిగుతు మధుబాబు రచనల్లో కనబడుతుంది. కాని మధుబాబు గారి రచనలు ఒక సూపర్ కధని పోలినట్టుయుంటాయి. అంటే ఆయన వ్రాసే రచనల్లోని షాడొ, గంగరాం, వీరభద్రారెడ్డి వంటి క్యారెక్టర్లు మన నిజజీవితములో చూడలేము. అందుకే ఆయన కధలు ఒక ప్రత్యేక పంధాలో కొనసాగుతాయి. అలాగే మన యితర రచయితల రచనలలో కూడా కొద్దిగా నాటకీయత ఉంటుంది. అందువలన వారి రచనలు చదవడానికి బాగుంటాయి కాని అందులో మనము ఊహించుకోలేము. కాని చేతన్ భగత్ వ్రాసే ప్రతి నవలలోను ప్రతి కార్యెక్టర్ మనకి తెలుసున్నదే అనిపిస్తుంది. ఎక్కడో ఒకచోట అరే నాకు కూడా యిలా జరిగిందే అన్నట్టుగా ఉంటుంది. అంటే మనల్ని అందులో ఫీలయ్యేలా చేయగలుగుతున్నారు చేతన్ భగత్. అందుకనే ఆయన రచనలు బాగున్నట్టుగా అనిపిస్తాయి. కాని ఈ రోజు ఆయనకు పట్టాభిషేకం చేస్తున్న తెలుగు యువత.. ఒకసారి మన రచయితల రచనలను చదవగల్గితే అంద్ర రుచులేంటొ తెలుస్తాయి మన యువతకు. మరియు మనలో చాలా మందికి మంచి పుస్తకాలేంటో తెలియవు. దాని వలన ఏ పుస్తకము చదవాలో తెలియక తికమకపడతారు. అలాగే నేను కూడా మొదట్లో తికమక పడేవాడిని. అలాగని ఇప్పటికి కూడా నాకు సరిగా తెలియదు మంచి పుస్తకమేదో, చెడ్డదేదో.. నాకు బాగుందనిపించిన పుస్తకాలన్నింటిని చదివాను. అందులో నాకు నచ్చిన పుస్తకాలు మచ్చుకు మీ ముందు పెడుతున్నాను. మృత్యువు తర్వాత జీవితము, చే గువేరా జీవిత చరిత్ర, పడిలేచే కడలి తరంగం... ఈ మూడు నాకు చాలా బాగా నచ్చాయి......
పి.ఎస్... నేను సాహితిప్రపంచం అనే సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టును. దాని పరిధిలో ఒక బచ్చాగాడిని. ఏదో నాకు తెల్సినంతవరకు బాగుందని రాసాను. ఇందులో ఎవరికైనా నా తెలివితక్కువతన రాతలు ఉంటే మన్నించగలరని కోరుకుంటు
.......

Thursday 3 November 2011

అసాంజే కోసం గోతి దగ్గర నక్క లాగా ఎదురుచూస్తున్న అమెరికా.....

వికిలీక్స్ వెబ్ సైట్ ద్వారా అనేక దేశాలకు చెందిన రహస్య పత్రాలను ప్రపంచానికి లీక్ చేసిన జూలియస్ అసాంజే ను చేజిక్కుంచుకోవడానికి అమెరికా గోతి దగ్గర నక్కలాగా ఇప్పుడు ఎదురుచూస్తుంది. అమెరికా మరియు యితర దేశాల మధ్య రహస్యంగా ఉండవలసిన అనేక ముఖ్యమైన దస్త్రాలను సంపాదించి దానిని బయట ప్రపంచానికి తెలియజేయడం ద్వారా ప్రపంచ దేశాలను ఉలిక్కిపాటుకి గురిచేసి ఒక్కసారిగా వార్తలోకి ఎక్కాడు జూలియస్ అసాంజే. అతను విడుదల చేసిన పత్రాలతో ఎక్కువగా అమెరికాకే నష్టం కలిగించింది. పైగా యితర దేశాల అంతర్గత వ్యవహారాలలో అమెరికా ఎంతగా జోక్యం చేసుకుంటుందో వికిలీక్స్ విడుదల చేసిన పత్రాల ద్వారా వెలుగుచూసింది. ముఖ్యంగా ఆయా దేశాలలో రాయబార కార్యాలయల్లో పనిచేసే సిబ్బంది గూడచార్యానికి పాల్పడుతున్నట్టుగా ఆయా పత్రాలను బట్టి తెలిసింది. దానితో ఆయా దేశాలు అమెరికాను అనుమానపు చూపుల్తో చూడడం అమెరికాకు త్రీవ ఇబ్బందిని కలిగించింది.. అప్పటి నుండి అసాంజే పై కన్నేసిన అమెరికా, వికిలీక్స్ కు అవసరమైన అన్ని రకాల అయివు పట్టులను మూసివేయడం ద్వారా దానికి ప్రాణవాయువు అందకుండా చూసింది. పైగా అసాంజేను చెరపట్టేందుకు పధక రచన చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం బ్రిటన్ లో ఉన్న అసాంజేను తమ దేశానికి తీసుకురావడానికి వీలుగా అతనిపై లైంగిక నేరారోపణ చేసి స్వీడన్ కు అప్పగించే విధముగా పాపులు కదిపింది. దరిమిలా బ్రిటన్ కోర్టు ఒకటి అసాంజే ను స్వీడన్ కు అప్పగించవలసినదిగా తీర్పు యిచ్చింది. ప్రస్తుతం బ్రిటన్ లో అత్యంత కఠిన నిబంధనల మధ్య గడుపుతున్న అసాంజే తనను స్వీడన్ కి అప్పగిస్తే, అమెరికాకు అప్పగించినట్టే అని మెరపెట్టుకున్నప్పటికి బ్రిటన్ కోర్టు వినిపించుకోలేదు. ఆయినా బ్రిటన్ కూడా అమెరికాకు తొత్తే అన్న విషయము గమనార్హం. ఇక అసాంజే ను స్వీడన్ కు అప్పగించిన తర్వాత అమెరికాకు తరలించడం లాంచనమే.. తర్వాత అసాంజేకు అక్కడి కోర్టులు మరణ శిక్ష విధించవచ్చును. లేదంటే గ్వాంటానేబే జైలుకు తరలించవచ్చును. ఏది ఏమైనా అమెరికా ఉన్మాదానికి ఇంకొక వ్యక్తి బలి కాబోయే రోజు తొందరలోనే ఉందనిపిస్తుంది.... అలా కాకపోతే దేవునికి వేలాదివేల ధన్యావాదములు తెలియజేసుకుంటాను....

Wednesday 2 November 2011

భోదిధర్మ గురించి తెలియజెప్పిన చిత్రం "సెవెన్త్ సెన్స్"

