నిన్న, మొన్న వరుసగా రెండు రోజులు శెలవులు వచ్చినప్పటికీ ఇంటికి వెళ్ళలేదు.
ఒక్క రోజు శెలవు దొరికితే చాలు ఇంటికి పారిపోయే నేను, ఈ సారి వెళ్ళకపోవడానికి
ఒక కారణముంది...
బహుశా నేను ఒంటరిగా ఉన్నప్పటి నుండి, శెలవులకు ఇంటికి వెళ్ళకపోవడం రెండో సారి అనుకుంటా...
అలవాటుగా ఎపుడూ శనివారము మధ్యాహ్నం అమ్మ నుండి ఫోన్ వచ్చింది...
ఎప్పుడు బయలుదేరుతున్నావు?? రాత్రికి టిఫిన్ ఏమి చేయమంటావు అని??
నాకెంతో ఇష్టం అమ్మతో మాట్లాడుతుంటే...
ఇంత వయసు వచ్చినప్పటికి అమ్మ నన్నింకా చిన్నపిల్లాడిలానే చూస్తుంటుంది...
అమ్మ ఫోన్ చేసి, ఎపుడు వస్తున్నావు అని అడిగితే, నా సమాధానం నాకు రావడం వీలుపడదని!!
అమ్మ గొంతులో కొద్దిగా మార్పు.... ఎందుకు రావడం లేదని కొద్దిగా తేడాగా మారిన గొంతుతో అమ్మ ప్రశ్న!!
రేపు వి.ఆర్.వొ. పరీక్షకు ఇన్విజిలేషన్ డ్యూటి పడిందని చిన్న అబద్దం తనతో....
ఆయిన సరే, పరీక్ష ఆయిపోయిన వెంటనే బయలుదేరి వచ్చేయి..ఎలాగు సోమవారం శెలవు కదా.. అని..
నిజానికి నాకు ఏ పరీక్షకు ఇన్విజిలేషన్ పడలేదు.. వెళ్ళకూడదని ముందుగానే నిర్ణయించుకున్నందున అబద్దం చెప్పేశా....
ఆయిన నాకు రావడానికి కుదరదు.. వేరే పని కూడా ఉన్నదని అబద్దం చెప్పి మొత్తానికి రావడం లేదని
తనకు సర్దిచెప్పడానికి చాలా కష్టపడవలసివచ్చింది.....
అసలు ఇంతగా వెళ్ళకూడదని నిర్ణయించుకోవడానికి కారణమేముంది??
అమ్మ నన్ను ఇంకా చిన్నపిల్లాడిగానే చూస్తుంది అన్న అలక..
నాకు అన్ని విషయాలు చెప్పడం లేదన్న బాధ....
ఇదే విషయము నా సోదరితో చెప్పాను.. నేను ఎందుకు రావడం లేదొ!!
తాను ఏమందో తెలుసా!!
నేను ఎటువంటి ఇబ్బంది పడకూడదని అమ్మ ఏ విషయాలు నాకు చెప్పడం లేదట...
ఇబ్బందికర విషయాలు (కుటుంబ సమస్యలు, అర్దిక వ్యవహారాలు) నాకు కూడా
చెప్పి నన్ను స్ట్రగుల్ చేయడం ఇష్టం లేకట....
నాన్న గారు, తాతయ్య గారు చనిపోయిన దగ్గర నుండి మొత్తము వ్యవహారములన్నీ
అమ్మే చూస్తుంది. నలభై ఎకరాల మాగణికి సంబందించిన పనులన్నీ తనే చూసుకుంటుంది..
ఇంటికి అసరాగా ఉండవలసిన పెద్దవాళ్ళు తొందరగానే కాలం చేసినప్పటికీ, బెంబేలు పడక,
మొత్తము తన మీద వేసుకొని మమ్మల్లి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటుంది...
అలా చూసుకోవడంలో ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులు... అవేవి మాకు తెలియనివ్వదు....
