Sunday 24 June 2012

ఓ తండ్రి డైరీలో చివరి పేజి.....

చిన్నా!
అలసిపోయాను, నీరసపడిపోయాను. ముసలివాణ్ణి. దయచేసి నన్ను అర్దం చేసుకో!

 బట్టలు వేసుకోవడం కష్టం, తువ్వాలేదో చుట్టబెట్టుకుంటాను, గట్టిగా కట్టుకోలేను, అందుకే తొలగిపోతూంటుందది, కసురుకోకు.

అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది, చప్పుడు కాకుండా తినలేను. అసహ్యించుకోకు.

 నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతే గుర్తు తెచ్చుకోరా, బట్టలు సరిగా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినే వాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను. విసుక్కోకు, స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చేయలేదని తిట్టకు.

 నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించే వాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు. కీళ్ళ నొప్పులు నడవలేను. ఊతకర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు, నీకు నడక వచ్చేవరకు నేను అలాగే నిన్ను వేలు పట్టుకొని నడిపించాను.

 అందుకేనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అంటారనుకుంటా!

 ఏదో ఒక రోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను, అప్పుడు కోపం తెచ్చుకోకు, అర్దం చేసుకో... ఈ వయసులో బతకాలని ఉండదు, కాని బతకక తప్పదు. ముసలికంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకొని కూర్చో, నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్న నేను అలాగే దగ్గరకు తీసుకొనేవాడిని. నువ్వలా తీసుకుంటే, ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతానురా....



                                                       RESPECT  YOUR  PARENTS


ఫేసుబుక్ లో నా స్నేహితుడు వాల్ మీద ఉన్న ఈ పోటో మరియు లేఖను యధాతదంగా పైన యివ్వడమైనది. చదవగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. పేరేంట్సుని సరిగా పట్టించుకోనని నేటి తరానికి ఈ లేఖ ఏమైనా మేలుకొలువు తీసుకురావచ్చునన్న ఉద్దేశంతో.......


9 comments:

  1. వెరీ టచింగ్! చాలా బాగుంది.

    ReplyDelete
  2. heart touching

    ReplyDelete
  3. లక్ష్మి రాఘవ గార్కి,
    స్పందించినందుకు ధన్యవాదములండీ.. and thanks for your compliment..

    ReplyDelete
  4. heart touching

    ReplyDelete
  5. రమణ డాక్టరు గార్కి,
    నేను మీ బ్లాగుకి వీరాభిమానిని అండీ;. అలాంటిది మీరే నా బ్లాగుకి వచ్చి కామెంటు పెట్టారంటే చాలా హ్యాపీగా ఉందండీ.
    నాకు తెలిసి ఫస్ట్ టైమ్ నా ఆర్టికల్ కి మీరు కామెంటు పెట్టడం..... చాలా ధ్యాంక్సండీ...

    ReplyDelete
  6. SNKR గార్కి,
    స్పందించినందుకు ధన్యవాదములండీ....

    ReplyDelete