సెవెన్త్ సెన్స్... సూర్య, మురుగదాస్ కలయికలో ఈ మధ్య వచ్చిన చిత్రం... ఈ చిత్రంపై అందరిలాగే ముందు నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది.. పైగా సూర్య తన నటనతో ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలడని ఈ సినిమా ద్వారా మరోసారి తెలియజేసాడు. ఇకపోతే సినిమా కధ గురించి మాట్లాడితే.. ఇందులో నాకు బాగా నచ్చిన అంశమేమిటంటే, ప్రస్తుతం చైనా లో యుద్దకళగా భావించే కుంగ్ ఫూ, షావోలిన్ విద్యలకు మూలము మన భారతీయతే అనే విషయము. భారతదేశానికి చెందిన భోదిధర్మ అనే వ్యక్తి తన ప్రపంచ యాత్రలో భాగంగా చైనాలోని ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ సమయములో మనకి తప్ప మరెవరికి ఎరుక లేని ఆమూల్యమైన వైద్య, యుద్ద కళలు అక్కడి వార్కి తెలియజెప్పడమనేది చాలా గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే నేను భారతీయున్ని కాబట్టి.. ఒక భారతీయుడు ద్వారా వారు అత్యున్నత స్దాయికి చేరుకోగలిగారు కాబట్టి. 
 ఒక భారతీయుడైన భోదిధర్మ చైనా మరియు జపాన్ తదితర ప్రాంతాలలో తనకు తెలిసిన విద్యలను అక్కడివారికి తెలియజేప్పడం ద్వారా అక్కడి ప్రజలకు దేవుడయ్యాడు. ఆ రోజు భోదిధర్మ భోదనలతో ప్రభావితమైన ఆయా దేశ ప్రజలు ఇప్పటికి ఆయనను గుర్తుపెట్టుకొని ఆరాధించడం చాలా గొప్ప విషయము.. అదే విధముగా మన దేశములో అదే భోదిధర్మ ఎవరో, ఈ సినిమా చూసినంత వరకు మనకు తెలియకపోవడం.. మనము మన సంస్కృతి మీద చూపిస్తున్న నిర్లక్యం.. నిజానికి మన దేశ చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నాటిది.. ఆనాటి నుండి, ఈ నాటి వరకు భారతీయుల భాగస్వామ్యం ప్రపంచమంతటా ఉంది. ఇప్పుడు చైనాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన మార్షల్ అర్ట్స్, షావోలిన్ విద్యలు మూలము మన భారతీయ యుద్దకళలే.. మరియు ఇప్పుడు ప్రపంచం మంతటా జపిస్తున్న పవర్ యోగ పుట్టుక భారతదేశంలోనే... కాని మనమందరము మన దేశ అద్బుత చరిత్ర మరిచి పాశ్చాత్య దేశాల ధోరణికి ఎంగిలి పడుతున్నాము. నేడు మనము ఎవరి ఎంగిలికి ఆశ పడుతున్నామో, ఆ పాశ్చాతులే నేడు భారతీయత సంప్రదాయానికి దాసోహమయి మన దేశాన్ని ఆరాధిస్తున్నారు..... ఈ విషయమై మంచి విషయాన్ని తెలియజేప్పేలా తీసిన చిత్ర దర్శకునికి నా జోహార్లు. ఈ విధముగా నేటి దర్శకులు మన భారతీయుల అద్బుత చరిత్ర కొద్దిగానైన సినిమాల ద్వారా తెలియజెప్పితే, నేటి మనలాంటివారికి ఎంతో కొంత తెలుస్తుంది.. చైనా, జపాన్ లో భోదిధర్మ కళలకు నేటికి కూడా ఆదరణ దక్కుతుందటంటే దానికి కారణం, అక్కడ దాన్ని ఒక ఆచారముగా భావించి క్రమము తప్పకుండా తమ తర్వాత తరాల వార్కి అందజేయడమే. దురదృష్టవత్తు మన పూర్వికుల్లో అది లోపించింది... సదరు దేశ సంపద్రాయలను పెద్దలు, తమ తర్వాత తరానికి ఖచ్చితముగా బదలాయించేలా చూడాలి. అప్పుడే మన సంప్రదాయాలు ఒక తరం నుండి మరోక తరానికి ప్రయాణిస్తాయి... ఈ విషయంలో మన పెద్దలు చొరవ తీసుకోవలసిన అవసరము ఉంది.....

Friday 21 October 2011

ముగిసిన మరో నియంత శకం... గడాఫీ..

లిబియాను నాల్గు దశాబ్దలుగా ఏకచత్రాధిపత్యంగా ఏలిన మూమర్ గడాఫీ నిన్న నాటో దళాలు, తిరుగుబాటుదారుల చేతిలో హతమయ్యాడు...

ప్రపంచ అగ్రరాజ్యాలు తమ స్వలాభము కోసం ఆడుతున్న క్రీడలో మరణించిన నాయకులలో గడాఫీ ఒకడు....
లిబియాలో ఉన్న అపార చమురు నిల్వలు, అగ్రరాజ్యాలు తమ జూద క్రీడకి తెరదీయడానికి అవకాశము కల్పించినట్టు అయింది.. చమురు నిల్వలు ఉన్న దేశాలలో తమ చమురు వ్యాపార కార్యాకలపాలు సజావుగా సాగాలంటే, ఆయా దేశాలలో నియంత లు ఉండడమే మేలనుకొన్నప్పుడు వారికి వంత పాడింది.... నేడు అదే నియంతలు మేకై గుచ్చుకొంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట తిరుగుబాటులు లేవదీసి మట్టుపెట్టడం మామూలే... అఫఘనిస్తాన్, ఇరాక్ లో జరిగిందేమిటో మనందరికి ఎరుకే.... గడాఫీ ఉన్నంతవరకు ఆగ్రరాజ్యాల పట్ల కఠినంగా వ్యవహరించినందున, అతన్ని మట్టుబట్టి, ఇప్పుడు లిబియాలో దోపిడి చేయడానికి రెడిగా కాచుకున్నాయి ఆగ్రరాజ్యాల గద్దలు..... ఇరాక్ లో డమ్మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అక్కడ చమురు వెలికితీత కంపెనిలన్నింటిని తమ దేశియుల చేతిలోనే పెట్టిన ఆమెరికా... ఇప్పుడు లిబియాలో కూడా అదే చేయనుంది.. అప్పటి వరకు లిబియాలో కూడా డమ్మి ప్రభుత్వమును పెట్టి, తను చెప్పినట్టు ఆడించుకుంటుంది.......
నాకు తెలిసి అమెరికాకు ఇంకా ఇప్పటికీ వ్యతిరేకముగా ఉన్న దేశాలలో క్యూబా ఒక్కటి... విఖ్యాత పోరాట యెధుడు చే గువేరా తిరుగుబాటు ద్వారా క్యూబాలో అమెరికా అనుకూల ప్రభుత్వమును పడగొట్టి తమ మిత్రుడైన ఫిడెల్ క్యాస్ట్రోను అధ్యక్షుడుని చేసిన దగ్గర నుండి ఫిడెల్ క్యాస్ట్రోను అంతమెందించడానికి ఎన్ని కుట్రలు పన్నిందో లెక్కలేదు..... కాని వాటన్నింటిని క్యాస్ట్రో సమర్దముగా ఎదుర్కొనడంతో అమెరికా ఆటలు సాగలేదు.... కాని ఏదో రోజు క్యూబా పరిస్దితి కూడా ఇరాక్, లిబియా వలే కావచ్చు..... ఇక మిగిలినవి ఆరబ్ దేశాలు..... లిబియా, ఇరాక్ లలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరు చెప్పి ఆయా దేశాధినేతలకు మరణశిక్ష లిఖించిన ఆమెరికాకు ప్రజాస్వామ్య సూచనలు మచ్చుకైనా కనిపించని ఆరబ్ దేశాలు గుర్తుకు రావెందుకో.... ఎందుకంటే ఆరబ్ దేశాధినేతలు అమెరికా మాట వినడం వలన.......

Wednesday 19 October 2011

సామాన్య ప్రజల ఆక్రోశం "వాల్ స్ట్రీట్ ముట్టడి" ...

