Sunday, 24 June 2012

వ్యవసాయం దండగేనా? (వాస్తవ చిత్రం)

పై చిత్రం మీలో చాలా మంది మొన్న వచ్చిన ఈనాడు పేపర్ లో చూసే ఉంటారు.

కరవు తెచ్చిన కొత్త కొలువు శీర్షికతో వచ్చిన ఆ కధనం చూస్తే ప్రస్తుత రైతు ఎంత దీనస్దితిలో ఉన్నాడో తెలుస్తుంది.

నేడు వ్యవసాయం ఏ విధముగాను గిట్టుబాటు కాక, అప్పటి వరకు ఎవరికి తాకట్టు పెట్టని అత్మాభిమానాన్ని సైతం వదులుకొని పట్టణాలకు వలస వచ్చి తమకు అప్పటి వరకు చేతగాని అనేక పనులు చేస్తూ బ్రతుకు యిడ్చుతున్న రైతన్నలు నేడు కొకొల్లలుగా ఉన్నారు మన రాష్ట్రంలో...

"వ్యవసాయం దండగ" అని ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు గారు అన్నారని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. పలు పర్యాయములు ఆరోపించి, తాను మాత్రం తమ పాలనలో రైతులకు ఎటువంటి దుస్దితి కలిగించరో తెలుసుకోవడానికి ఆయన ఇంకా బ్రతికి ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది..

నిజంగా "వ్యవసాయం దండగ" అని చంద్రబాబు గారు అన్నారో, లేదో కాని నిజానికి ఆ మాట అక్షరసత్యం రైతుల పాలిట.

ప్రకృతి సహకారం లేనప్పుడు ప్రభుత్వాలు మాత్రం ఏమి చేస్తాయిలే అని తీసిపారేయడానికి లేదు ఈ నాటి రైతు దుస్దితికి....

కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలున్నట్టు, ఈ నాటి రైతు దుస్దితికి ప్రకృతి సహకారం లేకపోవడం ఒక్కటే కారణం కాదు.

వ్యవసాయం పట్ల ప్రభుత్వ విధానం, ఎరువుల కంపెనీలు ఇష్టారాజ్యం, కరెంటు కష్టాలు, నకిలీ విత్తనాలు, మద్దతు ధర లేకపోవడం వంటి అనేకనేక కారణాలతో నేడు వ్యవసాయం చేయడమనేది నిజంగానే శుద్ద దండగ....


గాడిమొగ రిఫైనరీ నుండి వెలికి తీసే గ్యాస్ ధర నిర్ణయించుకోవడానికి రిలయన్స్ కంపెనీకి అనుమతివ్వడంలో తప్పులేదు....
జనాల జీవితాలతో చెలగాటమాడుతూ ఇష్టానుసరముగా నకిలీ మందులను వార్కి నచ్చిన ధరలకు అమ్ముకోవడానికి మందుల కంపెనీలకు అనుమతివ్వడంలో తప్పు లేదు........
తాము తయారు చేస్తున్న వస్తువులకు ధర నిర్ణయించుకొనే స్వేచ్చ ఆయా బడా కంపెనీలకు అనుమతివ్వడంలో తప్పు లేదు........
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుదల పేరు చెప్పి దేశములో పెట్రోలు రేటు పెంచడానికి అనుమతివ్వడంలో తప్పు లేదు....


కాని రైతన్న, తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర నిర్ణయించుకోవడం మాత్రం తప్పు మన ప్రభుత్వాలు దృష్టిలో.....


అన్ని పైపులా నుండి రైతన్న మీద దాడి చేస్తే, పాపం రైతన్న మాత్రం ఎంత వరకు ఓర్చుకోగలడు....


అందుకే వ్యవసాయంను శాశ్వతంగా వదిలివేసే దిశగా మెజారిటి రైతులు బయలుదేరుతున్నారు......

ఇంకొక ఇరవై సం.రాల తర్వాత దేశములో అసలు వ్యవసాయం చేసే వారు లేనప్పుడు, పంట ఉత్పత్తిలు పూర్తి స్దాయిలో పడిపోయినపుడు, అప్పుడు తెలుస్తుంది రైతన్న విలువ.... ఖచ్చితంగా తెలుస్తుంది తాము ఎంత తప్పు చేశామో.....

