ఒకేఒక్కడు మొదటి భాగం కొరకు దీనిపై క్లిక్ చేయండి..
ఒకేఒక్కడు తరువాయి భాగం:-
డిసెంబరు 9 ప్రకటన తదుపరి శ్రీకృష్ణ కమిటి నివేదిక
సమర్పించిన తర్వాత కూడా తెలంగాణా ఏర్పడగలదని ఎవరూ ఊహించలేదు. తెలంగాణా ఉద్యమం పేరు
చెప్పి కేసిఆర్ అక్రమ దందాలకు
పాల్పడుతున్నారని, కుటుంబ ఆస్దులు పెంచుకుంటున్నారనీ, తెలంగాణా కావాలన్న
చిత్తశుద్ది అసలు కేసిఆర్ కు లేనే లేదని ఇలా ఎన్ని రకాల విమర్శలు చేసినప్పటికీ
తెలంగాణా ఉద్యమ గాడతని, కేసిఆర్ దూకుడుని తగ్గించలేకపోయాయి.
ప్రజల్లో కూడా ప్రత్యేక
తెలంగాణా కావాలన్న కోరిక ఎక్కువడం, అది ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిచుచుండడంతో
మిగతా తెలంగాణా ఇతర పార్టిలకు చెందిన నాయకులు ప్రత్యేక తెలంగాణావాదం వైపునకు
మరిలారు....
కానీ ఇక్కడ చెప్పుకోవలసిన
విషయమేమిటంటే...
కేసిఆర్ ఒక ముఖ్యమంత్రిగా
పనిచేయలేదు. పోని టి.ఆర్.ఎస్. బలమైన ప్రాంతీయ పార్టీనా అంటే అదీ కాదు.. కేవలం ఒక
ఉపప్రాంతీయ పార్టి మాత్రమే.. కానీ తన ప్రాబల్యంను ఢీల్లీ వరకు తీసుకువెళ్ళడమే
కాకుండా తన మాట ప్రతి స్దాయిలో చెల్లుబాటు ఆయ్యేలా చేసుకోగలిగారంటే కేసిఆర్ రాజకీయ
చతురతని మెచ్చుకోకుండా ఉండలేము.
తొమ్మిది సం.రాల పాటు
ముఖ్యమంత్రిగా పనిచేసి, దేశ రాజకీయాల్లో ఒక శక్తిగా అవిర్బవించిన చంద్రబాబునాయుడు
కానీ, రాష్ట్రంలో బలమైన నాయకుడుగా అవతరించి మొత్తం పార్టిని తన చెప్పుచేతల్లో
ఉంచుకోగలిగిన వై.ఎస్.ఆర్ కానీ కేసిఆర్ ని ఎదుగుదల ఆపలేకపోయారని చెప్పుకోవచ్చు.
అంతే కాకుండా వారిలా ఎటువంటి పెద్దస్దాయి పదవులు అనుభవించకుండానే వారిద్దరిని
మించిన స్దాయిలో లాబీయింగ్ చేయించగలగడం నిజంగా ఆశ్చర్యకరమే...
కాంగ్రెసు ఆధిష్టానం కూడా
కేసిఆర్ కి అంత విలువ ఏ విధంగా యివ్వగలిగిందో ఇప్పటికీ నాకు అర్ద్రం కాదు. లాలూ,
పాశ్వాన్, పవార్, కరుణానిధి, జయలలిత, మమతాబెనర్జీ, ములాయం, మాయవతి లాంటి
వారెందరినో చూసింది. వారిని ఎప్పుడు ఎలా ఉపయెగించుకోవాలో అలా ఉపయెగించుకోనేది.
దారిలోకి రాకపోతే సి.బి.ఐ.కొరడాని గుళిపించడం ద్వారా దారిలోకి తెచ్చుకోనేది..