అర్దిక మాంద్యం నేపధ్యంలో అమెరికా ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపణలు దేశ జనాభాలో ఉన్న ఒక్క శాతము ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని, మరియు అదే సమయములో మిగతా తొంబై తొమ్మిది శాతం ఉన్న సాధారణ ప్రజానీకానికి సబ్బిడిలో కోత విధించడం పై ఆ దేశ పౌరులు, వాల్ స్ట్రీట్ ముట్టడి పేరుతో స్టాక్ ఎక్సేంజ్ ని ముట్టడించి, అందలి కార్యకలాపాలకు అటంకం కల్గించారు. ఇందులో చెప్పుకోవలసిదేమిటంటే, ప్రభుత్వాలకు ప్రజలపై ఉన్న ఈ రకమైన వివక్ష ప్రపంచమంతా ఉన్నదే.... ముఖ్యంగా చెప్పాలంటే మన దేశములో ఎప్పటి నుండో ఈ రకమైన దోపిడి జరుగుతుంది... కాని మనవాళ్ళు ఏమి చేయలేక ఊరకుండిపోయారు. అమెరికాలో మాత్రం సదరు ధనిక, పేద తారతమ్యం పై తమ గళం విప్పారు. అర్దిక మాంద్యం అనేది ప్రభావం చూపినప్పుడు అది అందరి మీద ప్రభావం చూపుతుంది. అటువంటి సమయములో ప్రజలకు అర్దిక అసరాగా నిలబడవలసిన ప్రభుత్వాలు, విపణిలో తారాస్దాయిలో ఉన్న ధరలను అదుపు చేయడం మరియు జనాభాలో అధిక శాతమున్న సామాన్య ప్రజానీకానికి అర్దిక ఇబ్బందులు లేకుండా చూడడంలో సరయిన శ్రద్ద చూపడం లేదనేది సత్యం. కాని అతి తక్కువుగా ఉన్న ధనికుల ప్రయోజనాలను కాపాడడానికి మాత్రము ఎనలేని అత్రుత చూపుతున్నాయి. ఈ రకమైన వివక్షని సహించలేకనే అమెరికాలో వాల్ స్ట్రీట్ ముట్టడి జరిగింది. నేడు అది ప్రపంచ దేశాలన్నింటికి పాకి, నిరసనోద్యమాలు ఎక్కువవడానికి అవకాశము కల్పించింది. ఇకపోతే మన దేశములోని ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు. ఒక అర్దికవేత్త ప్రధాన మంత్రి అయితే, దేశ అర్దిక ప్రగతి అభివృద్ధి పధంలో దూసుకువెళ్ళుతుందనుకొని, తద్వారా ప్రజల తలసరి ఆదాయము పెరుగుతుందని అనుకొని, కాంగ్రెస్ పార్టికి పట్టం కట్టి నందుకు, దానికి ఆ పార్టి చేసిన చర్యలు దేశములో ఉన్న ప్రతి సామాన్యుడి గుండే మండకమానదు. 
 మన్మోహన్ సింగ్ ప్రధాని ఆయిన తర్వాత భారత వృద్ది రేటు పెరిగిందని, గొప్పులు చెప్పుకుంటున్న ప్రణాళిక సంఘం, అది ఎవరి బ్రతుకులు దుర్బరం చేసి వృద్ది రేటు పెంచగలిగారో మాత్రం తెలపలేదు.
దేశజనాభాలో అతి తక్కువగా గల కార్పోరేట్ల అదాయాలను గణనీయముగా పెంచడం ద్వారా, దేశ అర్దిక వృద్ధి రేటు బాగుందని చెపుతున్న వారు, మిగిలిన అత్యధిక శాతానికి చెందిన సామాన్య జనాల పరిస్దితిని మాత్రము గాలికొదిలేసారు. నాయకుల నయవంచితతనానికి ఏనాడో అలవాటు పడి పోయిన భారతీయులు, దీని పై పల్లెత్తు మాట అనకుండా, తమ పని తాము చేసుకుపోతున్నారు. మన ప్రభుత్వ విధానాల కారణాముగానే దేశములో ఉన్న ధనవంతులు, అత్యధిక ధనవంతులు కాగలిగారు. పేదవాడు, కటిక పేదవాడుగా మారిపోయాడు. పైగా పేదరికంతో ప్రభుత్వాలు ఆటలు కూడా చాలా నీచాతినీచముగా ఉన్నాయి. దానికి ఉదహరణగా మొన్న ప్రణాళిక సంఘం వారు మినియం అదాయము లెక్కలు ముప్పయి రెండు రూపాయలు (ఒకరోజుకి)గా లెక్కకట్టినప్పుడే తెలిసింది మన వాళ్ళ గొప్పతనమేంటొ. కాని మిగతా దేశాలలో మాత్రం, మనలా ఊరుకోకుండా, ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. సామాన్య జనాలు మార్పు కోరుకుంటే ఏమవుతుందో ట్యూనీషీయా, ఈజిప్టు, లిబియాలో జరిగిన పరిణామాల ద్వారా నిరూపించబడింది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న వాల్ స్ట్రీట్ ముట్టడి, రేపు ఏ రకమైన పరిస్దితులకు దారితీస్తుందోనని ఒబామా అందోళన చెందుతున్నారు. అది ప్రస్తుతం మిగతా అభివృద్ది చెందిన దేశాలకు పాకింది. చూద్దాం ఇది ప్రపంచంలో ఏ మార్పులకు సంకేతమో........

Friday 30 September 2011

మా ఊరి రివ్యూ....

నేను ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా మా ఊరి వెళ్ళిపోతాను...
అంతే కాకుండా పొలాలకు కూడా వెళ్ళుతుంటాను.....
అందులో కొన్ని పోటోలు సరదాగా క్రింద......




Tuesday 27 September 2011

సరసమైన ధరలు(ధనికులకు మాత్రమే)......

కేంద్ర వ్యవసాయశాఖామంత్రి శరద్ పవార్ బి.సి.సి.ఐ. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత పలు ఒప్పందాలు ద్వారా దాని ఆదాయము ఇబ్బడిముబ్బడిగా పెంచడంతో ఆయన ఆలోచన విధానము కూడా లాభదాయక విషయాల మీదకు మళ్ళినట్టుంది. అది వ్యాపార రంగాలకు మాత్రమే పరిమితం అయితే బాగుండును. కాని ఆయన బి.సి.సి.ఐ అధ్యక్ష పదవితో బాటుగా కేంద్ర వ్యవసాయశాఖామంత్రిగా కూడా పనిచేస్తున్నరన్న విషయము తెలిసిందే. కాని ఇక్కడ ఉన్న సమస్యమేమిటంటే ఆయన తన రెండు పదవులను ఒకే దృష్టితో చూస్తున్నట్టున్నారు. (ఆయన ఇప్పుడు ఐ.సి.సి. అధ్యక్షుడు కూడా అయ్యారు). క్రీడల్లో నైపుణ్యంను చూడవలసిన వారు, అందులో వ్యాపార అవకాశాలు కూడా ఎలా అందిపుచ్చుకోవచ్చో క్రికెట్ ద్వారా నిరూపించారు. ఒకప్పుడు క్రికెట్ ఆట ద్వారా నాణ్యమైన ఆటగాళ్ళను తయారుచేయడం, తద్వారా అంతర్జాతియ క్రికెట్ లో మన సత్తా చాటడం కోసము నియమితమైన బి.సి.సి.ఐ, నేడు అది ఒక పెద్ద వ్యాపార కేంద్రం గా మారడంలో శరద్ పవార్ పాత్ర మరువలేనిది. మానసిక ఉల్లాసానికి మరియు కోట్ల మంది ప్రజానీకం బావోద్వేకాలకు ఉద్దేశించిన క్రికెట్ ను పూర్తి స్దాయి వ్యాపార అంశంగా మార్చివేసారు.
ఆయితే దీని వల్ల ఎవరికి నష్టం లేదు. ఎందుకంటే ప్రజలకు అది ఒక వినోదపు వస్తువు మాత్రమే. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు మానేస్తారు. పైగా అది ప్రెవేటుకు సంబందించిన వ్యవహారము కాబట్టి, అందులో లావాదేవిల వలన ప్రజలకు నష్టం లేదు...

