అత్మకధ- అంటే తమ జీవితంలో అనేక దశల్లో జరిగిన పరిణామలను, ఆయా సందర్బంలలో తమ ప్రవర్తన నెమరువేసుకొనుటకు లేదా సమర్దించుకొనుటకు గాను ఎవరికి వారే వ్రాసుకొనే ఒక డైరీ లాంటిది..
కాని ఇప్పుడది ప్రక్కవాడిని విమర్శించడానికి లేదా పొగడడానికి అవసరమైతే వ్యక్తిగత అంశాల్లోకి కూడా వెళ్ళగలిగి కామెంటు చేయడానికి పనికివచ్చే ఒక సాధనం...
అత్మకధలు రాయడం ఎప్పటి నుండి మొదలయిందో నాకంతగా తెలియదు.. బహుశా వంద సం.ల క్రితమే ప్రారంభమయి ఉండోచ్చని నా అంచనా...
ఇది వరకు ఎవరు అత్మకధలు రాసుకొన్నా, అవి వివాదస్పదం కావడం లేక అత్యంత ప్రజాదరణ పొందడం అనేది జరగలేదు...
ఆ మధ్య గంగూలీ టైములో కోచ్ గా పనిచేసి వెళ్ళిపోయిన గ్రెగ్ చాపెల్ ఇండియన్ క్రికెట్ గురించి, అందులోని రాజకీయాల గురించి తన అత్మకధ లాంటి కధలో రాయడంతో, ఇక్కడ క్రికెట్ క్రీడాకారులు మరియు బోర్డు అధికారులు గ్రెగ్ రాసిన రాతలపై మండిపడ్డారు. ఈ వార్త మీడియాలో ప్రముఖంగా రావడంతో, అసలు అందులో ఏముందో తెలుసుకోవడం కోసం జనాలు సదరు పుస్తకం పై ఎగబడడంతో దాని అమ్మకాలు అమాంతం పెరగడం గ్రెగ్ చాఫెల్ కి కలిసివచ్చింది. అంతెందుకు మొన్నటికి మొన్న రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ గురించి, అతనికి సహకరించని టీమ్ గురించి వ్యాఖ్యలు చేసాడు. అతని చేసిన వ్యాఖ్యలకు వివరణ యివ్వడం ఇష్టం లేక హైదరబాద్ వచ్చిన రాహుల్ ద్రావిడ్ మీడియా వార్కి అందకుండా పోయాడు.
ఇక అక్కడ నుండి అత్మకధలు రాసేవారు, తమ పుస్తకానికి జనాల్లో పబ్లిసిటి పొందడం కోసం అనేక వివాదస్పద అంశాలు జోడించడం, తద్వారా అమ్మకాలు పెంచుకోవడం అనేది కామన్ ఆయిపోయింది.
ఇప్పుడు కొత్తగా ఆ మధ్యనే దివంగతులైన అర్జున్ సింగ్ రాసిన పుస్తకం A GRAIN OF SAND IN THE HOURGLASS OF TIME ఈ కోవలోకే వస్తుంది.
మొత్తం పుస్తకంలో ఏమి రాసారో తెలియదు కాని, మన ఆంద్రుల నాయకుడు ఆనాటి ప్రధాని పి.వి.నరశింహరావు గారిపై కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అది నేషనల్ మీడియాలో పెద్ద వార్త ఆయి కూర్చుంది.
ఇంతకి విషయమేమిటంటే, రాజీవ్ గాంధీ హత్యానంతరం కాంగ్రెసు నాయకత్వం ఎవరికి అప్పజెప్పాలనే విషయములో తాను సదరు పదవిని సోనియా గాంధికి అప్పగించలని ప్రతిపాదించానని, దానిని పి.వి. వ్యతిరేకిస్తూ కాంగ్రెసు అనే రైలు బండికి ఆ కుటుంబ సభ్యులు తప్ప వేరేవరు లేరా అని మండిపడ్డారని, తద్వారా సోనియా రాక పి.వి.కి ఇష్టం లేదన్నట్టుగా తెలిపారు...
