మరి కొద్ది రోజుల్లో
రాజధాని హైదరబాద్ లో ప్రపంచ స్దాయి జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్న తరుణంలో అసలు
జీవ వైవిధ్యం అంటే ఏమిటి? దాని గురించి విస్తృత సమాచారము ఈనాడు దినపత్రికలో రోజూ
ఇస్తున్నారు.
ఇప్పటి వరకు జీవ వైవిధ్య
సదస్సు అంటే ఏమిటో అనుకునేవాడిని. అదేదో సైన్సుకు సంబందించిన మీట్ ఏమో
అనుకున్నాను. కాని దినపత్రికలో చదివిన తర్వాత తెలిసింది. ఆ సదస్సు ప్రపంచంలో
అనేకానేక జాతుల జీవనం, అంతరించడం అనే విషయమ్మీద అని.
జీవ వైవిధ్యం పేరుతో
ఈనాడు దినపత్రికలో ఈ మధ్య వరుసగా కధనాలు ఇస్తున్నారు. చాలా ఇంట్రస్టింగ్ గా
ఉన్నాయి.
నిజానికి గ్లోబలికరణ
పేరుతో మనము ప్రకృతి ఎంతలా నాశనం చేస్తున్నామో, తద్వారా అనేక జాతుల మధ్య ఉన్న
లింక్ ను నాశనం చేయడం వలన మనకు ఎంత నష్టం వాటిల్లుతుందో తెలిసింది. ఒక సారి
ఆలోచించి చూస్తే మన చిన్నప్పుడు కళ్ళ ముందు తిరిగిన అనేక జీవజాతులు నేడు చాలా
అరుదుగా కనిపించడం గమనిస్తున్నాము.(నిజం చెప్పాలంటే కాకులు కూడా చాలా అరుదుగా
కనిపిస్తున్నాయి). ప్రకృతి ప్రకోపం, కరువు లేక యితర కారణాల వలన ఒక జాతి అంతరించాలంటే
ఇంచుమించుగా కొన్ని వందల సం.రాలు పట్టోచ్చు.
అడవుల్లో ఉన్న జాతులు
గురించి ప్రక్కన పెట్టండి. మా చిన్నతనంలొ మేము చూసిన అనేక జాతులు ఇప్పటికే
కనుమరుగు కావడం చాలా బాధగా ఉంది. బహుశా ఒక ఇరవై సం.ల వ్యవధిలో అనుకుంటా ఇలా జరగడం.
అంతరించిపోవడం అనే ప్రక్రియ ఎంత వేగంగా ఉందో అర్ద్రం అవుతుంది.
నా చిన్నతనంలో ఉన్న
వాటిలో పిచ్చుకలు, రామచిలుకలు, గ్రద్దలు, రాబందులు, కముజు పిట్టలు ఇంకా నాకు
పేర్లు గుర్తుకు రావడం లేదు కానీ చాలా ఉన్నాయండీ...అవన్నీ ఇప్పుడు పల్లెటూర్లలో
కూడా కనబడడం లేదు.
ఇక కప్పలు..... ఎక్కడ
పడితే కనిపించే కప్పలు కూడా అసలు కనబడడం లేదండీ..
నాకు బాగా గుర్తు... మా
అన్నయ్య కు కప్పంటే చాలా భయం. అది తెలిసి నేను కప్పను చేతితో పట్టుకొని మా అన్నయ్య
వెనకాల పరిగెట్టడం నాకు ఇప్పటికి బాగా గుర్తు.
రోజులు ఎలా
మారిపోతున్నాయో...ఏంటో... కొన్నాళ్ళకు
మానవ జాతి మాత్రమే ఉండేలా ఉంది...
No comments:
Post a Comment