Wednesday, 21 March 2012

నరేంద్ర మోడి- మతతత్వం- న్యాయ, న్యాయాలు

నిన్న రాత్రి భోజనం చేసి రూమ్ కి వచ్చిన తర్వాత చానల్స్ అన్ని తిప్పుకుంటే వెళుతుంటే ఎన్.డి.టి.వి.లో ఒక ఇంట్రెస్టిగ్ డిబేట్ ప్రొగాం వస్తుంటే చూడడం మొదలెట్టాను..ఆ డిబేట్ ఏమిటంటే ప్రముఖ పత్రిక టైమ్స్ ముఖచిత్రంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి బొమ్మని ప్రచురించడం...దానిపై నరేంద్ర మోడి పాలనపై విశ్లేషణత్మక వ్యాసం ప్రచురిస్తూ, దానికి మోడి means బిజినెస్ అని క్యాప్షన్ ఇచ్చింది... ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు గాంచిన టైమ్స్ ముఖచిత్రంపై ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసిన ఆయా రంగాలకు చెందిన ప్రముఖ్యులు యొక్క కధనంతో ముఖచిత్రంగా ప్రచురిస్తే, దానిని చాలా గొప్పగా భావిస్తుంటారు(అనుకుంటా).

ఆ విధంగా టైమ్స్ ముఖచిత్రంపై నరేంద్రమోడి బొమ్మ రావడంతో,ఆ అంశం మీద డిబేట్ పెట్టారు ఎన్.డి.టివి.వారు.. అందులో దాని గురించి విశ్లేషించేవారెవరో నాకు అంతగా తెలియదు. కాని వారు మాట్లాడిన మాటల ద్వారా నరేంద్ర మోడి పై విమర్శలు ఎక్కుపెట్టడానికే ఎక్కువ ప్రయారిటి ఇచ్చారు. మోడి గురించి చెప్తూ అతనొక మత ఉగ్రవాదని, అతని యొక్క మతోన్మోదం కారణంగా జరిగిన గోద్రా అల్లర్లలో అనేక మంది అమాయక ముస్లింలు ప్రాణాలు కోల్పోయరని, అలాంటి వాడిని ఏ విధంగా మొచ్చుకొనగలమని వాదించారు. ఒకప్పుడు సద్దాం హూస్సేన్, బిన్ లాడెన్ ల ముఖచిత్రాలు కూడా టైమ్స్ ముఖచిత్రంగా వచ్చాయని, అంత మాత్రాన నరేంద్ర మోడిని గొప్పవాడిని భావించలేమని చెప్పుకొచ్చారు.


నిజమే, ఈ విషయమై నేను గోద్రా అల్లర్ల విషయములో నరేంద్ర మోడి పాత్రను అనుమానిస్తాను. నేను కాదు... మొత్తం ప్రజలందరూ అనుమానిస్తున్నారు. వీరందరి కన్నా కాంగ్రెసు పార్టి ఇంకా ఘోరంగా దీనిపై నరేంద్ర మోడి పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే నరేంద్ర మోడి పై నానా గగ్గోలు పెడుతూ జాతీయ కాంగ్రెసు జాతీయంగా రచ్చ రచ్చ చేసేసింది. (వీళ్ళకు భారత్ లో ముస్లిములు తప్ప వేరే వారు ఎవరూ కనబడరు అనుకుంటా). నాకు తెలిసి ఆ డిబేట్ లో కాంగ్రెస్ పార్టికి చెందిన ఒకాయన ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ, గుజరాత్ లో నరేంద్ర మోడి పాలనలో ముస్లింలు స్వేచ్చయుతమైన జీవితంను కోల్పోయారని, చాలా మంది ముస్లింలు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారని ఆరోపించారు.


నరేంద్ర మోడి పై ఈ విధమైన వ్యాఖ్య చేసినటు కాంగ్రెసు వాది ఒక విషయమును మాత్రం మర్చిపోయినట్టున్నారు. ఒకప్పుడు కాశ్మీర్ లో మోజారిటి సంఖ్యలో పండిట్లు ఉండేవారు. ఈ రోజు చూస్తే మచ్చుకు ఒక్కడు కనబడడు. ఎందుకని?? వారందరూ ఏమి ఆయిపోయారు? కాశ్మీర్ లో మోజారిటిగా ఉన్న పండిట్లులను మూకుమ్మడి ఊచకోతలు కోసినప్పుడు గాని, వారి కుటుంబాలను విచక్షణారహితంగా చంపినపుడు కాని ఈ జాతీయ కాంగ్రెసు వాదులు ఎక్కుడున్నారు? ఆ రోజు కాశ్మీర్ లో జరిగిన ఊచకోతల కారణంగా పండిట్లు అనే వారు ఎవరూ లేకుండా యితర ప్రాంతాలకు వలస పోయినపుడు, అక్కడ జరిగిన ఆరాచకం వీరి కంటికి కనబడలేదా? దానిపై రచ్చ రచ్చ చేయాలనిపించలేదా?


కాని ఇప్పుడు గుజరాత్ లో జరిగిన సంఘటనలతో ముస్లింలు అందరికీ అన్యాయం జరుగుపోతున్నట్టు తెగ ఫీలయిపోతున్నారు కాంగ్రెసువాదులు. ఆనాడు కాశ్మీర్ లో జరిగిన పండిట్లు ఊచకోతలు తప్పులేదు కాని, ఈ రోజు గుజరాత్ లో జరిగిన ఊచకోతలు తప్పు వచ్చాయా?


