Tuesday, 6 March 2012

సిరివెన్నెల... హృదయ స్పందనల సినిమా...

ఉదయము ఒక్కసారిగా మెలకువ వచ్చింది. దుప్పటి తొలగించి చూస్తే అప్పటికే తెలవారిపోయినట్టుగా
కిటికి నుండి సన్నటి వెలుగు..

ఉలిక్కిపడ్డాను... అప్పుడే తెల్లారిపోయిందా అని...

ప్రతిరోజూ ఉదయము రన్నింగ్ వెళ్ళడం అలవాటు నాకు. ఆయితే వేసవి కాలం మొదలు కావడంతో
కొద్దిగా ముందుగానే రన్నింగ్ కి వెళ్ళాలని అనుకొన్నాను.

వెంటనే గబుక్కున లేచి కూర్చుని టైమ్ చూస్తే ఆరు పావు ఆయింది. పర్వాలేదు పెద్దగా టైమ్
ఆయిపోలేదని త్వరగా రెడీ కావడం మొదలెట్టాను.. పైగా ఈ రోజు నుండి మా ప్రెండ్స్ షటిల్ గేమ్
స్టార్ట్ చేద్దామని అనుకొన్నారు. ఎందుకనే గాని ఆ ప్రోగాం క్యాన్సిల్ ఆయింది..
 
బ్రష్ చేసుకొని రన్నింగ్ డ్రెస్ వేసుకోసుంటగా, టి.వి. పెట్టాను. జెమిని మూవీస్ లో సిరివెన్నెల
సినిమా వస్తుంది ఆ టైమ్ లో...

అంతే, ఒక్కసారిగా ఆగిపోయాను రెడి ఆవుతున్నవాడిని.... ఎందుకంటే అక్కడ టి.వి.లో
వస్తుంది సాదాసీదా సినిమా కాదు.. లెజెండ్రి మూవీ సిరివెన్నెల....

విశ్వనాధ్ గారి చేతుల నుండి జాలువారిని మహద్బుమైన సినిమా......


అప్పుడెప్పుడొ ఇంటర్ చదివే టైములో చూసానీ సినిమాను. ఆ రోజుల్లోనే నా మదిలో

ఉండిపోయింది.. తర్వాత చాలాసార్లు చూద్దామనుకొన్నా ఆ సినిమాను. కాని టి.వి.లో
మిగతా అన్ని చెత్త సినిమాలు ఒకటికి పది సార్లు ఇచ్చేవారు కాని ఈ సినిమాను మాత్రం
ఇప్పటికీ ఒక్కసారి ఇవ్వలేదు. ఇచ్చినా నాకు చూడడానికి కుదరలేదు...

ఇదుగో మరల ఇన్నాళ్ళకు ఇచ్చాడు... అది ఉదయమే... ఇక రన్నింగ్ కి వెళ్ళాలనిపించలేదు...
సినిమా చూడడానికే డిసైడ్ ఆయిపోయాను. ఎందుకంటే ఆ సమయంలో దానిని మిస్
అవ్వాలనిపించలేదు....

సిరివెన్నెల సినిమా గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కేవలం చూసి తరించవలసినదే..
ముఖ్యంగా పాటలు... ఏమి పాటలండీ అవి.... ఎంత విన్నా.. ఇంకా వినాలనే.. వినాలనే ఉంటాయి...

నాకు తెలిసి ఈ పాటలన్నింటికి ఒకే ఒక్క ప్లూయిట్ అనే సంగీత వాయద్యం మీదే వచ్చాయనుకొంటాను...

ప్లూయిట్ మీద నుండి వచ్చే అద్బుత సంగీతానికి ఎవరైనా మైమరిచిపోవలసినదే... సినిమా మొత్తము
ప్లూయిట్ సంగీతం నేపధ్యంలోనే సాగుతుంది....

పాత్రలు, పాత్రధారులు, కధ, కధనం, పాటలు అన్ని అద్బుతంగా కుదిరి చూడడానికి ఎంతో బాగుంటుందీ సినిమా..
సర్వదామన్ బెనర్జీ (హిరో పేరు ఇంతవరకే గుర్తున్నది నాకు), సుహాసిని, మున్ మున్ సేన్, శుభలేఖ
సుధాకర్, మీనా మొదలగు అందరూ ఎంత గొప్పగా నటించారో చెప్పక్కలేదు.

