Thursday, 5 January 2012

అయ్యో.. మళ్ళీ మిస్సయింది....


నా దగ్గరున్నది ఏమి మిస్సవలేదులెండి.... నేను అంటున్నదీ మన క్రికెట్ దేవుడి గారి వందో సెంచరీ గురించి..
ఈ రోజు ప్రొద్దున్నే లేచి పేపరు చదివేసి, టి.వి. పెట్టి చానల్స్ అన్ని మార్చుకుంటూ, అలవాట్లో పొరబాటుగా స్టార్ స్పోర్ట్స్ చానల్ ని చూడడం...
అప్పటికి సచిన్ గారు డైబ్బయి రన్స్ తో దిగ్విదయంగా క్రీజులో ఉండడం చూసి......
మనోళ్ళు అస్టేలియా మీద విజయము మాట దేవుడెరుగు, కనీసము డ్రా మాట ఆయిన దేవుడెరుగు, ఈ రోజు మొత్తము పూర్తిగా ఆడతారా లేదా అన్న మీమాంసలో ఉన్న సమయములో సచిన్ డెబ్బయి పరుగుల వద్ద ఉన్నాడు.....
పోతేపోనీ సచిన్ గారు ఎప్పటినుండో చూస్తున్న వందో వంద ఆయిపోతే, తర్వాత నుండి దాని గురించి న్యూస్ పేపర్లలో వచ్చే విశ్లేషణలు చూసే భాద తప్పుతుంది కదా అని సంబరపడ్డా....
ఈ లోపులో స్నానానికి వెళ్ళి, తిరిగి వచ్చాక చూద్దునూ... సచిన్ ఆవుట్ అని ఉంది..... ఉసూరుమనిపించింది.....
సచిన్ ఆవుటయినందుకు బాధ లేదు. ..... కాకపోతే ఆ వందో వంద గురించి ఇంకా ఎన్ని విశ్లేషణలు చదవాలో తలచుకొనేసరికి ఒక్కసారిగా నీరసం ఆవచించింది...... ఆ వంద ఆయిపోయి ఉంటే, కొత్త న్యూస్ చదవచ్చు కదా అని ఆశపడ్డందుకు దేవుడి తగిన శాస్తే చేశాడు నాలాంటి వాళ్ళందరికి.....
పి.ఎస్: ఈ విషయములో ఎవరి మనసైనా నొప్పించిన యెడల  ఎవరికి క్షమాపణలు చెప్పే ప్రస్తక్తే లేదు.

Tuesday, 3 January 2012

నువ్వు సారా తాగుట మానురన్నో, లేకుంటే పైకి పోతావురన్నా......

జానీ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడి వినిపించినిదీ పాట..
నిజంగానే ఇది మన రాష్ట్రంలో ఈ మధ్య కల్తీ సారా మృతుల గురించి
విన్నప్పుడు, ఆ పాటలో నిజముందీ కదా అనిపిస్తుంది...
సారాలో కల్తీ జరిగి, అది అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణమైతే,
రాజకీయపక్షాలు మాత్రము ఒకరిపై ఒకరు బురద జల్లుకొంటున్నాయి....
సారా తయారీదారులు మీరంటే మీరు అని...........
ఆయిన సారా త్రాగి ఎవరో చనిపోతే, అది ప్రభుత్వ భాద్యత ఎలాగవుతుంది....
ఓహో.... సారాలో కల్తీ జరగకుండా ప్రభుత్వం చూడనందుకా???
మరి సారా త్రాగమని ప్రభుత్వం చెప్పలేదుగా......
వింతడవాదం చేస్తున్నానని అనుకోవద్దు.....
అసలు సారా త్రాగడం తప్పని తెలిసి, ఎగదొప్పుకొంటు పోయి రావడం ఎవడబ్బ తప్పు?
తీరా అందులో తేడా వస్తే తప్పు ప్రభుత్వాలుదా??
ఎక్కడికి పోతున్నారు మన మీడియా మరియు రాజకీయ పార్టీలు......
బుద్దొన్నోడు ఎవడూ సారా త్రాగడానికి వెళ్ళడు....
త్రాగి తందనలాడి, దానికి వేరొకరు భాద్యత వహించలంటే చెప్పు తీసుకొని కొట్టాలి....
ముందుగా జనాలు సారా త్రాగడం మానివేయాలి....
ఒక వేళ ఎవరైనా సారా త్రాగదొద్దురా అంటే, నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి
అని కూతలు కూసి, ఈ రోజు ప్రాణాలు మీదికి తెచ్చుకొన్న చవటల గురించి బాదపడవలసిన అవసరం లేదు.....

