Friday, 6 July 2012

100....

నా చిన్నప్పుడు మా అన్నయ్యలు మమ్మల్ని ఆటపట్టించడానికి పది(10) మధ్యలో సున్న పెడితే ఏమోస్తుందని అడిగేవారు...
తడుముకోకుండా నేను పంది అని చెప్పేవాడిని.... కాని మిగతా వాళ్ళు మాత్రం వంద అని చెప్పేవారు......

ఇద్దరది తప్పు అని చెప్పి, నా దగ్గర వంద కరెక్టని, వంద అని చెప్పిన వాళ్ళ దగ్గర పంది కరెక్టని చెప్పేవారు....

యింతకి ఉపోద్దాతమంతా ఎందుకంటే వంద గురించి....

వంద...

చాలా మందికి ఫిగర్ అంటే ఎనలేని మోజు.....  నాలాంటి వాడికి మాత్రం అదో రకం నిర్లిప్తత... ఎందుకంటే అది నాకు ఎప్పుడూ అందలేదు కాబట్టి...

సచిన్ టెండుల్కర్ కి వంద అంటే ఎంత మోజో ఎవరికి తెలియనిది కాదు...

వందో వంద కొట్టడానికి మన సచినుడు ఎన్ని మెలికలు తిరిగిపోయాడో మన భారతదేశంలో బుడతడుని అడిగినా చెప్తాడు.  సచిన్ ఇంకా బాగా చెపుతాడువందపవర్ ఏంటో....

ఇకపోతే చాలా మంది విద్యార్దులకు కంటి మీద కునుకు లేకుండా చేసేది కూడా వందే కదా.. ఎందుకంటే వాళ్ళకు పెట్టే పరీక్షలు వంద మార్కులకే కదా.... ఫిగర్ ని అందుకోవడానికి మన సచినుడు కన్నా అద్బుతమైన పల్టీలు కొట్టే అనేక మందిని చూడోచ్చు రోజుల్లో.... రోజుల్లోనేంటి.... రోజుల్లో కూడా.. విద్యార్దినడిగినా చెప్తాడువందపవరేంటో!

పైగా అది చాలదన్నట్టు, చివరలో పర్సంటేజిలు... ఇది కూడా వంద బేస్ చేసుకొనే తగలడేవారు... అసలే ఏదో మెస్తరూ మార్కులు తెచ్చుకొన్నాము కదానుకుంటే, చివరలో ఎంత పర్సంటేజి వచ్చిందో వివరించే కాలుక్యేషన్ ఒకటి..... ఇదంతా వంద వల్లె కదా....

ఇక సినిమా వాళ్ళు వందకి ఇచ్చే వాల్యు అంతా యింతా కాదు... ఒక సినిమాను నిలబెట్టేది వందే.. ఇప్పడు లేదు కాని, మొన్నటి వరకు సినిమా వంద రోజులు అడిందంటేనే విలువుండేది.... లేకపోతే ప్లాపుల లెక్కలోకే.... ఒక సినిమా వంద ఆడిందంటే సినిమాలో నటించిన హిరో, హిరోయిన, దర్శకుడి పంట పండినట్టే......  ప్రతి హిరో, దర్శకుడు తమ సినిమా వంద రోజులు ఆడాలని కోరుకుంటాడు. పైగా సినిమా వంద రోజులు ఆడడం అన్నదాని మీదే హీరో గారి ఇమేజి ఎలిమేట్ అవుతుంది జనాల్లో...... సో సినిమావోళ్ళకు తెలుసువందపవరేంటో!....

బాలీవుడ్ లో మధ్య ఎప్పుడూ చూసిన వంద కోట్లు కలెక్షన్లు వసూలు చేసిన సినిమాలు అంటూ కొద్దిగా హల్ చల్ చేస్తున్నాయి. అమీర్ ఖాన్ నటించిన 3ఇడియట్స్, రజనీరోబో, సల్మాన్ ఖాన్బాడీగార్డ్ఇలా ఇత్యాది సినిమాలన్నీ వంద కోట్లు కొల్లగొట్టిన డిజాస్టర్స్ అంటూ హిందీ సినిమా చానల్ చూసిన ఒకటే దొబ్బుడు..... ’వందకోట్లు కలెక్షన్లు అంటూ.....

ఇకపోతే బ్యాంకులు... వీళ్ళు కూడా వంద కి ఆతీతం కాదు... వీళ్ళు ఇచ్చే రుణాలు లేక వడ్డీలు కూడా వంద ని ప్రతిపాదిక చేసుకొనే ఇస్తారు. (నూటికి ఫలనా యింత వడ్డీ అని). పైగా వీళ్ళు తయారుచేసుకొనే వార్శిక నివేదికలు కూడావందచుట్టునే తిరుగుతాయి...

వంద కి యింతలా అన్ని రంగాల్లో యింత వాల్యూ ఉన్నప్పటికి నాకు మాత్రం ఫిగరంటే ఎనలేని చిరాకు.... ఎందుకంటే దానిని ఎప్పుడూ అందుకోలేకపోయాను కాబట్టి....

