Thursday, 12 January 2012

దార్శనిక నాయకుడు- తరుణ్ గోగొయ్..

రోజు భారతదేశంలో ఉన్న అరుదైన నాయకుల్లో ఒకడు. ప్రస్తుతం అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈయన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు... అది సహజము కూడా. ఎందుకంటే ఈ రోజు మీడియా వార్కి, యువతకు ఇలాంటి దార్శనికుల గురించి తెలుసుకొనే అవకాశము, సమయము లేదు. అన్నాహజరే అవినీతిపై ఉద్యమం దరిమిలా, ఒక్కసారిగా దేశప్రజానికలో అవినీతిరహిత నాయకుడు ఉన్నాడా? అనే సందేశాలు చాలా మందికి వచ్చాయి. ఈ రోజుల్లో ఎవరైనా స్వంతలాభం కొరకే రాజకీయాల్లోకి వస్తారు కాని, ఉన్న అస్దులను అమ్ముకొని ప్రజలకు సేవ చేద్దామని వచ్చేవారెవరుంటారు అని ప్రశ్నించుకొనేవార్కి సమధానం... తరుణ్ గోగొయ్, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన పూర్తి పేరు తరుణ్ కుమార్ గోగొయ్. అస్సాం రాష్ట్రంలోని జోర్హాత్ జిల్లాలో గల రంగజన్ టీ ఎస్టేట్ లో జన్మించారు. ఈయన మొదటిసారిగా రాసిన హెచ్.ఎస్.ఎల్.సి. పరీక్షల్లో ఫెయిలయ్యారు. కాని చివరకు ఆయన గౌహతి యూనివర్సిటి నుండి గ్రాడుయెట్ పట్టా అందుకున్నారు. తర్వాత అయన ఇండియన నేషనల్ కాంగ్రెసు పార్టిలో సభ్యత్వం పుచ్చుకొని, జోర్హాత్ నియెజకవర్గం నుండి 1971 సం.లో తొలిసారిగా పార్లమెంటుకి ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో అనేక ముఖ్య పదవులను చేపట్టిన తరుణ్ గోగొయ్ 2001సం.లో అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక్కడ వరకు ఆయన ప్రస్దానం గురించి చెప్పుకుంటే అందరిలాగే ఈయన గురించి అనుకోవచ్చు. ముఖ్యమంత్రి పీఠం అదిష్టించినప్పటికి, ఆయన మొదట్లో తను అనుకొన్న విలువలకు ఎటువంటి మచ్చ లేకుండా ఇప్పుడు వరుసగా మూడవ పర్యాయము అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ మూడు పర్యాయముల పదవి కాలములో ఈయనపై ఒక అరోపణ కూడా లేదంటే, ఆయన వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకోవచ్చు. ఆయనకు తన వ్యక్తిగత బ్యాంకు బాలెన్స్ ఎంత ఉంటుందో మీరు ఊహించగలరా? కేవలం పదిహెను వేల రూపాయలు. మీరు నమ్మకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది రాజకీయనాయకులు చెప్పేది ఇటువంటి లెక్కలే. తరుణ్ గోగెయ్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయినప్పటికి, ఆయన భార్య విశ్వవిద్యాలయములో అధ్యాపక వృతిలో కొనసాగుతున్నారు. ఆయన తన స్వంత ఖర్చులకు ఆవిడ వేతనం మీదే ఆధారపడతారు. మరియు అధికారిక కార్యక్రమాల్లో అవిడ ఎక్కడా కనబడరు. అంతే కాకుండా అవిడ తన కార్యాలయమునకు ఒక ముఖ్యమంత్రికి బార్యగా ఉండి కూడా, ముఖ్యమంత్రి భార్య హొదాలో అధికార వాహనము కాదని అటోలోనే వెళతారు. అధికారక