పైన చెప్పిన నాయకులు
కన్నా కేసిఆర్ ఎక్కువేమి కాదు. కానీ వారెవరికి ఇవ్వలేని ప్రాధాన్యతని కేసిఆర్ కి
ఇవ్వడంలోని అంత్యరం ఏమిటన్నది అంతుపట్టడం లేదు. కాంగ్రెసు ఆధిష్టానానికి కేసిఆర్
లొంగగలిగారు అనే దాని కన్నా కేసిఅర్ తన మాటని నెగ్గించుకోగలరు అనే విధంగా తన
కార్యాచరణని రూపొందించగలిగారు.
తెలంగాణా యితర పార్టిల
నాయకులు కలిసి రాకపోయినా, కాంగ్రెసు ముఖ్యమంత్రులు/యితర నాయకులు విభజన
వ్యతిరేకముగా ఉన్నప్పటికి, ప్రధాన ప్రతిపక్షనేత కూడా విభజన వ్యతిరేకముగా
ఉన్నప్పటీకిని ఒంటి చేత్తో తెలంగాణాని సాధించిన ఘనత కేసిఆర్ కే దక్కుతుంది.
ముఖ్యంగా స్వంత ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తినా పలు సాంకేతిక/పరిపాలనపరమైన/యితర అంశాలకు ఎటువంటి
విలువ ఇవ్వకుండానే తెలంగాణా ఏర్పాటుకు ముందుకు వెళ్ళడం వెనుక కేసిఆర్ ఉన్నారని
వేరే చెప్పక్కర్లేదు.
తొమ్మిదేళ్ళు
ముఖ్యమంత్రిగా చేసి దేశ రాజకీయాల్లో మంచి పట్టు కల్గిన చంద్రబాబునాయుడు ఒక వైపు,
స్వయాన స్వంత ముఖ్యమంత్రే ఒక వైపు విభజన అడుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం
చేసినప్పటికీ, తాను చెప్పిన దాని ప్రకారమే తెలంగాణాని సాధించుకురాగలిగారు.
చంద్రబాబునాయుడు, జగన్ ల లాబీయింగ్ కేసిఆర్ లాబీయింగ్ ముందు పనిచేయకుండా పోయింది.
తెలంగాణా బిల్లుని అసెంబ్లీలో
ఓడించి రాష్ట్రపతికి పంపినప్పుడు, కేసిఆర్ ఏమన్నారు....
“నేను రేపు డిల్లీ వెళ్ళి
తిరిగి తెలంగాణా రాష్ట్రంతోనే తిరిగివస్తాను” అని. ఈ మాట విని చాలా మంది
నవ్వుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని. వీడికి కాకమ్మ కబుర్లు చెప్పడం అలవాటే
కదా అని...
“రేపు మధ్యాహ్నం నాటికి
మీరందరూ సంబరాలు జరుపుకోవడానికి సిద్దంగా ఉండండి” అని పార్టి కార్యకర్తలకు పిలుపు
ఇచ్చినప్పుడూ ఏమనుకున్నారు అందరూ.... చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడురా వీడు. లోక్
సభలో బిల్లు పాసు అవుతుందని ఎలా అనుకుంటున్నాడో అని...
కానీ
ఏమయింది>>>>
అందరి అంచనాలని
తలక్రిందులు చేస్తూ తాను చెప్పినట్టుగానే లోక్ సభలో ఎవడినీ లోపలకి రానివ్వకుండా
తలుపులు బిడాయించి, ప్రత్యక్ష ప్రసారాలు నిలుపుచేయించి మరీ బిల్లును
ఆమోదించగలిగారు. తాను ముందు చెప్పినట్టుగానే తెలంగాణా ప్రజలు సంబరాలు
చేసుకున్నారు.
అలాగె తాను ముందు
చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ నుండి డిల్లి వెళ్ళి, తిరిగి వచ్చేటప్పటికి
తెలంగాణాలోనే అడుగుపెట్టగలుగుతున్నారు.....
నాయకులు చాలా మంది
ఉండోచ్చు ..... కానీ వారందరిలో కేసిఆర్ ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు....
అరవై సం.రాల కోరికను
నెరవేర్చి తెలంగాణా రాష్టా సాధకుడిగా తెలంగాణా ప్రజల దృష్టిలో ఉండిపోతారు.
