Wednesday, 1 June 2011

జగన్ వ్యతిరేకశాఖామాత్యులు (వైద్య ఆరోగ్యశాఖామాత్యులు)- డి.ఎల్.

ఎన్నాలకెన్నళ్ళకు...  మన మంత్రి గారు తన సొంత శాఖకి సంబందించి న్యూస్ లో కనబడడం.. అంటే ఇప్పటి వరకు సదరు మంత్రివర్యులు వారు వార్తల్లో కనబడలేదని కాదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. మరణించిన తర్వాత జరిగిన తదనంతర పరిస్దితుల్లో మంత్రి పదవి వరించిన డి.ఎల్.రవీంద్రారెడ్డి గారి శాఖ ఏమిటొ ఇప్పటి వరకు చాలా మందికి తెలియదంటే అతిశయెక్తి కాదు. అలాగని ఆయన వార్తల్లో లేని వ్యక్తా అంటే కాదు.... రోజు ఆయన పేరు లేకుండా వార్తలే లేవు. అలాగని వార్తలన్ని ఆయనకు  శాఖ కి సంబందించినవనుకొనేరు... కాదు.... వ్యక్తిగత ద్వేషాల పరంపరలో ఆయన మొన్నటి ఉపఎన్నికలు పూర్తయినవరకు వై.ఎస్.కుటుంబం మరియు వై.ఎస్.జగన్ మీద బురద జల్లడానికే తన సమయమంతా కేటాయించుకొన్నారు.  మంత్రి పదవి తీసుకొన్నప్పటి నుండి మొన్నటి వరకు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లలో, అయన శాఖకి సంబందించి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం మన కర్మ...... మా స్నేహితులందరు ఆయనను జగన్ వ్యతిరేక మంత్రిగా సంభోదించేవారు... మొన్నటి ఉప ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైన తర్వాత గాని మన మంత్రిగారికి బుర్రకి పట్టిన బూజు వదలనట్టుంది...  వ్యక్తిగత విమర్శలకు, రాజ్యాంగం కల్పించిన పదవికి మధ్య ఎడం పాటించలన్న ఇంగితయావ కూడా అయన పాటించలేదు...  ఆయినా వాళ్ళను అనుకొని లాభం లేదు.... మనం ఓట్లు వేసి గెలిపించినందుకు మన చెప్పుతో కొట్టుకోవడం మినహాయించి మరేమి చేయగలము చెప్పండి............

1 comment:

  1. ఎవరిని నొప్పించడానికి ఈ వ్యాసం రాయలేదు.... కాని ఉన్నత స్దానాల్లో ఉన్నవారు హూందాగా ప్రవర్తించవలసిన అవసరము ఉన్నదని నా అభిప్రాయం....

    ReplyDelete