నో టార్గెట్స్ ఇన్ 2012

ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరము వస్తుందనగానే, తాము మార్చుకోవలననుకొంటున్న అలవాట్లు, మరియు మొదలుపెడదమనుకొన్న పనులను కొత్త సంవత్సరము ప్రారంభం నుండి మొదలుపెట్టాలని అనుకుంటారు. కాని ఎంత మంది తాము అనుకొన్న విధముగా ఖచ్చితముగా చేయగలరో ఆ దేవుడికే తెలియాలి. ఇకపోతే నేను మాత్రము కొత్త సంవత్సరము వస్తుందనగానే, ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోలేదు. పెట్టుకోదలచుకోలేదు కూడా. ఎందుకంటే అవి అలోచించడానికి కూడా బద్దకం కాబట్టి. నిజమండీ, టార్గెట్స్ ఏర్పరచుకోవడానికి కనీసము ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే బద్దకం.. అలోచించి బుర్ర పాడుచేసుకోవడం ఎందుకని. ఇంకా చెప్పాలంటే అప్పటి వరకు చేస్తున్న కొన్ని కొన్ని పనులకు ఎగనామం పెట్టాను ఈ సంవత్సరములో. ఇంకా కొత్తగా ఏమి టార్గెట్ పెట్టుకుంటాము చెప్పండి.
 ఏదో ఒకటి చేస్తున్నామనిపించికోవడానికి ఉదయము పూట వాకింగ్ కి వెళ్తున్నాను. నిజానికి అసలు కారణము వేరే, అదేమిటంటే ఎక్కువసేపు పడుకుంటే బుగ్గలు పెరుగుతాయి అని నాకులాంటి ఎవరో తలకుమాసిన వెధవ నాతో గోకాడు. ఇక అప్పటి నుండి మన నిద్ర ఎక్కువయిపోతుందని బెంగపడిపోయి (అంటే బుగ్గలు పెరుగుపోతాయని) ఉదయము తొందరగా మెలకువ తెచ్చుకోవడం అలవాటు చేసుకొన్నాను. మరి బుగ్గలు తగ్గాయా? అని అడక్కండి.. అవి అలాగే ఉన్నాయిలెండి. ఇదిలా ఉండగా, ఇందకా పైన చెప్పుకొన్నట్టు అందరూ కొత్త సంవత్సర ప్రారంభం నుండి ఏదొక మంచి అలవాటు చేసుకోవాలని చూస్తే, నేను మాత్రము అప్పటి వరకు నాకున్న మంచి అలవాటయిన వాకింగ్ కి ఎగనామము పెట్టేసా.. అదేంటొ అప్పటి వరకు బాగానే చేసిన వాకింగ్ ని కరెక్టుగా ఈ నెల ఒకటి నుండే మానేసాను. విచిత్రం.. నాల్గు రోజులు వాకింగ్ మానివేస్తేనే, నా బుగ్గలు కొద్దిగా పెరుగినట్టుగా అనిపించిందండీ పొద్దున్న నా ముఖం అద్దంలో చూసుకొన్నప్పుడు. అదేంటొ వరుసబెట్టి కంటిన్యూగా వాకింగ్ కి వెళ్ళినప్పుడు బుగ్గలు కొంచెం కూడా తగ్గలేదు కాని ఓ నాల్గు రోజులు మానేస్తే పెరగడం ఎంత అన్యాయమండీ. ఏం చేస్తామండి మన ఖర్మ అలా తగలడింది. అందుకని రేపటి నుండి ఎలాగయిన మళ్ళి మొదలెట్టాలి వాకింగ్. అలా మనము టార్గెట్ కాని టార్గెట్ పెట్టుకున్నానండి ఈ వేళ. ఇకపోతే మొన్నటికి మా ఫ్రెండ్ ఒకడూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, "గత సంవత్సరములో చేసిన తప్పులు గురించి అలోచించి సమయము వృధా చేయకు, ఈ సంవత్సరము కొత్త తప్పులు ఎలా చేయాలా అని అలోచించు" అని మెసెజ్ పెట్టాడు. చదవగానే అహా ఎంత బాగా రాశాడనిపించిందండి.