Monday, 21 May 2012

’పవర్’ అన్ ఇన్ బైపోల్స్ ఏరియాస్ (అదృష్టవంతుల కధ)....


’పవర్’ అనే పదానికి ఎంత శక్తి ఉందో మీ అందరికి తెలుసు...

ముఖ్యంగా ఆ పదాన్ని ఒక్కొక్కొరు ఒక్కొక్కొ విధముగా అన్వయించుకుంటారు.....

ఎవరు ఏ విధంగా అన్వయించుకొన్నప్పటికి పవర్ అనే పదానికి చాలా శక్తివంతమైన అర్దం వస్తుంది...

అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పవర్ స్టార్ అనే బిరుదు తగులించుకొన్నారు.....

పవర్ స్టార్ అంటే ఆంద్రలో యువత వెర్రెత్తిపోతారు........ అదే విధంగా "పవర్" అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదే స్దాయిలో వెర్రెత్తిపోతారు....

"పవర్" అనే పదాన్ని ప్రభుత్వ పెద్దలు రెండు రకాలుగా అన్వయించుకుంటారు.. ఒకటికి ఎలక్షన్స్ కు ముందు ప్రజలకు కావలసిన కరెంటు గురించి....ఎలక్షన్స్ తర్వాత తమకొచ్చే అధికారం గురించి..... ఏదైనా దానిని పవర్ అనే అంటారు....

ఎందుకంటే వాళ్ళ దృష్టిలో తమ "పవర్" నిలబెట్టుకోవాలంటే, ప్రజలను "పవర్"(కరెంటు) కష్టాల నుండి గట్టెంకిచాలి కాబట్టి....

సాధారణంగా ప్రభుత్వాలు తమకు "పవర్" అందివచ్చేవరకు ప్రజలకు కావలసిన పవర్ గురించి చాలా శ్రద్ద తీసుకుంటారు.... దాని కోసం ప్రక్క రాష్ట్రాల నుండి ఎంత మొత్తానికైనా కొనుగొలు చేస్తారు.....

వాళ్ళకు కావలసిన "పవర్" వచ్చేసిన తర్వాత, ప్రజలకు కావలసిన పవర్ గురించి మర్చిపోతారు.... ఇక పవర్ గురించి ప్రజలు, ముఖ్యంగా రైతులు పడే పాట్లు ఆ దేవుడికే ఎరుక.....

తమ "పవర్" పదిలంగా ఉన్నంతకాలం.. ప్రజల పవర్ కష్టాలు గురించి అలోచించడానికి కూడా తీరిక లేకుండా, తమకు ప్రయెజనం చేకూర్చే పవర్ ప్రాజెక్టులు గురించి అలోచించుకోవడానికే తమ హెచ్చు సమయం సరిపోతుంది.....

వాళ్ళ కంటికి ప్రజలు ఎలక్షన్స్ సమయములోనే మహారాజుల్లా కనబడతారు... ఆ సమయములో ప్రజల మీద ఎక్కడ లేని అపార ప్రేమ పుట్టుకొస్తుంది.. ఆ సమయములో రూల్స్ అన్ద్ రెగ్యులేషన్స్ జాన్త హయి...

మొదటగా వారు అలోచించేది ప్రజల గురించే. ఎందుకంటే మరి వాళ్ళకు కావలిసినది ప్రజల దగ్గర ఉంటుంది కాబట్టి. ఆ ఎలక్షన్లు ఉన్న సమయం మంతా ప్రజలకు ఎటువంటి పవర్ ఇబ్బందులు లేకుండా రేయింబవళ్ళు ఎంతో కష్టపడుతుంటాయి ప్రభుత్వాలు....

అందుకనే నాలాంటి అమాయక జీవులు అనుకుంటాయి... ఎల్లవేళలా ఎలక్షన్లు ఉంటే బాగుణ్ణు అని.....
కాని ఆ దేవుడు అందరి మొరలు అలకించలేడు కదా..... ఒకవేళ అలకించిన అందరి కోరికలు తీర్చలేడు కదా......
అందుకని అలాంటి మహరాజు జీవితంను ఈ వేసవిలో కేవలం కొంత మంది కైనా కల్పించాలని ఆ దేవుడు సంకల్పించాడు....

అనుకున్నదే తడవుగా భగ భగ మండే వేసవిలో పద్దెనిమిది నియెజకవర్గాల్లో ఉప ఎన్నికలు రప్పించాడు.....
ఉప ఎన్నికలు రప్పించినాక ప్రభుత్వాలుకు కంటి మీద కునుకు ఎక్కడ పడుతుంది. అంతే ఉప ఎన్నికలున్న పద్దెనిమిది నియెజకవర్గ ప్రజలు వాళ్ళ దృష్టిలో మహరాజులయిపోయారు..... వెంటనే వారికి ఈ వేసవిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగర్తలు తీసుకోవాలని క్రింది స్దాయి అన్ని శాఖల అధికారులకు అదేశాలు వెళ్ళిపోయాయి....


అన్నింటిని తిమ్మిని బమ్మిని చేసి ఏదో విధంగా సరిపెట్టగలరు కాని..... పవర్ ను మాత్రం ఎలా సరిపెట్టగలదు ఆ మాత్రం అధికారులు........ అసలే వేసవి కాలమామే.... ప్రజలు ఎండ వేడి భరించలేక కరెంటును మంచినీళ్ళు త్రాగినట్టు పోలోమని త్రాగేస్తుంటే "పవర్" కి కటకట వచ్చేసింది...


ఆయినప్పటికి ఆ పద్దెనిమిది నియెజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు కలగరాదు. మంత్రదండం వాళ్ళ చేతుల్లో ఉందాయే....


ఆ పద్దెనిమిది తప్పితే మిగతా వాళ్ళతో మనకి పని ఏముందిలే అని ధర్మ ప్రభువులు వారు, అయా ప్రాంతాల్లో గంటలకు గంటలు తరబడి పవర్ కట్ అమలుచేసి, ఉప ఎన్నికల ప్రజలకు నిరంతర కరెంటు సప్లయి చేయుచూ వారి సేవలో తరించిపోతున్నారు...


తంతే, బూరెల బుట్టలో పడ్డట్టు, కరెక్టుగా మండు వేసవిలోనే వాళ్ళ నియెజకవర్గాలకు ఎన్నికలు వచ్చినందుకు అక్కడ ప్రజలు ఉబ్బితబ్బి ఆయిపోతున్నారు... ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత వెసులుబాటు ఉంటుందా అని.......

మిగతా ప్రాంతాల ప్రజలు మాత్రం... ప్రభుత్వం వారు బహుకరిస్తున్న "పవర్ కట్" పధకాన్ని తనివితీరా అనుభవిస్తూ, తమకు ఉప ఎన్నికలు రాని తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ.......................... గడిపేస్తున్నారు....
 

తప్పదు కదా...... రేయ్... విసన కర్ర ఇలా తెండి రా బాబు........ చచ్చిపోతున్నా గాలి ఆడక....


No comments:

Post a Comment