నాలాంటి వాళ్ళు ఏనాడో వదిలేసారు వ్యవసాయాన్ని.... రేపన్న రోజున్న మాకున పొలంలో మాకు మాత్రమే సరిపోయేలా వరి మరియు యితర కూరగాయలు పండించుకొని బ్రతుకుతాము. మిగతా రైతన్నలు కూడా అలా అలోచించే రోజులు ఎంతో దూరంలో లేవు...
 

13 comments:

  1. utpadana penche upayalu alochinchadam mani utpadana champe margam alochistunnaru ee palakulu, adhikarulu. nakili vittanalu, nakili mandulu, ammetappudu dalarulani chustu emi cheyakunda unna adhikarulu, vari bosslu kshamarhulu karu. tindi ginjalu dorakani repati rojuna artham avutundi dani viluva.

    ReplyDelete
  2. చాపకింది నీరులా మొంచుకొస్తున్న ఉపద్రవాన్ని తెలియజేశారు. దూరదృష్టి లేని కొన్ని ప్రభుత్వ పథకాలవల్ల రైతు కూలీలు దొరక్క అయిపోయిందని కొంతమంది వ్యవసాయ బ్లాగర్లు వాపోవడం విన్నాను. దానికి తోడు అస్తవ్యస్తంగా కురుతున్న వానలు, ఋతువులు. తొందరపడి ఏదైనా చేయకపోతే ఇది తిండి గింజలు దిగుమతి చేసుకునేలా చేసి, దేశాన్ని ఆర్థికంగా చావుదెబ్బ కొట్టగలదు. ఇది నిజంగా యుద్ధ ప్రాతిపదికన ఆలోచించి ఎదుర్కోవాల్సిన సమస్య. నాయకులకు, అధికారులకు స్కాములకే తీరిక లేదు.
    చాలా ముఖ్యమైన టాపిక్ తెచ్చారు.

    ReplyDelete
  3. company coverlalo amme annamtini bratakaali janam

    ReplyDelete
  4. నిజమే ఆ పరిస్థితి త్వరలోనే!

    ReplyDelete
  5. నిజమే ఆ పరిస్థితి త్వరలోనే వచ్చేటట్లుంది!

    ReplyDelete
  6. Sravya Vattikuti garki,
    thanks for your compliment....

    ReplyDelete
  7. anonymous,
    ఆవునండీ... ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇటువంటి పరిస్దితి దాపురించిందని చెప్పోచు... స్పందించినందుకు ధన్యవాదములు..

    ReplyDelete
  8. SNKR గార్కి,
    "ఉపాధి హామీ పధకం".. దీని వలన ఎవరు లాభపడుతున్నారో తెలియదు కాని..... రైతులకు మాత్రం కూలీల కొరతను కావలిసినంత సృష్టించిద్ండీ...
    దానికి తోడు ఈ పధకంలో లోటుపాట్లు వలన కూలీలలో కష్టించి పనిచేసే అలవాటు పోయిందండీ...

    ReplyDelete
  9. దుర్గేశ్వర గార్కి,
    కంపెనీ కవర్లలో దొరికే తిండే త్వరలో తినాలిలెండి... ఎందుకంటే ఇప్పటికే రిలయన్స్, టాటా లాంటి పెద్ద సంస్దలు కొంత మంది రైతుల వద్ద భూములను తీసుకొని పంటలు పండించి, వాటిని కంపెనీ బ్రాండ్ ద్వారా అమ్మకాలు సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ మధ్యన ఎక్కడో విన్నానండీ.. అప్పుడు వాడు ఎంత ధర నిర్ణయిస్తే, అంతకే మనము చచ్చినట్టు కొనుక్కోవాలి.. స్పందించినందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  10. చిలమకూరు విజయ మోహన్ గార్కి,
    మీరన్నట్టు త్వరలోనే వస్తుందిలెండి ఆ పరిస్దితి.... స్పందించినందుకు ధన్యవాదములు..

    ReplyDelete
  11. ఉపాధి హామీ పథకం కూడా, పనికి ఆహార పథకం లాంటి పనికిమాలిన పథకమే.
    ఈ పథకం వలన రైతులకే కాదు, నిర్మాణ రంగానికి కూడా కార్మికుల కొరత వచ్చింది.
    ఇవన్నీ నాయకులకీ, కార్యకర్తలకీ ఉపయోగపడే పథకాలే.

    ReplyDelete
  12. బోనగిరి గార్కి,
    మీరన్న దానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. స్పందించినందుకు ధన్యవాదములు

    ReplyDelete