(నిజానికి మీకు కూడా అలానే అనిపించింది కదా). తప్పులు చేయడాన్ని అందరూ ఎంత నామోషిగా తీసుకుంటారు కానీ, నిజానికి తప్పులు చేయలంటే గట్స్ ఉండాలి కదండీ: విజయాలన్ని ముందుగా ప్లాన్ చేసుకుంటే వస్తాయి. దాని కోసము బోలెడంతా స్కెచ్ తయారుచేసుకోవాలి. అదే తప్పులు చేయాలంటే అవేవి అవసరము లేదు. ఇంకా చెప్పాలంటే దానికి ఎటువంటి స్కెచ్ తయారుచేసుకొనవసరం లేదు. బాగుంది కదా నా ధియరీ.. పోయినేడాది బోలోడన్ని టార్గెట్స్ పెట్టేసుకొని, అందులో ఒకటి టార్గెట్ పూర్తి చేయలేక, పైగా నా టార్గెట్స్ మాట దేవుడెరుగు... నేను అసలు ఊహించని బోలెడన్ని ఫెయిలర్స్ నా గత సంవత్సర ఖాతాలోకి తన్నుకుంటు వచ్చేయడంతో నా ధియరీ ఈ విధముగా మారిపోయిందని మీరు అనుకోకండేయి. (నిజానికి అదే అసలు కారణం). అందుకని ఈ సంవత్సరము ఎన్ని ఫెయిల్యర్స్ చేయగలమో ఇప్పటి నుండి తెగ అలోచించడానికి కూడా బద్దకం వచ్చేస్తుందండి బాబు. ఈ లెక్కన మనకి ఈ సంవత్సరము ఏ చిన్న విజయము పొందినా, అది గొప్పదిగా మిగిలిపోవచ్చుననుకొంటా(అంటే ఈ సంవత్సరము మహేష్ బాబుకి దూకుడు లాంటి సాధారణ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా అనిపించి ఫీలయినట్టు) (మహేశ్ బాబు ఫాన్స్ కి కోపం వస్తే వార్కి నా క్షమాపణలు చెప్పుకుంటున్నాను). అందుకని ఈ సంవత్సరము ఎటువంటి టార్గెట్స్ పెట్టుకోకుండా ప్రస్తుతానికి బాగానే ఉన్నానండి. కాని ఇప్పుఇప్పుడే తప్పుడు అలోచనలు వచ్చేస్తున్నాయండి నా బుర్రలోకి. వాకింగ్ కే తిన్నగా వెళ్ళి రావడం చేతకాలేదు కాని, జిమ్ కి వెళ్ళాలని తెగ ఉబలాటం వచ్చేస్తుంది ఈ మధ్య... అంతే కాదండొయ్, గ్రూప్ పరీక్షలకు కూడా రాసేయాలని తెగ అనిపిస్తుంది కూడా. ఈ సంవత్సరము పొద్దున్నే ఎవడి ముఖం చూసానో కాని. ఇలాంటి అలోచనలు వచ్చి, వాటిని అచరణలో పెట్టడం మొదలెడితే ఏమయిపోతానన్న బెంగ నాకి మధ్య ఎక్కువయిపోయింది.
 ఈ గ్రూప్ లు గొడవ అలా అయిందో లేదో... మరల ఇంకొక కొత్తగా బిజినెస్ స్టార్ చేయాలన్న అలోచన వచ్చేస్తుంది.. అయ్యబాబోయ్ నాకేదో దెయ్యం పట్టుకున్నట్టుంది ఈ వేళ... లేకపోతే ఇన్ని టార్గెట్స్ పెట్టుకుంటే నేను ఎలా బ్రతకాలని తెగ మధనపడిపోతుందండి నా అంతరాత్మ(చ్చ. వీడికో అంతరాత్మ కూడానా?). అలా అనకండి. ఈ మాట కనుక వాడు విన్నాడనుకొండి.. నిజంగానే వాటనన్నిటిని చేసేయాలంటాడు. కాబట్టి గమ్మున యుండండి. మీరు మాత్రము నాకు మల్లే కాకుండా మంచి మంచి టార్గెట్స్ పెట్టుకొండి... ఒక వేళ మీరు కూడా బొర్లాపడ్డారనుకొండి.. అప్పుడు మీరు కూడా నా ధియరీని ఫాలో అయిపోదురు కాని. సరేనా>>>
పి.ఎస్. బుడుగు బొమ్మలని నా అర్టికల్ లో వాడుకున్నందుకు బాపూ గార్కి క్షమపణలు చెప్పుకుంటూ...

