Monday 20 February 2012

అమ్మ మీద అలక.....

నిన్న, మొన్న వరుసగా రెండు రోజులు శెలవులు వచ్చినప్పటికీ ఇంటికి వెళ్ళలేదు.
ఒక్క రోజు శెలవు దొరికితే చాలు ఇంటికి పారిపోయే నేను, ఈ సారి వెళ్ళకపోవడానికి
ఒక కారణముంది...
బహుశా నేను ఒంటరిగా ఉన్నప్పటి నుండి, శెలవులకు ఇంటికి వెళ్ళకపోవడం రెండో సారి అనుకుంటా...
అలవాటుగా ఎపుడూ శనివారము మధ్యాహ్నం అమ్మ నుండి ఫోన్ వచ్చింది...
ఎప్పుడు బయలుదేరుతున్నావు?? రాత్రికి టిఫిన్ ఏమి చేయమంటావు అని??
నాకెంతో ఇష్టం అమ్మతో మాట్లాడుతుంటే...
ఇంత వయసు వచ్చినప్పటికి అమ్మ నన్నింకా చిన్నపిల్లాడిలానే చూస్తుంటుంది...
అమ్మ ఫోన్ చేసి, ఎపుడు వస్తున్నావు అని అడిగితే, నా సమాధానం నాకు రావడం వీలుపడదని!!
అమ్మ గొంతులో కొద్దిగా మార్పు.... ఎందుకు రావడం లేదని కొద్దిగా తేడాగా మారిన గొంతుతో అమ్మ ప్రశ్న!!
రేపు వి.ఆర్.వొ. పరీక్షకు ఇన్విజిలేషన్ డ్యూటి పడిందని చిన్న అబద్దం తనతో....
ఆయిన సరే, పరీక్ష ఆయిపోయిన వెంటనే బయలుదేరి వచ్చేయి..ఎలాగు సోమవారం శెలవు కదా.. అని..
నిజానికి నాకు ఏ పరీక్షకు ఇన్విజిలేషన్ పడలేదు.. వెళ్ళకూడదని ముందుగానే నిర్ణయించుకున్నందున అబద్దం చెప్పేశా....
ఆయిన నాకు రావడానికి కుదరదు.. వేరే పని కూడా ఉన్నదని అబద్దం చెప్పి మొత్తానికి రావడం లేదని
తనకు సర్దిచెప్పడానికి చాలా కష్టపడవలసివచ్చింది.....
అసలు ఇంతగా వెళ్ళకూడదని నిర్ణయించుకోవడానికి కారణమేముంది??
అమ్మ నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తుంది అన్న అలక..
నాకు అన్ని విషయాలు చెప్పడం లేదన్న బాధ....
ఇదే విషయము నా సోదరితో చెప్పాను.. నేను ఎందుకు రావడం లేదొ!!

తాను ఏమందో తెలుసా!!

నేను ఎటువంటి ఇబ్బంది పడకూడదని అమ్మ ఏ విషయాలు నాకు చెప్పడం లేదట...
ఇబ్బందికర విషయాలు (కుటుంబ సమస్యలు, అర్దిక వ్యవహారాలు) నాకు కూడా
చెప్పి నన్ను స్ట్రగుల్ చేయడం ఇష్టం లేకట....
నాన్న గారు, తాతయ్య గారు చనిపోయిన దగ్గర నుండి మొత్తము వ్యవహారములన్నీ
అమ్మే చూస్తుంది. నలభై ఎకరాల మాగణికి సంబందించిన పనులన్నీ తనే చూసుకుంటుంది..
ఇంటికి అసరాగా ఉండవలసిన పెద్దవాళ్ళు తొందరగానే కాలం చేసినప్పటికీ, బెంబేలు పడక,
మొత్తము తన మీద వేసుకొని మమ్మల్లి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది...
అలా చూసుకోవడంలో ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులు... అవేవి మాకు తెలియనివ్వదు....
నేను చాలా సార్లు ప్రయత్నించా... అమ్మకు అన్ని విషయాల్లో చేదెడు వాదోడుగా ఉండాలని...
కాని అమ్మ ఎపుడూ తన సమస్యల గురించి నా దగ్గర చర్చించదు......
తను పడే ఇబ్బందులు నాకెందుకులే అన్న నిర్ల్యక్షం......

అంటే నేను ఏమన్నానో తెలుసా?

ఇబ్బందులు, కష్టాలన్నీ తను పడి, సుఖాలు మాత్రము మనకి ఇస్తే, అటువంటి సుఖం నాకొద్దు....
అమ్మ ఎదుర్కొనే కష్టాల్లో నేను కూడా పాలుపంచుకుంటేనే, సుఖాలు కూడా పాలుపంచుకుంటాను అని చెప్పాను....

ఎందుకు మా కోసము అమ్మ తన కష్టాలు దాచుకోవాలి??

నేనేమన్నా పరాయివాడినా?? తమ కష్టాలు నాకు చెప్పవలసిన అవసరం లేదా?
మాకు కావలసినపుడూ అన్ని వండిపెట్టేసి, కావలసినపుడు అడిగినంత డబ్బు ఇచ్చేస్తే,
విశ్వమంతా ప్రేమను మాకు పంచేస్తే సరిపోతుందా??

సరిపోదు... నాకు అమ్మ మనసు కావాలి.... ఆవిడ అంతరంగం నాకు తెలియాలి....
ఆవిడ కష్టాలు నాకు తెలియాలి.. ఆ కష్టాల్లో నేను కూడా పాలు పంచుకోవాలి.......
అప్పుడే అమ్మ నా కోసం చేసిన ఏ పని ఆయిన నేను అస్వాదించగలను....

ఇది నా మాట......

