Wednesday 8 February 2012

చిన్నప్పటి ఆటలు- కర్ర-బిళ్ళ....

మొన్న "నేనింతే-రవితేజని కాను" బ్లాగులో గిరిష్ గారు వ్రాసిన టపా "ఆటలు-పాటలు-పాఠాలు" చదివిన తర్వాత నా చిన్నప్పటి రోజులన్ని సినిమా రీలుగా గిర్రున వెనక్కి తిరిగిపోయాయి. నిజానికి గిరిష్ గారి టపాకి కామెంటు రాద్దామనుకొని, టపా రాసేస్తున్నాను. నేను పంచుకోవలనుకొన్న చిన్నప్పటి అనుభూతులన్ని అల్రెడి అందరూ చెప్పేసారు. అవన్నీ నన్ను చూసి రాసేశారెమిటా అని అనుకున్నా కూడాను. నేను ఒక్కడినే సర్కారీ బడిలో చదువుకొని, నాదైనా ప్రపంచంలో మారుమూల పల్లెలో అందమైన బాల్యంను గడిపానేమో అనుకొన్నాను. కాని నాకు తోడు చాలా మంది ఉన్నారీ ఈ బ్లాగు ప్రపంచంలో... (తప్పుగా అర్ద్రం చేసుకోకండి. బ్లాగర్లందరూ పట్నాం బాబులేమో అనుకొనేవాడిని). కాని మీ అనుభవలన్నీ చదివిన తర్వాత చాలా మంది పదహరణాల పల్లెల నుండి వచ్చినవారే అని నాకు క్లియర్ గా అర్ద్రమయిపోయింది. కాని మీరందరూ వాటన్నింటిని ఈ కాలం పిల్లల్లో మిస్ అయ్యారేమో కాని, నేను మాత్రం ఇంకా అటువంటి ఆటలను మిస్ కావడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ నేను ప్రతి వీకెండ్ మా ఊరుకి వెళ్ళిపోతాను. మహ అయితే ఓ మూడు వేల జనభా ఉంటారెమో మా ఊరిలో. అక్కడ మా ఇంటికి వచ్చే కుర్రాళ్ళతో మన చిన్నప్పటి ఆటలు కొన్ని ఆడిస్తాను. (మనమాడిన మొత్తం ఆటలు అడించడం మన వల్ల కాలేదు లెండి). కొన్నయిన ఆడించడం ద్వారా నా బాల్యంను గుర్తుచేసుకుంటున్నాను. అందులో భాగంగా మా ఇంటి దగ్గరు కుర్రాళ్ళతో కర్ర-బిళ్ళ అట ఆడించా. ముచ్చటపడి దాన్ని సెల్ ఫోన్ ద్వారా వీడియా తీశా. దాన్ని మీ కోసము క్రింది పెడుతున్నాను.

2 comments:

  1. Super..
    వాఖ్య రాయబోయి టపానే రాశారన్నమాట..
    చాలా వరకు బ్లాగర్లందరూ సర్కారు బడిలో చదివినవోళ్ళే.. ఎందుకంటే ప్రైవేటు బడిలో చదివిన వాళ్ళకు తెలుగు అంతగా రాకపోవచ్చు..
    చిన్నప్పటి అనుభవాలు దాదాపు అందరిలోను అందంగా ఉంటాయి.. :)

    ReplyDelete
  2. @గిరిశ్ గార్కి,
    ధ్యాంక్యు అండీ, స్పందించినందుకు, and
    సారీ అండీ, మీరు వ్రాసిన టపా అధారంగా నేనొక టపా రాసేసినందుకు.....

    ReplyDelete