ఇప్పుడు పై దాని గురించి మనం మాట్లాడుకుందాం.... మన దేశం ప్రజాస్వామ్య దేశమని, ఇందులో రాచరికానికి, కుటుంబ పెత్తనానికి తావు లేదని స్వాతంత్రం వచ్చిననాడే కాంగ్రెసులో తీర్మానించిన విషయము అర్జున్ సింగ్ కి తెలియదు అనుకోవాలా? అలాగే తమ వారసులు ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పలువురు తొలితరం కాంగ్రెసు నాయకులు నిర్ణయించుకొన్న విషయము కూడా తెలియదనుకోవాలా? రాజీవ్ హత్యానంతరం సోనియాజీనే నాయకత్వం వహించాలని నెహ్రు కుటుంబానికి వీరవిధేయుడైన అర్జున్ సింగ్ కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దానిని ఎవరూ కాదనలేరు. ఆయనకు కావలసినది ఎంతసేపూ నెహ్రు కుటుంబానికి భజన చేయడమే తప్పితే దేశం కోసం ఆలోచించగలిగే విశాల మనసత్వం ఉందని మనం అనుకోలేం. అలాంటి స్దితిలో ఉన్న అర్జున్ సింగ్ కి ఆనాడు పి.వి. గారు సోనియాజీ నాయకత్వం అప్పగించే విషయములో అబ్జెక్షన్ పెట్టడం ఆయనకు తప్పుగా అనిపించడంలో అశ్చర్యం లేదు.
ఆనాడు దేశానికి కావలసిన సమర్ద నాయకత్వం గురించి ఆలోచించగలిగి ఉండగలిగితే ఈ విషయాన్ని యింత రాద్దాంతం చేసియుండేవారు కాదనుకుంటా. అనాడు అర్దికంగా అత్యంత దీనస్దితిలో ఉన్న భారతదేశానికి ప్రణాళిక సంఘల ద్వారా అర్దిక పరిపుష్టి తీసుకువచ్చి ప్రపంచంలో తలెత్తుకొనేల చేసిన పి.వి యొక్క నాయకత్వం గురించి మాట్లాడకుండా, కేవలం సోనియాజీ పై వ్యతిరేకత గురించి మాత్రమే రాసారంటే, అయన రాతల్లో ఔచిత్యంను ఏమనుకోవాలి.
పి.వి.నరశింహారావు గారిని దేశాన్ని అభివృద్ది పధంలో నడిపించగలిగిన ఒక సమర్ద నాయకుడుగా చూడకుండా, కేవలం సోనియాజీ నాయకత్వాన్ని ప్రశ్నించడం గురించి మాత్రమే చూడగలిగిన అర్జున్ సింగ్ అంతరంగాన్ని మనము ఎలా అర్ద్రం చేసుకోవాలి.
ఇక దీని తర్వాత చెప్పుకోవలసినది ప్రముఖ ప్రాతికేయుడు కులదీప్ నయ్యర్ వ్రాసిన అత్మకధ....
ఈయన కూడా పి.వి.నరశింహరావు గారినే టార్గెట్ చేయడం గమనార్హం. ఆయా పత్రికల్లో ఈయన వ్రాసే ఆర్టికల్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. నాకు ఈయన వ్రాసే ఆర్టికల్స్ అంటే ఇష్టం కూడా....
అయెధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సమయములో ఆనాటి ప్రధాని పి.వి.నరశింహరావు గారి వ్యవహరశైలి పై ఈయన విమర్శలు ఎక్కుపెట్టారు. అర్జున్ సింగ్ కూడా ఈ విషయమై తన పుస్తకంలో వ్యాఖ్యానించారు కూడా.. బాబ్రీ మసీదు కూల్చివేయవచ్చునన్న విషయమును పి.వి. గార్కి తాను ముందుగానే చెప్పానని, ఆ విషయము విని విననట్టుగా వదిలివేసారని, ఆయన ప్రవర్తన తనకు చికాకు పెట్టించిదని అర్జున్ సింగ్ తన పుస్తకంలో వివరించారు. అంతే కాకుండా బాబ్రీ మసీదు కూల్చివేత సమయములో పి.వి.ఎవరికి అందుబాటులో లేకుండా గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకొన్నారని తద్వారా బాబ్రీ మసీదు కూల్చివేతను అడ్డుకోలేకపోయారని ఆరోపించారు. ఇంచుమించుగా ఇదే అరోపణను కులదీప్ నయ్యర్ కూడా చేసారు. కాకపోతే ఆ సమయములో పి.వి. పూజలో ఉన్నారని, కూల్చివేత పూర్తయినంత వరకు పూజలో నుండి బయటకు రాలేదని, అ తర్వాతనే పూజ ముగించారని ఆరోపించారు.
ఇక్కడ మనం ఒక విషయము మాట్లాడుకోవాలి.... మన దేశంలో మైనారిటిలుగా పేర్కోనే ముస్లింల కట్టడం బాబ్రీ మసీదు కూలగొట్టడం మీదేనా ఇంత రాద్దాంతం చేయడం.. అదే సమయంలో హిందూ మత కట్టడాలు కూల్చివేత పై వీరెవరికి నోరు పెగలదా.... వారు మానవతవాదులైనపుడు ఏ మతం వార్కి చెందిన కట్టడం కూల్చివేసిన ఒకే రకముగా స్పందించాలి. హిందూ కట్టడముల కూల్చివేత సమయములో లేని అత్రుత ముస్లింల కట్టడం కూల్చివేత సమయములో ఉండడం అవసరమా?
హిందూ కట్టడములు కూల్చివేత ఎప్పుడు జరిగింది? అని మీరందరూ అడగొచ్చు....
అసలు బాబ్లీ మసీదు కట్టడానికి ఇక వేరే ప్లేస్ ఎక్కడ దొరకలేదా? అనాడు హిందువుల పుణ్యకేత్రమైన రామ మందిరంను కూలగొట్టే కదా బాబ్లీ మసీదును నిర్మించారు!! ముస్లింలకు వారి ప్రవిత స్దలమైన మక్కా మీద ఎంత దైవభక్తి ఉందో, హిందువులకు కూడా తమ పవిత్ర స్దలం మీద అంతే అభిమానం ఉంటుంది కదా!!
ఆనాడు ముస్లింలు పాలకుల కళ్ళు నెత్తికెక్కి హిందూ మందిరం కూలగొట్టి మసీదు కడితే,
ఈనాడు లౌకిక కాంగ్రెసు పాలకుల కళ్ళు నెత్తికెక్కి మసీదును కూలగొట్టారనుకుంటే సరిపోతుంది ఏమో కదా....
మీకు కోపం వచ్చి ఉంటుంది. ఈ విధంగా మాట్లాడుతున్నానని.... కాని ఒకసారి ఆలోచించండి... ఒకరు చేస్తే ఒప్పు, అదే పని ఇంకొకరు చేస్తే తప్పు కాజాలదు..
ఎంత సేపు ఒక వర్గంనకు సంబందించిన విషయాల మీదే రచ్చ చేయాలని చూస్తే, ఎటువంటి మతఫీలింగ్ లేని నాలాంటి వాడు కూడా రగిలిపోతున్నాడు.
గోద్రా అల్లర్లనే తీసుకుంటే, ఎంత సేపు గోద్రా ఘటన తదనంతరం జరిగిన సంఘటనల గురించే గుండెలు బాదుకుంటున్నారు కాని, దానికి కారణమయిన గోద్రా రైలుకి నిప్పు పెట్టిన ఘటన, అందులో హిందువులు చనిపోయిన సంఘటన లెక్కలోకి రాదా?
గోద్రా రైలుకి నిప్పు పెట్టిన విషయము అసలు వీరికి కనబడనే లేదా? రైలుకి నిప్పు పెట్టి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయిన వారిని అరెస్ట్ చేయాలని ఏ ఒక్కరైనా డిమాండ్ చేసారా? అవతలి వర్గం వారివి మాత్రమేనా ప్రాణాలు... మిగతా వారివి కావా?
