Monday, 24 September 2012

ప్రజలు సహృదయంతో అర్ద్రం చేసుకోవాలి..


ఎక్కడో విన్నట్టుగా ఉందా మీకు పై వాక్యం చూసినపుడు....

ఇంకెవరండీ.. మన బొత్స గారు ఆర్టీసి చార్జీలు పెంపుదల సందర్బంగా చెప్పిన అపూర్వ మాటలవి...

మన్మోహన్ సింగ్ గారేమో డీజిల్ ను ధనవంతులు మాత్రమే వాడతారు.. మరియు ఖరిదైన కార్లకు మాత్రమే డీజిల్ వాడతారు. అలాంటప్పుడు ధనవంతులకు, వారు వాడే కార్లకు అవసరమయ్యే డిజీల్ కు రాయితీ యివ్వడం భావ్యమా? ధనవంతుల కొరకు సబ్బీడిలు యివ్వడం  అవసరమా? అని దేశంలో సామాన్యులందరి తరపున వకాల్తా పుచ్చుకొని అమాయకంగా అడిగారు... (కార్పోరేట్లకు, బడా కంపెనీలకు ఇష్టానుసారం ప్రభుత్వం యిచ్చే రాయితీల గురించి మాట్లాడకండి. మనకు తెలీదనుకుంటున్నారు కదా).

డిజీల్ ధర పెంపు వలన ధనవంతులకు మాత్రమే నష్టం అని తమ పార్టీ ప్రభుత్వం వారే అంటే, మరి బొత్స గారు సామాన్యుల నడ్డి విరిగేలా ఆర్టీసి చార్జీలు పెంచేసి, డిజీల్ ధరలు పెరగడం వలన,  చార్జీలు తప్పనిసరయి పెంచవలసివచ్చిందని సెలవిచ్చారు. మరియు ఈ చర్యని ప్రజలు సహృదయంతో అర్ద్రం చేసుకోవలసినదిగా కోరారు.

ఇంతకీ ప్రజలు అర్ద్రం చేసుకోవలసినది....

బొత్స వారి బాదుడు సామాన్యుల మీద వేసినందుకా లేక సింగ్ గారు చెప్పినట్లు ధనవంతుల మీద వేసినందుకా?

చెట్లకు డబ్బులు కాస్తాయా?


దేశాన్ని ముందుకు నడిపించలంటే సంస్కరణలు అమలు చేయవలసినదే,

దానికోసం డబ్బులు కావాలి కదా? అవి ఎక్కడ నుండి వస్తాయి? డబ్బులేమి చెట్లకు కాయవు కదా! అని గొప్ప సత్యాన్ని చెప్పిన మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు...

ఎనిమిదేళ్ళుగా ఏలుతున్న తమ ప్రభుత్వ నిర్వాకం ఫలితంగా ఇష్టానురీతిన నిత్యావసరములు, యితర అవసరముల ధరల పెరుగుదల,  గ్యాస్ సబ్బీడిలు ఎత్తివేత వంటి చర్యలు ద్వారా ఇప్పటికే సామాన్యుడి అర్దిక పరిస్దితిని అతకతులం చేసిన ప్రభుత్వం..... మరీ వీటన్నిటిని భరించడానికి సామ్యానులకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయనుకుంటున్నారు?

బహుశా సామాన్యుల ఇళ్ళల్లో చెట్లకు డబ్బులు కాస్తున్నాయి అనుకుంటున్నారా!!

Sunday, 16 September 2012

ఒబామా గొప్పా?, సింగ్ గొప్పా?