చిన్నప్పుడు పరీక్షల్లో క్వొశ్చన్ పేపర్ ఇవ్వగానే నాకు ముందుగా కనబడేది దాని పైన ఉండే వంద మార్కులు అనే ట్యాగ్.  పేపర్ లో క్వొశ్చన్స్ ఏమి ఇచ్చారో చూడకుండానే మన సచినుడు వందకి చేరువలో ఉన్నప్పుడు ఒక్కసారే తన ఆటతీరుని ఎలా మార్చుకుంటాడో విధంగా,  సెల్ప్ ఢిపెన్స్ లోకి వెళ్ళిపోయేవాడిని. జాగర్తలో ఇంకా తప్పులు ఎక్కువగా రాసేసి, ప్రీతిప్రాతమైన వందకి అమడ దూరంలోనే ఉండిపోయేవాడిని. వంద ఎప్పుడూ నాకు అందని ద్రాక్షలానే ఉండేది.... (అఖరికి లెక్కల్లో కూడా రాలేదండీ). అందుకే నాకు అందని వంద అంటే నాకు విద్యార్ది దశ నుండి చిరాకే....

కాని ముచ్చట నాకు ఇంటర్ లో తీరిందిలెండి...కాని అప్పుడు లెక్కలు పేపర్ 75 మార్కులకు ఇచ్చేవారు. వాటిల్లో 75కి 75 వచ్చినప్పటికి శాటిస్ ఫై కాలేకపోయా.... ఎందుకంటే ’100’ కి ఉన్న విలువ ’75’ కి లేదు కదా...

సచిన్ కి కూడా వంద అంటే ఎంత ఫోబియానో, అంతే ప్రీతి... ఎంత ప్రీతి అంటే సెంచరీకి  అమడ దూరంలో ఉండగా తన ఆట తీరుని హై అలర్డ్ లోకి మార్చుకోనేంతగా.... ఇక టైమ్ లో మన సచినుడికి దేశం, టీమ్ ఇలాంటివి ఏమి కనబడవు. కేవలం కనుచూపు మేరలో కనబడుతున్న వంద మీదే ఉంటుంది దృష్టి.... ఎందుకంటే ఇక్కడ వంద చేస్తేనే తనకు సంతృప్తి... సంతృప్తి కోసం ఎన్ని బాల్స్ వేస్ట్ చేయమన్నా చేస్తాడు.....

అన్ని వందలు కొట్టినప్పటికీ, సచినుడుకి వంద అంటే మోజు పోయిందా? అంటే లేదనే చెప్పాలి. మొన్న వందో వంద గురించి ఎన్ని గింగిరాలు తిరిగాడో క్రికెట్ చూడని వాడు కూడా చెప్తాడు.... కాని వంద చుట్టూ గింగిరాలు తిరగడం వల్లే కదా నా లాంటి వాళ్ళ దృష్టిలో పెద్ద స్వార్దపరుడుగా ముద్రపడిపోయాడు....

ఏంటి, రోజు మనోడు వంద మీద ఇలా దంచేస్తున్నాడు అని డౌటు వచ్చిందా మీకు ఇప్పుడు? ఇంకా రాలేదా!!! 

ఎందుకంటే, ఇది నా వందో పోస్ట్ కాబట్టి...... ఇప్పటికైనా అర్ద్రమయిందా నేను వంద మీద ఎందుకు దంచుతున్నానో......

ఏమి చెప్పామంటారండీ, సచినుడు లానే నాకు కూడా వంద దగ్గరకు వచ్చేసరికి దేని మీద పోస్ట్ రాయాలో ఒక పట్టనా బుర్రకి తట్టలేదు.... అందుకే వంద మీద దంచి, దంచి పోస్ట్ ఇలా వ్రాసి పడేశాను.....

6 comments:

  1. వంద అంకె మీద మన fixation గూర్చి చక్కగా రాశారు. వందో పోస్టు సందర్భంగా మీకు అభినందనలు. ఇలాంటి మైలు రాళ్ళు మరెన్నో దాటాలని అభిలషిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. సార్, నాకైతే అస్సలు నచ్చలేదు నేను రాసిన ఈ అర్టికల్... ఇంత చెత్తగా రాసానేమిటా అని అనిపించిందండీ.... కాని మీ కాంప్లిమెంట్ చూసిన తర్వాత మీ ఆర్టికల్ " గురువుగారి జ్ణాపకాలు- నా బాలకృష్ణ అభిమానం" లోని అవదం సుబ్బడికి మాస్టారు గారు కొద్దిగా ఎక్కువ మార్కులు వేసినట్టుగా మీరు కూడా నా మీద దయ చూపించారు సార్..... నా బ్లాగుని చూసిన మీ అభిమానానికి కృతజ్ణతలు సార్.....

      Delete