కాని నిన్న జరిగిన వ్యవసాయ శాఖా అధికారుల సమావేశంలో వరికి మద్దతు ధర పెంచే విషయమై, అందరికి సరసమైన ధరల గురించి ప్రస్తావించారు (ఇప్పుడు ఆయన బి.సి.సి.ఐ. ప్రెసిడెంటు కాదు.. వ్యవసాయశాఖామంత్రి అని గుర్తుంచుకోగలరు). వ్యవసాయ పంటలకు సరయిన మద్దతు ధరలు లేక , వ్యవసాయము భారమయిన ప్రస్తుత పరిస్దితుల్లో వరికి మద్దతు ధర పెంచవలసిన అవశక్యత గురించి స్వామినాధన్ కమిటి చేసిన సిపార్సులను ఏ మాత్రం పట్టించుకోకుండా, వరికి మద్దతు ధర పెంచితే, ఆ భారము వినియెగదారుల మీద పడుతుంది. కాబట్టి మద్దతు ధర కల్పించే విషయములో, వినియోగదారుల ప్రయెజనాలు (సరసమైన ధరలు) కూడా లెక్కలోకి తీసుకోవాలని సెలవిచ్చారు. అహా వినియెగదారుల మీద అమాత్యుల వారికి ఎంత ప్రేమ... ఎంత ప్రేమ... అని గుండెలు బాదుకోవలనిపించింది విన్నవాళ్ళందరికి...... మరి వరికి మద్దతు ధర పెంచితే, ఆ భారము వినియెగదారుల మీద పడుతుందని ఎంతో "దురా"లోచన చేసిన అమాత్యులు, మరి ఈరోజు చుక్కల్లో ఉన్న మిగతా వాటి గురించి ఏ మాట సెలవివ్వలేదుమేమిటో ఆయన నొటి ద్వారానే వినాలని వుంది... అదే విధముగా ఎరువులు, విత్తనాల కంపెనీలకు వాటి ధరలను ఇష్టానుసరంగా పెంచుకొనేందుకు అనుమతించినప్పుడు, మరి ఈ సరసమైన ధరలు ఎవరికి అందుబాటులో ఉన్నాయో చెప్పలేదు. ఈ రోజు వినియెగదారులకు సరసమైన ధరలు అందుబాటులో ఉంచాల్సిన అవసరము తమకుందన్న వ్యవసాయశాఖామాత్యుల వారు, ఏ వస్తువులు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయో చెప్పాలి. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకుండా పోతున్నా, మొక్కవోని దీక్షతో వ్యవసాయము చేస్తున్న రైతు కష్టాన్ని ఆయన ఏ విధముగా అర్దం చేసుకొన్నారో చూస్తుంటే, ఆయన ప్రజా సంక్షేమాన్ని ఆశిస్తున్నారా లేక ధనికుల సంక్షేమాన్ని ఆశిస్తున్నారా అనిపిస్తుంది. ఏ రోజు కూడా రైతు లాభాపేక్షతో వ్యవసాయము చేయడమ్ లేదు. అదే రైతుల పాలిట శాపమయింది.
ఈ అర్దిక సం.లో పెట్రోలు ధర, డిజీల్ ధర, పప్పులు, గ్యాస్ బండలు, ఎరువులు, విత్తనాలు అన్నింటిని ఇష్టానుసరంగా పెంచుకుంటు పోయినప్పుడూ ఈయన గారి బుద్ది ఎక్కడుంది... పైవన్నీ పెంచుకుంటు పోయునప్పుడు, వినియెగదారుడుకి సరసమైన ధరలు లెక్క ఆలోచనలోకి రాలేదా.... ఏం అప్పుడు గడ్డి తింటున్నారా..... లేక గడ్డి పీకుతున్నారా...... ధనికులు లాభపడతారనుకుంటే ఏదైనా చేయోచ్చు... అదే రైతులకు మద్దతు ధర ప్రకటించాలంటే లెక్కలు గుర్తుకువస్తాయా? పోనీ బియ్యం ఆయిన బహిరంగ మార్కెటులో సరసమైన ధరలకు ఎందుకు దోరకడం లేదు??? దీనికి కూడా ఆయనే సమాధానము చెప్తే బాగుంటుంది. రాజకీయాల్లో ఇలాంటి అడ్డమైన గాడిదలున్నంత కాలము ప్రజలు ఇబ్బందులు పడవలసినదె. ఏదో ఒక రోజు రైతులు మొత్తము వ్యవసాయానికి స్వస్తి పలకక పోరు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు మద్దతు ధర కోసము ప్రాకులాడవలసిన అవసరము రైతులకు రాదు. అప్పుడు రైతులు వారికి మాత్రమే కావలసిన ధాన్యం, కూరగాయలను పండించుకుంటారు. మిగతా అవసరాల కోసము కూలీ చేసుకోని డబ్బు సంపాదించుకుంటారు. ఆ రోజు మిగతా రంగాల వార్కి కావలసిన ఆహర ధాన్యాల గురించి, రైతుల దగ్గరికి వచ్చినప్పుడు, వారికి నచ్చిన ధరకు కొంటేనే అమ్ముతామని ఖరాఖండిగా చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయి.....

Friday 16 September 2011

మర్చిపోలేకపోతున్నా...

ప్రేమ ఎంత మధురం..... ఎడబాటు ఎంత కఠినం.....
లైఫ్ లో తన పని తాను సిన్సియర్ గా చేసుకుంటు పోయేవాడు ఎప్పుడూ ప్రేమలో పడడు...
ఒక వేళ ప్రేమలో పడితే, దానిని కూడా అంతే సిన్సియర్ గా చేస్తాడు......
నీ మీద నాకు ఇష్టం కలగడమే ఆశ్చర్యం.....
కానీ నిన్నే మనువాడలనుకొన్నా.....
నువ్వు కూడా నాతో కలసి అడుగు వేయడానికి సంసిద్దత వ్యక్తం చేయడంతో.....
నా కలల సౌధం నిర్మించుకొన్నా......
నువు నాకు దూరముగా ఉన్నప్పట్టికి నువ్వు ఉన్న నా కలల సౌధానికి వెళ్ళి సేద తీరా.....
ఒత్తిడి లోను, బాధలోని, సంతోషంలోను నిన్ను తలచుకొని రిలాక్స్ అయ్యా.,...
అంతగా నీ ప్రాణంతో మమేకమైపోయిన నేను.......
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నీ చేయిని అందుకొనే అవకాశం కోసము ఎదురుచూసిన నేను.......
ఒక్కసారే నీతో తెగతెంపులు ఎందుకు చేసుకోవలనుకొన్నానో నీకు తెలుసా.........
ఎప్పుడూ అమ్మాయిలే ముందు తెగతెంపులు చేసుకుంటారు......
కాని నువ్వు నాతో కలసి ఉండాలని కోరుకొన్నప్పటికి నేను ఎందుకు నిన్ను వదులుకోవలని అనుకొన్నానో తెలుసా........
నీకు తెలుసు, నేను ఎందుకు నీ నుండి దూరముగా వెళ్ళిపోయానో........
ఇలా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు........
ఎక్కడైనా ప్రేమికుల మధ్య మనస్పర్దలు వలన విడిపోతారు.......
కాని మనము మాత్రము వేరోక వ్యక్తుల అసూయ, అనుమాన వ్యాఖ్యాల కారణంగా విడిపోవడం భావ్యమా....
నన్ను ఇష్టపడీ, నువ్వు కూడా ఆ వ్యాఖ్యలను సమర్దించడం ఎంత వరకు భావ్యం......
నాకు అత్మభిమానం మెండు..... నా తప్పు లేకుండా నేను మాట పడను.....
కాని నువ్వు నన్ను కనీసము వివరణైన అడగకుండా మాట అన్నావు చూశావా??
ఆ రోజే నా మనసు గాయపడింది...... నాకు నీ ప్రేమ కన్న నా అత్మాభిమానమ్ గొప్పది.........
అందుకనే కఠిన నిర్ణయము తీసుకొన్నా......

కాని ఈ నాటికీ నిన్ను మర్చిపోలేకపోతున్నా.....
నీ రూపమును నా మనస్సు నుండి తొలగించలేకపోతున్నా.........
ఎప్పటికీ నిన్ను మర్చిపోలేకపోతున్నా....
నీ నుండి దూరముగా పారిపోవలనుకుంటున్నా....
కాని పారిపోలేకపోతున్నా.......
నీకు మరల దగ్గర కావాలని ఉంది........ కాని అదే సమయములో తన స్వార్దం చూసుకొన్న నాకిష్టమైన ఒక వ్యక్తి అసూయ గుర్తుకు వస్తుంది.....
నీకు, నాకు ఎడబాటుకు కారణము..... నిజముగా అతనే......
మనిద్దరి ప్రేమకి మధ్య అడ్డుగోడ నిజానికి అతనే అడ్డుగోడ........

