Tuesday 7 February 2012

ప్రియాంక గాంధి.....

నాకిష్టమైన రాజకీయనాయకుల్లో ప్రియాంక గాంధి ఒకరు. (ప్రియాంక రాజకీయనాయకురాలు కాదేమో?). ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మధ్య ఎక్కువగా ప్రియాంక గాంధీ వార్తల్లో కనిపిస్తున్నారు. ఈవిడ ఎక్కువగా బయటకు కనిపించరు. అంతేకాదు ప్రత్యక్ష రాజకీయాల్లో ఈవిడ ప్రమేయం నామమాత్రం. నాకు ఎందుకో తెలియదు కాని, ఆవిడను చూస్తే స్వచ్చమైన నాయకురాలుగా కనిపిస్తుంది. నిండైన ముఖం, సింపుల్ గా ఉండే ఆహర్యం, మాటతీరు, ఆకట్టుకొనే హుందాతనం.. ఇవన్నీ కలగలసి తానంటే నాకు అభిమానం. పైగా తాను ఇందిరా గాంధీ పోలికలతో ఉండడం, ఇటలీ దేశస్దురాలైన తల్లికి జన్నించినప్పటికి, తన అహార్యం పూర్తిస్దాయి భారతీయతను ప్రతిబింబిచండం మొదలైనవన్నీ ఆవిడ మీద అభిమానమునకు కారణం కావచ్చు.

ఉత్తరప్రదేశ్ లో తన తల్లి, సోదరుల స్వంత నియెజకవర్గాల ఎన్నికల ప్రచారానికి మాత్రమే సారి పరిమితమయ్యారు. రాహుల్ గాంధీతో సమానమైన ఫాలోయింగ్ (చెప్పాలంటే, రాహుల్ కన్నా ఎక్కువే)ఉన్నప్పటికి ప్రియాంక గాంధీ కేవలం రెండు నియెజకవర్గాల ప్రచారానికే పరిమితమవుతారు. విషయమ్మీదే అన్న, చెల్లెలిద్దరిని ప్రతిపక్షాలు "వర్షాకాలపు కప్పలు"గా అభివర్ణించాయి. ఆయితే విమర్శను ప్రియాంక గాంధీ బాగానే త్రిప్పిగొట్టగలిగారు. విమర్శ నాకు వర్తింస్తుదేమో కాని, రాహుల్ కి కాదని కౌంటర్ ఇచ్చింది.



Rahul గాంది కంటే ప్రియాంకకు ఎక్కువ విషయజ్ణానం,మరియు వాక్చాతురం, ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోవడమేమిటో నాకు అర్ద్రం కాదు. ఎవరైనా గమనించవచ్చు. రాహుల్, ప్రియాంకలను పోల్చుకున్నప్పుడు ప్రియాంకనే బెటరనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తారు.

 బహుశా, విషయములో సోనియా గాంధీకి పుత్రవాత్సలం ఎక్కువగా ఉన్నట్టుంది.మరియు తమ వంశ వారసత్వ బదిలీ గాంధీలకే చెందాలని ఆవిడ బావిస్తుండొచ్చు. ప్రియాంకను తీసుకువస్తే రాహుల్ తేలిపోతాడని, తద్వారా పార్టీ పగ్గాలు తమ కుటుంబం నుండి వాద్రాల కుటుంబానికి బదలాయింపు అవుతుందని భావిస్తుండొచ్చు. కారణంగా ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కుదరల్లేదని అనుకోవచ్చు.

ఇప్పటికే రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి ఏళ్ళు గడిచిపోయాయి. ఎంత సేపు కాంగ్రెసు పాలన లేని రాష్ట్రాలలో మారుమూల గ్రామల్లో పర్యటించి, మరియు వారితో గడిపి, అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప, తాను చేసిందేమిటన్నది ఆయన వివరించడం లేదు. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికి, మరియు కీలకమైన స్దానములో ఉన్నప్పటికి ఆయన ప్రజలకు ఏమి చేయకుండానే, పాతతరం రాజకీయనాయకుల వలె రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆడిపోసికోవడం ఆయన అసమర్దతను సూచిస్తుంది. సాంకేతిక విప్లవం పుణ్యమాని ప్రతి ఒక్కరికి ఇంటర్ నెట్ అందుబాటులో వచ్చిన రాహుల్ గాంధీ చేసే పనులను అందరూ గమనిస్తున్నారు. దురదృష్టావత్తు రాహుల్ ఈ విషయమును విస్మరిస్తున్నారు.

కేంద్రంలో తన ప్రభుత్వమే ఉన్నందున, తన పలుకుబడిని ఉపయెగించి, తద్వారా మంచి పనులు (ప్రాజెక్టులు) చేసియుంటే, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా విశ్వసనీయతను పెంచుకోవలసినది. కాని ఎంత సేపు మాటలతోనే కాలము గడిపేస్తున్నారు. అందువలన ఆయన మీద ప్రజలకు నమ్మకం సడలింది.

దేశ ప్రధాని అభ్యర్ది విషయములో రాహుల్ గాంధీ కున్నా పాపులారిటి తగ్గిపోయి, నరేంద్రమెడికి పావులారిటి పెరిగిపోయిన నేపధ్యంలో కాంగ్రెసు పార్టికి ధీటైన అభ్యర్దిగా ప్రియాంక గాంధీ వస్తే మేలని చాలా మంది భావిస్తున్నారు. పైగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెసు పార్టి మరల అధికారములోకి వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు.

పైగా ప్రియాంక గాంధీ ప్రజల్లో ఉన్న పాపులారిటి కూడా కాంగ్రెసు పార్టికి ఉపయెగపడగలదని బావిస్తున్నారు. ప్రియంకా గత ప్రసంగాలు విన్నవారు, ఆవిడలో, తన నానమ్మ ఇందిరా గాంధీ పోలికలు ప్రస్పూటంగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు. నేను కూడా అదే భావిస్తున్నాను.

1 comment:

  1. >>తమ వంశ వారసత్వ బదిలీ గాంధీలకే చెందాలని ఆవిడ బావిస్తుండొచ్చు>> - నిజం.
    >>దురదృష్టావత్తు రాహుల్ ఈ విషయమును విస్మరిస్తున్నారు.>> - ఆయన దురదృష్టము, మన అదృష్టము.. :), రాహుల్ కన్నా చాలా మంది ఉన్నారు దేశంలో ప్రతిభ కలిగిన నాయకులు ex: Arvind Kejriwal.

    ప్రియాంక గాంధీ గురించి నేను కూడ +ve గానే విన్నానండీ..

    ReplyDelete