నేను చాలా సార్లు ప్రయత్నించా... అమ్మకు అన్ని విషయాల్లో చేదెడు వాదోడుగా ఉండాలని...
కాని అమ్మ ఎపుడూ తన సమస్యల గురించి నా దగ్గర చర్చించదు......
తను పడే ఇబ్బందులు నాకెందుకులే అన్న నిర్ల్యక్షం......
అంటే నేను ఏమన్నానో తెలుసా?
ఇబ్బందులు, కష్టాలన్నీ తను పడి, సుఖాలు మాత్రము మనకి ఇస్తే, అటువంటి సుఖం నాకొద్దు....
అమ్మ ఎదుర్కొనే కష్టాల్లో నేను కూడా పాలుపంచుకుంటేనే, సుఖాలు కూడా పాలుపంచుకుంటాను అని చెప్పాను....
ఎందుకు మా కోసము అమ్మ తన కష్టాలు దాచుకోవాలి??
నేనేమన్నా పరాయివాడినా?? తమ కష్టాలు నాకు చెప్పవలసిన అవసరం లేదా?
మాకు కావలసినపుడూ అన్ని వండిపెట్టేసి, కావలసినపుడు అడిగినంత డబ్బు ఇచ్చేస్తే,
విశ్వమంతా ప్రేమను మాకు పంచేస్తే సరిపోతుందా??
సరిపోదు... నాకు అమ్మ మనసు కావాలి.... ఆవిడ అంతరంగం నాకు తెలియాలి....
ఆవిడ కష్టాలు నాకు తెలియాలి.. ఆ కష్టాల్లో నేను కూడా పాలు పంచుకోవాలి.......
అప్పుడే అమ్మ నా కోసం చేసిన ఏ పని ఆయిన నేను అస్వాదించగలను....
ఇది నా మాట......
అందుకే అమ్మ మీద అలిగాను.... నువ్వు ఏ విషయాలు నాతో పంచుకోవడం లేదని....
అవన్నీ నీకు ఎందుకురా!! అని పుచిక పుల్ల తీసి పారేసినట్టు పారేస్తుంది నా మాటలను...
అందుకనే నేను వెళ్ళలేదు ఇంటికి నిన్న....
ఆదివారము పొద్దున్నంతా రూమ్ లో ఉండిపోయి... మధ్యాహ్నం అలా సరదాగా బీచ్ కి వెళ్ళాను...
సాయంత్రం వరకు తిరిగి, బోజనం చేసి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చా.
ఎక్కడా ఎంజాయ్ చేయలేకపోయాను.. రోజంతా అమ్మను మిస్ ఆయ్యానన్న ఫీలింగ్ నా మదినిండా....
అమ్మే కాదు... నేను కూడా అమ్మ లేకపోతే ఉండలేనన్న సంగతి చూచయగా తెలిసింది.....
ఇంటికి వెళ్ళిపోవలనిపించింది.... కాని పంతం కొద్ది వెళ్ళలేదు....
మర్నాడు మహశివరాత్రి.... రూమ్ లో ఉండబుద్దికాలే....
ఒక ప్రెండ్ ని తీసుకొని ద్రాక్షరామ శివాలయానికి వెళ్ళాను. దర్శనం అయ్యేసరికి మద్యాహ్నం ఆయిపోయింది...
దర్శనంను కూడా పూర్తి స్దాయిలో అస్వాదించలేకపోయాను.
ఎందుకంటే నా మనసు నిండా అమ్మే ఉండిపోయింది.......
అమ్మ లేకుండా ఉండడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది.....
అమ్మ మీద విజయం సాధించడం చాలా కష్టం....
అందుకే వచ్చే అదివారము కోసము చాలా అత్రుతగా ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నాను....
శనివారం మద్యాహ్నమే ఇంటికి వెళ్ళిపోవాలి.... తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి...