Wednesday, 22 June 2011

లేచింది మహిళలోకం....... మొదలయింది మోసాలపర్వం......

శ్రీమతి కొండపల్లి సత్యవతి గారు తన బ్లాగ్ "మా గోదావరి"లో రాసిన "ఇదేం ప్రేమ రోగం. అంటు రోగంలా ఉంది" కాలమ్ చదివి వ్యాసము రాస్తున్నాను..
ఇప్పుడు నడుస్తున్న అంతుపొంతులేని ప్రేమ వ్యవహరములు, వాటి పర్యవసానలకు అసలు కారణమేమిటి...
తప్పు మగాడిలో ఉందా.... లేక అడవాళ్ళలో ఉందా.....
నిజానికి నా ఉద్దేశంలో ప్రేమ అనేదానికి సరయిన అర్దం లేదు..... అది అబ్బాయిలు, అమ్మాయిల మధ్య కలిగే ఆకర్షణకి పెట్టిన సెంటు వాసనల పేరు....
ప్రతి అమ్మాయి తాను ఇచ్చే లోకువతోనే ప్రేమ మొదలవుతుంది.....
ఒకప్పుడు ఇటువంటి వ్యవహరములు ఎక్కువగా ఉండేవి కాదుట......
ఎందుకంటే రోజుల్లో అబ్బాయిలు ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపే వెసులుబాటు ఉండేది కాకపోవడం వల్లనేమో..
అమ్మాయిలకు రోజుల్లో ఇప్పటికి మల్లే మితిమీరిన స్వేచ్చ లేకపోవడం వల్ల కావచ్చు........
కాని కాలముతో పాటు వచ్చిన మార్పులతో పాటుగా అమ్మాయిల జీవనవిధానములో కూడా అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి......
ఇంటి పట్టునే ఉండాలి అనుకొనే రోజుల నుండి అమ్మాయిలను చదివించాలనుకొనే రోజులోచ్చాయి......
అమ్మాయిలను చదివించాలనుకొనే రోజుల నుండి వారిని ఉద్యోగము చేయించాలనే రోజులోచ్చాయి......
ఉద్యోగాలు చేయించలనే రోజుల నుండి మితిమీరిన స్వేచ్చనివ్వాలనే రోజులోచ్చాయి........
మితిమీరిన స్వేచ్చనివ్వాలనే రోజుల నుండే ఇలాంటి ప్రేమ వ్యవహారములు నెరపే రోజులోచ్చాయి.....
అమ్మాయిలు జీవన విధానములో అబ్బాయిలకు సమానంగా ఎదగకూడదు అన్నది కాదు నా ఉద్దేశం......
దయచేసి నా ఉద్దేశంను అపార్దం చేసుకోకండి......
అమ్మాయిలు స్వతంత్రంగా, అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాలలో ఎదగలన్నది మన అందరి కోరిక.....
అందుకు అనుగుణంగానే ఎంతో మంది మహిళలు తమ తమ రంగాలలో తమ శక్తి సామర్ద్యాలను నిరూపించుకొన్నారు.......
వారికి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశములను విధముగా ఉపయెగించుకోవాలి కాని....... ఇలాంటి చిల్లర ప్రేమ వ్యవహరములు నడపడానికి కాదు.....

అంటే విషయములో అబ్బాయిలది మాత్రం తప్పులేదని నేను అనను.......
అసలు అబ్బాయిలదే పెద్ద తప్పు...... వాళ్ళ జన్మే పెద్ద తప్పు.........
అబ్బాయిలు రోజుల నుండి, రోజు వరకు విషయములో ఒకటే శ్రద్ద.......
అబ్బాయిలు కౌమర దశ దాటిన దగ్గర నుండి కనిపించే ప్రతి అమ్మాయిని అదే దృష్టితో చూస్తారు.......
కాలేజికి వెళ్ళగానే వాళ్ళు చేసే మొట్టమెదటి పని అమ్మాయిలని వెతకడమే........
సినిమాకు వెళ్ళగానే వాళ్ళు కళ్ళు సెర్చ్ చేసేది అమ్మాయిలు ఎక్కడెక్కడ ఉన్నారనే.......
అందుకనే వారు ఎప్పుడూ అవకాశము కోసము ఎదురుచూస్తుంటారు......
ఎప్పుడయితే అవకాశము అమ్మాయి ఇచ్చిందో ఇక అప్పటి నుండి మొదలవుతుంది అద్బుతమైన సినిమా......... దాని పేరే ప్రేమ....
అదే అమ్మాయి కూడా అవకాశము ఇవ్వకపోతే ఎటువంటి సినిమాలు ఉండవు......... 
అబ్బాయిలందరికి ఒకే విధమైన కోరికలు ఉంటాయి..... కాని అందరూ అటువంటి అవకాశాల కోసం చూడరు......
కొంతమంది మాత్రమే అటువంటి అవకాశాల కోసం ప్రయత్నిస్తారు...... అవకాశం వచ్చిన చోటే తమ టాలెంట్ చూపిస్తారు.......
అలాగే అమ్మాయిలందరు అటువంటి అవకాశాలకు చాన్స్ ఇవ్వరు........
కొంత మంది మాత్రమే అటువంటి అవకాశాలకు చాన్స్ ఇస్తారు........  అవకాశం ఇచ్చిన చోటే తమ పతనాన్ని కొనితెచ్చుకొంటారు......

అంటే అమ్మాయి ఇచ్చిన చాన్స్ వల్లే ఇటువంటి ప్రేమ వ్యవహరములు చోటు చేసుకుంటాయి......
తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్చను వారు ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగములో సెటిల్ అవ్వడానికి ఉపయెగించుకుంటే లైఫ్ బాగుంటుంది...
అదే తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్చను దుర్వినియెగపరిచి ప్రేమ, గోమ అంటూ తిరిగితే, ఇలాగే పోలిసు సేష్టన్లులోను, హెల్ప్ లైన్ సెంటర్లలోను తేలతారు.....
చిన్నప్పటి నుండి పెంచి పెద్దచేసి, చదివించి, ప్రయెజనకురాలను చేసినట్టే తనకు తగ్గ మంచి జోడిని కూడా తల్లిదండ్రులే సమకూర్చగలరని ప్రతి అమ్మాయి భావించిన రోజు ఇటువంటి వ్యవహరములు ఉండవు.........
అమ్మాయిలతో లైంగిక అవసరాల కోసమే ప్రతి అబ్బాయి అమ్మాయి స్నేహము కోసం ట్రై చేస్తాడు......  కొందరికి మినహయింపు ఇవ్వొచ్చులెండి విషయములో......
అది ఎప్పుడు ఆయితే తీరిపోయిందో, ఇక అప్పటి నుండి రెండో సినిమా మొదలవుతుంది.......
అందుకని అమ్మాయిలు ప్రేమ వ్యవహరములకు దూరముగా ఉంటే ఎటువంటి సమస్యలుండవు.........
నా వ్యాసము అమ్మాయిలు, అబ్బాయిల పరస్పర అంగీకర ప్రేమ వ్యవహరముల విషయములలో మాత్రమే......

అలాగని పెద్దలు కుదిర్చి చేసిన అన్ని సందర్బాలలోను ఎటువంటి సమస్యలు లేవని చెప్పలేము.......
ప్రస్తుతం వరకట్న వేధింపులు, గృహహింస వగైరాలన్ని కోవలోకే వస్తాయి.......
అలాంటి కేసులు నిరుపితమైన మగాళ్ళను నడి వీధిలో అందరు ముందు ఉరి తీయాలి...... 

4 comments:

  1. Read this: కాలేజి ప్రేమలు - ఒక ట్రాష్ http://radicalfeminism.stalin-mao.in/50492442

    ReplyDelete
  2. రాఘవ..చాలా విషయాలు సాధారణంగా అనిపిస్తాయి.ఆ..విషయాలనే.. మీరు..ప్రేమ అనే దృకోణం లో.. చూస్తే ఎలా.. ఉంటుందో..బాగా చెప్పారు. మీరు చెప్పిన విషయం లో..చాలా..పారదర్శకత ఉంది . మీకు అభినందనలు..ధన్యవాదములు.

    ReplyDelete
  3. ప్రవీణ్ శర్మ గారికి,
    ధన్యవాదములు..... నా అభిప్రాయమును అర్దం చేసుకొన్నందుకు....

    ReplyDelete
  4. గౌరవ వనజావనమాలి గార్కి,
    అమ్మా...... ఈ రోజు సమాజంలో సాధారణంగా జరుగుతున్న విషయాలనే ప్రస్తావించాను....
    మీరు నా బ్లాగ్ వరకు వచ్చి నా అర్టికల్ చూడడం నాకు ఆనందంగా ఉంది......
    ధన్యవాదములతో....

    ReplyDelete