ఆ రోజు గోద్రా రైలుకి నిప్పు ఘటన గురించి ఈ రోజు పలురకాలుగ గగ్గోలు పెడుతున్న వారు ఆనాడు మానవీయంగా స్పందించివుంటే, నేను ఈ విధమైన పక్షపూరిత వైఖరితో మాట్లాడకపోదును.
ఆయిన కులదీప్ నయ్యర్ అనాటి తప్పు మొత్తంను పి.వి.నరశింహారావు గారి మీదే వేసే ముందు, ఉత్తరప్రదేశ్ లో ఉన్నది భాజపా మనిషి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయమును మర్చిపోతునట్టున్నారు. (నయ్యర్ భాజపా మనిషని మీకు తెలుసనుకుంటా)..
వాస్తవానికి ఆ సమయములో పి.వి. నరశింహరావు గారు ఏమి చేశారో, అ సమయానికి అక్కడే ఉన్న ఒక ఉన్నత అధికారి నిన్ననే వివరణ ఇచ్చారు. పై వారందరూ అరోపిస్తున్నట్టు పి.వి.గారు పూజలో కూర్చుని ఉండలేదని, హోం శాఖ కార్యదర్శితో జరుగుతున్న పరిణామలతో ఎప్పటికప్పుడు చర్చించారని తెలిపారు...
మరి ఇందులో మనం ఏది నిజమని నమ్మాలి? ఆరోపణ చేసిన వ్యక్తి తాను మరణించిన తర్వాతనే పుస్తకం ప్రచురించలని చెప్పాడు. ఆరోపణలు చేయబడ్డ పి.వి.నరశింహారావు గారు వివరణ ఇవ్వడానికి మన మధ్య లేరు. మరి ఎవరి వాదనను మనం నమ్మాలి?
చివరగా ఏ సంఘటననైనా మానవీయ కోణంతో చూడడం నేర్చుకోవాలి మన నాయకులు. ఆ తర్వాత అందులో తప్పుఒప్పులు గురించి గగ్గోలు పెట్టోచ్చు. ఒక్కొక్కొ వర్గానికి ఒక్కొక్కొ తరహ విధానంను అవలింబించడం వలన వైష్యమాలు పెరగడం మినహా వేరే ఉపయోగం లేదు...
చివరగా మన నాయకులు దేశానికి నిస్వార్ద సేవల అందించిన నాయకులును గుర్తించగలగాలి. అంతే కాని ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాసిన నాయకులను కాదు..... నా దృష్టిలో పి.వి. నరశింహారావు గారు ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రధాని. ఆయన మన తెలుగు వాడని అనడం లేదు ఈ మాటని.
అత్మకధలు రాయడం తప్పు అనడం లేదు. కాని అందులో తమకు గిట్టని వారి మీద అభాండాలు వేయడం లోనే ఇబ్బంది అంతా... ఆనాడు సోనియాజీ కి నాయకత్వం అప్పగించే విషయములో పి.వి. వ్యవహరశైలి తప్పయితేనేమి, ఒప్పుయితేనేమి తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. దటీజ్ పి.వి.నరశింహరావు అంటాను నేను... లేదంటే మాట పెగలడానికి కూడా ధైర్యం చేయలేని సందర్బంలో తన వాయిస్ వినిపించిన తెలుగోడు అని గర్వంగా ఫీలవుతున్నాను నేను...
అర్జున్ సింగ్ కి పి.వి. గారి మీద ముందు నుండి వ్యతిరేకత ఉంది. అది పి.వి. చనిపోయేంత వరకు కొనసాగింది. ఒక వేళ అయనకు పి.వి. తో సఖ్యత ఉండి ఉంటే, ఇదే విషయాన్ని పి.వి. యొక్క ధైర్యసాహాసాలగా వర్ణించేవారేమో. తనకు గిట్టక పోతే ఒకలా, గిడితే ఒకలా రాసే ఇలాంటి రాతలకు మనమ్ ప్రాధాన్యత యివ్వడం అవసరమా అన్న విషయము మనం అలోచించికోవాలి.