కార్యక్రమాలకు కూడా ఈవిడ ముఖ్యమంత్రితో కాకుండా సాధారణంగానే వెళతారు. తరుణ్ గోగొయ్ తనకు వచ్చే గౌరవ వేతనం పదమూడు వేల రూపాయలను కూడా ప్రభుత్వ ఖజానాకే జమచేస్తారు. దేశములో ఎక్కడైనా ఒక స్దాయికి చేరిన రాజకీయ నాయకుడు కొంత కాలం గడిచేసరికి ఏదొక కుంభకోణ మకిలితో అంటకాగుచున్నారు. ఈ రోజు దేశములో రాజకీయాలను ఉన్నత స్దానానికి ఎదగడానికి ఉపయెగపడే ధన సోపానలుగానే బావిస్తున్నారు. అంతేకాక ఈ రోజు రాజకీయాలను కేవలం స్వంత ఎదుగుదలకు మాత్రమే ఉపయెగించుకుంటున్న అనేక మంది రాజకీయనాయకులను ఈ రోజు గల్లి, గల్లీకి చూడవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఈ రోజుల్లో అసలు అంత నిజాయితిగా, నిక్కచ్చిగా రాజకీయాల్లో కొనసాగడం సాధ్యమేనా అనేది అనేక మందికి వచ్చే పెద్ద సందేహం. వాటన్నింటికి సమాధానం తరుణ్ గోగొయ్.
మన మీడియాకు, వార్తపత్రికలు కూడా ఇలాంటి నిజాయితిగా ఉండగల్గుతున్న వారిని ప్రజలకు తెలియపరిచే సమయం ఉండడం లేదు. వాళ్ళకు ఇలాంటి వారి కంటే అవినీతి కంపు కొడుతున్న నేటి నాయకులంటేనే మెజు. వాళ్ళ గురించి పేజిలకు, పేజిలు కవరేజిలు ఇవ్వడంతోనే సరిపోతుంది. ఏ రోజూ కూడా ఇలాంటి నాయకుల జీవనశైలి గురించి కాని, లేక వారి గురించి కాని పతాక శీర్షికల్లో కనబడవు. ఒక వేళ ఉన్నా చిన్న కాలమ్ లో వార్త రాసేసి దుమ్ము దులిపేసుకుంటాయి. అదే పనికిమాలిన రాజకీయ నాయకులు డ్రమ్ము కొట్టిన, మందు త్రాగిన, ముక్క తిన్న, డాన్స్ లు వేసిన, తిట్టుకొన్న, అదొదే పెద్ద ఇష్యూలా పేజిలకు, పేజిలు వాటి గురించే. ఇక మీడియా పనితీరు ఇలాగుంటే మనకి తరుణ్ గోగొయ్ లాంటి వారి గురించి ఏమి తెలుస్తుంది. అలాంటి ఉదహారణే మీకు ఇంకోకటి చెప్పగలను. కాకినాడకి ప్రక్కన గల యానాం ఎమ్.ఎల్.ఎ. మల్లాడి కృష్ణారావు గారు.
 ఈయన తరుణ్ గోగెయ్ అంతటి ఆదర్శవాది కాకపోయినా చాలా మంచి భావాలు కల్గిన వ్యక్తి. మొన్న పుదుచ్చేరి రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో, ఈయన ప్రచారానికి బయటకు రాకుండా, ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా, ఎవరిని ఓట్లు అడకకుండా విజయము సాధించారు. ఎందుకంటే ఆయన ప్రజలను తాను చేసిన అభివృద్ది చూసి ఓట్లేయవలసినదిగా కోరారు. ప్రజలు ఆయనను అఖండ మెజారిటితో గెలిపించారు. ఆయన తన నియొజక వర్గానికి చేసిన అభివృద్ది అలాంటిది. యానాం పట్టణం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారీ మాట. మరి ఈ రోజుల్లో ఎంత మంది ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా గెలవగలుగుతున్నారు? ఏది ఏమైనా మనం విలువలను త్రికరణ శుద్దిగా పాటించినప్పుడు నిజాయితిగా ఉండగలమని నిరూపించారు తరుణ్ గోగెయ్ మరియు మల్లాడి కృష్ణారావు గార్లు.

2 comments: