Wednesday, 8 June 2011

వచ్చే వచ్చే వానాకాలం..........

సుమారు రెండు నెలల పాటు నరకం చూపించిన ఎండలు తగ్గిముఖం పట్టి వాతావరణం చల్లగా మారడంతో
జీవితంలోకి ఎక్కడలేని రిలాక్స్ వచ్చినట్టు అనిపించింది
......ఇక వర్షాలు రావడమే తరువాయి...నాలాంటి ఉద్యోగస్తులు ఎండకాలం ఆయిపోయి వర్షాకాలం వస్తుందంటే బోలోడంతా రిలాక్స్ గా ఫీలవుతారు...... ఎండల్లో ఆఫీసులకు వెళ్ళవలసిన బాద తప్పినందుకు..........కాని కుర్రగాళ్ళకు మాత్రము అప్పుడే ఎండాకాలం ఆయిపోయిందా అని నిరాశ......ఇక నుండి స్కూళ్ళకు, కాలేజిలకు వెళ్ళాలని........నా లాంటి వ్యవసాయదారులకు(నేను కూడా రైతు బిడ్డనే) వర్షాకాలం వస్తుందంటే అందోళనతో నిండిన ఆనందం.......ఈ సంవత్సరమైనా పంట దిగుబడి బాగా వస్తుందా.. రాదా...అని. ఏది ఏమైనప్పటికి కాలచక్రంను ఎవరూ ఆపలేరు.......కాని వచ్చే ఆ కాలమార్పు ఎవరికి నష్టం కలిగించకూడదని ఆ దేవున్ని కోరుకుంటున్నాను...రాబోయే కాలం వర్షాకాలం...... ఇది రైతులకు చెందిన కాలం...... వార్కి దైవంతో సమానమైన కాలం...కాని ఆ దైవం కొద్ది కాలముగా రైతుల కంట కన్నీరు నింపుతుంది.............పోయిన సారి చేతికి అందివచ్చే సమయములో ఆకాల వర్షాలతో రైతుల పొట్టకొట్టింది ఆ దైవం..........వరుస దెబ్బలకి కుదేలయిన రైతు ఈ సారికి పంటల జోలికి వెళ్ళదలసుకొలేదన్న విషయం శోచనీయం......ఏమైనప్పటికి ఈ వచ్చే వానాకాలం........ రైతుల కాలమే....... వార్కి ఈ ఏడాది సువర్ణ వర్షాకాలమే కావాలి......వచ్చే సంక్రాంతి నాటికి ప్రతి రైతు కంట ఆనందం కనిపించాలి...............ఆందరికి ఈ వర్షాకాలం చల్లదనాన్ని ఇవ్వాలి......... విద్యార్దులకు తన చిటపట చినుకులతో ఉల్లాసాన్ని యివ్వాలి.........

No comments:

Post a Comment