కాంగ్రెసు కుటుంబ నాయకత్వానికి పి.వి. అంటే పడకపోవచ్చు..... అంత మాత్రాన పి.వి. దేశానికి ద్రోహం చేసినట్టుగా భావించక్కర్లేదు....
కొద్దిలో కొద్దిగా గొప్ప ఏమిటంటే, పి.వి. పై కులదీప్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను కొంత మంది రాష్ట్రనాయకులు ఖండించడం.....
Iagree with you
ReplyDeletethank you sir..
Deleteపీవీ గారిని ఆయన చేపట్టిన సంస్కరణల విషయంలో సమర్ధిస్తాను. పాత సినిమాల్లో చూపించినట్లు యువత no-vacenty చూసీచూసీ ఏ నక్సల్స్ గానో మారటంలేదంటె అది ఆయన చలువే నని నానమ్మకం. అలాగే ఆర్జున్ సింగ్‌ని Sonia is the natural heir to the thrown అన్న విషయంలో వ్యతిరేకిస్తున్నాను. "పదివినధిరోహించడానికి సామర్ధ్యమూ, ఉద్దేశ్యాలేతప్ప పుట్టుక, మూలాలు ప్రధానం కాకూడదు" అనేది నా అభిప్రాయం. Having said that, సోనియా సమర్ధురాలని నేనుభావిస్తే despite of she being a "foreigner", would I support her.
ReplyDeleteబాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ నిస్క్రియాపరత్వం నిజమైన పక్షంలో it deserves criticism and trial-and-punishment. మీరన్నదే నేను ఇంకోలా చెబుతున్నాను. ఒకరుచేసిన అదే తప్పు ఇంకొకరుచేస్తే తప్పుకాకుండా పోతుందా? ఒకతప్పుని సరిచేయడానికి మనంచేయాల్సింది ఒక సరైనపనేకానీ, ఇంకొక తప్పుకాదుకదా!
గోధ్రా విషయాన్ని ఇంకోలా ప్రయత్నిద్దామండీ... ఒక అమెరికన్ని ఒక భారతీయుడు చంపాడనుకుందాం. ఇప్పుడు అమెరికా... మొత్తం భారతీయులను అంతమొందించే ప్రయత్నంలోభాగంగా భారత్ మీద యుధ్ధం ప్రకటించడాన్ని మీరు దాన్ని సమర్ధిస్తారా?
i agreee with ur argument sir .. but
Deleteoka american ni indian chapamdam ne manam apujeyagalite, next problems ravu kada anedi na opinion...
america vodu indians andhraini chapadaniki gala karanam ni marchipokudadu kadha....
ade america vadini india vadu champakapothe, america vadu india joliki radu kadha......
ఆ హత్య జరిగింది అమెరికా దేశపు పరిధిలోనేననుకోండి, ఆ హంతకుడిని పట్టుకోవడంకూడా అమెరికా పనే అనుకోండి, చట్టపరంగా భారత్ చెయ్యగలిగింది ఏమీకూడా లేదనుకోంది, హంతకుణ్ణి పట్టి శిక్షించలేని అమెరికా ప్రభుత్వం ప్రభుత్వం saving-the-face gestureగా భారత్ మీదకి యుధ్ధానికి తెగబడిందనుకోండి, అప్పుడది ఎవరి తప్పవుతుందంటారు?
Deleteఆ హత్య జరిగింది అమెరికా దేశపు పరిధిలోనేననుకోండి, ఆ హంతకుడిని పట్టుకోవడంకూడా అమెరికా పనే అనుకోండి, చట్టపరంగా భారత్ చెయ్యగలిగింది ఏమీకూడా లేదనుకోంది, హంతకుణ్ణి పట్టి శిక్షించలేని అమెరికా ప్రభుత్వం ప్రభుత్వం saving-the-face gestureగా భారత్ మీదకి యుధ్ధానికి తెగబడిందనుకోండి, అప్పుడది ఎవరి తప్పవుతుందంటారు?