Thursday 15 September 2011

మీడియా...ఏ ఎండకా ఆ గొడుగా???

ప్రస్తుతం దేశ రాజకీయాలలో ఎక్కువగా చర్చించుకొంటున్నది దేని గురించో తెలుసా... సుప్రింకోర్టు మరియు సి.బి.ఐ. ప్రభుత్వాలలో పేరుకుపోయిన అలసత్వాన్ని ఈ మధ్య కాలములో తేరగా ఏకి పారేస్తున్న సుప్రింకోర్టు గురించి ఈ మధ్య రాజకీయాల్లోను, మీడియాలోను పెద్ద హట్ టాపిక్ ఆయిపోయింది. తర్వాత సి.బి.ఐ. సెంట్రల్ బ్యూరో ఇన్ స్వెగేటన్ అఫ్ ఇండియా... ఏ ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్న దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మీడియా కూడా సుప్రింకోర్టు మరియు సి.బి.ఐ. ల ఘనకార్యాల గురించి పుంఖానుపుంఖలుగా వార్తలు ఇస్తునే ఉంది.. యాక్చువల్ గా ఇందులో చెప్పుకోడానికి ఏమి లేదు.... కాని మన రాజకీయ నాయకులు మరియు మీడియా యొక్క అవకాశవాదం గురించి మాట్లాడాలి. ఈ మధ్య కాలములో వరుస పెట్టి వెలుగులోకి వచ్చిన కామన్ వెల్త్ , జీ మొ.గు కుంభకోణాలు వెలుగులోకి రావడం మరియు అందులో నిందితులు జైలుకి వెళ్ళడంలో సుప్రింకోర్టు యొక్క క్రియాశీలక పాత్ర ఉంది... ఆయితే ఈ చర్యల ద్వారా సుప్రీంకోర్టు పనితీరుని ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రస్తుత రాజకీయ నాయకులు మరియు మీడియా వారే గతములో ఇదే కోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు పై అపేక్షణ వెలుబుచ్చిన సందర్బాలు చాలా ఉన్నాయి.


 ఈ వ్యత్యాసమునకు గల కారణమేమిటన్నది ప్రతి ఒక్కరికి తెలిసినదే.. దురదృష్టశావత్తు దేశములో ఉన్న ప్రధాన మీడియాలన్ని ఏదోక ఒక పార్టికి అనుకూలముగా ఉండడం లేక రేటింగులు పెంచుకోవడం కోసము ఇష్టపూర్వక రాతలు వ్రాసేస్తున్నారు. మీడియా దేశములో ఉన్న వాస్తవ పరిస్దితులను యధాతదముగా తెలియజేయకుండా, తాము కొమ్ము కాస్తున్న రాజకీయ పార్టిలకు అనుకూలముగా వార్తలు ప్రచురించడం విచారకరం. అదే విధముగా గతములో పలు కేసులలో సి.బి.ఐ. దర్యాప్తు చేసిన పలు కేసుల్లో విచారణ తమకు అనుకూలముగా రానప్పుడు, దాని మీద విచ్చలవిడి విమర్శలు చేసి, అది సెంట్రల్ బ్యూరో ఫర్ ఇన్ స్వెగేషన్ కాదని, అది కాంగ్రెస్ బ్యూరో ఇన్ స్వెగేషన్ అని పలుమార్లు తెలుగుదేశం మరియు ఇతర ప్రతిపక్ష పార్టిలు మరియు ఈనాడు మీడియా విమర్శలు చేయడం మనకు విదితమే, అంతే కాకుండా తమకు సి.బి.ఐ. మీద నమ్మకం లేదని, అది ప్రభుత్వానికి అనుకూలముగా పనిచేయడానికే ఉందని పదే పదే విమర్శలు గుప్పించిన రాజకీయ నాయకులు మరియు మీడియా, నేడు అదే సి.బి.ఐ. దర్యాప్తులో విచారణ ఎదుర్కొంటున్న అవినీతి రాజకీయ నాయకులు తమకు ప్రత్యర్ది వర్గానికి చెందినవారు కావడంతో ఒక్కప్పుడు తాము తూలనాడిన ఆనాటి సి.బి.ఐ. పనితీరుని నేడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కారణమేమిటో మనందరికి తెలిసిందే. అదే విధముగా ప్రస్తుతం సి.బి.ఐ.విచారణను ఎదుర్కొంటున్న జగన్, గాలి జనార్దన్ రెడ్డిలు అధికారములో ఉన్నప్పుడు తమపై వచ్చిన వివిధ రకముల ఆరోపణలు పై సి.బి.ఐ. దర్యాప్తును జరిపించుకొని క్లీన్ చిట్ పొంది, దాని ద్వారా తమ రాజకీయ ప్రత్యర్దుల మీదకి ఎదురు దాడిని దిగినప్పుడు సి.బి.ఐ. వార్కి సక్రమముగానే ఉన్నట్టుంది. కాని ఇప్పుడు అధికారము కోల్పోయి అదే సి.బి.ఐ. విచారణను ఎదుర్కొవలసివచ్చినప్పుడు, దాని పనితీరుని తప్పుబడుతున్నారు. ఈ రకమైన అవకాశ వాదము రాజకీయనాయకులకు ఉండోచ్చు. ఎందుకంటే అది వారి సహజబుద్ది..
కాని మీడియా బుద్ది ఏమయింది??? మన రాష్ట్రంలో ఉన్న ప్రదాన మీడియా అంతా కూడా విలువలు వదిలేశాయి. ఇందులో సాక్షి గురించి మాట్లాడుకోకవడమే బెటరు. ఎందుకంటే దాని గురించి రాసి నా విలువైన టైమ్ వేస్ట్ చేసుకోదలచుకోలేదు. ఇక మిగిలిన ఈనాడు పేపరు పక్కా పక్షపాతంగా వ్యవహారిస్తున్నట్టు తెలిసిపోతుంది.. ఇది తెలుగు దేశము పార్టికి మద్దతుదారు అని ప్రజలందరికి తెలుసు.... నేను ఈ పేపరులో వచ్చిన ఆర్టికల్స్ చాలా సార్లు ఒక విషయమై పరస్పర విరుద్దముగా వార్తలు వెలువరించిన సందర్బాలు చూసాను.. జగన్ మరియు గాలి అవినీతి విషయములో ఈనాడు మీడియా చూపిస్తున్న అత్యుత్సహం ఎందుకో ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను జగన్, గాలి అవినీతి వ్యవహారములను మాత్రమే ఈనాడు మీడియా హైలెట్ చేస్తుంది అని చెపుతున్నాను. నిజానికి ఇవే కాకుండా ఇంకా చాలా దేశియ వనరుల విచ్చలవిడి దోపిడి జరుగుతుంది. అది ఈనాడు మీడియాకు కూడా తెలుసు. కాని ఏనాడు వాటి గురించి ప్రచురించదు. ఈ విషయములో అది కూడా పక్షపాతముగా గిట్టనివారి గురించే ప్రముఖంగా ప్రచురిస్తుంది. నేను ఒకప్పుడు అంతర్జాతియ, దేశియ, ప్రాంతియ వార్తలు కోసము ఎక్కువగా ఈనాడు పేపరు మీదే ఆధారపడేవాడిని. కాని ఇప్పుడు వాటి యొక్క శాతము విపరీతముగా తగ్గిపోయింది. ఇప్పుడంతా తమకు నచ్చని వారి న్యూస్ ప్రచురించడానికే స్దానము సరిపోవడం లేదు.
ఇకపోతే మిగిలింది ఆంద్రజ్యోతి మీడియా... రాజు గారి మొదటి బార్య మంచిది అని అంటే, దానిని రాయడం మానేసి రాజు గారి రెండొ భార్య చెడ్డది అని వార్త రాసే చెత్త మీడియా.... ఆది ఎప్పుడు వార్తలను సంచలనాత్మకముగా ఎలా ప్రచురించాల అని అలోచిస్తుందే తప్ప ప్రజలకు సరయిన వివరములు తెలియజెప్పలన్న అలోచన దానికి ఎప్పుడూ ఉండదు.. ఎక్కడయినా ప్రముఖులతో ఇంటర్వూ తీసుకొన్నప్పుడు వారు చెప్పిన మంచి మాటలను హెడ్డింగ్ గా కాకుండా, అనుకోకుండా అన్న చిన్న చిన్న నెగెటివ్ మాటలనే కొంచెం మసాలా జోడించి దానిని హెడ్డింగ్ గా పెట్టేస్తారు. అదండి మన మీడియా వరుస.. వీరందరూ ప్రజలందరికి సరయిన సమాచారము ఇవ్వడం కోసము పనిచేయడం లేదు. యాక్చవల్ గా మీడియా ఏ విషయములోను పక్షపాత వైఖరి ఉండకూడదు. అది ఎప్పుడూ తటస్దంగా ఉండాలి.. ఏ విషయానైన్న సరే సాధారణ విషయముగానే పరిగణించి న్యూస్ ఇవ్వాలి.. అంతే కాని గిట్టని వారి మీద ఒకలా, నచ్చిన వారి మీద ఒకలా రాయడం శ్రేయస్కరం కాదు. లేకపోతే విశ్వసనీయత కోల్పోతారు. ఇప్పటికే మన మీడియా మీద చాలా మందికి ఉన్న ఒపెనీయన్ తెలిస్తే వారందరు ఉరేసుకు చావాలి. ఈ రోజు చాలా మంది వార్తలు తెలుసుకోవడం కోసము మిగతా దేశియ మీడియా మరియు దేశియా మీడియా మీద ఆధారపడుతున్నరన్న సంగతి తెలుసుకోవాలి. ఏ ప్రాంతియ మీడియాను వీరు విశ్వసించడం లేదన్నది సత్యం. మీరు రాసినదే వేదము అని నమ్మే వాళ్ళు తగ్గుతున్నారన్న వాస్తవం తెలుసుకోని మసలుకుంటే వాళ్ళకి మంచిది.