అందుకే అమ్మ మీద అలిగాను.... నువ్వు ఏ విషయాలు నాతో పంచుకోవడం లేదని....
అవన్నీ నీకు ఎందుకురా!! అని పుచిక పుల్ల తీసి పారేసినట్టు పారేస్తుంది నా మాటలను...

అందుకనే నేను వెళ్ళలేదు ఇంటికి నిన్న....

ఆదివారము పొద్దున్నంతా రూమ్ లో ఉండిపోయి... మధ్యాహ్నం అలా సరదాగా బీచ్ కి వెళ్ళాను...
సాయంత్రం వరకు తిరిగి, బోజనం చేసి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చా.
ఎక్కడా ఎంజాయ్ చేయలేకపోయాను.. రోజంతా అమ్మను మిస్ ఆయ్యానన్న ఫీలింగ్ నా మదినిండా....
అమ్మే కాదు... నేను కూడా అమ్మ లేకపోతే ఉండలేనన్న సంగతి చూచయగా తెలిసింది.....
ఇంటికి వెళ్ళిపోవలనిపించింది.... కాని పంతం కొద్ది వెళ్ళలేదు....

మర్నాడు మహశివరాత్రి.... రూమ్ లో ఉండబుద్దికాలే....
ఒక ప్రెండ్ ని తీసుకొని ద్రాక్షరామ శివాలయానికి వెళ్ళాను. దర్శనం అయ్యేసరికి మద్యాహ్నం ఆయిపోయింది...
దర్శనంను కూడా పూర్తి స్దాయిలో అస్వాదించలేకపోయాను.
ఎందుకంటే నా మనసు నిండా అమ్మే ఉండిపోయింది.......
అమ్మ లేకుండా ఉండడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది.....
అమ్మ మీద విజయం సాధించడం చాలా కష్టం....

అందుకే వచ్చే అదివారము కోసము చాలా అత్రుతగా ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నాను....
శనివారం మద్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోవాలి.... తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి...
 
 

9 comments:

  1. వీలుంటే సెలవు పెట్టి ఇప్పుడే వెళ్ళండి.

    ReplyDelete
  2. ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే..

    ReplyDelete
  3. ప్రతీ అమ్మ ఇలాగే ఆలోచిస్తుంది.. సో ముందు అమ్మకు కాల్ చేసి సారీ చెప్పండి. తర్వాత వెళ్లి కలవండి. మీరు రానందుకు మీకంటే మీ అమ్మ ఎక్కువ బాధపడి ఉంటుంది. దానికి కారణం మీరే....ఇది మీకు న్యాయమా?? ఒక్కసారి ఆలోచించండి..

    ReplyDelete
  4. @jyothi గార్కి,
    రేపు సాయంకాలమే వెళుతున్నానండీ,
    శుక్రవారము, శనివారము శెలవులు పెట్టేసా... మొత్తం మూడు రోజులు ఇంట్లోనే..
    ధన్యవాదములు...

    @anonymous gaarki,
    అనుభవంలోకి వచ్చిందండి మీరన్నది...
    ధన్యవాదములు..

    ReplyDelete
  5. జ్యోతి గార్కి,
    అమ్మబాబోయ్ నేను మా అమ్మగార్కి సారీ చెప్పలేనండీ,
    ఇప్పటికి ఒక్కసారీ అమ్మకి సారీ చెప్పలేదు... అమ్మ మనసు వెన్న అని తెలిసిన తర్వాత..
    నేను సారీ చెప్తే, చెప్పినందుకు అమ్మ అలుగుతుంది నా మీద....
    మీరన్నట్టు అమ్మ మీద అలగడం నాకు న్యాయం కాదనుకొండి.... కాని అమ్మ తన సమస్యలు నాకు చెప్పడం లేదన్నది నా బాధ.
    పూర్వకాలం రోజుల్లోలా మనం ఇంటి పట్టునే ఉంటే, కొంత వరకైనా తన సమస్యలు మనకు తెలుస్తాయి..
    కాని ఉద్యోగాల రీత్యా దూర ప్రాంతాల్లో ఉండడం తప్పనిసరి కావడం మూలన తెలియడం లేదు.. అమ్మను నా దగ్గరకు వచ్చేయమని
    వెళ్ళిన ప్రతిసారీ బ్రతిమాలుతాను... నవ్వేసి ఊరుకుంటుంది.. కాని రావడం లేదు. గట్టిగా అడిగితే ఇక్కడ అందరూ నాకు
    చుట్టాలే కదా... నాకెమి తక్కువ అంటుంది....
    ధన్యవాదములండి స్పదించినందుకు....

    ReplyDelete
  6. @Sravya Vattikuti gariki,
    thanks..

    ReplyDelete
  7. మీ ఇద్దరి అనుబంధం చూస్తె ముచ్చటేస్తుంది.

    ReplyDelete
  8. just now i entered into ur blog n saw two things , one rambabu n other about mom, nuvvu cheppav amma kastaalu thanu paduthu sukaalu manaki isthundhi ani , adhe amma ante , anuskshanam pillala kosam bhartha kosam thapisthu kastapaduthu anandhisthuvuntundi , nenu chaala sarlu choosa maa ammani yeppudu emi tiffin cheyanu emi curry cheyanu ani aduguthundhi,roju prodhunne lechi adhe pani , oka roju late ga legusthe neersangha undha ani aduguthundhi , nenu maatram maa ammani eppudu adagaledu, chaala try chesaanu chesthunnanu pelli avuthe ammaki konchem rest ivvacchu ani , kaani na korika theeradam ledu, oka sari naa kallalo neellu thiruguthuntayi ammaki nenu emi cheyalaeka pothunna ani.amme modhiti daivam ,srivishnu amma prema kosame krishnuni avataram lo puttaru

    ReplyDelete