Deleteఇక్కడ నేనేది ఏమిటంటే... శిక్షించగలిగే అధికారం తనచేతుల్లోనే ఉన్నప్పుడు, ఎవరిని శిక్షించాలి అనే విచారణ జరపడంలో విఫలమైన ప్రభుత్వం (లేదా అసలు విచారణే జరిపే ఉద్దేశ్యమేలేని ప్రభుత్వం), తన వైఫల్యానికి -coming to the example again- మొత్తం భారతీయులను దండించడం తప్పుకదండీ! ఆ హత్య భారతీయులందరూ కూడబలుక్కునైతే చేసుండరుకదా! హత్య జరిగింది తమచట్టపరిధిలోనున్న భూభాగంలోనే కాబట్టి, భారత్‌కూడా చెయ్యగలిగేది ఏమీఉండదు.
Deleteక్షమించండి... మీతో అలా వాదించినందుకు..
Deleteమీరన్న దానితో నేను పూర్తిగా ఏకిభవిస్తున్నాను....
కాని గోద్రా రైలు ఘటనను కూడా త్రీవంగా పరిగణించవలసినదన్నది నా అభిప్రాయము...
గోద్రా తదనంతరం జరిగిన ఘటనతో సమానంగా గోద్రా రైలు ఘటనను పరిగణించలేదన్నది నా అభిప్రాయం..
ఈవిషయంలో మీతో ఏకీభవిస్తున్నాను.
Deleteక్షమించడాలూ ఎందుకండీ. మనమేమో పోట్లాడుకోలేదుకదా.
"కొద్దిలో కొద్దిగా గొప్ప ఏమిటంటే, పి.వి. పై కులదీప్ నయ్యర్ చేసిన వ్యాఖ్యలను కొంత మంది రాష్ట్రనాయకులు ఖండించడం"
ReplyDeleteYou're lying. Aren't you? రాష్ట్రనాయకులు అంత స్వతంత్రంగా వ్యవహరించడం ఎప్పుడైనా మనం కన్నామా, విన్నామా? :))
emo sir... monna eenadu paper lo unte chusanu.. ade vishayam ni indulo cheppanu...
Deleteand very thanks sir for commenting
సొంత వ్యక్తిత్వం అంటూ లేని అర్జున్ సింగ్ వంటి ఎందరో నాయకులకు తమ ఉనికి గురించి తీవ్రమైన ఆందోళన. పార్టీని జాతీయ స్థాయిలో గెలిపించే శక్తి లేని బలహీనులు. కానీ వాళ్ళకు అగ్ర స్థాయి పదవులు కావాలి. అందుకోసమే ఇందిరా గాంధి కుటుంబ భజన. సొంత వెన్నెముకతో పని చేసిన పీవీ అంటే అర్జున్ సింగ్‌కి ఏనాడూ పడేది కాదు. అందుకే ఆ ఏడుపు. మీరు చెప్పిన పీవీ జాతీయ స్థాయి నాయకుడు అన్న మాట అక్షర సత్యం. అందుకే వారందరికీ భయం. గత్యంతరం లేని పరిస్థితుల్లో, మినారిటీ ప్రభుత్వపు పగ్గాలను తామెవ్వరూ మోయలేమని తెలిసినందునే... పార్టీ పరంగా పీవీని నియంత్రించగలమనే మూర్ఖపు భావనతో... ఆయనను బలిపశువును చేసినా పట్టించుకునే వారెవరూ ఉండరన్న ధీమాతో ఆయనను ప్రధానిని చేయడానికి ఒప్పుకున్నారు నాటి సోకాల్డ్ కాంగీ పెద్దలు. అలాంటి వారందరి భావనలనూ తుత్తునియలు చేస్తూ పీవీ పాలన కొనసాగింది. నాటి నికృష్ట ఆర్ధిక పరిస్థితుల్లో ఈ అర్జున్ సింగ్ వంటి వారో... లేక వారు భజన చేసిన సోనియా గాంధీయో చేయగలిగినదేమీ లేదు. ఏ తప్పు జరిగినా పీవీ ఎకౌంట్‌లోకి తోసేయవచ్చనే వారి దుర్బుద్ధి. "బాధ్యతలు వద్దు, పదవులూ అధికారాలే ముద్దు" అనే యాటిట్యూడ్‌తో ప్రవర్తించిన సిగ్గుమాలిన కాంగీయులు వారంతా. ఆయన్ను ఏకగ్రీవంగా గెలిపించి రామారావు తన మర్యాద నిలుపుకుంటే... ఆయన శవాన్ని పార్టీ ఆఫీస్‌లోకి రానీయక, ఆ ప్రధానికి దేశ రాజధానిలో సమాధీ, స్మారకమూ ఉండనీయక... సోనియా, ఆమె తాబేదార్లూ తమ కురచ బుద్ధి బైటపెట్టుకున్నారు.
