Sunday, 4 March 2012

జయహో భారత క్రికెట్

written by murthy nagavolu
బంగ్లాదేశ్ లో బాణా సంచా కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. బంగ్లా ప్రధాని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకో తెలుసుకునే ముందుగా కొంచెం వెనకకు వెళదాం.

          అది క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానం. ప్రపంచంలోని క్రికెట్ ఆడుతున్న జట్లన్నీ అక్కడే ఉన్నాయి. చాలా హడావిడిగా ఉంది. ప్రపంచ మీడియా అంతా అక్కడే కేంద్రీకృతమై ఉంది. అందరూ ఉద్వేగంగా, ఉత్సాహంగా ఉన్నారు. అన్ని దేశాల క్రికెట్ జట్ల కెప్టెన్ లు అక్కడే వివిధ స్ధానాలలో ఉన్నారు. అందరికంటే కొంచెం ఎత్తుగా సింహాసనం లాంటి సోఫాలో భారత కెప్టెన్ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు.
          భారత దేశంలోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సభ్యులు, రాజకీయనాయకులు మరియు బుకీలు సందడి సందడిగా అటూ ఇటూ మొబైల్ ఫోన్ల ద్వారా ఇంగ్లాండులో ఏం జరుగుతున్నాదో తెలుసుకుంటున్నారు. ఇదే సమయంలో భారత ప్రధాని కార్యాలయం నుండి ఫోన్, ప్రధాని మాట్లాడారు. అమెరికా నుండి అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేసారని సాధ్యమైనంత వరకు అమెరికాకు అనుకూలంగా జరిగేలా చూడమని. ఇంతలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి ఫోన్ చేసి ఎలాగైనా ఇటలీ దేశానికి అనుకూలంగా జరగాలని.

                  ఇంతకూ ఇంగ్లాండ్ లో ఏం జరుగుతోంది? అందరిలో అంత టెన్షన్ ఎందుకు? ప్రపంచ మీడియాకు అక్కడ ఏం పని? తెలుసుకుందామనుకుంటున్నారా?

                   ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాలన్ని వన్డే క్రికెట్, టేస్ట్ మరియు టి.ట్వంటీ లలో మొదటి స్ధానం పొందిన జట్టుకు ఏటా వెయ్యి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చేందుకు నిర్ణయించాయి. సంవత్సర కాలంలో అయాదేశాలు ఆడే స్ధాయిని బట్టి మొదటి స్ధానం దక్కుతుంది. ఇందులో అమెరికా మరియు ఇటలీ కూడా కొత్తగా వచ్చి చేరాయి. భారత దేశం ఇంట్లో పులి వీధిలో కాగితం పులలని అందరికి తెలుసు. అందుకే ప్రతీ దేశం భారత దేశంతో అయాదేశాలలో కనీసం ఐదు టెస్ట్లు, ఐదు వన్డేలు మరియు మూడు టి.ట్వంటీలు అడేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే భారత్ ఏదేశం వెళ్ళినా వైట్ వాష్ తో రావడమేకాని గెలుపనేది ఉండదు కాబట్టి.అలాంటి భారత్ తో ఆడితే ఎక్కువ పాయింట్స్ సంపాదించవచ్చని అయాదేశాల ఆలోచన. అయితే ఈ విషయంలో అయాదేశాల మధ్య యుద్ధం మొదలైంది. భారత్ మాదేశంలో ఆడాలంటే మా దేశంలో ఆడాలని అయాదేశాలు కొట్టుకొనే పరిస్ధితి వచ్చింది. దీంతో ఐసిసి కల్పించుకోక తప్పలేదు. అంతేకాకుండా భారత్ ముందుగా ఏ దేశంతో ఆడాలో తెలియని పరిస్ధితి. ఎందుకంటే ఒకరితో ఆడితే ఇంకో దేశం కోపగించుకుంటోంది. అందుకే ఐ.సి.సి  మరియు బి.సి.సి.ఐ కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి.
                   ఆ ఒప్పందం ప్రాప్తికి ప్రతీ సంవత్సరం భారత దేశం టూర్ ప్రొగ్రాం ఒకటి తయారు చేసి ఆ ప్రకారం లాటరీ తీయడానికి, అలా లాటరీలో వచ్చిన దేశంతో భారత్ అ దేశంలో అడటం జరుగుతుంది. అలా లాటరీ ద్వారా నిర్ణయించడానికే లార్డ్స్ లో అన్నిదేశాలు రావడం జరిగింది. వరుస ఓటముల సారధి ధోని మరియు భారత తొట్టిగాంగ్ అంతా అక్కడకు రావడం జరిగింది. కొద్ది క్షణాలలో లాటరీ ద్వారా భారత్ విదేశాలలో ఆడే దేశాలను నిర్ణయించబోతున్నారు. అందుకే ప్రపంచ మంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నది.

                   మొదటి సంవత్సరం భారత్ ఎక్కువ సిరీస్ లు  ఆడేదేశంగా లాటరీ ద్వారా  బంగ్లాదేశ్  ఎన్నుకోబడింది. అంటే భారత్ తప్పకుండా తను ఆడే సిరీస్ లన్ని వైట్ వాషచేయించుకోకుండా రాదు. కాబట్టి బంగ్లాదేశ్ కొంచెం జాగ్రత్తగా ఆడితే ఆ సంవత్సరం మొదటి స్ధానం బంగ్లాదేశ్ గెల్చుకుంటుంది. అందుకే బంగ్లాదేశ్ లో ఆ సంబరాలు.

                             అందుకే జయహో భారత క్రికెట్
P.S.
(మా అన్నయ్య మూర్తి నాగవోలు గారు నాకు పంపిన మెయిల్ బాగున్నందున, దీనిని అందరూ చదువుటకు వీలుగా యధాతధముగా ఇక్కడ ఇవ్వడమైనది)

No comments:

Post a Comment