ముఖ్యంగా హిరో పాత్రధారిని కళ్ళు లేని సంగీతాభిమానిగా మలచిన తీరు చూస్తే విశ్వనాధ్ గారి ప్రతిభను
మెచ్చుకోకుండా ఉండలేము. అదే విధముగా సుహాసిని అభినయంను కూడా.. మాటలు రాని యువతిగా
సుహాసిని చేసిన అభినయము నభూతో నభవిష్యత్...

ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలా మంది నటులు గుడ్డి వారి గాను, మూగ వారిగాను నటించారు కానీ,
సిరివెన్నెల సినిమాలో పాత్రధారులు చేసినటు వంటి సహజసిద్దంగా ఎవరూ చేయలేకపోయారు...

గుడ్డివాడిగా సర్వాదామన్ బెనర్జీచే విశ్వనాధ్ గారు అద్బుతమైన నటనను రాబట్టుకొన్నారు. కొన్ని కొన్ని సీన్స్
చూస్తుంటే, ఆ దృశ్యాలు మన హృదయాన్ని తాకుతాయి. అదే విధముగ సుహాసిని పాత్ర కూడాను..

కాని ఎందుకో కాని, కొన్ని కొన్ని సన్నివేశాల్లో సుహసిని నటన కొద్దిగా అతిగా అనిపించింది. బహుశా
ప్రస్తుతం సినిమాలకు అలవాటు పడిపోవడం వల్లనేమో....



మిగిలినది.. మున్ మున్ సేన్ గురించి... అద్బుతమైన అందగత్తె అని చెప్పలేను కాని. చూస్తున్నంతసేపు
చాలా బాగుందనిపించేలా ఉంది. ముఖ్యముగా చెప్పుకోవలసినదేమిటంటే, శృంగార భరిత సన్నివేశాల్లో
ఎక్కడా అసభ్యత ఉన్నట్టుగా అనిపించలేదు. పైగా అవి చాలా సహజసిద్దంగా ఉన్నట్టుగా మలిచారు.

నాకొక డౌటు ఉండేది.. ఇప్పుడున్న సినిమాల్లో అసభ్యత ఎక్కువయిపోతుందని విమర్శలు వస్తుంటాయి కదా...
యాక్చువల్ గా శృంగారన్ని చూపించేటప్పుడు అసభ్యంగా అనిపించడం సహజమే కదా అనుకొనేవాడిని..
కాని అది తప్పని తెలిసింది ఈ రోజు.... శృంగారమనేది కధలో భాగమే కానీ, దానిని అసభ్యంగా కాకుండా
చూపించడం ఎలాగో విశ్వనాధ్ గారు సిరివెన్నెల సినిమాలో చూపించారు అనిపించింది....

మున్ మున్ సేన్ తో వచ్చే శృంగార సన్నివేశాలు ఎంత గొప్పగా చిత్రికరించారో మాటల్లో చెప్పలేను.
ఎక్కడా అసభ్యత లేకుండా, అలా అని శృతి మించకుండా తీయడం.... కేక......

సినిమా క్లైమాక్స్ లో మున్ మున్ సేన్ చనిపోతుందని నాకు గుర్తు. ఎందుకు చనిపోతుందో నాకంతగా
ఐడియా లేదు. ఇప్పుడు ఎలాగైనా చూడాలనుకొన్నాను. కాని ఆఫీసుకి టైమ్ ఆయిపోయింది..

ఆఫీసుకి లేటుగా వెళ్ళి ఆయిన సరే చూడాలనుకొన్నా.... కాని ఈ రోజు ఆఫీసులో కొత్త కలెక్టరు గారితో
మీటింగ్ యున్నందున తప్పని సరిగా వెళ్ళవలసివచ్చింది....

మొత్తానికి అలా సినిమా క్లైమాక్స్ మిస్సయ్యా...


కాని ఈ రోజు ఉదయమే ఒక మంచి సినిమా చాలా కాలము తర్వాత చూసిన అనుభూతి కల్గింది.
కె.విశ్వనాధ్ గార్కి ధన్యవాదములు... ఇంత గొప్ప సినిమాను మనకు ఇచ్చినందుకు....

1 comment:

  1. నాకు కూడా బాగా నచ్చిన సినిమా అండి ఇది. సమీక్ష బాగా వ్రాశారు.

    ReplyDelete