ReplyDeleteబాబ్రీ సమయంలో పీవీ చర్యల గురించి పీవీయార్కే ప్రసాద్ విపులంగా తన "అసలేం జరిగిందంటే"లో రాశారు. బీజేపీ కులదీప్ నయ్యర్, కాంగీ అర్జున్ సింగ్‌ల కంటె ఆయన ఇచ్చిన సమాచారం ఎంతో విశ్వసనీయం.. కనీసం పీవీకి సంబంధించినంత వరకూ.
పార్టీ కోసం చేసిన తన పనులు తప్పులు కాకపోయినా కేసులు ఎదుర్కొన్న పీవీ ఆయా ఎడ్వొకేట్ల కోసం తన ఒకే ఒక సొంత ఇంటిని అమ్మేసుకోవలసి వచ్చిందని తెలుసుకుంటే కళ్ళమ్మట నీళ్ళాగవు. ఈ అర్జున్ సింగ్, సోనియా లాంటి వాళ్ళు కనీసం ఊహించనైనా ఊహించలేని అపూర్వ వ్యక్తిత్వం ఆయనది. పీవీ గురించి చెప్పుకునేటప్పుడు ఈ చెత్త వెధవల గురించి చెప్పుకోవలసి రావడం జాతి దౌర్భాగ్యం.
chala baga chepparu sir....
Deleteand many thanks sir for commenting...
కాంగ్రెసు కుటుంబ నాయకత్వానికి పి.వి. అంటే పడకపోవచ్చు..... అంత మాత్రాన పి.వి. దేశానికి ద్రోహం చేసినట్టుగా భావించక్కర్లేదు....
ReplyDelete----------------------
Very true !
thanks madam for commenting..
DeleteUnfortunately, even autobiographies are being misused for political ends.
ReplyDeleteOne thing I cannot understand is that by maligning PV now what these fellows gain?!
batiki unnappu emi cheyaleka, chacchi sadisadam sir...
Deletethank u sir for commenting..
మంచిమాట చెప్పారు. పి.వి. దేశానికి చేసిన సేవల్ని రకరకాల కారణాలతో భావితరాలకు తెలీని విధంగా బ్లాకౌట్ చేశారు, ఇంకా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో దేనికీ పి.వి. పేరు పెట్టకుండా చెశారు. ఎప్పటికైనా హైదరాబాద్ అంతర్జాతీయ విమాశ్రయానికి పి.వి. పేరు పెట్టేలా తెలుగువాళ్ళమంతా కృషి చేయాలి.
ReplyDeletemana telugu vallu eppudu unity ga unnaru sir? 33 MPs unna mana state ki emi pikalekapoyaru, mana telugu valla kosam.... mundu ga mana vallu tamilanadu varila unity feeling ravali sir... aa tarvate edaina......
Delete>>(నయ్యర్ భాజపా మనిషని మీకు తెలుసనుకుంటా)..<<
ReplyDeleteనాకున్న అవగాహన మేరకు నయ్యర్ కి భాజపా భావ జాలంతో సంబంధం లేదు. ఒక్కసారి చెక్ చేసుకోండి.