Tuesday 13 September 2011

వేటాడుతున్న ప్రభుత్వం......

ఇక నుండి మనము బ్రతకడానికి డాలర్లు ఖర్చు చేయడానికి సిద్దముగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో బ్రతకలంటే మనకు రూపాయల్లో సంపాదన సరిపోదు.... ఖచ్చితముగా మనము డాలర్ల లెక్కలో సంపాదించవలసినదే... ఇప్పటికే అన్ని విధములుగా పెరిగిపోయిన ధరలతో డిలాపడిపోయిన సామాన్యుడుకి మరల ఎక్కడ రిలాక్స్ దొరుకుతుందో లేక డబ్బును ఎక్కడ స్విస్ బ్యాంకులకు తరలిస్తారో అని ప్రభుత్వం దీర్ఘాలోన చేసి నిత్యావసరలైన బియ్యం, పప్పులు, వంట గ్యాస్ తో సహ ప్రాణాధారమైన మందుల పై ఇప్పటి వరకు ఉన్న నాల్గు శాతం వ్యాట్ రేటును ఐదు శాతానికి గుట్టుచప్పుడు కాకుండా పెంచేసింది...
 దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు వెయ్యి కోట్ల వరకు ఆదాయము సమకూరే అవకాశం ఉందని అంచనా... ఎందుకయ్యా సామాన్యులని ఇలా ఏడిపిస్తున్నారు అని ముఖ్యమంత్రులవారిని అడగడం పాపం, తప్పక పెంచవలసివచ్చినది, అనివార్యమైనదని కూల్ గా సెలవిచ్చారు... అదే అనివార్యం రైతుల పంటకు మద్దతు ధర పెంచకపోవడం, బడుగు జీవుల వేతనాల్లో పెంపు లేకపోవడం, ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిర్మూలించకపోవడం, పాలనలో పారదర్శకత లేకపోవడం వంటి వాటిలో చూపకపోవడమేమిటి??? ముందు ప్రజలకు ఆదాయాలకు ఎటువంటి డోకా లేకుండా చేస్తే, తద్వారా అదే ప్రజల నుండి పన్నుల రూపేణా ఆదాయమును ఆశించండం తప్పు కాకపోవచ్చు... కాని సామాన్యులను వారి దారికి వారిని వదిలేసి నచ్చినట్టు బాదేస్తే వారు ఎలా మనుగడ సాగించాలని ప్రభుత్వానికి వీసమొత్తు కూడా ఆలోచన రాకపోవడం ఏమనుకోవాలి. ఈ రోజు ప్రజల్లో సంపన్న వర్గం తప్ప ఏ వర్గం వారు కూడా నిక్షేపంగా మునుగడ సాగించలేకపోతున్నరనేది పచ్చి నిజము.. ఒక్కప్పుడు అత్మభిమానానికి ప్రతికగా నిలిచిన రైతు ఆరుగాలం పంటని పండించి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అమ్ముకొని మిగిలిన దానితో అవసరమైతే ప్రక్కవాడికి సాయము చేస్తూ బ్రతికేవారు.. కాని అదే రైతు ఈ రోజు కాలము కలసిరాక, ప్రభుత్వాలు సాయము చేయక, తాను వేసిన పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తెచ్చుకోలేక అత్యంత దౌర్బగస్దితిలో ఉంటే, కనీస కనికరము లేకుండా ప్రభుత్వం ఏ విధముగా పన్నులు రూపేణా బాదుడు వేయగలదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినదేమిటంటే ఏ రోజు రైతు ప్రభుత్వాల మీద ఆధారపడలేదు..
మరియు ప్రభుత్వాలు రైతుకి ఎటువంటి సాయం చేయకపోయినా కీడు చేయడంలో మాత్రము అత్యుత్సహాము చూపించాయి. విత్తనాలు నుండి ఎరువులు వరకు ఏది కూడా రైతులకు అందజేయలేకపోయాయి. మరియు వ్యవసాయ సంబంధ వస్తువులన్నింటిని ఉత్పత్తి చేసే కంపెనీలకు, అయా ఉత్పత్తిలను ఎప్పటికప్పుడు క్రమము తప్పకుండా పెంచుకుంటు పోతున్న ప్రభుత్వాలు, ఆరుగాలము కష్టపడి పంటను పండించిన రైతు శ్రమను మాత్రము పెంచకుండా మోకాలు అడ్డుపెట్టీ దమననీతిని ప్రదర్శిస్తుంది.. ఇకపోతే మిగతా వారు చిరు వ్యాపారులు, శ్రమజీవులు, రోజుకూలీలు, ఉద్యోగులు మొదలైనవారు. వీరు కూడా అధికముగా శ్రమ దోపిడి గురవుతున్నారు. కాని దానికి తగ్గ వేతానాలు మాత్రము అందుకోలేకపోతున్నారు. యజామాన్యాలు ఇచ్చే జీతాలు సరిపోక, మరియు ఎప్పటికప్పుడు ధరలతో వేటాడుతున్న ప్రభుత్వాలతో పడలేక సంఘర్షణకి లోనువుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెంచే వేతానాలతో సమానముగానే బయట ధరలు కూడా పెరుగుతుండడంతో పెరుగుదలలో సౌలబ్యంను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వాలు చేసే అన్ని పనులు సంపన్న వర్గాలను ఇంకా అభివృద్ధి చేసే విధముగానే ఉన్నాయనేది కాదనలేని సత్యం......
పి.ఎస్.: ఏదో నాలో ఉన్న ఆవేదనంతటిని ఇలా వ్రాసాను కాని, ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.....

Monday 12 September 2011

తమిళ్ సినిమాలు అదురుతున్నాయి......