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గొప్పా లేక భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్పా?
అమెరికా అధ్యక్షుడు తమ దేశ కంపెనీలు ఉత్పత్తులను స్వంత దేశ ప్రజలే కొనక, అమ్ముడవక వాటిని ఎలా, ఎక్కడ అమ్మాలా అని అలోచించి వాటిని భారత దేశానికి అంటగట్టి, తద్వారా అమెరికా కంపెనీలను సేవ్ చేద్దామనుకొన్నాడు
మరి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తమ దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ప్రజలు ఇబ్బందులతో అలరారుతున్నప్పటికీ, విశాల హృదయంతో అమెరికా ప్రజల కష్టాలకు స్పందించి ఎఫ్.డి.ఐ. లకు తలుపులు బార్లా తెరిచారు.
ఇప్పుడు చెప్పండి,
స్వంత ప్రయెజనాలను ఆశించి అమెరికా కంపెనీలను సేవ్ చేద్దామనుకుంటున్న ఒబామా నా
లేక ప్రపంచ సంక్షేమమే ధ్యేయంగా (ప్రపంచం అంటే మన్మోహన్ దృష్టిలో అమెరికా అని అర్దం చేసుకోవాలి) స్వప్రయెజనాలను కూడా పణంగా పెట్టి దేశ ప్రజలను బకారాలను చేద్దామనుకుంటున్న సింగ్ గారా
ఎవరు గొప్ప?

Saturday, 15 September 2012

What is the Life?

వ్వాట్ ఈజ్ ద లైఫ్?

టి.వి. చూస్తూ, నా ప్రక్కన్న ఉన్న నా రూమ్ మేట్ నాయుడు ని అడిగాను..

నా పైపు అదోలా చూసి, నాకు ఇటు వైపు కూర్చొన్న నరేంద్ర వైపు చూశాడు. తనని అడగమన్నట్టుగా..
నరేంద్ర వైపు చూసి, సార్, వ్వాట్ ఈజ్ ద లైఫ్? అని అడిగాను...

వాడు నా పైపు కొద్దిగా ఎగాదిగా మరియు చిరునవ్వుతో చూసి, లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ అన్నాడు...

నేను, నాయుడు నవ్వుకున్నాము వాడి సమాధానానికి! ఎందుకంటే ఆ రోజే శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ రిలీజ్......

వాడు సమయాను సంధర్బంనుపయెగించి, చమత్కారంగా సమాధానము చెప్పినప్పటికీ, నేను వేసుకొన్న క్వొశ్చన్ కి సరయిన సమాధానము దొరకలేదు అనిపించింది.

ఆవును...... వ్వాట్ ఈజ్ ద లైఫ్?


ప్రతి ఒక్కరికీ, ఏదోక సందర్బంలో ఈ క్వొశ్చన్ తగులుతుందని ఎక్కడో చదివాను. నిజంగానే ఆ క్వొశ్చన్ నాకు ఇప్పుడు వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడూ మనకి అటువంటి క్వొశ్చన్ రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నిజంగానే లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ కాబట్టి.. ఆప్పుడే లైఫ్ ని ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేయగలమా అనే ఆలోచించగలము. కొద్దిగా పెద్ద ఆయిన తర్వాత చదువులు గురించి, టార్గెట్ పెట్టుకొన్న గోల్స్ గురించి,  అమ్మాయిల గురించి, ఉద్యోగాల గురించి ఆలోచించి ఏ సందర్బంలోను పై క్వొశ్చన్ బుర్రలోకి వచ్చే చాన్సే లేదు. అదీ కూడా ఆయిపోయిన తర్వాత, అంటే ముప్పైకి వచ్చాక, ఈ క్వొశ్చన్ వచ్చింది బుర్రలోకి....

వయసు పెరిగే కొలదీ మనిషిలో సున్నితత్వం తగ్గిపోయి, స్వార్దం పెరుగుపోతుందని ఒక తత్వవేత్త సెలవిచ్చాడు...
 
అదే విధంగా ఇంకో పెద్దాయన, పెద్దయ్యే కొలది, మమతలు, అనుబంధాలలో కూడా తేడాలు వస్తాయని సెలవిచ్చాడు....

ఇలా, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్దితిని ప్రతి ఒక్కరూ ఇరవై ఆరు నుండి ముప్పై సం.రాల లోపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారని తెలిసింది... అదేంటో నాకు మాత్రం ముప్పై దగ్గరకి వచ్చిన తర్వాత కాని నాకా క్వొశ్చన్ తగల్లేదు. (బహుశా మన తెలివి ఎక్కువయిపోయి ఉంటుందిలెండి). పోనిలే ఇప్పటికైనా వచ్చిందీ... రాకపోయే ఉంటే అసలు నేను మనిషిని కానేమో అని డౌట్ వచ్చి యుండేది...