తెలుగుజాతిని
విడగొట్టినవాడుగా, విద్వేషాలు, అసత్యాలు ప్రసారం చేసి విభజన చేసిన వాడుగా సీమాంధ్రుల
దృష్టిలో ఉండిపోతారు.
If Y.S.R is alive no KCR..no Telamgaana..
ReplyDeleteమీరన్నది నిజమే కావచ్చు...వైఎస్ ఆర్ లేకపోయినా కూడా నో తెలంగాణా అనుకున్నారు అందరూ...
Deleteకానీ యస్ తెలంగాణా అయింది...
అందరూ అది కేస్యార్ క్రెడిట్ అంటారు కానీ.... మనోళ్ళు(బొత్స, పనబాక లక్షమి, శీలం, సిరు) కూడా తమ శాయశక్తులా ప్రయత్నించారు సీమాంధ్ర అస్తిత్వన్ని తాకట్టు పెట్టి తెలంగాణా రావడానికి...
స్పందించినందుకు ధన్యవాదములు..
The old leaders of T.congress who didn't' get chance to become C.M encourage separate T.& KCR..now war begins in T. between TRS & congi..
ReplyDeleteDirty politics..everywhere in India..no Hero..only vilains to poor public..
ముందున్నది మొసళ్ళ పండగ అన్న సామెత గుర్తువస్తుందండీ నాకు....
Deleteదేశంలో ఉన్న్ నేతలందరూ ప్రజలకు విలన్ల లెక్కేనండీ... ఒక్క టి.ప్రజలకు తప్ప.. వారికి అక్కడి నేతలు దేవుళ్ళు లెక్క.. ఆ దేవుళ్ళు ఏమి చెప్తే అదే వేదం అక్కడ...
అదేంటో యెప్పుడు కాంగ్రెసు(అధినేత్రి)ని కలిసినా పార్టీ నుంచి మరో పురుగుని కూడా రానివ్వకుండా ఒఖ్ఖడే(!?) వెళ్తాదు. అక్కడ పొర్లు దండాలే పెడుతాడో గుక్క పట్టి యేడుస్తాడో పీక కోసుకుంటానని బెదిరిస్తాడో యెవరికీ తెలీదు.బయట కొచ్చి ద్డవిలాగులు మాత్రం దంచేస్తాడు.ఒక్క నెల రోజులే ఇంకొక్క నెల రోజులే అంటూ డేకించుకొచ్చి ఆఖరికి ఖాజీ సాయెబు గారు తురకల్లో కలిసి పోయాడన్నట్టు కాంగ్రెసులో కలిసి పోతున్నాడు.పాపం!
ReplyDeleteఅయన్నీ బ్రహ్మరహస్యాలు.. బయటికి ఎవూడికి తెల్వవంతే....
Deleteలోపల చేసినవన్నీ(పొర్లుదండాలు/గుక్కపెట్టి ఏడుపు/పీక కోసుకుంటానై) మర్చిపోడానికే లిక్కర్ అలవాటు ఆయిదనుకుంటా....
స్పందించినందుకు ధన్యవాదములు....
నా కామెంటు కన్నా మీ కామెంటు(ప్రతి వ్యాఖ్య?) అదిరింది.. హ్హ హ్హ హ్హ
Deleteవిలీనం చెయ్యకుండా సీట్ల సర్దుబాటు వల్ల కాంగ్రెసుకి లాభం ఉండదని తెలిసిందే గనుక విలీనం తప్పక పోవచ్చు. విలీనం చేస్తే ఉద్యమ పార్టీ అస్తిత్వం లేకుండా అయిపోతుంది. చెయ్యకపోతే మాటి మాటికీ మాట తప్పేసే ఉద్యమ మేతని నమ్మకంగా కాంగ్రెసుకే అంటిపెట్టుకుని ఉండేలా పట్టి ఉంచడమూ కష్టమే.అటు చూస్తే ఆంధ్రాలో వలసలే వలసలు!యెగదీస్తే గోహత్యా దిగదీస్తే బ్రహ్మహత్యా అనే సామెత ఇట్టాంటి సిట్యుయేషన్ లోనే పుట్టించారేమో పాతకాలం వాళ్ళూ:-)
ReplyDelete