ఈ మధ్యన వరుసబట్టి తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అవుతుంటే, వరుసపట్టి అవే చూడవలసివచ్చింది.. ఎందుకంటే అసలు చూడడానికి తెలుగు సినిమాలే లేవు. అలాగని సినిమాలు చూడకుండా ఉండలేము కదా... ఆయినప్పటికి ఇది ఒకందుకు మంచిదేలెండి. ఎందుకంటే ఈ కారణంగానే తమిళ్ సినిమాలు చూసే భాగ్యం కలిగినందుకు. నాకు ఎందుకనో గాని తమిళ్ సినిమాలంటే చిన్న చూపు.. దిగ్గజాలనదగ్గ దర్శకులందరూ తమిళ్ దర్శకులైనప్పటికి వారి కోలివుడ్, మన టాలివుడ్ కన్నా తక్కువేనని అభిప్రాయపడేవాడిని... కాని ఈ మధ్య విడుదలైన జీవా నటించిన రంగం, అజిత్ నటించిన గ్యాంబ్లర్ చూసిన తర్వాత వారి సాంకేతికత మరియు చిత్రికరణ ఎంత అడ్వాన్స్ గా ఉందో చూసి నా మైండ్ బ్లాంక్ అయింది. నిన్ననే అజిత్ నటించిన గ్యాంబ్లర్ కి వెళ్ళాను(చూడడానికి ఏ తెలుగు సినిమా లేక తప్పక వెళ్ళాను). కాని సినిమా చూసిన తర్వాత ఇప్పటి వరకు ఎందుకు చూడలేదా అనుకొన్నా.. సినిమా చాలా బాగా తీసాడు.. చాలా కాలము తర్వాత ఒక మంచి యాక్షన్ ద్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది.. కధనం మరియు చిత్రికరణ మరియు స్రీన్ ప్లే చాలా అద్బుతంగా మలిచినట్టు అనిపించింది. ఒక రకముగా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అనిపించింది. నేను ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువగా చెప్పుతున్నాననుకోవచ్చు.. కాని తెలుగు సినిమాలతో పోల్చుకుంటే నాకు ఈ సినిమా అన్ని విభాగాలలోను గ్రేట్ అనిపించింది. ముఖ్యంగా అజిత్ నటన ఆకట్టుకుంది...తాను చాలా బాగా నటించాడు. చెప్పుకోవలసినదేమిటంటే ఇందులో అజిత్ క్యారెక్టర్ వయస్సు కధ ప్రకారం నలభై పైన అని చెప్పాడు. చెప్పడంతో సరిపెట్టకుండా దానికి తగ్గట్టుగానే తన అహార్యంను మార్చుకొన్నాడు. నిజానికి అది చాలా గ్రేట్ కదా.. ఎందుకంటే నిజానికి అజిత్ ఇంకా కుర్రాడిలనే కనబడతాడు.. కాని పాత్ర కోసము సినిమా మొత్తము తెల్లని హెయిర్ తొ కనబడలనుకోవడం సాహాసమే కదా... మన తెలుగులో చూడండీ... ఒక్కొక్కొడికి నెత్తి మీద వెంట్రుకలన్ని ఊడిపోయిన, యాభై ప్లస్ లోను కూడా తాము ఇరవై సం.రల కుర్రాడన్నట్టు చాలా భయంకరంగా మేకప్ వేసుకుంటారు.. ఈ విధముగా చూస్తే తెలుగు దర్శకులెవరు తమిళ్ దర్శకులతో పోల్చుకుంటే అంత గొప్పవాళ్ళు కాదనుపిస్తుంది. తమిళ్ సినిమాలు ఎక్కువగా కధను నమ్ముకోవడం, తెలుగు సినిమాలు ఎక్కువగా స్టార్ డమ్ ను నమ్ముకోవడం ప్రధానంగా వాళ్ళకి, మనకి తేడా... కాని స్టార్ డమ్ ఆధారముగా కూడా మంచి కధలు తెరకెక్కించవచ్చు... కాని మన దర్శకులకు అంత అలోచన ఎక్కడుంది.. జాగర్తగా గమనించండి తెలుగు సినిమాలన్ని ఇంచుమించుగా ఒకే పార్మాలాతో వస్తుంటాయి.. అంటే హిరో ఎంట్రన్స్, కొలత కొలిచినట్టు ఇంత నిడివికి గల సమయానికి పాటలు, ఫైట్లు అలాగే కామిడికి ప్రత్యేక ట్రాక్.... ఇలా చెప్పుకుంటు పోతే చాలానే ఉన్నాయి.
 ఆ మధ్యన జీవా నటించిన రంగం సినిమా కూడా కధనం ఆధారముగానే మంచి విజయము దక్కించుకుంది... గతములో చూస్తే సూర్య ’గజని’.... గుర్తుకు రావడం లేదుకాని ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయిలెండి.... ఇవన్ని కధనమ్ ఆధారముగానే మంచి విజయాలందుకొన్నాయి... పైగా అయా నటులు మన తెలుగు లోను కూడా మార్కెట్ సంపాదించుకొన్నారు.... మన వాళ్ళు మాత్రం ఇతర మార్కెట్లలకు విస్తరించలేకపోతున్నారు..... కారణం ఇదే మరి..... కాదంటరా??..... మన వాళ్ళ మైండ్ సెట్ మారి మరల ఎప్పటికి మంచి చిత్రాలు తీయడం మెదలుపెడతారో వేచి చూడాలి.....

Wednesday 24 August 2011

పెళ్ళి గోల మొదలయ్యింది....