నిజంగానే నాకీ ఈ డౌట్ వచ్చిన దగ్గర నుండి సరయిన సమాధానము దొరకలేదు.

ఒక్కొసారి ఆలోచిస్తే, నాలో స్వార్దం పెరిగిపోయిందేమో అనిపించింది. అలాగే నా సన్నిహితులతో నాకున్న అనుబంధాలలో గాఢత తగ్గిపోయిందేమో అని కూడా అనిపిస్తుంది. బహుశా అందుకేనేమో నాకీ క్వొశ్చన్ ఇప్పుడు వచ్చింది!

నిజానికి నేను చాలా హ్యాపిగా గడిపేశాను ఇప్పటి వరకు... ముఖ్యంగా నా స్నేహితులతో నాకున్న అనుబంధం, అలాగే బంధువులతో ఉన్న అనుబంధం నా జీవితాన్ని ఎప్పుడూ హ్యాపీగా ఉంచేవి.  మరి, ఇప్పుడు వారందరూ లేరా? అని అడిగితే ఉన్నారనే చెప్పాలి... మరెందుకు నేనిలా ఉన్నాను?

ఏమో సమాధానము నాకే తెలియదు.

కాని నా స్నేహితులు మాత్రం అందరూ కలసినపుడు గతంలో లాగానే చాలా హ్యపీగా ఉంటారు.. ఒకప్పుడూ నేను వాళ్ళలో ఒకడిలా కలసిపోయేవాడిని. కానీ ఇప్పుడు.... వాళ్ళతో కలవలేకపోతున్నాను....

బహుశా వయసుతో పాటుగా అలోచనల్లో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మనము ఏమీ సాధించాము అనిపిస్తుంది? నేను స్వయముగా సాధించాను అనదగ్గ విజయలేవి అనిపిస్తుంది? తరచి చూసుకుంటే ఏమి కనబడడం లేదు... అదేనా మన అసంతృప్తికి కారణం? 

అదేనని చెప్పలేము... మన స్వంత విజయాలు కాకపోయిన, ఈ రోజు నేను మంచి పొజిషన్ లోనే ఉన్నాను. మరెందుకు ఇప్పుడు మాత్రమే వ్వాట్ ఈజ్ ద లైఫ్ అని క్వొశ్చన్ నా బుర్రలో తొలుస్తుంది?

తొక్కలో ఆలోచనలూ నువ్వునూ.... చెత్తగా అలోచించండం వలనే ఇలాంటి చెత్త అలోచనలు వస్తుంటాయి నీకు అని నా అంతర్మాత నన్ను విసుక్కొంది....

అంతేనేమో అని అనుకొని, కనీసం శేఖర్ కమ్ముల ఆయిన చెప్పుతాడు కదా అని “ లైఫ్ ఈజ్ బ్యూటీపుల్” సినిమాకి వెళ్ళా... మూడు గంటలు ఓపిక పట్టి చూసాను.. ఆయిపోయిన తర్వాత చూద్దును.... నా క్వొశ్చన్ కి సమాధానం దొరకలేదు...

సినిమా ఆయిపోయిన తర్వాత, రూమ్ కి వచ్చిన తర్వాత అడిగారు నా రూమ్మేట్స్ సినిమా ఎలావుంది అని?

వ్వాట్ ఈజ్ ద లైఫ్? ........ ఇది నా సమాధానం వారు అడిగిన దానికి నా సమాధానం.

అప్పుడు నరేంద్ర అన్నాడు....  రాజీవ్ కి పెళ్ళయితే కాని తెలియదు ఈ క్వొశ్చన్ కి సమాధానం....
ఆయిన నాకొక డౌట్.... పెళ్ళయితే ఎవ్వడైనా చెప్పుతాడు “లైఫ్ ఈజ్ హెల్” అని....

నాకు అపుడు కాదు కావాలి... ఇప్పుడు కావాలి సమాధానం “వ్వాట్ ఈజ్ ద లైఫ్” అంటే.....