చాలా
రోజులయింది మరల బ్లాగు ప్రపంచంలోకి వచ్చి.... పని భారము వలన మరియు నా మనసు బాగాలేకపోవడం వలన ఈ మధ్య బ్లాగులోకి రావడానికి కుదరలేదు... ఆయిన నా ఆర్టికల్స్ కోసము వెయిట్ చేసేంతటి ఫాలోయింగ్ నాకు లేదు... ఈ అర్టికల్ వ్రాసేనాటికి కూడా నాకు సరయిన మనశ్శాంతి లేదు.... దేనిమీద శ్రద్ద పెట్టలేకపోతున్నాను.. కేవలం మనసు నిండా ఉన్న అనిజి భావన కారణముగా సతమవుతున్నాను.... అందుకనే సడెన్ గా నాకు అనిపించింది.... అది ఏంటంటే మనశ్శాంతి కావాలంటే దానికి కొలమానం ఏమిటి అని?? ఎంత ఆలోచించిన దానికి సరయిన కొలమానాలు ఉండవని అనుకుంటున్నాను.... ఎందుకంటే అది ఆ వ్యక్తి యొక్క మానసిక స్దితి మీద ఆధారపడి యుంటుందని నా అభిప్రాయము...నాకు బ్యాంకు బాలెన్స్ కి ఇబ్బంది లేదు... గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నాను... స్నేహితులున్నారు.. ఆయినప్పటికి నాకు మానసిక ప్రశాంతత సాధించలేకపోతున్నాను. అసలు ఈ మానసిక ప్రశాంతత అనేది ఎలా సాధించాలో తెలియక సతమవుతున్నాను... ఆ మధ్య చాలా పుస్తకాల్లో చదివాను నేటి యువత ఎక్కువగా డిప్రెషన్ తో భాదపడుతున్నరని.... అది చదివినప్పుడు అనుకున్నాను... ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు ఎవరైనా డిప్రెషన్ కి లోనవుతారు కదా... దానికి యింతంత అర్టికల్స్ వ్రాయడం అవసరమా అని... కాని ఆ ప్రాబ్లెమ్ ఏంటొ నాకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది... నాకైతే ఇప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లెమ్స్ లేవు.... కాని డిప్రెషన్ లో ఉన్నాననిపిస్తుంది.... ఈ నా డిప్రెషన్ నన్ను ఎక్కడికి తీసుకుపోతుందో చూడాలి...ఇలాంటి
చెత్త పోస్ట్ వ్రాసి మీ అముల్యమైన టైమ్ ని వేస్ట్ చేశానని భావిస్తే క్షమాపణలు కోరుకుంటూ........
No comments:
Post a Comment