Wednesday, 23 March 2011

ప్రపంచకప్ ఫీవర్

భారత క్రికెట్ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసున్న ప్రపంచకప్ పోటిలు రసవత్తర స్దితికి చేరుకున్నాయి. చిరకాలము తర్వాత తిరిగి ఇండియాకు ప్రపంచకప్ సాధించలన్న టీమిండియా కోరిక మరియు తన కెరిర్ లో తొలి ప్రపంచకప్ అందుకోవలన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కోరిక తీరాలన్న  రోజు మధ్యాహ్నం ఆస్టేలియాతో జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తప్పక గెలవవలసిన స్దితి. వాస్తవానికి ఇప్పటి మ్యాచ్  క్వార్టర్ ఫైనల్ ఆయినప్పటికి, ఆడే ప్రతి మ్యాచ్ ఫైనల్ గానే భావించాలి. ఎందుకంటే ఇక్కడి నుండి సమరంలో ఓడిపోయే టీమ్ వైదొలగవలసినదే. ఇలాంటి క్లిష్ట సమయములోనే టీమిండియా తన సత్తాను చాటుకోవలసిన అవసరం వచ్చింది.
2003 ప్రపంచ కప్ మన నోటి దాకా వచ్చి చేజారిపోవడంలో ఆస్టేలియా పోరాటపటిమ దోహదపడింది. రోజు ఆస్టేలియా చూపిన పోరాటపటిమకి మనవాళ్ళు దాసోహమయ్యారు. సదరు అప్పటి పరిస్దితిని నేటి మ్యాచ్ లో పునరావృతం కానివ్వకూడదనియే ప్రతి భారతీయుడు అశ. దానిని ఎంత వరకు నిలబెట్టుకుంటారనేది రోజు టీమిండియా అటగాళ్ళ మానసిక ధృడత మీద ఆధారపడియుంది.  మన వాళ్ళు తమ శక్తి సామర్ద్యాల మేరకు ఆడితే ఆస్టేలియా మీద గెలవడం పెద్ద కష్టం కాదు. కాని టీమిండియాలో ఉన్న లోపమేమిటంటే, ఇప్పటికి కూడా ఎవరో ఒకరి ప్రదర్శన మీదే ఆధారపడడం. ఇప్పటికైనా అందరూ కలిసికట్టుగా సమైక్యంగా అడితే విజయము నల్లేరు మీద నడకే.  ఏది ఏమైనా రోజు అస్టేలియాను నిలువరించి మెహలీలో జరిగే సెమీఫైనల్ పోరులో మన దాయాది పాకిస్తాన్ తో తలపడలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

No comments:

Post a Comment