Saturday, 19 April 2014

మనమిలాగే ఉందాం... తోకలు ఊపుతూ ఉందాం...

ప్రపంచంలో ఒక ప్రక్కన కులమతాలు గోడలు కూలిపోయి ప్రజలందరూ కలిసిమెలసి జీవిస్తూ సంతోషంగా ఉంటుంటే, మనం మాత్రం ఇక్కడ ఎన్నికల పేరు చెప్పి కులాలు, మతాలు వారీగా విడిపోదాం....

మతప్రతిపాదికన,  కుల ప్రతిపాదికనే అభ్యర్దులను నిలబెడుతున్న పార్టిలనే సమర్దిద్దాం... 

ఏదైనా ప్రాంతంలో ఒక అభ్యర్దిని నిలబెట్టాలంటే యెగ్యత కలవారు, అర్హత కలవారు అక్కర్లేదు మనకు.. ఆ ప్రాంతంలో అత్యధిక శాతం కల్గిన వర్గం నుండి ఒకరికి సీటు ఇస్తే సరి... అక్కడ అతని విజయం గ్యారంటీ... అతని మీద ఎన్ని మర్డర్ కేసులు, అక్రమార్జన కేసులున్న మనకి అనవసరం....

ఒక ప్రక్కన నిజమైన లౌకిక వాదులం అని చెబుతున్న కాంగ్రెసుని, అసలైన హిందుత్వ పార్టిలని చెబుతున్న బి.జె.పి. పార్టిలను మనం గుడ్డిగా నమ్మేద్దాం... ఎందుకంటరేంటండి.. మనది బారతదేశం... స్వాతంత్ర్వం వచ్చి అరవైళ్ళయిన కూడా ఇంకా ఇలానే ఉన్నాము అంటే మామూలు విషయమా చెప్పండి....

ఒక నాయకుడెమో ఫలనా వర్గం వారు సంకనాకిపోయారు కాబట్టి వారికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాము అంటే, దానర్దం వారి ఓట్లు ఎక్కువ శాతంలో ఉన్నాయి అని మీకు అర్ద్రం ఆయితే మాకేంటండీ... మేము ఇలానే ఉంటాము....

ఇంకో నాయకుడెమో ఫలనా వర్గం వారు రాజకీయాధికారమునకు కూతవేటు దూరంలో ఉండిపోయారు. కాబట్టి ఈసారి మెజారిటి సీట్లు ఆ వర్గం వార్కే ఇస్తాము అంటారు.. అంటే వాళ్ళ ఓటు బ్యాంకు మీద కన్ను పడిందని అర్ద్రం మయితే ఎలాగండీ... మేము దేశానికి ఉద్దరించడానికి మా పార్టిలు చేసే పనికి తోక ఊపుతూ ఉంటాము అంతే...

ఇగపోతే మనం, ఒకయాన ఇంటి మీద పెద్ద సిలువ బొమ్మ పెట్టుకొని, బైబిలు పుస్తకాన్ని చేతిలో పెట్టి తిరుగుతున్నాడని మనం ఆడికే ఓటు వేద్దామనుకుంటే మీరు ఏడుస్తారెందుకండీ...

ఇంకోయన అచ్చ హిందుత్వవాది అని చెప్పి దేవుడిని కించపరిచేలా కూడా అతనిని దేవుడిని చేసేసి అరాధిస్తుంటే మీరు ఏడుస్తారెందుకు.. మేమింతే..మేమిలాగే ఉంటాము...

ఆయన పేరు చివర తోక, నా పేరు చివర తోక ఒకటే కాబట్టి, నేను అతనినే ఫాలో అవుతాను...మీకెందుకండీ....

చదువుకోకముందు కాకరకాయ అన్నాడట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడట వెనకటికి ఒకాయన.. అలా మేము ఎంత చదువుకున్నవాళ్ళమయితే మాత్రం కులాలు, మతాలు పట్టీంచుకోకూడదు అంటే ఎలాగండీ.... కుదర్దదు....

ఐనా ఇయన్నీ ఎందుగ్గానీ సమీకరణాలు అంటు బోలెడంత హోమ్ వర్కు చేయవలసి వస్తుంది.. ఆ శ్రమ లేకుండా కులాలు, మతాలు పరంగా దేశాన్ని విడగొట్టెయాలి అంతే... అప్పుడు ఏ భాద ఉండదు... ఏ కులంవోడూ ఆ ప్రాంతంలోనే పోటీ చేస్తాడు... అప్పుడు మనమ్మీద ప్రపంచం పడి ఏడ్వదు.. ఏమంటారు...

అప్పటి వరకు మనమిలాగే ఉందాం.... తోకలు ఊపుతూ ఉందాం.....

చివరితోక:-  తూ... దీనెమ్మ కుళ్ళు రాజకీయాలు.... మన నాయకులు మారరు, మన జనాలు మారరు... మార్పు రావాలంటే వినాశనమే రావాలి....  

ఒక కులమో, మతమో మనకి అన్నం పెట్టదు..
అన్నం కావాలంటే అభివృద్దే కావాలి... అభివృద్ధికి కులమో, మతమో ఉండదు... 
మతం, కులం ఉన్నచోట అభివృద్ధి ఉండదు.. అభివృద్ధి ఉన్న చోట మతం, కులం ఉండదు....






No comments:

Post a Comment