క్షమించండి.. నా ఉద్దేశం ఇక్కడ ఎవరినీ సమర్దించడం లేదు. నేరం ఎవరూ చేసిన అది సమర్దనీయం కాదు. జాతీయ పార్టి ఆయిన కాంగ్రెసు ఓట్ల లబ్ది కోసము ఇలాంటి మతతత్వ ట్రిక్కులు ఉపయెగించడం పైనే నా అవేదన అంతా... ఊచకోతలనేవి ఎక్కడ జరిగిన అందులో సమిధిలవ్వేవి సామాన్య జనం మాత్రమే... ఒక కాశ్మీర్ లో జరిగిన ఊచకోతలైన, గుజరాత్ లో జరిగిన ఊచకోతలైన, లేదా వేరే ఎక్కడ జరిగిన ఊచకోతలైన బలయ్యేది సామాన్య జనమే. ఆ నష్టానికి మతంను ఆపాదించలేము... ఆ సమయములో వారు పడే వేదన, భయము పగవాడికి కూడా రాకూడదని ఏ మతం వాడైనా కోరుకుంటాడు.


కాని నీచులైన పాలకులకు, రాజకీయ నాయకులకు ఇటువంటివేవి కనబడదు. వాళ్ళకు కనబడేది కేవలం ఓట్లు మాత్రమే. నిజానికి కాశ్మీరి పండిట్లు, గుజరాత్ ముస్లింల పై ఊచకోతల గురించి వింటే ఎలాంటి వాడికైనా గుండె ద్రవించుకుపోతుంది. మతాల వారీగా ప్రజలను విడగొట్టి ఎంతకాలం విషం చిమ్ముతారో తెలియడం లేదు మన దేశంలో కుహనా రాజకీయవాదులు....


నా మాటకు చెప్పాలంటే, ఇలాంటి విషయాల్లో కాంగ్రెసు వాదులు ఎక్కువగా పండిపోయారు. ఏ దురదృష్ట సంఘటననైనా వీరు తమ రాజకీయాలకు అనుగుణంగా మార్చుకుంటారు. కాని నరేంద్రమోడి అలా కాదు. గోద్రా అల్లర్లలో తన హస్తంను క్షమించలేకపోయిన, తదనంతర కాలములో అతను గుజరాత్ ని అభివృద్ది పధంలోకి తీసుకొళ్ళిన విధమును పరిశీలిస్తే అతనిని మెచ్చుకొనకుండా ఉండలేము. దేశ జి.డి.పి.రేటు కన్న, గుజరాత్ రాష్ట్ర జి.డి.పి. రేటు ఎక్కువగా ఉందంటే అర్ద్రం చేసుకోవచ్చు అతని పనితీరును. రాష్ట్రంలో సరయిన సహజ వనరులు లేకపోయినప్పటికి, వ్యాపారపరంగా గుజరాత్ ని ఎక్కడికో తీసుకెళ్ళగలిగిన మోడి యొక్క దూరదృష్టిని గమనించే టైమ్స్ పత్రిక తన ముఖచిత్రంపై మోడి బొమ్మను ప్రచురించగలిగింది.


ఒకప్పుడు గోద్రా అల్లర్ల దృష్ట్యా మోడికి తమ దేశ వీసా నిరాకరించిన అమోరికా, ఈ రోజు మోడి ని అమోరికా రావలసినదిగా అహ్హనం పంపిన విషయమును ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. గుజరాత్ ని అభివృద్ధి పధంలో తీసుకువెళ్ళడానికి నరేంద్ర మోడి చేసిన కృషిని గుర్తించే టైమ్స్ మేగజైన్ లో తమ బొమ్మను వేసింది తప్ప, అతని యొక్క దురాగతలను చూసి కాదని కాంగ్రెసు వాదులు తెలుసుకొంటే మేలు.


ఇప్పటికైనా కాంగ్రెసు మరియు విపక్షాలు నరేంద్ర మోడీ పై విమర్శలు మాని, అతని నెలకొల్పిన ప్రమాణాలు అందుకొని, వీలయితే దాటుకొని వెళ్ళి నిరూపించుకోవాలి. కాబోయే దేశ ప్రధాని రేసులో వేగంగా దూసుకుపోతున్న నరేంద్ర మోడి పై పనికిమాలిన విమర్శలు చేసే బదులు, దేశానికి నిజమైన అభివృద్ది ఎలా చేయాలో తెలుసుకుంటే మేలు... లేకుంటే ఇప్పటికే అందనంత ఎత్తులో ఉన్న నరేంద్ర మోడిని ఎప్పటికి అందుకోలేరు.

4 comments:

  1. మంచి వ్యాసం అండి.. చాలా బాగా చెప్పారు

    ReplyDelete
    Replies
    1. Nagasinivasa Peri garu,

      tnks very much to ur compliment sir..

      Delete
  2. మంచి వ్యాసం అండి.. చాలా బాగా చెప్పారు

    ReplyDelete
  3. mee abhiprayam tho eekibhavisthunnanu

    ReplyDelete