దేశములో ప్రభుత్వ
సొమ్ముతో తేరగా పోషిస్తున్న కోతగాళ్ళలో ఇప్పటికే మాంటెక్ సింగ్ అహ్లువాలియా
ఉన్నారు..
ఇప్పటికే మన
దేశంలో అసలు పేదరికమే లేదని కనిపెట్టి తేల్చిచెప్పిన పెద్దాయన ఈయన....
ఇప్పుడు ఈయనకు
తోడు మరో కోతగాడు తయారయ్యాడు...
అయనే విజయ్ కేల్కర్...
ఈయన గారు దేశంలో ప్రస్తుతం వంటగ్యాస్, కిరోసిన్, డిజీల్,
చౌక దుకాణాల్లో యిచ్చే ఆహర ధాన్యాలకు యిచ్చే సబ్బీడిలను పూర్తిగా తొలగించాలని
సెలవిచ్చారు. అలాగే పెట్రోలియం ఉత్తతిలో రాయితీలను దశల వారీగా ఎత్తేయాలని కేంద్ర
ప్రభుత్వానికి హితభోద చేసారు.
భారత అర్దిక వ్యవస్ద పలు దేశియ, అంతర్జాతియ కారణాలతో సమస్యల
సుడిగుండంలో చిక్కుకుందని, అందుకు ప్రతిగా ప్రభుత్వం యిస్తున్న అన్ని రాయితీల
కోతలో ధైర్యంగా వ్యవహరీంచాలని సెలవిచ్చారు.
ఆయినా, నాకు తెలియక అడుగుతాను.. వారు సబ్బీడి రూపములో యిస్తున్న డబ్బు ప్రజల నుండి
వసూలు చేసింది కాదా? లేక వాడి అబ్బ సొమ్మా?
సరే.. రాయితీలు యివ్వడం అర్దిక వ్యవస్దకి భారంగా
ఉందనుకుందాము... రాయితీల కోత ఆన్ని వర్గాలకి వర్తించాలి కదా? కేవలం సామాన్యుడు
ఎక్కువగా ఆధారపడే అంశములపైనే రాయితీల కోత విధించాలా? మరి ధనవంతులకు, కార్పోరేట్లకు
యిచ్చే రాయితీల మాట ఏమిటి?
సరే, అది కూడా ప్రక్కన పెడదాం...
ప్రజ్యాస్వామ్య ప్రతినిధులుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు
మెరుగుపరచడానికి వారు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? సమాధానం చెప్పడం
కష్టం వాళ్ళకు....
ప్రభుత్వం వారు దేశ
ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా, మోజారిటి ప్రజలు
స్వయంవృద్ది మీద బ్రతుకుతున్నారు.
వ్యవసాయం మీద
మోజారిటి ప్రజలు ఆధారపడేవారు. రైతులు కష్టమైన, నష్టమైన వ్యవసాయం చేసుకోనేవారు.
అంతే తప్ప ఏనాడు ప్రభుత్వం వారి మీద ఆధారపడలేదు. కాని ప్రభుత్వం ఏమి చేసింది!
దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం మీద అధారపడడం వలన అర్దిక వృద్ది పెరగడం లేదని
భావించి, వ్యవసాయ రంగంనకు చేయూత యివ్వడం మాట దేవుడెరుగు.. ఉన్న రంగంను అస్దవ్యస్దం
చేసేలా చర్యలు తీసుకున్నారు.
పోనీ, వ్యవసాయరంగం నుండి మరలిన ప్రజలకు వేరే జీవనధారం ఏమైనా
చూపించిందా? అది లేదు...
దానితో చాలా మంది స్వయం ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు..
చాలా మంది కిరణా కొట్టు దారులుగా, చిన్న పరిశ్రమల యజమానులగా రూపాంతరం చెందారు. కొంత
మంది బాగా చదువుకొని పట్టబద్రులయ్యారు. ఇక్కడ కూడా ప్రభుత్వం వీరికి ఏమి సాయం
చేయలేదు.....