చాలా రోజులయింది నా అర్టికల్ పోస్ట్ చేసి.... యాక్చువల్ గా నేను చాలా సబ్జెక్ట్స్ అనుకొన్నా వ్రాయడానికి.... కాని ఎందుకనో గాని నా సిస్టమ్ లో దీనికి సంబందించిన సైట్ ఒపెన్ కాలేదు... ఇదుగో మరల ఇన్నాళ్ళ తర్వాత ఈ రోజు ఒపెన్ అయింది... సైట్ ఒపెన్ ఆయితే ఆయింది కాని నా మైండ్ మాత్రం ఒపెన్ కాలేదు... కాని ఏదోకటి వ్రాసేయాలని తాపత్రయం... తాపత్రయం కుదురుకు ఉండనివ్వదు కదా మన మనస్సుని.... ఏమి రాయాల అని ఆలోచిస్తుంటే ప్రొద్దున అమ్మ చేసిన ఫోన్ కాల్ గుర్తుకు వచ్చింది... ఎందుకంటే నా పెళ్ళి గురించట... పెళ్ళి అంటే ఏమిటొ ఇప్పటికి మనకు అంతుచిక్కడం లేదు... సో.. దీని మీద మనకున్న అభిప్రాయాలన్ని కలపి ఇందులో వ్రాసేద్దమని కూర్చున్నా..... ఇక చదవండి.... నాకెందుకో తెలియదు మొదట నుండి కూడా పెళ్ళి మీద పెద్దగా నమ్మకం లేదు... నమ్మకం లేని వాణ్ణి నోరు మూసుక్కొని ఊరుకోవచ్చు కదా.... ఊరుకోకుండా బంధువుల దగ్గర, సన్నిహితుల దగ్గర అడిగిన, అడగక పోయినా నేను పెళ్ళి చేసుకొను అని స్టేట్ మెంట్స్ ఇచ్చి పారేసాను.... అలాగే చూద్దామని కొంత మంది అన్నప్పటికి వాటిని ప్రక్కకు తీసిపారేశాను.. ఇంతకి పెళ్ళి మీద సదబిప్రాయం ఎందుకు లేదో మాత్రము సరయిన కారణం లేదు... అలా కాలముతో పాటు మన అభిప్రాయములు కూడా మారాయి. (కాలము మారకపోయినా మన అభిప్రాయలు మాత్రము స్దిరంగా ఉన్నట్టు?)... పెళ్ళి మీద సదభిప్రాయము లేదన్నను గాని ప్రేమ మీద సదభిప్రాయము లేదనులేదు కదా అని అనుకొని మా మరదలును ఇష్టపడ్డాను.... ఇష్టపడ్డాననే మాటే గాని ఎందుకు ఇష్టపడ్డానో సరయిన కారణం లేదు.. బహుశా అందరికి లవర్స్ ఉన్నారు. మనకు మాత్రము లేరు అని అనుకొని ఉంటా..... మనకు ఎప్పుడైనా ఒక స్దిర అభిప్రాయములు ఉంటే కదా........ మరి ఆ విషయము కుదురుగా ఒక చోట ఉండదు కదా.. అది పల్లమెరిగిన నీరు లాగా ప్రవహించి ఆ విషయము ఆ నోటా, ఈ నోటా అలా పాకి మా అమ్మ గారి వద్దకి వెళ్ళింది.... వెళ్ళిన తర్వాత వారు ఊరుకోరు కదా, ఒక దుర్మమహుర్తంలో నన్ను పిలిచి నా మరదలుతో పెళ్ళి గురించి కదిపారు.... ఇంతకు ముందు పెళ్ళి చేసుకొను అని కూసిన కారుకూతలు మర్చిపోయి, సరేనని అనడంతో తదనంతర పనులు మొదలెట్టడం లో మునిగిపోయారు.... కాని పెళ్ళి మాత్రం ఒక సంవత్సరము తర్వాతేనని కండిషన్... నాకు అందులో అభ్యంతరం కనిపించలేదు... కాని ఒక సంవత్సరము కాలము గ్యాపే నా కొంప ముంచుతుందని అనుకొలే.... ఎందుకంటే మధ్యలోకి మా తమ్ముడు దిగాడు.... దిగడమంటే ఏ ట్రైన్ నుండో బస్సు నుండో దిగడం కాదు.. నాకు, నా మరదలికు మధ్య ఉన్న సం.రమ్ గ్యాప్ లోకి దిగి మొత్తము రసాభస చేసేశాడు.... అంతే నాకు, నాతో పెళ్ళి కుదిరిన మరదలికి అండర్ స్టాండింగ్ కుదరక యు టర్న్ తీసుకున్నా(దీనికి మాత్రము సరయిన కారణముందిలెండి. అపరిపక్వ నిర్ణయము మాత్రము కాదు. ఆ స్టోరి చెప్పాలంటే సీరియల్ కధలు రాయాలి).. ఈ విషయాలన్ని మా అమ్మగారికి తెలియవు కాబట్టి, నేను తీసుకొన్న యు టర్న్ కి తాను కొద్దిగా ఫైర్ అయ్యారు... కొద్ది రోజులకు ఆ ఫైర్ సద్దుమణిగిందనుకొండి... ఇది జరిగిన తర్వాత మరల మనకి పెళ్ళి మీద ఉన్న ఆ కొద్దిపాటి ఇంప్రెస్ కూడా పూర్తిగా పోయింది... అంతే పెళ్ళి చేసుకోకూడదని మరల స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను... నాకు మాత్రం ఈ బ్యాచిలర్ లైఫ్ బెటర్ లా అనిపించింది..
ఎందుకంటే మంచి ఫ్రెండ్స్, రూమ్మెట్స్ ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది... కాని మేమందరము జీవితాంతం అలాగే ఉంటామంటే కుదరదు కదా... రూమ్మేట్స్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసము బయటకి వెళ్ళినప్పుడు పెద్దగా ఏమనిపించలేదు... అలాగే ప్రెండ్స్ కు మాత్రము నా అభిప్రాయాలే వాళ్ళకు ఉండాలని రూల్ లేదు కదా... ఉన్నదాంట్లో బెస్ట్ ప్రెండ్స్ అన్నవాళ్ళలో శ్రీకాంత్ పెళ్ళి చేసుకొని లండన్ వెళ్ళిపోయాడు.. పోనిలే వాడు లండన్ లో సంసారం తిప్పలు పడతాడులే అని సరిపెట్టుకొన్నా.. ఇంకొక ప్ర్రెండ్ గత రెండు సంరల క్రితమే ఒక అమ్మాయిని చూసుకొని పెళ్ళి కోసము ఎదురు చూస్తున్నాడు.. ఇంకొకడు ఎంగైజ్ మెంట్ చేసేసుకొని, ఈ రోజే ఫస్ట్ ఎంగైజ్ మెంట్ అన్యువెర్సరి అని పార్టి చేసుకుంటున్నాడట. ఆరు నెలలు తిరక్కుండనే నా బెస్ట్ జోస్త్ బాపూరావు కూడా పెళ్ళికి రెడి అయిపోయి, పెళ్ళి కూడా చేసేసుకున్నాడు.... పోనిలే అందరూ బాగుపడుతున్నారులే అనుకొన్నా..... నిజముగానే వాళ్ళందరూ బాగుపడ్డారు, పెళ్ళాలతో... నన్ను ఒక్కడు పట్టించుకుంటే ఒట్టు... పెళ్ళయిన వెధవలందరూ అంతే అని సరిపెట్టుకున్నా..... కాని మొదట నుండి అలవాటు ఆయిన ప్రెండ్స్ లేకపోయేసరికి మన షెడ్యుల్ మొత్తము తలక్రిందులయిపోయింది... నా మరదలుతో పెళ్ళి వద్దనుకున్నప్పుడు కూడా నా షెడ్యుల్ ఇలా తలక్రిందలవలేదు.... కాని చిన్నప్పటి నుండి అలవాటు ఆయిన షెడ్యుల్, ప్రెండ్స్ లేకపోయేసరికి తలక్రిందలయిందన్నమాట....
ఇప్పుడు చెప్పండి... నేను ముందులాగా పెళ్ళి చేసుకొను అనే నా మాటకి కట్టుబడి ఉండాలా.. లేక ఇంకొకసారి మరల మాట తప్పితే పోలా....
డైలమాలో ఉన్నా.... దానికి తోడు మా ఆఫీసులో ఒకటే రోద.... పెళ్ళెప్పుడని?? అడిగినా ప్రతివాడికి సమాధానము చెప్పలేక తిక్కరేగిపోతుంది.... ఆయినా నా వయస్సు ఇప్పుడు ఎంతని... జస్ట్ ఇరవై తొమ్మిది.... ఇరవై తొమ్మిదా అని నోరు వెళ్ళబెట్టకండి... నా దృష్టిలో అది ఎక్కువ కాదని నా అభిప్రాయము. కాలము ఎంత విచిత్రం చూడండి.... అప్పుడు అడగని ప్రతి ఒక్కడికి చెప్పేవాడిని, పెళ్ళి చేసుకొనని.... కాని ఇప్పుడు ప్రతి ఒక్కడు అడుగుతున్నా చెప్పడానికి తిక్కరేగుతుంది..... ఏమి చేస్తాం కలికాలం.... ఇప్పటికి కూడా కన్ ప్యుజ్ లో ఉన్నాను పెళ్ళి చేసుకోవడం గురించి... ఎప్పటికి వస్తుందో క్లారిటి.,... మరి మనకు క్లారిటి వచ్చేవరకు ఇంట్లో ఆగరు కదా.... అందుకే ప్రొద్దున మా అమ్మగారు ఫోన్.... అర్జంటుగా పోలిస్ స్టేషన్ లో దొంగలకి నాల్గు ప్రక్కల నుంచి తీసిన పోటోస్ తరహాలో పూల్ పోటొ ఒకటి, ఆఫ్ పోటొ ఒకటి, కూర్చున్నది ఒకటి, నిలబడినది ఒకటి తీసుకొని పంపాలట.... నెవ్వర్.. పంపే ప్రస్తక్తే లేదని తెగేసి చెప్పేసా.. ఆయితే సరే అని ఫోన్ పెట్టేసారు.. ఆశ్చర్యం. కొద్దిసేపు బ్రతిమాలతారేమో అనుకున్నా... అబ్బే.. బ్రతిమాలలేదు... ఏంటొ బొత్తిగా నన్ను ఎవరు అర్దం చేసుకోవడం లేదని ఒకటే బాధ.... అదేంటిరా బాబు వీడికి వెళ్ళి చేయకూడదని మా ఇంట్లో కూడా ఫిక్సయిపోరా ఏంటి అని బెంగ మొదలయింది నాలో....
ఆయితే పెళ్ళి విషయములో నాకు క్లారిటి వచ్చే వరకు ఆగాలా?? లేక పెళ్ళి చేసుకొని క్లారిటి తెచ్చుకోవాల అని అర్దం కావట్లేదు.....