పూనం మాలకొండయ్య మార్క్ పనితీరు...


గడిచిన పది రోజులలో ఎ.పి.పి.యస్.పి. ద్వారా వెలువడిన వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు బుర్ర నిండా పని కల్పించాయి. యిందులో ముఖ్యంగా ఎ.పి.పి.యస్.పి. చైర్మన్ ఆయిన పూనం మాలకొండయ్య గార్కి మనసూర్పిగా అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లో విడుదల చేయడంలో ఆవిడ తన పనితీరును నిరూపించుకొన్నారు. దేశములో నిజాయితిపరులయిన అధికారులలో పూలం మాలకొండయ్య గారు స్దానం దక్కించుకొన్న విషయము మీరందరికి తెలిసిందే. ఆవిడ ఎక్కడ పని చేసిన తన మార్క్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఆ మార్క్ నే మనందరం నిజాయితిగా చెప్పుకోవచ్చు. పూనం మాలకొండయ్య గారు రాకముందు వరకు ఎ.పి.పి.యస్.పి. బాగా తుప్పు పట్టిపోయిఉంది. ఈవిడ వచ్చిన తర్వాత దానికున్న తుప్పునంతా వదలిగొట్టి, ప్రభుత్వ సంస్దల్లో ఉన్న ఖాళీలను గుర్తించి, ఆ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళడంలో ఆవిడ చూపించిన పనితీరు, రాష్ట్రంలో ఉన్న అనేక మంది నిరుద్యోగుల పాలిట వరమయ్యింది.
 దానికి తోడు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా నిర్ణయము తీసుకోవడంతో మొన్నటికి మొన్న వరుస పెట్టి పది నోటిఫికేషన్స్ పరీక్షా తేదిలతో సహ విడుదల చేసారు. ఇప్పటికే సరయిన ఉద్యోగాలు లేక నిరాశవాదంలో ఉన్న అనేక మంది విద్యార్దులు, ఈ వరుస నోటిఫికేషన్స్ తో ఉక్కిరి బిక్కిరి ఆయిపోతున్నారు. పైగా ఇంకా గ్రూప్.4 మరియు డి.ఎస్.ఎసి పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్స్ భారీ స్దాయిలో  విడుదల చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయములో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రాజకీయాలను ప్రక్కన బెట్టి కొంత వరకు ప్రజా ప్రయెజన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విధమైన ప్రోత్సాహము ముఖ్యమంత్రి నుండి ఉంటే, ఇంకా చాలా మంది నిజాయితిపరులైన అధికారులు ఇంకా సమర్దవంతంగా తమ తమ శాఖలను అభివృద్ది చేస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకని ఈ సంవత్సరమును నిరుద్యోగుల పాలిట ఉద్యోగ నామ సంవత్సరముగా పేర్కొనవచ్చు... చివరగా తన సర్వీసులో ఏ విషయములో రాజీ పడకుండా నిజాయితిగా పనిచేస్తున్న శ్రీమతి పూనం మూలకొండయ్య గార్కి అభినందనలు తెలియజేసుకుంటున్నాను..