Wednesday, 21 May 2014

విరామం తర్వాత..


ఈ సంవత్సరం నా పోస్టుల మధ్య విరామం చాలా ఎక్కువయిపోయింది. అలాగని బ్లాగ్ ప్రపంచంలో ఎలాంటి కల్లోలం జరగలేదనుకొండి. కాకపోతే నా సోది వినే(చదివే) బాధ బ్లాగర్లకు తగ్గిందని అనుకుంటున్నాను.(అనుకోవడమేంటి నిజమే)...  పోస్టులు రాయడం మాత్రమే కాదు బ్లాగులు చదవడం కూడా బాగా తగ్గిపోయింది. దానితో అనుభవజ్ణులైన బ్లాగర్ల యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ మధ్య కాలములో మిస్ అవడం జరిగింది.. అసలే అన్ని రకాల ఎన్నికలు ఒక్కసారే వచ్చి జరిగిన సమయం. ఇలాంటి సమయంలో పలు బ్లాగర్లు యొక్క అనుభవాలను, ఆలోచనలను, సలహలను మిస్ అయ్యాననే ఫీలింగ్ ఉంది.

ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు రాజకీయపార్టిల పరంగా విడిపోయి ఏదొ ఒక పార్టి తరపున వకల్తా పుచ్చుకొని ప్రచారం చేయడంతో కొంత అయెమయం గురయిన సంధర్బాలు చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో బ్లాగులను పరిశీలించడం ద్వారా అసలైన విషయ పరిజ్ణానంను తెలుసుకోవడానికి అవకాశం ఉండేది.
కానీ ఈ సారి రాజకీయ పార్టిల గురించి, వాటి మేనిపేస్టొ గురించి గాని లేదా యితర అంశాలు గురించి కాని పట్టించుకొనే తీరికే దొరకలేదు. ఎందుకంటే స్దానిక సంస్దల ఎలక్షన్స్ ఆ తదుపరి జరిగిన సాధారణ ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాత్రింబవళ్ళు పనిచేయవలసివచ్చింది. చాలా మందికి ఎన్నికల పోలింగు నాడు మరియు కౌంటింగ్ నాడు జరిగిన తతంగం మాత్రమే తెలుస్తుంది. కాని ఆ ఎన్నికల జరపడానికి కావలసిన సన్నద్దత కోసం సుమారు మూడు నెలల నుండే కసరత్తు జరుగుతుందని చాలా మందికి తెలిసే అవకాశం లేదు. జనవరి నెల నుండి మొదలయిన మా పని నిరంతరంగా మొన్నటి సాధారణ ఎన్నికల కౌంటింగ్ పూర్తయి, నేటి వరకు సాగుతునే ఉంది. ఈ మధ్యలో మాకు ఇక ఎటువంటి ఇతర వ్యాపకాలు మీద దృష్టి పెట్టగలిగే అవకాశమే రాలేదు. ప్రస్తుతం అన్ని రకాల ఎన్నికలు పూర్తయినందున ఇదిగో మరల ఇలా తీరిగ్గా కూర్చూని రాయగలిగే సమయం దొరికింది.

ఎన్నికల్లో మోడీ ఘనవిజయం, చంద్రబాబు విజయం, కాంగ్రెసు పరాజయం, జగన్ ఆశలు ఆవిరి ఆయిన సంద్బరాలు ఇలాంటి వాటి గురించి నా అభిప్రాయాలు పంచుకోవడానికి కుదరలేదు. పోని ఇప్పుడు రాద్దామంటే సదరు అంశాలు పాతపడిపోయాయి.

పి.ఎస్: చాలా రోజుల తర్వాత కదా రాయడం.. అసలు ఏమి రాయాలో పాలుపోలేదు. ఏదో కష్టపడి ఈ నాల్గు ముక్కలు రాయగలిగాను. ఈ పోస్టు ద్వారా డిస్పాయింట్ ఆయిన వారందరికి క్షమాపణలు...



2 comments:

  1. hi raghava, how r u? yes long time no see. happy to c u here again.

    ReplyDelete
  2. cool!
    hope you are well!

    ReplyDelete