Monday 28 October 2013

లెక్క తప్పిన రేసు

గత రెండు రోజుల నుండి న్యూస్ పేపర్ చూస్తుంటే భారత్ లో మూడవ సారి నిర్వహిస్తున్న ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రి గురించి వార్తలే... వరుసగా మూడో సారీ జర్మనీ బుల్లొడూ వెటోల్ గెలవడం అద్బుతమే....

ఆయితే సదరు ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రి రేసు భారతదేశంలో నిర్వహించడం ఇదే అఖరుసారని, వచ్చే ఏడు నుండి ఇండియాలో నిర్వహించడం లేదని ఆ మధ్య వార్తలొచ్చాయి...

ఎన్నో లక్షలు ఖర్చు చేసి నోయిడాలో ఎంతో అధునికంగా నిర్మించిన బుద్ద ఇంటర్నేషనల్ ట్రాక్ మూడేళ్ళ ముచ్చటగానే మిగిలిపోనున్నది.. దీనికి నిర్వహకులు అనేక కారణాలు చెబుతున్నారు. ఆశించిన ఆదరణ లేకపోవడం మరియు నిర్వహణ ఖర్చు భారీగా ఉండడం, ప్రభుత్వము నుండి పన్నులు భారీగా ఉండడం తదితర అంశాలు కారణాలుగా తెలియచున్నది. కారణాలేమి ఆయితేనేమి మొత్తానికి ఇదో గుదిబండగా మారింది.

ఒక పదేళ్ళు వెనక్కు వెళితే, అప్పుడు దేశములో ఇలాంటి రేసులు ఉండేవి కాదు. ఫార్ములా వన్ రేసు ప్రియులు వాటిని చూడాలంటే విదేశాలకు వెళ్ళి రావల్సిందే...  మైకేల్ షుమాకర్ ఇమేజి మూలంగా దేశంలో కూడా ఫార్ములా వన్ రేసులంటే ఎంతో కొంత ఇంట్రెస్టు ఉండేది.. దానికి తోడు క్రికెట్ దేవుడు సచిన్ మరియు మైకేల్ షుమాకర్ లు  స్నేహితులు కావడం మొ.గు అంశాలు ఎంతో కొంత ఇంట్రెస్టుని క్రియేట్ చేసాయి.  ఆయితే వాటిని టెలివిజన్లో చూడడం వరకే పరిమితం... విదేశాలకు వెళ్ళి చూసేంతా స్టామినా దేశంలో చాలా మందికి లేవు.  ఆయితే ఈ రేసులు మీద ఇంట్రెస్టు చాలా మటుకు ఉన్నత స్దాయి వర్గాల్లోనే ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అది చాలా ఖరిదైన వ్యవహరం... పైగా కార్లు ఎంత మందికి మాత్రం ఉండేవి??

అలాంటి పరిస్దితుల్లో ఫార్మాల్ వన్ ని భారతదేశంలో నిర్వహించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందులో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సదరు ఫార్ములా వన్ ట్రాక్ ని హైదరబాద్ లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసారు.

దీనిపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ, సదరు గ్రాండ్ ప్రి రావడం వలన అనేక ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని, తద్వారా అనేక మందికి జీవనోపాధి కలుగుతుందని మరియు పర్యాటకం ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించి ప్రయత్నాలు చేసారు. ఎందుచేతనో, ఎందుకో తెలియదు కానీ సదరు గ్రాండ్ ప్రి నోయిడాకి తరలిపోయింది.
అక్కడి ప్రభుత్వం దానికి బోలెడన్నీ రాయితీలు కల్పించి, ఎంత సహకరించాలో అంతగా సహకరించడంతో భారతదేశంలోఫార్ములా వన్ గ్రాండ్ ప్రి నిర్వహించడానికి మార్గం సుగుమయింది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అత్యంతనాధునతమైన ట్రాక్ ని తయారు చేసారు...

మొదటి ఫార్ములా వన్ ఇండియన్ గ్రాండ్ ప్రి కి పలు రంగాల నుండి వి.ఐ.పి.లను ఆహ్హనించడంతో మంచి ఆదరణ లభించింది... తర్వాత నుండి ఆదరణ పెరగలేదు సరి కదా తగ్గిపోయింది. ఎందుకంటే అంతటి విలాసావంతమైన ఆట మన దేశంలో చాలా మందికి అందని ద్రాక్ష కాబట్టి.  మూడవ సం.రం వచ్చేసరికి పూర్తిగా ఎత్తేసే చర్యలు తీసుకుంటున్నారు..

భారతదేశంలో పేదరికం స్దాయి చాలా ఎక్కువ... ఇక  విపణిలో పెరిగిపోతున్న నిత్యవసరాల ధరల కారణంగా మధ్య  తరగతి వారు విలాసాలు అన్న సంగతినే మర్చిపోయారు. కేవలం జనాభాలో తక్కువ శాతం గల ధనవంతుల కోసం అంతంత డబ్బు ఖర్చు చేసి, అనేక పన్ను రాయితీలు కల్పించి ఇలాంటి ధనిక వినోద కార్యక్రమాలను నెత్తిన పెట్టుకోవడం మనలాంటి దేశానికి అవసరమా అన్న విషయాన్ని ఏ ప్రభుత్వం ఆలోచించలేదు....

దాని కన్నా ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలను తీసుకురావడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది కదా... దాని వల్ల ఇటు నిరుద్యోగం తగ్గుతుంది. అటు ఉత్పాదకత ద్వారా ఆదాయం సృష్టించవచ్చు కదా.... ఇప్పుడు మన దేశానికి కావల్సినది వినోదభరితమైన పరిశ్రమలు కాదు.... కూడు పెట్టగలిగే పరిశ్రమలు కావాలని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిదే కదా....

మన దేశానికి ఏది అవసరమో వాటినే మనం ఆహ్హనించాలి... ప్రజలకు ఏది అవసరమో వాటినే నెలకొల్పాలి.... అలాంటప్పుడు మాత్రమే ప్రజలు ఆదరణ ఉంటుంది దేనికైనా...

లేకపోతే మన ఆలోచనలు, ప్రణాళికలన్ని లెక్క తప్పుతాయి.....



No comments:

Post a Comment