ప్రభుత్వం ఇంకా ఏమి చేసింది ప్రజల జీవన ప్రమాణాల మెరుగవ్వడం
కోసం?...
స్వంతంగా అర్దిక అవలంబన ఏర్పాటు చేసుకొసుకొన్న కిరాణాకొట్టు
దారుల మూలాలు దెబ్బతీయడానికి ఎఫ్.డి.ఐ. లను అనుమతించింది.
చిన్న పరిశ్రమల యజమానులగా రూపాంతరం చెంది, ఇంకో కొద్ది మందికి
ఉపాధి కల్పిస్తున్న చిన్న పరిశ్రమలను దెబ్బతీయడానికి, కరెంటు సరాఫరాలో కోతలు
విధించింది.....
బాగా చదువుకొని పట్టబద్రులయ్యి, ఏదోక సంస్దలో ఉద్యోగం
సంపాదించుకోవలనుకొన్న యువతకు ఏమి చేసింది? దేశంలో అసలు పారిశ్రామికకరణ అభివృద్దే
లేకుండా, స్వంతంగా ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులుగా పడుకోబెట్టింది...
అసలు సక్రమయిన ప్రభుత్వ రవాణా వ్యవస్ద అనేది లేని దేశములో
ప్రజలు స్వంత వావానముల మీద ఆధారపడితే, ప్రభుత్వం ఏమి చేసింది? పెట్రోలు ధరల్లో
సబ్బీడి ఎత్తేసింది......
ప్రజలకి వారు ఏమి చేయకుండా, ప్రజల నుండి పన్నులు వసూలు
చేయడం మానేస్తున్నారా? ముక్కు పిండి మరీ అన్ని రకముల పన్నులను పిండుకుంటున్నారు.
పన్నుల ద్వారా వచ్చిన డబ్బును సబ్బీడి రూపంలో తిరిగి ప్రజలకు యివ్వకూడదని మన విజయ
కేల్కర్ గారి అభిప్రాయం......
ఇలాంటి కోతల రాయుళ్ళు ఉన్నందునే దేశ అర్దిక వ్యవస్ద
సమస్యల్లో ఉన్నదని ప్రభుత్వ పెద్దలు తెలుసుకుంటే మేలు...
ముందుగా వారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఏమి
చర్యలు తీసుకున్నారో చెప్పమనండి.. ఆ తర్వాత
సబ్బీడిల్లో కోతల గురించి మాట్లాడమనండి.
వ్యవసాయరంగంనకు చేయూత యివ్వక పోయిన పర్వాలేదు... నిర్వీర్యం
చేసే చర్యలు తీసుకోకుండా ఉంటే చాలు
సక్రమయిన ప్రజా రవాణా వ్యవస్దను ఏర్పాటు చేయండి.. అప్పుడు ముడి
చమురుపై సబ్బీడి యివ్వవలసిన అవసరం లేదు....
కిరణా కొట్టుదారులు, మరియు ఇతర చిన్న చితకా దుకాణాదారులను
వాళ్ళ మానాన వాళ్ళను ఉండనీయండి... ఎఫ్.డి.ఐ.లను అనుమతించకుండా ఉంటే చాలు......
ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి.... కానీ నాకే టైమ్ సరిపోవడం
లేదు..
నిజానికి, మన అర్దికవేత్తల, రాజకీయ నాయకులు ఘనకార్యల
గురించి ఎవరికి టైమ్ సరిపోతుందిలెండి....
ఎవడి పిచ్చి వాడికానందం..... నా గోల నాకు ఆనందం.. ఏమి
చేస్తాం....
అంతా అపై వాది దయ....
కాదు...కాదు...
అంతా ఏలికల వారి దయ...
చాలా బాగా చెప్పారు రాఘవ.. కాని, ఈ మనసుఘొష అంతా, ఎన్ని సార్లు చెప్పినా.. చెవిటివాని ముందర శంఖపు నాదమే కదా!
ReplyDelete