నిన్న వీకెండ్ కి ఇంటికి వెళ్ళినప్పుడు సావకాశముగా ఉన్న సమయములో సరదాగా టి.వి. చూద్దామని కూర్చుంటే ప్రభాస్ నటించిన పౌర్ణమి సినిమా వస్తుంది....
ఆ సినిమా అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం.....
ఎక్కడ చూసిన ఒక పార్ములాను అనుకొని తీసిన సినిమాలే ఉన్న ఈ రోజుల్లో అటువంటి సినిమా వస్తే ఎవరికైనా ఆనందమే కదా....
ముఖ్యముగా నాకు మరీను.....
ఆ సినిమా గురించి నేను చెప్పేది కొంచెం అతిశయెక్తి కావచ్చు..... ఎందుకంటే నాకు అద్బుతమైన సినిమా విశ్లేషణ శక్తి లేదు.....
ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్, చార్మి, త్రిష నటించిన పౌర్ణమి సినిమా వచ్చి సుమారుగా మూడేళ్ళు అవుతుందనుకొంటా.....
ఇందులో ముఖ్యముగా చెప్పుకోవలసినది చార్మి నటన గురించి.....
చార్మి ఇందులో నటించిందనేకన్నా జీవించింది అని చెప్పొచ్చు.......
ముఖ్యముగా చివరి సన్నివేశంలో ముక్కంటిని సేవిస్తూ ఆవిడ చేసిన నృత్యం అద్బుతం.... అందులో ఆవిడ డాన్స్, హవభావాలు, మూమెంట్ అన్ని చక్కగా కుదిరాయి.......
మరియు ఈ సినిమాలో పాటలు కూడా ప్రభుదేవా తన అభిరుచి తగినట్టుగా చాలా చక్కగా తీయడంలో సపలీకృతుడయ్యాడు.... ఇందులో పాటలన్ని వినసొంపుగానే ఉంటాయి......
ముఖ్యముగా ప్రభుదేవా ఎంచుకొన్న కధ ఈ నాటి కధావస్తువులకు పూర్తి విరుద్దం...... ఆ కధ నేటి కాలానికి తగినట్టు చేయడం కత్తిమీద సాము లాంటిదే......
ప్రభుదేవా మాత్రం కత్తి మీద సామే చేసాడు...... ప్రభాస్ కూడా తన పరిధిలో చాలా బాగానే చేసాడు.......
ఇకపోతే త్ర్రిష నటన అంతంత మాత్రమే...... కేవలం తను అందం కోసమే ఉన్నట్టుగా ఉంది....
భారమైన సంఘటనలు, క్లిష్టమైన సన్నివేశాలలో త్రిష నటన తేలిపోయింది..........
కాని ఆ లోటును చార్మి భర్తి చేసినట్టుగా అనిపిస్తుంది........ ఏది ఏమైనా ఈ నాటి బెస్ట్ సినిమాల లిస్టు తయారు చేస్తే అందులో తప్పకుండా ఈ సినిమా ఉంటుంది.
No comments:
Post a Comment